కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన
సిరిసిల్లజిల్లా :జూన్ 20
నేడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా ఈ క్రింది కార్యక్రమాల్లో పాల్గొంటారని జిల్లా ఉన్నతాధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పర్యటన వివరాలు:
ఉదయం 10. 30 గంటలకు గంభీరావుపేట మండలం గోరంట్యాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులు ప్రారంభోత్సవం. ఉదయం 11 గంటలకు మన ఊరి-మన బడి లో భాగంగా నిర్మించిన ఎల్లారెడ్డిపేట పాఠశాల భవన సముదాయం ప్రారంభోత్సవం. కంప్యూటర్ చాంప్స్’ కార్యక్రమం ప్రారభోత్సవం. జిల్లాలో 60 మంది ఉన్నత పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ విద్య) అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారు.
మధ్యాహ్నం 2 గంటలకు వికలాంగులకు దాదాపు 1000 మందికి సహాయాలు మరియు ఉపకరణాల పంపిణీ. పద్మానాయక ఫంక్షన్ హాల్, సిరిసిల్ల పట్టణం. మధ్యాహ్నం 3: 30 గంటలకు పట్టణంలోని మినీ స్టేడియంలో వాలీబాల్ అకాడమీ ప్రారంభోత్సవం, చేయనున్నారు.....
Jun 20 2023, 14:29