ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ పాఠశాలల యజమానుల పైన చర్యలు తీసుకోవాలి
•బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్
బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాల యజమానులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ నిబంధన ఉల్లంఘిస్తున్నారు ఆర్థిక ఇబ్బందులు తో సతమతం అవుతున్న పేద ప్రజల నుండి బలవంతంగా ఫీజులు ముందే కట్టాలని ఫీజులు చెల్లిస్తేనే పుస్తకాలు ఇస్తామని ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు కొన్ని పాఠశాలల్లో అరకొర వసతులతోనే ప్రవేట్ పాఠశాలలను ప్రారంభించారు.
నార్కట్పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ అనుమతి లేకుండా చైతన్య ఈటెక్నిక్ స్కూల్ పేరుతో పాఠశాల పారంభిస్తామని చెప్పి అడ్మిషన్లు చేసుకోవడం జరుగుతుంది కావున తక్షణమే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. విద్యాహక్కు చట్టాన్ని కూడా అమలు చేయాలని , ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని
ప్రతి ఒక్కరికి పాఠ్య పుస్తకాలు అందజేయాలని బీసీ విద్యార్థి సంఘం తరఫున కోరుతున్నాము ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు మండల యాదగిరి యాదవ్, జిల్లా నాయకులు కొంపల్లి రామన్న గౌడ్, నరేష్, పండ్ల హరికృష్ణ, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Jun 19 2023, 18:54