/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు Yadagiri Goud
అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు

_వేములవాడ : ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. వేములవాడ రాజన్న సన్నిధిలో శనివారం కోడెమొక్కులు చెల్లించుకుని ఆ నందీశ్వరుడి సాక్షిగా.. మనసున మనసై అని పాడుకుంటూ పెళ్లి కూడా చేసేసుకున్నారు. వారిలో ఒకరు హిజ్రా అయితే.. ఇంకొకరు ఓ యువకుడు._

_వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పింకీ అనే 22 ఏళ్ల హిజ్రాను.. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వేములవాడ రాజన్న సన్నిధిలో మూడు ముళ్లతో ఈ జంట ఒక్కటైంది.

డిగ్రీ పూర్తి చేసిన శ్రీనివాస్ ప్రస్తుతం ఆటో నడుపుతూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. తాజాగా పింకీ, శీనుల వివాహ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి._

_​కాగా ఇటీవల ఇలాంటి వివాహమే మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. గార్ల మండలం అంజనాపురం గ్రామానికి చెందిన ట్రాన్స్‌జెండర్ బానోత్ రాధిక(28) డోర్నకల్ మండలం సిగ్నల్ తండాకు చెందిన ధారావత్ వీరూ(30) కి రైలులో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమగా మారింది. రెండు సంవత్సరాలు ప్రేమించుకున్న వీరిద్దరూ శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వేదమంత్రాల సాక్షిగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు...!!_

KCR: హరగోపాల్‌ సహా ఇతరులపై ఉపా కేసు ఎత్తివేత: సీఎం కేసీఆర్‌ ఆదేశాలు

హైదరాబాద్‌: పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్‌ హరగోపాల్‌ సహా ఇతరులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కింద నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు..

వెంటనే కేసుల ఎత్తివేతకు తగు చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్‌ను సీఎం ఆదేశించారు.

మావోయిస్టు కార్యకలాపాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై హరగోపాల్‌తో పాటు ఇతర ప్రజాసంఘాల నేతలపై ఉపా చట్టం కింద తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి తప్పు చేయకపోయినా, ఆధారాలు లేకుండా ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడం దారుణమని..

వెంటనే వారిపై నమోదు చేసిన కేసు ఎత్తివేయాలని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను పరిశీలించిన కేసీఆర్.. హరగోపాల్ సహా ఇతరులపై నమోదు చేసిన కేసుల ఎత్తివేతకు నిర్ణయం తీసుకున్నారు..

ఈ నెల 22 న రాహుల్ గాంధీతో భేటీ : 30న కాంగ్రెస్ గూటిలోకి

ఖమ్మం జిల్లా :జూన్ 17

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. ఈ నెలాఖరున అంటే జూన్ 30న పొంగులేటి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు.

పొంగులేటితో పాటు జూపల్లి కృష్ణారావు తదితరులు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఈనెల 22న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పొంగులేటి, జూపల్లి, కూచూకుళ్ళ దామోదర రెడ్డి, పిడమర్తి రవి తదితరులు భేటీ కానున్నారు.

భేటీ అనంతరం తెలంగాణలో వేరువేరు బహిరంగ సభల్లో పలువురు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈనెల 30న ఖమ్మంలో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది.

ఖమ్మం సభలో పొంగులేటి అండ్ టీమ్ కాంగ్రెస్ కండువా కప్పుకోనుంది. ఈ సభకు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. పొంగులేటితో పాటు మ‌రికొంద‌రు నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది.....

పంట కాలువలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

కృష్ణాజిల్లా :జూన్ 27

పంటకాల్వలోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో.. బస్సులో ప్రయాణిస్తున్న పలువురు గాయపడ్డ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో శనివారం చోటుచేసుకుంది.

జిల్లాలోని వానపాముల దగ్గర కొద్దిసేపటి క్రితం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంటకాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ప్రయాణీస్తున్న పలువురు గాయపడ్డారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 68మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.....

SB NEWS

తొలకరి పలకరింపేదీ?

