/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz కొండగట్టు అంజన్న చెంతకు కాళేశ్వరం నీళ్లు Yadagiri Goud
కొండగట్టు అంజన్న చెంతకు కాళేశ్వరం నీళ్లు

జగిత్యాల జిల్లా : మహిమాన్విత క్షేత్రం, 400 ఏండ్ల చరిత్ర గల కొండగట్టు అంజన్న స్వామి చెంత నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశనంలో ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎస్సారెస్పీ వరదకాలువ నుంచి శాశ్వత నీటి వనరు కల్పించి, తద్వారా కాళేశ్వర జలాలను అంజన్న చెంతకు చేర్చి 365 రోజులు నీరు పుష్కలంగా అందుబాటులో ఉంచేందుకు కార్యాచరణను రూపొందించింది. తాజాగా రూ.13.45 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టింది. ఆరు నెలల్లో పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది.

ముఖ్యమంత్రి దిశానిర్దేశం

కొండగట్టు క్షేత్రం గతంలో అభివృద్ధికి నోచుకోలేదు. దేవస్థానం పరిధిలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం, అలాగే అద్భుత క్షేత్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్‌.. ఈ ఏడాది ఫిబ్రవరి 15న కొండగట్టులో స్వయంగా పర్యటించారు. దానికి ముందుగానే జగిత్యాలలో జరిగిన ఓ బహిరంగ సభలో కొండగట్టు అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కొండగట్టును సమూలంగా అభివృద్ధి చేసేందుకు దశల వారీగా రూ.వెయ్యి కోట్లయినా కేటాయిస్తామని అక్కడే ప్రకటించారు.

నీటి సమస్యకు శాశ్వత విముక్తి

దేవస్థానం పరిధిలో నీటి కొరత వెంటాడుతున్నది. పకడ్బందీ ప్రణాళికలు లేకపోవడం వల్ల కొండపై నిత్యావసరాలతో పాటు తాగునీటికి అవస్థలు ఏర్పడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టాక.. మిషన్‌ భగీరథ కింద కొంత మేరకు పరిష్కారం చూపింది. అయితే భవిష్యత్‌లో నీటి కొరత పునరావృతం కాకుండా కొండగట్ట్టును ఆనుకొని ఉన్న ‘సంతలోని లొద్ది’కి వరద కాలువ నుంచి నీటిని పంపింగ్‌ చేయడానికి ప్లాన్‌ చేశారు. ఇందుకోసం మల్యాల మండలం ముత్యాల గ్రామ శివారులోని వరదకాలువ 81 కిలోమీటర్‌ వద్ద ప్రత్యేకంగా పంపు హౌస్‌ నిర్మిస్తున్నారు.

అక్కడి నుంచి 1.7 కిలోమీటర్ల మేర పైపులైన్‌ వేసి ప్రెజర్‌ పంపు ద్వారా లొద్దికి పంపిస్తారు. ఇందుకోసం లొద్ది ప్రస్తుత సామర్థ్యాన్ని పెంచుతున్నారు. ప్రస్తుతం 358 ఉన్న ఎఫ్‌టీఎల్‌ (ఫుల్‌ ట్యాంకు లెవల్‌) నుంచి 370కి పెంచుతున్నారు. పాత బండ్‌కు ఆనుకొని కొత్త బండ్‌ నిర్మిస్తున్నారు. వీటి ద్వారా ప్రస్తుతం 2.50 ఎంసీఎఫ్‌టీ ఉన్న లొద్ది సామర్థ్యం 13 ఎంసీఎఫ్‌టీకి పెరుగుతుంది. ఈ పనులన్నింటినీ ఆరు నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. సాయిల్‌ టెస్టింగ్‌ వంటి పలు పరీక్షల నిమిత్తం ఎన్‌ఐటీ వరంగల్‌కు పంపించారు. ఈ పనులు పూర్తయితే కొండగట్టు చెంతకు కాళేశ్వరం జలాలు వచ్చి నీటి సమస్యకు శాశ్వత విముక్తి కలుగనున్నది.

