మొక్కలే మానవ మనుగడకు జీవనాధారం
•ప్రతి ఒక్కరూ బాధ్యత తో మొక్కలు నాటి సంరక్షించాలి:
•నల్లగొండ డిఎస్పి నరసింహారెడ్డి
మొక్కలే మానవ మునుగడకు జీవనాధారమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని నల్లగొండ డిఎస్పి వరాల నరసింహారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.
నల్గొండ డీఎస్పీ కార్యాలయం, టూ టౌన్ సర్కిల్ కార్యాలయం, టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆయా స్టేషన్ల అధికారులు మొక్కలు నాటి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న హరితహారం లో భాగంగా పోలీస్ స్టేషన్లలో సైతం మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అపూర్వరావు గారి ఆదేశాల మేరకు విరివిగా మొక్కలు నాటడం జరిగిందన్నారు.
మొక్కలు నాటడంతో పాటు సంరక్షించడం వల్ల ఆహ్లాదం పెంపొందడంతో పాటు మానవుల జీవన ప్రమాణ స్థాయి కూడా పెరుగుతుందన్నారు. భూమి మీద ఉన్న అన్ని ప్రాణులకు కూడా ఆక్సిజన్ అందించడంలో మొక్కలు ఎంతగానో దోపడతాయన్నారు.
నల్లగొండ డివిజన్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటడం జరిగిందన్నారు. కార్యక్రమంలో టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పసుపులేటి నాగ దుర్గ ప్రసాద్, ట్రాఫిక్ సిఐ చీర్ల శ్రీనివాస్, చిట్యాల సిఐ శివరాం రెడ్డి, నల్లగొండ టూ టౌన్ ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, నార్కట్ పల్లి ఎస్సై సైదా బాబు, చిట్యాల ఎస్ఐ రవికుమార్, సిబ్బంది ఉన్నారు.
Jun 20 2023, 09:00