/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz విడిగా వస్తానో, కూటమితో వస్తానో ఇంకా నిర్ణయించలేదు : పవన్‌ Yadagiri Goud
విడిగా వస్తానో, కూటమితో వస్తానో ఇంకా నిర్ణయించలేదు : పవన్‌

జనసేన కథ ఏంటో తొందరలోనే తేలిపోతుందా? పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన మాటలు విన్నతర్వాత అందరికీ ఇలాగే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే తొందరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయబోతోందని చెప్పారు..

ఇంతవరకు బాగానే ఉందికానీ ఎన్నికల్లో జనసేన ఎవరితోనూ పొత్తు పెట్టుకోవటంలేదని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఎన్నికలను ఒంటరిగానే ఎదుర్కొని పార్టీ సత్తా ఏమిటో చూపిస్తుందని చెప్పారు. ఈ మాటతోనే అందరికీ అనుమానం పెరిగిపోతోంది.

“ఎంతసేపూ… నువ్వు విడిగా రా… నువ్వు విడిగా రా అంటారు. నేను విడిగా వస్తానో, ఉమ్మడిగా వస్తానో ఇంకా నిర్ణయించుకోలేదు. ఆ సమయం వచ్చినప్పుడు కుండబద్దలు కొట్టినట్టు చెబుతాను.

కానీ ఒక్క విషయం… వచ్చే ఎన్నికల్లో గెలిచి నేను అసెంబ్లీలో అడుగుపెట్టాల్సిందే… పెడతాను. దాన్ని కోసం ఎన్ని వ్యూహాలైనా అనుసరిస్తాం. ముఖ్యమంత్రి పదవిని ఇస్తే సంతోషంగా స్వీకరిస్తాం. ముఖ్యమంత్రి పదవి మనకు రావాలంటే ఏం చేయాలి, ఎలా వెళ్లాలి అనేది మాట్లాడుకుందాం” అంటూ పవన్ తన మనసులో మాట చెప్పారు..

మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తాం

- మైనర్లు వాహనాలు నడిపితే రోడ్డుపై జరిగే ప్రమాదాలకు తల్లిదండ్రులదే బాధ్యత

- నల్లగొండ టూ టౌన్ ఎస్సై ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి

మైనర్లకు వాహనాలు ఇస్తే బండి యజమానులపై కేసులు నమోదు చేస్తామని నల్లగొండ టూ టౌన్ ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు.

బుధవారం రాత్రి నల్లగొండ పట్టణంలోని రామగిరిలో జిల్లా ఎస్పీ అపూర్వరావు ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మైనర్లు నడుపుతున్న 20 వాహనాలను పట్టుకొని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడపడం మూలంగా రోడ్డు ప్రమాదాలు జరిగి అమాయక ప్రజలు మరణిస్తున్నారన్నారు.

మైనర్లు వాహనాలు నడిపితే జరిగే ప్రమాదాలకు తల్లిదండ్రుల బాధ్యత వహించాలని అన్నారు. ప్రతి ఒక్కరు కచ్చితంగా లైసెన్స్ తీసుకొని వాహనాలు నడపాలన్నారు. లైసెన్స్ లేకుండా, నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపే వారిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బుధవారం 34 కేసులు నమోదు చేసి రూ. 20 వేల జరిమానా విధించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎస్సైలు సంపత్, జూకూరు సైదులు, సిబ్బంది నరసింహ, ధార లింగస్వామి, వెంకన్న, అనిల్ పాల్గొన్నారు.

Adipurush Movie: ఆదిపురుష్‌ టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి..

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, హీరోయిన్‌ కృతీ సనన్‌ జంటగా నటించిన చిత్రం ఆదిపురుష్‌. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 16న రిలీజ్‌ కానుంది..

తాజాగా ఈ చిత్రయూనిట్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆదిపురుష్‌ సినిమా టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అనుమతిచ్చింది.

అన్ని థియేటర్స్‌లోనూ ప్రతి టికెట్‌కు రూ.50 పెంచుకునేలా వెసులుబాటు కల్పించింది. అయితే పది రోజుల వరకు మాత్రమే టికెట్‌ రేట్లు పెంచుకునే అవకాశాన్ని కల్పించింది.