సీఎం దూరదృష్టికి నిదర్శనం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూరదృష్టి వల్లే కొండగట్టులో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతున్నది. కొండగట్టు క్షేత్రస్థాయి పర్యటన రోజే సీఎం కేసీఆర్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆ ప్రకారంగానే పనులకు శ్రీకారం చుట్టారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత నీటి సమస్యే కాదు కొండగట్టును అద్భుతంగా తీర్చిదిద్దేందుకు అనుమతిచ్చిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం.

ఆల్ సో మేష్ కుమార్

అంతా ఆయనొక్కడే

మూడు నెలల విరామంతో సీఎస్ సోమేశ్ కుమార్ మళ్లీ ప్రభుత్వంలోకి ఎంట్రీ అయ్యారు. సీఎస్‌గా పని చేస్తున్న సమయంలో జనవరి రెండోవారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏపీకి వెళ్లారు. అక్కడ పోస్టింగ్ ఇవ్వకపోవడంతో వీఆర్ఎస్ తీసుకున్నారు.

కాగా, సోమేశ్ కుమార్ మొదటి నుంచే సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడుగా ముద్రపడ్డారు. దీంతోనే కేడర్ విషయంలో న్యాయస్థానాల్లో కేసులున్నా, వాటన్నింటిని పక్కన పెట్టి సీఎం ఆయనకు సీఎస్ బాధ్యతలు అప్పగించారని చర్చ ఉన్నది. ఇప్పుడు ఏదైనా కీలక పోస్టు ఇస్తారనే హామీతోనే సోమేశ్ కుమార్ వీఆర్ఎస్ తీసుకున్నారని ప్రచారం జరిగింది. మహారాష్ట్ర బీఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్ వేదికపై సోమేశ్ ప్రత్యక్షం కావడంతో త్వరలో ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవి ఇస్తారని టాక్ నడిచింది.

కీలకం కానున్న సోమేశ్

సీఎం ముఖ్య సలహాదారుడిగా అపాయింట్ కావడంతో సర్కారులో మళ్లీ సోమేశ్ శకం వస్తుందనే ప్రచారం జరుగుతున్నది. ఆయన సీఎస్‌గా పనిచేసినప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంతా ఆయన కనసన్నల్లోనే జరిగేది. ఆయనకు తెలియకుండా ఏ సెక్రటరీ సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఇప్పుడు సీఎం చీఫ్ అడ్వయిజర్‌గా అపాయింట్ కావడంతో సీఎస్ ఆఫీసు, సీఎంఓ సెక్రటరీల పనితీరుపై ఎఫెక్ట్ పడుతుందేమోనని చర్చ జరుగుతున్నది.

అనధికారిక ప్రొటోకాల్ ప్రకారం సీఎస్ శాంతికుమారి, సీఎంఓ సెక్రటరీలు అందరూ ఇప్పటి నుంచే ఆయన గైడెన్స్ ప్రకారం పనిచేయాల్సి ఉంటుందేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఫైల్‌ను సోమేశ్ కుమార్ పరిశీలించాకే, సీఎం సంతకం కోసం వెళ్లేవిధంగా ఏర్పాట్లు చేస్తారేమోనని టాక్ వినిపిస్తున్నది.

భిన్నాభిప్రాయాలు

సోమేశ్ నియామకంపై అధికారులు, మంత్రుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు తీర్పుతో సోమేశ్ ఏపీకి వెళ్లడంతో ఊపిరి పీల్చుకున్న కొందరు అధికారుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. అయితే ఆయన నియామకాన్ని స్వాగతించే ఆఫీసర్లు, మంత్రులు కూడా ఉన్నారు. సోమేశ్ హయాంలో సీఎస్ ఆఫీసుకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, ఆయన సీఎస్‌గా ఉండి ఉంటే, సెక్రటేరియట్ ప్రారంభోత్సవంలో ఎంప్లాయీస్‌కు అవమానాలు జరిగేవి కావని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎంతటి కష్టమైన పనినైనా, ఎంతో దీక్షతో పూర్తి చేసేవారిని మంత్రులు కితాబిస్తున్నారు.

