మద్యం దుకాణానికి తాళాలు వేసి బైఠాయింపు
మర్రిగూడ, ఇటీవల ప్రభుత్వం తగ్గించిన ధరలకే మద్యం విక్రయించాలని మద్యం ప్రియులు డిమాండ్ చేశారు. మర్రిగూడ మండలకేంద్రంలోని మూడు వైన్‌షాపులకు బుధవారం రాత్రి తాళాలు వేసి బైఠాయించారు. ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించినట్లు ప్రకటించినా స్థానిక పద్మావతి, వెంకటసాయి, శ్రీసాయి మద్యం దుకాణాల యజమానులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి పాత ధరలకే మద్యం విక్రయిస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం తగ్గించిన ధరలకు మీరు ఎందుకు విక్రయించడం లేదంటూ నిర్వాహకులను ప్రశ్నించారు. పాత స్టాక్ ఉన్నందున దానిపై ఉన్న ధరలకే విక్రయిస్తున్నామని, కొత్త స్టాక్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రకటించిన ధరలకు విక్రయిస్తామని వైన్ షాపుల యజమానులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రంగారెడ్డి మద్యం దుకాణాల వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు.
మూడు దుకాణాల యజమానులు సిండికేటై ఇష్టానుసారం మద్యం విక్రయిస్తున్నారని ఎస్‌ఐకి చెప్పారు. ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించిన మాట వాస్తవమేనని, కానీ పాత స్టాక్ ఉన్నందున తాము వాటిపై ఉన్న ధరలకే అమ్ముతున్నామని నిర్వాహకులు తెలిపారు. మద్యం ప్రియులకు ఎస్‌ఐ రంగారెడ్డి నచ్చజెప్పి దుకాణాలను తెరిపించి యథావిధిగా కొనుగోలు చేయించారు.
SB NEWS
SB NEWS











May 11 2023, 13:52
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
118.7k