ఢిల్లీ లిక్కర్ కేసులో మాగుంట రాఘవకు బెయిల్..
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాగుంట రాఘవకు ఊరట లభించింది. మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు 15 రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది..
తన అమ్మమ్మ అనారోగ్యంతో ఉందని బెయిల్ కోసం రాఘవ హైకోర్టును ఆశ్రయించగా.. నేడు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది..
కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాగుంట రాఘవను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫిబ్రవరి 10న అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
సౌత్ గ్రూప్ తరఫున చెల్లించిన రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంలో రాఘవరెడ్డి పాత్ర ఉందని.. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈడీ ఆరోపించింది..











Jun 07 2023, 14:28
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.7k