ప్రియాంక గాంధీ తెలంగాణలో పోటీ చేయనున్నారా ❓️

తెలంగాణలో గులాబీ పార్టీ హ్యాట్రిక్ కొట్టకూడదు.. ఎట్టి పరిస్థితుల్లో, ఏం చేసైనా సరే కేసీఆర్‌ను గద్దె దించాల్సిందే.. బీఆర్ఎస్‌ కారుకు బ్రేక్‌లు వేసి చావు దెబ్బ రుచి చూపించాలి.. ఇదే కాంగ్రెస్, బీజేపీ పార్టీల ముందున్న ముందున్న ఏకైక లక్ష్యం. ఇందుకు ఇరు పార్టీలు శక్తికి మించి మరీ ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఢిల్లీ పెద్దలు మోదీ, అమిత్‌ షా డైరెక్షన్‌లో కమలనాథులు.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్, గాంధీ కుటుంబం చరీష్మాతో పూర్వవైభవం తీసుకొచ్చి అధికారంలోకి రావాలని నేతలు తహతహలాడుతున్నారు. సరిగ్గా ఇదే టైమ్‌లో తెలంగాణ నుంచే ప్రియాంక గాంధీని పోటీ చేయించాలనే యోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయాన్ని తెలంగాణ నేతలు.. సోనియా గాంధీ రాహుల్ గాంధీలకు చెవిన వేసినట్లు తెలుస్తోంది. ఎక్కడ్నుంచి పోటీ చేయించవచ్చు..? ఎంపీ అయితే బాగుంటుందా..? ఎమ్మెల్యే అయితే బాగుంటుందా..? అని సమాలోచనలు కూడా చేశారట.

ఇందుకు రెండు నియోజకవర్గాలను ఎంపిక చేశామని.. ఎంపీగా అయితేనే కరెక్ట్‌గా ఉంటుందని వివరించారట. మహబూబ్‌నగర్ లేదా మెదక్ నుంచి పోటీ చేయించాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు ఇటు తెలంగాణలో.. అటు ఢిల్లీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ప్రియాంకను తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకురావడం వల్ల ఇక్కడ రాజకీయ సమీకరణలు మార్చవచ్చన్నది టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లానట. ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్రియాంకను ‘ఫేస్ ఆఫ్ ది తెలంగాణ కాంగ్రెస్’ అని రాష్ట్ర నేతలు భావిస్తున్నారట.

అటు నుంచి ఇటు..!

కర్ణాటకలో కాంగ్రెస్‌కు విజయావకాశాలు ఉన్నాయని అగ్రనేతలు గట్టిగా నమ్ముతున్నారు. మరోవైపు బీజేపీ కూడా కచ్చితంగా కాషాయ జెండా ఎగరేస్తామని కమలనాథులు ధీమాగా చెబుతున్నారు. ఇక్కడ ఎన్నికలు పూర్తవ్వగానే ఈ రెండు పార్టీలకు టార్గెట్ తెలంగాణ మాత్రమే. అక్కడ.. ఇక్కడ తాడేపేడో తేల్చుకోవాలని జాతీయ పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే జాతీయ స్థాయి నేతలు తెలంగాణ నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారట. ఇప్పటికే ప్రధాని మోదీ మహబూబ్‌నగర్ నుంచి పోటీచేస్తారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సోనియాగాంధీ కూడా మల్కాజిగిరి నుంచి పోటీచేస్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది. ఇప్పుడు ఏకంగా ప్రియాంక గాంధీ గురించి వార్తలు గుప్పుమంటున్నాయి. మెదక్ లేదా మహబూబ్‌నగర్ నుంచి పోటీచేసే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ఇందిరాగాంధీ 1980లో మెదక్ నుంచి ఎంపీగా పోటీచేసి విజయకేతనం ఎగురవేశారు. అప్పటికే అత్యవసర పరిస్థితితో విమర్శలపాలైన ఇందిరమ్మను మెదక్ ప్రజలు అక్కున చేర్చుకోవడంతో ఈ విజయం పెను సంచలనమే అయ్యింది. అందుకే నాన్నమ్మ బాటలో.. ఇక్కడ్నుంచే ప్రియాంకను పోటీ చేయిస్తే కాంగ్రెస్‌కు కలిసొస్తుందని ఏఐసీసీ ప్లాన్ చేస్తోందట. బీజేపీని ఢీ కొట్టలేక చతికిలపడుతున్న కాంగ్రెస్‌కు ప్రియాంక రూపంలో ఊపిరిపోయాలని హైకమాండ్ అనుకుంటోందట.

