కొత్త మండలాలు.. పాత భవనాలు
మండలాలు ఏర్పాటైనా పాత, అద్దె భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు
కొమరంభీంజిల్లా:జూన్19 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ప్రజలకు అధికారులు చేరువలో ఉండి పరి పాలన సౌలభ్యంగా ఉండాలని ప్రభుత్వం కొత్త మండ లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అయిన ఆయాశాఖల కార్యాలయ నిర్వహణ మాత్రం గాల్లోకి వదిలేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నూతన జిల్లాలు ఏర్పడి ఆరేళ్లు కావస్తున్నా ప్రభుత్వ కార్యాలయాలు ఇంకా అద్దె భవనాలు, పాత ప్రభుత్వ భవనాల్లోనే కొనసాగడమే ఇందుకు నిదర్శణం. పాలనా సౌలభ్యం కోసం నూతన మండలాలను ఏర్పాటు చేశామని చెబుతున్న ప్రభుత్వం ఆయాశాఖల కార్యాలయాలకు నూతనభవన నిర్మాణాలు చేపట్టడం లేదు. అద్దె,పాత భవనాల్లోనే పలు కార్యాల యాలు కొనసాగుతున్నాయి. మరి కొన్నింటిని ఇతర శాఖ కార్యాలయాల్లో సర్దుబాటు చేసుకోవాల్సి వస్తోంది. నూతన జిల్లాలో భాగంగా కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాను 2016లో ఏర్పాటు చేశారు. పూర్వ 12మండలాల నుంచి పెంచికలపేట, చింతలమానేపల్లి, లింగాపూర్ మూడు మండలాలను కొత్తగా ఏర్పాటు చేయగా 15మండలాలతో కూడిన నూతనజిల్లా ఆవిష్కృతమైంది. నూతన మండ లాలు ఏర్పాటు చేసినప్పటికీ కార్యాలయాలకు భవనాలు లేకపోవడంతో అటు అధికారులు, సిబ్బంది, వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
నూతనంగా ఏర్పాటు అయిన మూడు మండలాల్లో మండల సర్వసభ్య సమావేశాలతోపాటు ప్రభుత్వ పథకాల అమలుపై అవగాహన కార్యక్రమాలను ప్రస్తుతం అద్దె భవనాల్లో నిర్వహించేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతిమూడు నెలలకోసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశాలను ఇరుకు గదుల్లోనే, స్థానిక రైతువేదికలో నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. కార్యాలయాలకు రోజు వందల సంఖ్యలో ప్రజలు వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. కార్యాలయాల ముందు కనీసం పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో అంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నూతనంగా ఏర్పాటైన మండలాల్లో సొంతభవనాల నిర్మాణంపై దృష్టిసారించి పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
నూతనంగా ఏర్పాటైన పెంచికలపేట మండలంలో తహసీల్దార్ కార్యాలయం ఆరె సంక్షేమ సంఘ భవనంలో కొనసాగుతోంది. ఎంపీడీవో కార్యాలయం ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లో కొనసాగుతుండగా వ్యవసాయశాఖ అధికారులు రైతువేదికలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అటవీ శాఖ కార్యాలయం బీట్‌ఆఫీసర్ వసతిగృహంలో కొనసాగుతోంది.
పోలీసుస్టేషన్, ఎంఆర్‌సీ భవనం, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం భవనాలను నూతనంగా నిర్మించి ఇటీవలే ప్రారంభించారు. మండల ఏర్పాటుకు పూర్వం నుంచి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, పశువు వైద్యశాలలు ఉన్నాయి.
తహసీల్దార్ కార్యాలయం ప్రభుత్వ పాఠశాలలో కొనసా గుతుండగా ఎంపీడీవో కార్యాలయం జిల్లా పరిషత్ పాఠశా లలో కొనసాగుతోంది. వ్యవసాయ అధికారులు స్థానిక రైతు వేదికలో కొనసాగిస్తున్నారు. పోలీసు స్టేషన్, కేజీబీవీ పాఠశాల భవనాలు నూతనంగా నిర్మించి ఇటీవలే ప్రారం భించారు. పూర్వం నుంచే ఆస్పత్రి, పశువైద్యశాలలు ఉన్నాయి.
తహసీల్దార్ కార్యాలయం పాత జడ్పీఎస్‌ఎస్ పాఠ శాలలో, ఎంపీడీవో కార్యాలయం గ్రామపంచాయతీ కార్యా లయంలో కొనసాగుతున్నాయి. అటవీశాఖ కార్యాలయం వీఎస్‌ఎస్ కమ్యూనిటీ హాల్‌లో, వ్యవవసాయశాఖ రైతు వేదికలో కొనసాగుతున్నాయి. ఎంఆర్‌సీ భవన నిర్మాణం పూర్తైనా ఇంకా ప్రారంభించలేదు. మండలానికి పూర్వమే పోలీసు స్టేషన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.
భవన నిర్మాణాలు చేపట్టాలి..
ప్రజల సౌలభ్యం కోసం నూతన మండలాలు ఏర్పాటు చేశామని చెప్పినప్పటికీ ఆరు సంవత్సరాలు గడుస్తున్నా నేటివరకు ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాల ఊసేలేదు. దీని వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా త్వరితగతిన సొంత భవనాలు నిర్మించి వినియోగంలోకి తేవాలి.........
Jun 19 2023, 12:20