ఇకపోతే అటు తెలంగాణ సర్కార్‌ కూడా టికెట్‌ రేట్ల పెంపుకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే! మొదటి మూడు రోజుల పాటు సింగిల్‌ స్క్రీన్స్‌కు రూ.50 పెంచుకునేందుకు అనుమతిచ్చింది. అలాగే రోజుకు ఆరు షోలు ప్రదర్శించుకోవచ్చని తెలిపింది..

Amit Shah: అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా..

హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) పర్యటన వాయిదా పడింది. బిపర్‌జోయ్‌ తుఫాను కారణంగా ఈ పర్యటనకు బ్రేక్ పడింది..

త్వరలోనే ఖమ్మంలో నిర్వహించే సభ తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

తెలంగాణలో అధికారం దిశగా పార్టీని నడిపేలా.. బీజేపీ కార్యకర్తలు, శ్రేణులకు కొత్త ఉత్సాహాన్నిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటన సాగేలా ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి సమయానికి హైదరాబాద్‌కు చేరుకోనున్న షా.. గురువారం రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమై పలు అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేస్తారని, శ్రేణులను వార్‌ మోడ్‌లో పెడతారని బీజేపీ నేతలు భావించారు.

ముఖ్యంగా.. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో మిగిలింది ఐదారు నెలల స్వల్ప సమయమేనని, ఈ సమయంలోగా పార్టీ పుంజుకుని మళ్లీ మునుపటిలాగా బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనన్న అభిప్రాయం ప్రజల్లో తేవాలంటే ఎలా దూకుడుగా వ్యవహరించాలి? సూక్ష్మస్థాయిలో ఏయే వ్యూహాలను రచించి పాటించాలి? వంటి అంశాలపై పార్టీ నేతలకు ఆయన సూచిస్తారని భావించారు..

ఈడీ అదుపులో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ కస్టడీలో పరిస్థితి విషమించడం, ఐసీయూలో చేరడం

తమిళనాడు ఇంధన శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీ మనీలాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. బుధవారం ఉదయం వి సెంథిల్ బాలాజీ ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించి ఆయనను అరెస్టు చేశారు. అధికారులు తమతో తీసుకెళ్లడం ప్రారంభించిన వెంటనే కన్నీరుమున్నీరయ్యారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఈడీ అధికారులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. సెంథిల్ బాలాజీని ఐసీయూకి తరలించినట్లు డీఎంకే ఎంపీ, న్యాయవాది ఎన్ఆర్ ఎలాంగో తెలిపారు. డిస్క్ తర్వాత, డిఎంకె సెంథిల్‌పై దాడి చేసి హింసించారని ఆరోపించింది.

డీఎంకే చిత్రహింసలకు పాల్పడిందని ఆరోపించారు

డిఎంకె నాయకులు బాలాజీ తన ప్రాంగణంలో సోదాల తర్వాత ఆందోళనకు గురయ్యారని ఆరోపించారు. బాలాజీ పరిస్థితి చూస్తుంటే చిత్రహింసలకు గురిచేసినట్లు అనిపిస్తోందని రాష్ట్ర మంత్రి పీకే శేఖర్‌బాబు అన్నారు. సెంథిల్ బాలాజీ పరిస్థితిపై పీ శేఖర్ బాబు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం విద్యుత్ శాఖ మంత్రిని ఐసీయూలో ఉంచినట్లు తెలిపారు. అతను అపస్మారక స్థితిలో ఉన్నాడు మరియు అతని పేరు పిలిచినా స్పందించడం లేదు. అతని చెవి దగ్గర వాపు ఉంది. అతని ఈసీజీలో కూడా చాలా హెచ్చు తగ్గులు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. బాలాజీని చిత్రహింసలకు గురిచేశారని బాబు ఆరోపిస్తున్నారు.