అంతా ముందస్తుగానే..!

ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటించడం పక్కా వ్యూహమేనట. రానున్న రోజుల్లో తెలంగాణ ఇంచార్జ్‌గా నియమించినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదట. సరూర్‌నగర్ పర్యటన జస్ట్ శాంపిల్ మాత్రమేనని.. మున్ముందు ఇక నెలలో రెండుసార్లు రాష్ట్రంలో పర్యటించేలా హైకమాండ్ ప్లాన్ చేస్తోందట. ఇప్పుడు యువత, నిరుద్యోగులు.. రానున్న రోజుల్లో రైతులు, ఆ తర్వాత ఉద్యమకారుల ఇలా ఒక్కో పర్యటనలో ఒక్క వర్గానికి సంబంధించి సభ ఉండబోతోందట. అయితే.. ఇటు ఇంచార్జ్.. అటు తెలంగాణ నుంచి పోటీ ఇవన్నీ ఒక్కసారిగా వార్తలు రావడంతో అసలు ఇందులో ఏది నిజమో తెలియక కార్యకర్తలు, వీరాభిమానులు తికమకపడుతున్నారు. వాస్తవానికి ప్రియాంక ఇదిగో ఫలానా చోటు నుంచి పోటీచేస్తారని వార్తలు ప్రతిసారి వస్తున్నాయే తప్పితే ప్రత్యక్ష ఎన్నికల్లో ఆమె ఎప్పుడూ బరిలోకి దిగలేదు. బాధ్యతలు మాత్రం పెద్దవే ఉన్నప్పటికీ పోటీ మాత్రమే ఎక్కడా చేయలేదు. ఇప్పుడు యువనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన తర్వాత కాంగ్రెస్‌కు ఉన్న ఏకైక ఆప్షన్ ప్రియాంకేనని కార్యకర్తలు, వీరాభిమానులు చెప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో అది కూడా వయనాడ్ నుంచి ప్రియాంక పోటీచేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇంతవరకూ ఆ ఊసేలేదు. ఒకవేళ పోటీచేయాల్సి వస్తే వయనాడ్, తెలంగాణ నుంచి ఒక స్థానంలో.. రెండుచోట్లా పోటీచేయించాలనేది హైకమాండ్ ప్లానట. ఆడబిడ్డ పైగా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా.. ఇందిరమ్మను ఇందిరమ్మ

ప్రియాంక రూపంలో చూసుకుని జనాలు గెలిపిస్తారని రాష్ట్ర పెద్దలు ధీమాతోనే ఉన్నారట.

బీఆర్ఎస్ అధినేత పార్లమెంట్ ఎన్నికల్లో నాందేడ్ స్థానం నుంచి పోటీ చేయనున్నారా ❓️

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. రానున్న జనరల్ ఎలక్షన్స్‌లో మహారాష్ట్రలోని నాందేడ్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

పార్టీ అధినేత స్వయంగా అక్కడి నుంచి పోటీచేసి గెలిస్తే దాని ప్రభావం మొత్తం రాష్ట్రం మీద ఉంటుందని అక్కడి నేతలు అభిప్రాయపడుతున్నారు. నాందేడ్ సెగ్మెంట్ మీద ఫోకస్ పెట్టినా ప్రత్యామ్నాయంగా ఔరంగాబాద్‌నూ పరిశీలిస్తున్నట్టు తెలిసింది.

మరికొంత విస్తృత అధ్యయనం తర్వాత ఎక్కడి నుంచి పోటీచేయాలన్న దానిపై కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చే చాన్స్ ఉన్నది. బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత కేవలం మహారాష్ట్రపై మాత్రమే ఫోకస్ పెట్టిన కేసీఆర్.. ఎక్కువగా తెలంగాణకు సరిహద్దుగా ఉన్న నాందేడ్, ఔరంగాబాద్ జిల్లాల మీదనే దృష్టి సారించారు.