‘నైరుతి’ కోసం రైతుల ఎదురుచూపు

వర్షాల ఆలస్యంతో ముందస్తు సాగుకు గ్రహణం

వానాకాలం సీజన్‌కు ఆదిలోనే హంసపాదు

ఏరువాక పౌర్ణమి వచ్చింది వెళ్లింది.. మృగశిర కార్తెలో సగం గడిచిపోయింది. ఇప్పటికీ నైరుతి రుతుపవనాల పలకరింపు లేదు. తొలకరి పలకరింపు కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఫలితంగా ఆదిలోనే హంసపాదు అన్నచందంగా వానాకాలం సాగుకు గ్రహణం పడుతోంది. కాలం దాటుతున్నా నైరుతి రుతుపవనాల జాడ లేకపోవడం.. ఆశించిన మేర వర్షాలు పడే అవకాశం లేదని రైతుల ఆందోళన చెందుతున్నారు. జూన నెల సగం అయిపోయినా ఎండలు మండుతుండటం.. వేడి గాలులు వీస్తుండటం అన్నదాతలను మరింత ఆవేదనకు గురిచేస్తున్నాయి. 2015 నాటి కరువు పరిస్థితులు పునరావృతమవుతాయని చాలామంది అభిప్రాయపడుతున్నాయి.

పొడిదుక్కుల్లోనే విత్తనాలు..

రోహిణి కార్తెలో విత్తనం నాటితే ఈ సమయంలో మొక్క మొలుస్తుందని, ఆ మొక్కలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండి చీడ పీడలను తట్టుకోవడంతో పాటు పంట దిగుబడులు కూడా గణనీయంగా వస్తాయని రైతులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో రోహిణి కార్తె ప్రారంభం కాగానే జిల్లాలో చాలా ప్రాంతాల్లో రైతుల పొడి దుక్కుల్లోనే పత్తి విత్తనాలు వేశారు. ఎప్పటి లాగే వర్షాలు పడితే మొలకలు వస్తాయన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. కానీ రుతుపవనాల రాక ఆలస్యమై వానలు రాక.. ఆవిత్తనాలు మట్టిలోనే పొట్లిపోతుండటంతో రైతులు అందోళన చెందుతున్నారు. బోర్లు, బావుల నీటి ఆధారం ఉన్న రైతులు విత్తనం నాటిన రెండు మూడు రోజుల వ్యవధిలోనే తడులు మళ్లించే ప్రయత్నం చేస్తున్నా.. ప్రస్తుతం ఎండ తీవ్రతకు ఆ ప్రయత్నాలు అంతగా ఫలించడం లేదు. అక్కడక్కడ రైతులు భయంతోనే వరినారు కూడా పోస్తున్నారు. మొన్నటి వరకు అకాల వర్షాలు, వడగళ్ల వానలతో చేతికందిన దశలో పంటలు నష్టపోయిన రైతులు.. ఈ వానాకాలం సీజన్‌ ప్రారంభంలోనే గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పంటలు చేతొకొచ్చే దశలో ఎలాంటి నష్టం జరగకుండా ఉండాలంటే వానాకాలం పంట సాగును నెల రోజుల ముందుకు తీసుకొచ్చి.. జూన మూడో వారం కల్లా వరినాట్లు వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే జరిగితే మార్చి నెలాఖరుకు వరి కోతలు వచ్చి అకాల వర్షాలు, రాళ్ల వానల నుంచి కాపాడుకోవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కూడా పంట కాలాన్ని ముందుకు తేవాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే రుతుపవనాలు కాపాడకపోవడంతో వానాకాలం పంటల సాగు మరింత వెనక్కు వెళ్లే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు.

ముందస్తు సాగు కష్టమే..