సెంథిల్ బాలాజీని ఐసీయూకి తరలించినట్లు డీఎంకే ఎంపీ, న్యాయవాది ఎన్ఆర్ ఎలాంగో తెలిపారు. బాలాజీ అరెస్టును ఈడీ అధికారికంగా ధృవీకరించలేదని డీఎంకే నేత తెలిపారు. ఆసుపత్రికి చేరుకోగానే సెంథిల్ బాలాజీని ఐసీయూకి తరలించినట్లు చూశానని చెప్పారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి ఏమిటో డాక్టర్ మాత్రమే చెప్పగలరు. తనపై దాడి చేసినట్లుగా ఉందని డీఎంకే ఎంపీ అన్నారు. డాక్టర్ సరైన నివేదికను సిద్ధం చేయాలి.అన్ని గాయాల మార్కులను కూడా గమనించాలి. అధికారికంగా నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తుంది.

ఈడీని ఆరోపిస్తూ.. నిన్న ఉదయం ఏడు గంటలకు మంత్రిని గృహనిర్బంధం చేశారని ఎంపీ తెలిపారు. జూన్ 14వ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు స్నేహితులు, బంధువులు, న్యాయవాదులు ఎవరినీ కలవడానికి అనుమతించలేదు. సడెన్ గా రెండు గంటలకి హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. అడ్మిట్ చేసుకున్నప్పుడు స్పృహలో లేనట్లు అనిపించిందని ఎంపీ అన్నారు.

విషయం ఏమిటి?

మనీలాండరింగ్ విచారణకు సంబంధించి కరూర్ జిల్లాకు చెందిన ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ప్రముఖుడు బాలాజీకి సంబంధించిన ప్రాంగణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం దాడులు చేసింది. బాలాజీకి వ్యతిరేకంగా ఆరోపించిన 'ఉద్యోగం కోసం నగదు' కుంభకోణంపై విచారణకు సుప్రీంకోర్టు పోలీసు మరియు EDకి అనుమతి ఇచ్చిన నెలల తర్వాత ఈ చర్య వచ్చింది. మనీలాండరింగ్‌ విచారణలో భాగంగా చెన్నై, కరూర్‌, ఈరోడ్‌లలో బాలాజీకి సంబంధించిన స్థలాలపై మంగళవారం ఈడీ దాడులు చేసింది.

Cyclone Biparjoy: ముంచుకొస్తున్న బిపోర్‌జాయ్‌.. 8 రాష్ట్రాలకు అలర్ట్‌

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాను (Cyclone Biparjoy) తీరం దిశగా ముంచుకొస్తోంది. గురువారం సాయంత్రం ఈ తుపాను గుజరాత్‌లోని జఖౌ పోర్టు సమీపంలో తీరం దాటనుంది..

అయితే తీరం దాటే సమయంలో ఈ తుపాను భారీ నష్టం కలిగించే అవకాశమున్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో తీర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. అటు గుజరాత్‌ (Gujarat)లోని కచ్‌, ద్వారక, సౌరాష్ట్ర ప్రాంతాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు.

కచ్‌, ద్వారక, పోర్‌బందర్‌, జామ్‌నగర్‌, మోర్బీ, జునాగఢ్‌, రాజ్‌కోట్‌ జిల్లాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశముందని ఐఎండీ (IMD) తెలిపింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనా ఆశ్చర్యం లేదని పేర్కొంది. లోతట్టు ప్రాంతాలకు వరదముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. దీంతో కేంద్ర, రాష్ట్ర యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి..

8 రాష్ట్రాల్లో వర్షాలు..

బిపోర్‌జాయ్‌ తుపాను (Cyclone Biparjoy) ప్రభావంతో గుజరాత్‌తో పాటు మరో ఎనిమిది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గోవా రాష్ట్రాలతో పాటు డామన్‌డయ్యూ, లక్షద్వీప్‌, దాద్రానగర్‌ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. రాజస్థాన్‌లో జూన్‌ 16 నుంచి ఈ తుపాను ప్రభావం ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. జోధ్‌పుర్‌, ఉదయ్‌పుర్‌ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది..

Manipur Violence: మణిపుర్‌లో మళ్లీ హింస.. 9 మంది మృతి..!

ఇంఫాల్‌: జాతుల మధ్య ఘర్షణలతో చెలరేగిన హింస కారణంగా కొద్దిరోజులుగా ఈశాన్య రాష్ట్రం మణిపుర్(Manipur) అట్టుడుకుతోంది. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది..

