పశువుల మందపై పెద్ద పులి దాడి
నంద్యాల జిల్లా:జూన్ 19
ఆత్మకూరు మండలం పెద్ద అనంతపురం గ్రామ సమీపంలో సోమవారం ఉదయం అవుల మంద పై పెద్దపులి దాడి చేసింది.. ఈ దాడిలో రెండు అవులు మృతి చెందాయి… పులి దాడిని ప్రత్యక్షంగా చూసిన పశువుల కాపర్లు కేకలు వేయడంతో పులి అడవులలోకి పారిపోయింది..
సమాచారం అందుకున్నఅటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పులి దాడి చేసిన వివరాలను సేకరించారు.. . ఇటీవల అడవి సమీప గ్రామాలలో పశువులపై తరుచు పులులు దాడులు చేస్తున్నాయని,
పులుల బారి నుంచి తమను కాపాడాలని స్థానికుల వేడుకున్నారు.. పులి దాడితో భయపడుతున్న ప్రజలకు భరోసా ఇస్తూ, పికెట్ ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు...
SB NEWS
Jun 19 2023, 18:50