రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన : వైయస్ షర్మిల
కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ , రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘేల్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే , ఎంపీ సంజయ్ రౌత్ , టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ తో పాటు పలువురు రాహుల్ గాంధీకి అభినందనలు తెలిపారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు, ఇది చాలా సంతోషకరమైన రోజని, మీరు మీ పట్టుదల, సహనంతో ప్రజలకు స్పూర్తినిస్తూ హృదయ పూర్వక ప్రయత్నాల ద్వారా సేవ చేస్తూ ఉండాలని షర్మిల ట్వీట్ లో కోరారు. ఆరోగ్యవంతంగా, సుఖ సంతోషాలతో విలసిల్లాలని అకాంక్షించారు.
కాంగ్రెస్ లో విలీనం నిజమేనా?
తెలంగాణలో వైఎస్పార్ టీపీ ని కాంగ్రెస్ లో కలిపేస్తారంటూ ప్రచారం జరుగుతున్న వేళ రాహుల్ కు షర్మిల విషెస్ చెప్పటం ఆసక్తికరంగా మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రత్యేకించి రాహుల్ కు షర్మిల ట్వీట్ చేయటం వెను క ఉద్దేశం కూడా అదే అని పలువురు నేతలు రీ ట్వీట్లు మొదలుపెట్టారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత రెండు సార్లు బెంగళూరు వెళ్లిన షర్మిల డిప్యూటీ సీఎం ను కలిసిన సందర్భాలను కూడా ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. అయితే షర్మిల మాత్రం అవన్నీ ఏమీ లేవని , తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రసక్తే లేదని చెబుతున్నారు....
Jun 19 2023, 13:49