అక్కడ మరోసారి చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో తొమ్మిది మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఓ మహిళ కూడా ఉందని సమాచారం. పలువురు గాయపడినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. (Manipur Violence)

ఇంఫాల్‌ తూర్పు జిల్లాలోని ఖమెన్‌లక్‌ ప్రాంతంలో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. ఉగ్రవాదులు, గ్రామ వాలంటీర్ల మధ్య సోమవారం రాత్రి వరకు ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ ఘటన కారణంగా తొమ్మిది మంది మృతి చెందారని, ఐదుగురు గాయపడ్డారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ధ్రువీకరణ మాత్రం రాలేదు. గాయపడిన వారిని దగ్గర్లోని ఆసుపత్రుల్లో చేర్చారు. దాంతో కర్ఫ్యూ అమలు చేస్తోన్న సమయం మరింత పెరిగింది. ఆంక్షల సడలింపులకు కోత పడింది..

Tamil Nadu: ఈడీ అరెస్టు.. ఆసుపత్రిలో ఏడ్చేసిన మంత్రి

చెన్నై: మనీలాండరింగ్‌ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి, డీఎంకే నేత వి.సెంథిల్‌ బాలాజీ (Senthil Balaji)ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ED) అధికారులు అరెస్టు చేశారు..

మంగళవారం రాష్ట్ర సచివాలయంలోని ఆయన కార్యాలయంతో పాటు చెన్నైలోని నివాసంలో సుదీర్ఘంగా సోదాలు (Raids) చేపట్టిన ఈడీ అధికారులు.. అర్ధరాత్రి తర్వాత మంత్రిని అదుపులోకి తీసుకున్నారు. కొన్ని గంటల పాటు ప్రశ్నించిన తర్వాత బుధవారం ఉదయం అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే వైద్య పరీక్షల నిమిత్తం సెంథిల్‌ను చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు.

అయితే, అప్పటికే అనారోగ్యంతో ఉన్న మంత్రి.. ఆసుపత్రికి తీసుకొచ్చే సమయంలో ఛాతీ నొప్పి తట్టుకోలేక ఏడ్చేశారు. కారు నుంచి కిందికి దిగే క్రమంలో తీవ్రంగా విలపించిన సెంథిల్‌ బాలాజీ (Senthil Balaji)ని పోలీసులు బలవంతంగా ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. ఈడీ విచారణ సమయంలో మంత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేదని DMK రాజ్యసభ సభ్యుడు ఎన్‌.ఆర్‌. ఇలంగో చెప్పారు. ప్రస్తుతం సెంథిల్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు..

అమిత్ "షా రొస్తున్నారు!!

హైదరాబాద్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

చూద్దాం సై.. చేద్దాం సై

బీజేపీ శ్రేణుల్లో హుషారు నింపే యత్నం

రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలతో రేపు సమావేశం

భద్రాచలం క్షేత్రంలో సీతారాముల దర్శనం

ఖమ్మంలో బహిరంగసభ.. ఎన్టీఆర్‌కు నివాళి

తెలంగాణలో అధికారం దిశగా పార్టీని నడిపేలా.. బీజేపీ కార్యకర్తలు, శ్రేణులకు కొత్త ఉత్సాహాన్నిస్తూ అమిత్‌ షా పర్యటన సాగుతుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

