నేటి నుంచి పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
సికింద్రాబాద్:జూన్ 19
నిర్వహణ పనుల కారణంగా సోమవారం 19 నుంచి 25 వ తేదీ వరకు కొన్ని మార్గాల్లో ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్యరైల్వే అధికారులు తెలిపారు.
లింగంపల్లి - హైదరాబాద్ (రైలు నెంబర్: 47129, 47132, 47133, 47135, 47136), హైదరాబాద్-లింగంపల్లి (రైలు నెంబర్: 47105, 47108, 47109, 47110, 47112), ఉందానగర్- లింగంపల్లి (రైలు నెంబర్: 47165, 47211),
లింగంపల్లి - ఫలక్‌నుమా (రైలు నెంబర్: 47189, 47179), లింగంపల్లి - ఉందానగర్ (రైలు నెంబర్: 47178, 47212), ఫలక్‌నుమా -లింగంపల్లి (రైలు నెంబర్: 47158) సర్వీసులను ఈ రోజు నుంచి 24 వరకు రద్దు చేశారు.
ఉందానగర్ - లింగంపల్లి (రైలు నెంబర్: 47214) , రామచంద్రాపురం - ఫలక్‌నుమా (రైలు నెంబర్: 47177), ఫలక్‌నుమా-లింగంపల్లి (రైలు నెంబర్: 47156), ఉందానగర్-లింగంపల్లి (రైలు నెంబర్: 47157), లింగంపల్లి-ఉందానగర్ (రైలు నెంబర్: 47181) సర్వీసులను 25వ తేదీ వరకు రద్దు చేశారు. లింగంపల్లి-ఫలక్‌నుమా (రైలు నెంబర్: 47182) సర్వీసును ఈనెల 25న రద్దు చేశారు....
Jun 19 2023, 12:38