Rahul Gandhi: తెలంగాణలోనూ భాజపాను తుడిచిపెట్టేస్తాం: రాహుల్ గాంధీ
న్యూయార్క్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తమ పార్టీ ఇతర రాష్ట్రాల్లోనూ ఆ పరంపరను కొనసాగిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ధీమా వ్యక్తం చేశారు..
తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లోనూ భాజపా (BJP) తుడిచిపెట్టుకుపోతుందని చెప్పారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదని.. యావత్తు దేశం విద్వేషపూరిత సిద్ధాంతాలను ఓడించేందుకు సిద్ధమైందని భాజపాపై నిప్పులు చెరిగారు.
''భాజపాను తుడిచిపెట్టేయగలమని కర్ణాటకలో నిరూపించాం. మేం వారిని కేవలం ఓడించలేదు. తుడిచిపెట్టేశాం'' అని న్యూయార్క్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్- యూఎస్‌ఏ నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ (Rahul Gandhi) అన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన న్యూయార్క్, వాషింగ్టన్, శాన్‌ఫ్రాన్సిస్కోలో కార్యక్రమాలను ముగించుకొని మాన్‌హాటన్ చేరుకోనున్నారు..
2024 ఎన్నికల్లోనూ భాజపా (BJP)ను ఓడిస్తామని రాహుల్ అన్నారు. ప్రతిపక్షాలు ఏకమయ్యాయని చెప్పారు. అన్ని పార్టీలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఓవైపు భాజపా విద్వేషపూరిత సిద్ధాంతం.. మరోవైపు కాంగ్రెస్ ప్రేమపూర్వక సిద్ధాంతం ప్రజల ముందున్నాయని వ్యాఖ్యానించారు..











Jun 05 2023, 09:18
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
13.0k