జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం
•శుభాకాంక్షలు తెలియజేసిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు
చిట్యాల మండల మరియు మున్సిపాలిటీ ప్రజలకు జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు గారు శుభాకాంక్షలు తెలియజేశారు.
ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ గారు విశ్వశాంతి కొరకు ప్రతి ఒక్కరు ప్రతినిత్యం యోగా చేయాలని అదేవిధంగా సుదర్శన క్రియ, ప్రాణాయామం, మెడిటేషన్ చేయడం ద్వారా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు అన్నారు, సర్వరోగ నివారిణి యోగ అని పల్లపు బుద్ధుడు అన్నారు, యోగ అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం అని,
మోక్ష సాధనలో భాగమైన ధ్యానం అంతః దృష్టి పరమానంద ప్రాప్తి లాంటి ఆధ్యాత్మిక పరమైన సాధనలకు పునాది అని, ధ్యానయోగం ఆధ్యాత్మిక సాధనకు, మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడుపడుతుందని, పతంజలి యోగ సూత్రాల ద్వారా ధారములో మణులను చేర్చినట్లు యోగశాస్త్రాన్ని పతంజలి ఒక్కచోట చేర్చారన్నారు, శరీర ధారుడ్యానికి, ఆరోగ్య సంరక్షణకి రోగ నిరోధకానికి సహాయ పడే శారీరక ఆసనాలను అష్టాంగ యోగము వివరిస్తుందన్నారు.
జీవితం ఆనందదాయకంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు యోగా, సుదర్శన క్రియ ప్రతినిత్యం చేయాలన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ ద్వారా హ్యాపీనెస్ అనే కోర్సుతో ఒత్తిడిని పారదోలి ఆచరణాత్మక చర్యలకు వీలు కల్పిస్తూ మన ఆరోగ్యాన్ని మరియు జీవశక్తిని పెంపొందిస్తుంది అన్నారు, ధ్యానం మరియు ఉఛ్వాస నీశ్వాసలను చక్కగా పొందుతారని తెలియజేశారు. శ్వాసను పట్టుకో ఆరోగ్యాన్ని పెంచుకో జీవితం ఆనందదాయకంగా ఉంటుందన్నారు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ గారు ప్రపంచవ్యాప్తంగా 186 దేశాల లోని అన్ని వర్గాలవారు 45 మిలియన్ ప్రజలకు దీని ద్వారా గొప్ప ప్రయోజనాలను పొందారన్నారు. అదేవిధంగా చిట్యాల మండలంలోని అన్ని గ్రామాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో యోగా, సుదర్శన్ క్రియ కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఆనందాన్ని పంచాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్తామన్నారు.
Jun 21 2023, 10:34