ప్రకాశం జిల్లా: ఒంగోలు రాజాపానగల్‌లో తుపాకీ పేలుడు
ప్రకాశం జిల్లా: ఒంగోలు రాజాపానగల్‌లో తుపాకీ పేలుడు కలకలం రేగింది. యూబీఐ కరెన్సీ టెస్సీ సెంటర్ లో ఎస్పీఎఫ్ గార్డు వెంకటేశ్వర్లు గన్ పేలింది.
ఈ ఘటనలో గార్డు వెంకటేశ్వర్లు తలలోకి బుల్లెట్ దూసుకువెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఇది ఆత్మహత్య లేక గన్ మిస్ ఫైర్ అయిందా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు జరిగింది.
ఎస్పీఎఫ్ గార్డు వెంకటేశ్వర్లు మధ్యాహ్నం డ్యూటీకి వచ్చారు. వచ్చిన 30 నిముషాలలోనే అతని గన్ ఫైర్ అయినట్లుగా సమాచారం. అయితే గన్ మిస్ ఫైర్ అయిందా? లేక ఇతర కారణాలతో వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
సంఘటన ప్రదేశంలో లోపలకు ఎవరినీ రానివ్వడంలేదు. క్లూస్ టీమ్ సాయంతో అక్కడున్న వేలిముద్రలు సేకరించారు. ఆ వేలి ముద్రలు వెంకటేశ్వర్లువేనా? లేక ఇతరులవా? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది....











Jun 05 2023, 21:47
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
43.1k