ఆ జిల్లాలకు చెందిన నేతలనే పార్టీలో చేర్చుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. గ్రామస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు వివిధ పార్టీలకు చెందిన నేతలను వందల సంఖ్యలో బీఆర్ఎస్‌లోకి ఆహ్వానిస్తున్నారు. ఎన్సీపీ, శివసేన పార్టీలకు చెందిన నేతలు కూడా వీరిలో ఉన్నారు.

ఇప్పటికే రెండుసార్లు నాందేడ్ జిల్లాలో పబ్లిక్ మీటింగ్స్ పెట్టిన బీఆర్ఎస్.. త్వరలో పొరుగున ఉన్న చంద్రాపూర్ జిల్లాలోనూ బహిరంగ సభను నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నది. ఇటీవల జరిగిన బోకర్ మార్కెట్ కమిటీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయినప్పటికీ ఇకపైన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున అభ్యర్థులను నిలబెట్టాలని గులాబీ బాస్ భావిస్తున్నారు.

జాతీయ పార్టీగా గుర్తింపు కోసం..

జాతీయ పార్టీగా బీఆర్ఎస్‌ను తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని మహారాష్ట్ర నుంచే స్టార్ట్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. తొలుత కర్ణాటక నుంచి బోణీ కొట్టాలని భావించి జేడీఎస్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించినా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ దూరంగానే ఉన్నది. జేడీఎస్‌కు మద్దతుగా ప్రచారం చేయనున్నట్టు ఆ పార్టీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించినా అది మాటలకే పరిమితమైంది. నాందేడ్‌ నుంచి బీఆర్ఎస్‌కు విస్తృతమైన మద్దతు లభిస్తూ ఉన్నదనే భావనలో గులాబీ బాస్ ఉన్నారు..

ఇవాల్టి నుండి రికౌంటింగ్ వెరిఫికేషన్ అప్లికేషన్

ఇయ్యాల్టి నుంచి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు అప్లికేషన్లు

జూన్ 4 నుంచి అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ పరీక్షలు

 ఇంటర్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఫస్టియర్​లో 61.68% మంది, సెకండియర్​లో 63.49% మంది పాస్ అయ్యారు. పోయినేడాదితో పోలిస్తే పాస్ పర్సంటేజీ తగ్గింది. గతేడాది సెకండియర్​లో 67.16 శాతం మంది పాస్ కాగా, ఈసారి 63.49 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు.

ఫస్టియర్​లో పోయినేడు 63.32 శాతం మంది పాస్ కాగా, ఈసారి 61.68 శాతం పాస్ అయ్యారు. ఇక సర్కార్ కాలేజీల్లో దాదాపు సగం మంది స్టూడెంట్లు ఫెయిల్ అయ్యారు. సెకండియర్​లో మొత్తం 80,100 మంది పరీక్ష రాయగా 43,340 మంది మాత్రమే పాస్ అయ్యారు. పోయినేడాది సర్కారులో పాస్ పర్సంటేజీ 56.37 శాతం కాగా, అది ఈసారి 54 శాతానికి తగ్గింది. మంగళవారం నాంపల్లిలోని ఇంటర్ బోర్డులో సెక్రటరీ నవీన్ మిట్టల్​తో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు. ఎప్పటిలాగే ఈసారీ అమ్మాయిలు సత్తా చాటారు. సెకండియర్​లో మొత్తం 4,65,478 మంది పరీక్షలు రాయగా, వారిలో 2,95,550 (63.49%) మంది పాస్ అయ్యారు. అమ్మాయిలు 2,29,958 మంది రాయగా 1,64,598(71.57%) మంది ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిలు 2,35,520 మంది రాయగా 1,30,952 (55.60%) మంది పాస్ అయ్యారు. ఫస్టియర్​లో మొత్తం 4,82,675 మంది పరీక్షలు రాయగా.. 2,97,741 (61.68%) మంది పాస్ అయ్యారు. అమ్మాయిలు 2,41,673 మందికి గాను 1,65,994 (68.68%) మంది పాస్ కాగా.. అబ్బాయిలు 2,41,002 మందికి 1,31,747 (54.64%) మంది ఉత్తీర్ణత సాధించారు.