బుధవారం అర్ధరాత్రి సమయానికి హైదరాబాద్‌కు చేరుకోనున్న షా.. గురువారం రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమై పలు అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేస్తారని, శ్రేణులను వార్‌ మోడ్‌లో పెడతారని భావిస్తున్నారు. ముఖ్యంగా.. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో మిగిలింది ఐదారు నెలల స్వల్ప సమయమేనని, ఈ సమయంలోగా పార్టీ పుంజుకుని మళ్లీ మునుపటిలాగా బీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం తామేనన్న అభిప్రాయం ప్రజల్లో తేవాలంటే ఎలా దూకుడుగా వ్యవహరించాలి? సూక్ష్మస్థాయిలో ఏయే వ్యూహాలను రచించి పాటించాలి? వంటి అంశాలపై పార్టీ నేతలకు ఆయన సూచిస్తారని సమాచారం. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి మార్పు అంశం పార్టీలో కలకలం రేపుతున్న నేపథ్యంలో.. అమిత్‌ షా ఆ అంశంపై కూడా పార్టీ శ్రేణులకు ఒక స్పష్టతనిస్తారని భావిస్తున్నారు. ఒకవేళ పార్టీ నాయకత్వాన్ని మార్చాలని భావిస్తే.. దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో కూడా వివరించి, ఒప్పిస్తారని అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జుల మధ్య సమన్వయలోపం కూడా తెలంగాణలో పార్టీ ఎదుగుదలకు శాపంగా మారిందన్న అభిప్రాయం ఉంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరిస్తున్న సునీల్‌ బన్సల్‌, తరుణ్‌ఛుగ్‌తో పాటు.. సంస్థాగత పార్టీ అగ్రనేత శివప్రకాశ్‌, మరో సీనియర్‌ నేత అర్వింద్‌ మీనన్‌ రాష్ట్ర బీజేపీకి ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్నారు. వీరి మధ్య సమన్వయం లేదన్న ప్రచారంపార్టీవర్గాల్లో జరుగుతోంది. దీంతోపాటు పలువురు సీనియర్‌ నేతల మధ్య కొరవడిన సఖ్యత... కొత్త, పాత నేతల మధ్య అపోహలు.. కొంతమంది అసమ్మతి నేతల రహస్య భేటీలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇతరపార్టీల నుంచి వచ్చిన నేతల నడుమ విభేదాలు.. ఒకరికి ప్రాధాన్యమిస్తే మరొకరు ఆగ్రహం చెందడం.. ఒకరికి పార్టీ పదవి ఇస్తే మరొకరు వ్యతిరేకించడం వంటి చర్యలు పార్టీ దూకుడును ఒక అడుగు ముందుకు వేస్తే రెండడుగులు వెనక్కి వేసినట్లుగా మారుస్తున్నాయన్న వాదన ఉంది. ఫలితంగా జాతీయ నాయకత్వం నిర్దేశిస్తున్న కార్యక్రమాలను పలుచోట్ల తూతూమంత్రంగా కొనసాగిస్తున్నారన్న వాదన కూడా ఉంది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి పార్టీ దూకుడు పెంచడానికి ఆట్టే సమయం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ భవితవ్యం అమిత్‌ షా పర్యటనపైనే ఆధారపడి ఉందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీంతోపాటు.. పార్టీకి పట్టులేని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అమిత్‌షా తొలిసారిగా బహిరంగసభలో పాల్గొంటున్న దృష్ట్యా, ఆ జిల్లాలో ఎలాంటి సమీకరణాలకు తెరలేవబోతోందన్నది కూడా రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

వరుస భేటీలు

అమిత్‌షా బుధవారం రాత్రి 11.55 గంటలకు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రికి శంషాబాద్‌ నొవాటెల్‌లో బస చేస్తారు. గురువారం ఉదయం రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. అనంతరం ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణతో, ఆ తర్వాత ప్రముఖ సినీ దర్శకులు రాజమౌళితో మణికొండలో సమావేశమవుతారు. 12.45 గంటలకు శంషాబాద్‌లోని జేడీ కన్వెన్షన్‌లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ నాయకులతో, కేడర్‌తో గంటంబావు పాటు విందు సమావేశంలో గడుపుతారు. 2.25 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి భద్రాచలం చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు రాములవారిని దర్శించుకున్న తర్వాత.. 5 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా.. 5.40 గంటలకు ఖమ్మంలోని ఆయన విగ్రహానికి నివాళులర్పిస్తారు. 6 గంటలకు పార్టీ బహిరంగసభలో పాల్గొన్న అనంతరం.. 7.10కి గెస్ట్‌హౌ్‌సలో విశ్రాంతి తీసుకుంటారు. 7.40 గంటలకు బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కణ్నుంచీ 8.15 గంటలకు ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్‌ వెళతారు...

తిరుమలలోకొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి :జూన్ 14

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు బుధవారం టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 27 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 75,227 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం 3.85 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 33,706 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు....

SB NEWS