వ్యవసాయ శాఖ నాలుగేళ్ల నివేదికల ప్రకారం వానాకాలం, యాసంగి సీజన్ల జాప్యం కారణంగా అన్నదాతలు వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, రైతులు పంటలు నష్టపోతున్నారని, ఆ పరిస్థితిని అధిగమించాలంటే ఈ వానాకాలాన్ని ముందస్తుగానే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభ్తుత్వం రైతులకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో సహకార సంఘాల ద్వారా భూసారానికి అవసరమైన జీలుగులు, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చే శారు. ఈ నేపథ్యంలో చాలామంది రైతులు ముందుగానే పచ్చిరొట్ల విత్తనాలు చల్లారు. ఉదాహరణకు కల్లూరు డివిజన పరిధిలోని కల్లూరు, సత్తుపల్లి, వేంసూరు,పెనుబల్లి, తల్లాడ, మండలాల్లోని పలు గ్రామాల రైతులు పచ్చి రొట్ట విత్తనాలు చల్లడమే కాకుండా.. వెదజల్లే పద్ధతిలో వరి నార్లు కూడా పోశారు. ఇలా 1.20 లక్షల ఎకరాల్లో వరి, 80వేల నుంచి లక్ష ఎకరాల్లో ఆరుతడి పంటల సాగుకు అవకాశం ఉంది. కానీ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఈ వానాకాలం సీజన్‌ ఇప్పట్లో ప్రారంభమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. పొడి దుక్కలకు అవసమైన కనీసం 8మీమీ వర్షపాతం కూడా నమోదు కాలేదు. వాస్తవానికి రుతుపవనాల ప్రభావంతో పడే వర్షాలతో పంటలు పండే పరిస్థితి నుంచి తుఫాన్‌ ప్రభావంతో పడుతున్న వర్షాలతోనే పంటలు సాగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఐదేళ్లుగా బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో తరచూ అల్పపీడన ద్రోణులు ఏర్పడి మాత్రమే భారీ వర్షాలు పడుతున్నాయి.

6.16లక్షల ఎకరాల్లో సాగు అంచనా

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వానాకాలం పంటల సాగు విస్తీర్ణం గతేడాది కంటే 66వేల ఎకరాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. గత వానాకాలంలో 5.50లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా ఈ వానాకాలంలో 6.16లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే పరిస్థితి ఉందని చెబుతున్నారు. దానిలో అత్యధికంగా వరి, పత్తి సాగుకు అన్నదాతలు మొగ్గు చూపుతుండగా తర్వాత స్థానాల్లో మిర్చి, ఆయిల్‌ పాం పంటలున్నాయి. వానాకాలం పంటలకు సంబంధించి అవసరమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన పంట వరి 2,90,000 ఎకరాలు, మొక్కజొన్న 5,500 ఎకరాలు, పెసర 21వేల ఎకరాలు, పత్తి 2.15లక్షల ఎకరాలు, మిరప 80వేల ఎకరాలలో సాగు కావచ్చని అధికారులు అంచన వేశారు. అవసరమయ్యే విత్తనాలు, ఎరువుల వివరాలను ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.. కేపీ

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు

హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. గత మూడు రోజులుగా ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్‌ రెడ్డికి సంబంధించిన కంపెనీలు వాటికి సంబంధించిన ఆడిటర్లు వారి ఆర్థిక లావాదేవీలపై ఐటీ దృష్టి పెట్టింది.

సోదాల్లో కీలక మైనా సమాచారాన్ని అధికారులు సేకరించారు. ఎమ్మెల్యేకు చెందిన కంపెనీలు, వ్యాపార వ్యవహారాలు, వారు చెల్లిస్తోన్న పన్నులకు మధ్య భారీ వ్యత్యాసాన్ని ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. పైళ్ల శేఖర్‌ భార్య వనితా రెడ్డికి చెందిన తీర్థా గ్రూప్‌ సంస్థ, వైష్ణవి వ్యాపార సంస్థలకు సంబంధించిన లావాదేవీలను కూడా ఐటీ శాఖ పరిశీలించినట్లు తెలుస్తోంది.