ములుగు టాప్..

సెకండియర్ జనరల్ కేటగిరీలో 85 శాతం పాస్ పర్సంటేజీతో ములుగు జిల్లా టాప్ లో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో కుమ్రంభీమ్​ ఆసిఫాబాద్ (81 శాతం), మేడ్చల్ (75 శాతం) నిలిచాయి. చివరి స్థానాల్లో మెదక్ (52 శాతం), నాగర్ కర్నూల్ (54 శాతం), వరంగల్ (58 శాతం) ఉన్నాయి. ఒకేషనల్ కేటగిరీలో 85 శాతం పాస్ పర్సంటేజీతో నారాయణపేట జిల్లా టాప్ లో ఉండగా.. 52 శాతంతో జగిత్యాల చివరి స్థానంలో ఉంది. ఇక ఫస్టియర్ జనరల్ కేటగిరీలో 75 శాతం పాస్ పర్సంటేజీతో మేడ్చల్ జిల్లా టాప్ లో ఉండగా.. 73 శాతంతో రంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మెదక్ (38 శాతం), నారాయణపేట (41 శాతం) చివరి స్థానాల్లో ఉన్నాయి.

గురుకులాలు ఫస్ట్..

ఇంటర్ ఫలితాల్లో గురుకులాలు సత్తాచాటాయి. ప్రైవేటు కాలేజీలతో పోలిస్తే భారీగా పాస్ పర్సంటేజీ నమోదైంది. ప్రైవేటు కాలేజీల్లో సెకండియర్​లో 63 శాతం మంది పాస్ కాగా, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ గురుకులాల్లో 92 శాతం మంది పాస్ అయ్యారు. అయితే ఎయిడెడ్​ విద్యాసంస్థల్లో మాత్రం 46 శాతం మందే ఉత్తీర్ణత సాధించారు.

జూన్ 1 నుంచి ఇంటర్ క్లాసులు: నవీన్ మిట్టల్

రీకౌంటింగ్, రీవెరిఫికేషన్​కు బుధవారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ వెల్లడించారు. ఈ నెల 16 వరకు అవకాశం ఉంటుందని తెలిపారు. రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపర్​కు రూ.100, రీవెరిఫికేషన్​ కు రూ.600 ఫీజు చెల్లించాలని చెప్పారు. విద్యార్థులు tsbie.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రీవెరిఫికేషన్ కు అప్లై చేసుకున్నోళ్లకు ఆన్సర్ బుక్ లెట్ జిరాక్స్ కాపీలు ఇస్తామని పేర్కొన్నారు. ఇక జూన్ 4 నుంచి 9 వరకు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. సప్లిమెంటరీకి కూడా బుధవారం నుంచే ఫీజు చెల్లించవచ్చని చెప్పారు. మానసిక ఇబ్బందులుంటే హెల్ప్ లైన్ నంబర్ 14416కు కాల్ చేయాలని స్టూడెంట్లకు సూచించారు. జూన్ 1 నుంచి ఇంటర్ క్లాసులు స్టార్ట్​ అవుతాయని, త్వరలోనే ప్రైవేటు కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియ పూర్తిచేస్తామని తెలిపారు.

ఆందోళన పడొద్దు: సబితా ఇంద్రారెడ్డి

ఫెయిల్ అయిన స్టూడెంట్లు ఆందోళన పడొద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. వచ్చే నెల 4 నుంచి అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని చెప్పారు. ఈసారి ఎంసెట్​లో ఇంటర్ మార్కుల వెయిటేజీ తొలగించామని, కాబట్టి మార్కులతో ఇబ్బంది లేదన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు భరోసా ఇవ్వాలని సూచించారు. సర్కారు కాలేజీల్లో తక్కువ పాస్ పర్సంటేజీ నమోదైందని, గురుకులాలతో పోటీ పడాలన్నారు.

