మాణిక్ రావు ఠాక్రే కు టిపిసిసి ఉపాధ్యక్షులు డా:చెరుకు సుధాకర్ పిర్యాదు
శ్రీ మాణిక్‌రావు ఠాక్రే గారు,
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గారికి
నేను డా. చెరుకు సుధాకర్, ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నాను. ఉమ్మడి రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో, ప్రజా ఉద్యమాల్లో, తెలంగాణ రాష్ట్ర సాధనలో 3 దశాబ్ధాలు పైగా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర సమితిలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉండి, 2014 తరువాత తెలంగాణ ఉద్యమ వేదికగా పనిచేసి, 2017లో తెలంగాణ ఇంటి పార్టీగా ఉండి, 2022 ఆగస్టు 5న అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులైన మల్లిఖార్జున ఖార్గే సమక్షంలో కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి చొరువతో కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ హాల్‌లో కాంగ్రెస్‌లో చేరినాను.
ఢిల్లీ నుండి నేరుగా రేవంత్‌రెడ్డి గారితో కలిసి మునుగోడు ఉప ఎన్నికల్లోని ప్రచార సభకు చండూర్‌లో హజర్ అయ్యి మాట్లాడినాను. అదే నియోజకవర్గంలో పార్టీ ఎన్నికల సమన్యయంలో మర్రిగూడ మండలంలో ఉండి అన్ని ప్రాంతాల ప్రచారంలో పాల్గొన్నాను.
మునుగోడు కాంగ్రెస్ యం.యల్.ఏగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉద్దేశపూర్వక రాజీనామా వెనుక కుట్రను, కాంగ్రెస్‌ను బలహీనపరిచేకుయుక్తులను వ్యతిరేకిస్తూ, బహిరంగంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గారు, కొంత పరోక్షంగా బిజెపి అభ్యర్ధిని సమర్ధించడంతో వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అభ్యర్ది కోసం పని చేసినది వాస్తవం. నా చేరికను వ్యతిరేకిస్తూ నన్ను, రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గారిని జాతీయ అధ్యక్షుడు మల్లిఖిర్జున ఖార్గే గారిని, ఇంచార్జి మాణిక్యం ఠాగోర్ గారిని నిందిస్తూ గౌరవ భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడిన తీరు పార్టీకి తీవ్ర నష్టం కలిగించినది.
మార్చి 3వ తేది, 2023న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గారు, నా కుమారుడు డా . చెరుకు సుహాస్, నవ్య హాస్పిటల్‌కు నల్లగొండకు ఫోన్ చేసి అత్యంత జుగుప్సాకరంగా తిట్టడం, చంపుతామని బెదిరించడంతో అన్ని తెలంగాణాలోని, తెలుగులోని పత్రికల్లో, మీడియాలో పతాకా శీర్షకల్లో రావడం, విపరీతమైన చర్చకు, నష్టానికి దారి తీసింది.
2023, మార్చి 6న మీకు జరిగిన పరిణామాలు, తీసుకోవలసిన చర్యలకై నేను ఇతర టి.పి.సి.సి సభ్యులతో పిర్యాదు చేసనప్పటికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పటివరకు జరిగిన సంఘటనపై కనీస చర్చ కూడా జరగకపోవడం పార్టీ ప్రతిష్టకు నష్టమనే భావిస్తున్నాను.
ఉదయ్‌పూర్ కాంగ్రెస్ మేధోమదనం తరువాత, రాయ్‌పూర్ సభల తరువాత సామాజిక న్యాయం, ఇంకా ఇతర విషయాల్లో గుణాత్మక, ఆచరణాత్మక మార్పును తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. దేశానికి కాంగ్రెస్ అవసరమని, యావత్ పౌర సమాజం కూడా సానుకూలంగా స్పందిస్తున్న సమయంలో బుజ్జగింతలో కాకుండా నిర్ధిష్ట క్రమశిక్షణ చర్యలు కోమటిరెడ్డి లాంటి నేతలపై తీసుకోకపోతే రాబోయే రోజుల్లో సానుకూల ఎన్నికల ఫలితాలు రావడానికి ఆటంకం కలుగుతుందని గుర్తుచేస్తున్నాం.