తీర్థా గ్రూప్‌కు డైరెక్టర్‌గా ఉన్న వనితా రెడ్డి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరిపి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి హైదరాబాద్‌, బెంగళూరులో సాగించిన వెంచర్లు, విల్లాల అమ్మకాల్లో నగదు లావాదేవీలను గుర్తించినట్టు సమాచారం. ఇద్దరు ఎమ్మెల్యేలు వారి కుటుబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు గుర్తించారు. కీలక డాక్యుమెంట్లు, విలువైన ఆభరణాలను ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

మూడు రోజుల క్రితం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్థన్ రెడ్డిలకు చెందిన నివాసాలు, వ్యాపారాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. వరుసగా బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఒకేసారి ఐటీ శాఖ సోదాలు నిర్వహించడంతో బీఆర్‌ఎస్‌ నేతల్లో టెన్షన్ మొదలైంది. వ్యాపారాలు నిర్వహిస్తున్న నేతలే టార్గెట్‌ సోదాలు జరగినట్లు తెలుస్తోంది. సోదాల్లో బీఆర్‌ఎస్‌ నేతల నివాసాలు, వ్యాపారాల్లో పలు కీలక సమాచారాన్ని అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది..

తెలంగాణలో పండిస్తున్న తెల్ల పత్తి ఎక్కడ దొరకదు

వరంగల్:జూన్ 17

తెలంగాణలో పండే తెల్ల పత్తి ఎక్కడా దొరకది మంత్రి కేటీఆర్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ...

మన ప్రాంతంలో నల్లబంగారం సింగరేణి ఉందని.. అలాగే తెల్ల బంగారం కూడా మన దగ్గరే ఉందన్నారు. పూర్వ వైభవం కలిగే విధంగా కాకతీయ మెగా టెక్స్ట్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

కొరియా దేశం నుంచి యంగ్ వన్ సంస్థ ముందుకు వచ్చి యూనిట్ స్థాపించిందన్నారు. 11 ఫ్యాక్టరీల ఏర్పాటుతో 20 వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చే సంస్థలు ఇక్కడ పని చేస్తున్నాయన్నారు. కోటెక్స్ ద్వారా 4000 మందికి ఉపాధి కలుగుతుందని... 99 శాతం స్థానికులకు ఉపాధి అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాల్లో ప్రపంచంలో అధిక శాతం బట్టల తయారి జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు సోయి వచ్చిందని.. ప్రధానమంత్రి మిత్ర పేరుతో కేంద్రం అవకాశం ఇస్తుందన్నారు. తెలంగాణలో చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు వేరే పేరుతో దేశం లో అమలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు..

బీసీ రుణాల కోసం ఇబ్బందులు పడుతున్న పట్టించుకోని జిల్లా అధికారులు

•బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్

బిసి కులవృత్తిదారులకు లక్ష రూపాయల రుణం గడువు తేదీని పెంచి ఆన్లైన్లో కులం ఆదాయం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తక్షణమే ఆ సర్టిఫికెట్లు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవడం గురించి బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కుల వృత్తుల దారులకు లక్ష రూపాయల రుణాలు ఇస్తామని చెప్పితే కులవృత్తుదారులు అందరూ ఎన్నో ఆశలతోటి కులం ఆదాయం సర్టిఫికెట్ల కొరకు ఆన్లైన్లో అప్లై చేసుకుని మండల తాసిల్దార్ కార్యాలయం చుట్టూ ఎండలో రోజు తిరుగుతూ వారి పనులు కోల్పోతూ ఎండలు విపరీతంగా ఉండడంతో అనారోగ్య గురి కూడా కావడం జరుగుతుంది అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 20వ తేదీ చివరి తేదీగా ప్రకటించడంతో అందరూ అప్లై చేసుకోవాలని ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికీ ఎవరికీ కూడా ఇంకా కాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు రాకపోవడంతో అందరూ ఆన్లైన్లో లక్ష రూపాయల రుణాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు కావున జిల్లా కలెక్టర్ గారు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని తాసిల్దార్ కార్యాలయాల్లో సందర్శించి పెండింగ్లో ఉన్న కులం ఆదాయం సర్టిఫికెట్లను తక్షణమే ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ 20వ తేదీ గడువుని పెంచాలని ప్రతి ఒక్కరికి దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా లక్ష రూపాయల రుణం ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు మండల యాదగిరి యాదవ్ బిసి విద్యార్థి సంఘం నాయకుడు నారబోయిన రాజు కొంపెల్లి రామన్న గౌడ్ రమేష్ యాదవ్ అఖిల్ ముదిరాజ్ రాహుల్ చారి సంతోష్ రజక తదితరులు పాల్గొన్నారు.

ఏసీబీ ట్రాప్‌.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్‌ గుప్తా?

హైదరాబాద్‌: తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ రవీందర్ గుప్తా ఏసీబీ ఉచ్చులో పడ్డారు. శనివారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఆయన్ని ఏసీబీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది..

హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే లంచం తీసుకుంటూ ఆయన పట్టుబడినట్లు సమాచారం.

గత కొంతకాలంగా తెలంగాణ యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలు యూనివర్సిటీలో సోదాలు నిర్వహించాయి. ఆరోపణలకు తగ్గట్లే అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది.

అయితే.. తాజాగా పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం ఓ వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు వీసీ రవీందర్ గుప్తా. ఈ క్రమంలో బాధితుడు శంకర్‌ ఏసీబీని ఆశ్రయించగా.. ఏసీబీ వల పన్నింది. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసానికి వెళ్లి బాధితుడు డబ్బు ఇవ్వబోయాడు. ఆ టైంలో రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు రవీందర్‌ గుప్తా. అనంతరం ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆయన్నీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఏసీబీ నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది..

Manipur: గుంపులుగా వచ్చి దాడులు.. మణిపుర్‌లో చల్లారని హింస..

ఇంఫాల్‌: జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌(Manipur)లో కల్లోల పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ ఘర్షణ మొదలవుతుందో తెలియని తీవ్ర ఉద్రిక్తత నెలకొంది..

శుక్రవారం రాత్రి క్వక్తా, కాంగ్వై ప్రాంతాల్లో ఘర్షణ జరిగింది. దాంతో శనివారం తెల్లవారుజామువరకు చెదురుమదురు కాల్పుల ఘటనలు నమోదయ్యాయి. నిరసనకారులు భారీ సంఖ్యలో గుంపుగా ఏర్పడటం, విధ్వంసానికి యత్నించడం వంటి పలు ఘటనలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. (Manipur Violence)

స్థానిక అడ్వాన్స్‌ హాస్పిటల్ సమీపంలోని ప్యాలెస్ కాంపౌండ్‌ వద్ద ఒక మూక నిప్పంటించడానికి ప్రయత్నించింది. ఆ మూకలో దాదాపు వెయ్యిమంది వరకు ఉన్నారని అధికారులు తెలిపారు. వారిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు బాష్పవాయువు, రబ్బర్‌ బుల్లెట్లను ప్రయోగించాయి. మణిపుర్‌ విశ్వవిద్యాలయం సమీపంలో, తొంగ్జు ప్రాంతంలోని ఓ ఎమ్మెల్యే ఇంటి వద్ద వందల మంది గుమిగూడి ఇదే తరహాలో దాడికి యత్నించారని వెల్లడించారు.

అలాగే మరో 300 నుంచి 400 మంది గుంపుగా వచ్చి ఇంఫాల్ సమీపంలోని ఇరింగ్‌బామ్ పోలీస్‌ స్టేషన్‌లోని ఆయుధాలను లూటీ చేసేందుకు విఫలయత్నం చేశారు. అక్కడి వారికి ఎలాంటి ఆయుధాలు లభ్యం కాలేదు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలి ఇంటివద్ద, భాజపా కార్యాలయం వద్ద నిరసనకారులు ఈ తరహాలోనే విధ్వంసం సృష్టించాలని చూశారని అధికారులు తెలిపారు. ఆర్మీ, అస్సాం రైఫిల్స్, రాపిడ్ యాక్షన్‌ ఫోర్స్, రాష్ట్ర పోలీసు యంత్రాంగం సంయుక్తంగా ఈ దాడుల్ని భగ్నం చేస్తున్నాయి. అలాగే ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో అర్ధరాత్రి వరకు ఫ్లాగ్ మార్చ్‌ నిర్వహించాయి..