ప్రియాంక గాంధీ గారు యువకులకు సంబందించి ఒక డిక్లరేషన్‌ను ఈ మద్య ప్రకటించడంతో పాటు తెలంగాణ ఉద్యమకారుల కోసం ఒక భరోస, భాద్యత తమదని మాట్లాడినారు.
నల్లగొండలో నిరుద్యోగ భరోస కోసం జరిగిన కాంగ్రెస్ సభలో యువతను కూడగట్టి క్షేత్రస్థాయిలో సనిచేసిన నన్ను, ఇంకా దుబ్బాక నర్సంహా రెడ్డి, కొండేటి మల్లయ్య, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, కైలాష్ నేతను వేదిక మీద పిలువ వద్దని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వొత్తిడి చేసి అవమానానికి గురి చేసినారు.
తెలంగాణ ఉద్యమకారుల కోసం జూన్ 2 తెలంగాణ ఆవిర్హావ దినోత్సవ వేడుకల కోసం ఒక కమిటీని ప్రకటించి, దానికి చైర్మన్‌గా నేను ఉండాలని రేవంత్‌రెడ్డి గారు ఆదేశిస్తే, కమిటీ సభ్యులతో విడుదలకు సిద్,మైన ప్రకటనను ఆపు చేయించి గౌ. చిన్నారెడ్డి గారిని వెంటనే ప్రకటించినారు. ఈ రకమైనా అడ్డంకులు పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని గమనించాలి.
గౌ. భట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకులు ఆదిలాబాద్ నుండి నల్లగొండకు వచ్చిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో మంచిర్యాల, వరంగల్, భువనగిరి, దేవరకొండ, జి. చెన్నారంలో పాల్గొని, తేది 17న నల్లగొండ క్లాక్ టవర్‌లో జరిగిన కార్నర్ మీటింగ్‌లో ఇతర నియోజకవర్గాల నాయకులు ఎవరు ఉన్నా వేదిక ఖాళీ చేయాలని స్థానిక నాయకులచే అనిపించి, కోమటిరెడ్డి అనుచరులే వేదికపై ఉండాలి, ఇతరులు దిగాలని హెచ్చరించడం ఒక్క బహుజన, తెలంగాణ ఉద్యమనాయకుడికి జరిగిన అవమానమే కాదు, భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారు నిత్యం చెబుతున్న సోషల్ ఇంజనీరింగ్ తెలంగాణలో, నల్లగొండలో అమలవుతుందన్న నమ్మకాన్ని వమ్ము చేస్తున్నది. అంతేకాక, ఎవరు నియోజకవర్గాలకు పరిమితమైన నాయకులో, ఏ ప్రకారం ప్రస్తుత భువనగిరి యం.పి నల్లగొండ నియోజకవర్గ నాయకుడవుతారో చెప్పాలి. ఆయన నకిరేకల్ నియోజకవర్గం అయితే నేను కూడా అదే నియోజకవర్గం అవుతాను. లేదంటే టి.పి.సి.సి సభ్యులు అన్ని నియోజకవర్గ నాయకులు అవుతారు.
నిన్న జరిగిన పరిణామాలు అంతకు ముందు నిరుద్యోగ భరోసాలో అవమానాలు, కాంగ్రెస్‌లో మా అందరినిఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఇట్లా జరుగుతున్న సంఘటనలపై మీరు రాష్ట్ర ఇంచార్జ్‌గా చర్చించవలసి ఉన్నది. దళితున్ని ముఖ్యమంత్రి చేయగలిగే, పీపుల్స్‌మార్చ్‌లో భట్టితో సహా అందరి మౌనం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు రావాల్సిన మైలేజీకి అడ్డంకి కాకూడదని మీ దృష్టికి తీసుకు వస్తున్నాను.
వంద కార్లలో వచ్చి చెరకు సుధాకర్‌ను చంపుతామని బెదిరించే స్టార్ క్యాంపెయినర్ పార్టీకి భారం కావొద్దని, నకిరేకల్‌లో, ఇతర ప్రాంతాల్లో అదే పద్దతి కొనసాగిస్తే ఎవరి ఉనికికై వారు ప్రతిచర్య చేపడితే పార్టీకి నష్టమని గుర్తు చేస్తూ, మీ స్పందనకై ఎదురు చూస్తున్నాం.
డా. చెరుకు సుధాకర్
టి.పి.సి.సి రాష్ట్ర ఉపాధ్యక్షులు
Jun 19 2023, 12:28