హైదరాబాదులో హెరిటేజ్ టవర్ కు కెసిఆర్ భూమి పూజ

మనుషులు, ప్రాంతాలు, దేశాలు వేరైనా పూజించే పరమాత్ముడు ఒక్కడేనని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌ కోకాపేటలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం, శ్రీకృష్ణ గో సేవామండలి విరాళంతో నిర్మిస్తున్న హరేకృష్ణ హెరిటేజ్‌ టవర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. మత మౌఢ్యం ప్రమాదకరమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

మత మౌఢ్యం మనుషులను పిచ్చివాళ్లను చేస్తుందని వెల్లడించారు. మతం, దేవుడు హింసకు వ్యతిరేకమని, మధ్యలో వచ్చినవాళ్లే మత మౌఢ్యాన్ని ప్రేరేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంతటి ఆధ్యాత్మిక వాతావరణంలో మీ మధ్య ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఆలయం సామాజిక సాంత్వన కేంద్రమని వెల్లడించారు.

హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు. నగరంలో హరేకృష్ణ ఆలయం నిర్మించడం మంచి పరిణామని చెప్పారు.

ఆలయ నిర్మాణానికి రూ.25 కోట్లు ఇస్తామని ప్రకటించారు. విశ్వశాంతి కోసం మనం ప్రార్థన చేయాలని సూచించారు. మనశ్శాంతి కోసం ప్రస్తుతం చాలామంది మ్యూజిక్‌ థెరపీ తీసుకుంటున్నారని చెప్పారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించామని తెలిపారు. వేములవాడ, కొండగట్టు ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. హరేకృష్ణ ఫౌండేషన్‌ అక్షయపాత్ర ద్వారా అన్నదానం చేయడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు.

హైదరాబాద్‌లో ధనవంతులు కూడా రూ.5 భోజనం తింటున్నారని చెప్పారు. ఎంతో చిత్తశుద్ధి ఉంటేనే అక్షయపాత్ర లాంటి కార్యక్రమాలు నడుస్తాయన్నారు. కరోనా సమయంలో హరేకృష్ణ ఫౌండేషన్‌ ఎన్నో సేవలు అందించిందని కొనియాడారు. అన్ని ఆపద సమయాల్లో ప్రజలకు అండగా నిలిచిందని చెప్పారు.

Rajasthan: రాజస్థాన్‌లో కూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిగ్-21 విమానం

జైపూర్ (రాజస్థాన్): ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిగ్-21 విమానం సోమవారం రాజస్థాన్‌ రాష్ట్రంలోని హనుమాన్ ఘడ్ జిల్లాలో కుప్పకూలిపోయింది.(Rajasthan)ఈ ప్రమాదం నుంచి ఎయిర్ ఫోర్స్ మిగ్-21 విమాన పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు..

ఎయిర్ ఫోర్స్ విమానం కూలిన ప్ర్రాంతానికి ఆర్మీ హెలికాప్టర్(Indian Air Force MiG-21 aircraft) వచ్చి సహాయ చర్యలు చేపట్టింది. ఈ మిగ్ విమానం సూరత్ ఘడ్ నుంచి బయలుదేరి ప్రమాదానికి గురైంది.(crash) గత జనవరి నెలలో రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ లో రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ సుఖోయ్ 30 మిరాజ్ 2000 విమానాలు కూలిన ఘటనలో ఓ పైలట్ మరణించారు..

SB NEWS

SB NEWS

SB NEWS

తగ్గుతున్న కరోనా కేసులు.. తాజాగా నమోదైన కేసులు ఇవే !

డిల్లీ..

గడిచిన 24 గంటల్లో 1839 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్నటితో పోలిస్తే దాదాపుగా 540 కేసులు తగ్గాయి. ఇక గత 24 గంటల్లో కోలుకున్న వారిలో 3861 మంది ఉన్నారు..

మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ గా ఉన్న కేసుల సంఖ్యను చూస్తే 25178 ఉన్నాయి. ఇక ముందు ముందు కేసుల సంఖ్య పెరగకుండా చూసుకుంటే ప్రమాదం ఉండదు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంది..

SB NEWS

SB NEWS

SB NEWS

చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోయిస్టులు మృతి

రాయ్‌పూర్‌: చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో సోమవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మహిళ సహా ఇద్దరు నక్సలైట్లు మృతి చెందారు..

భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దంతేష్‌పురం అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు(ఐఈడీ), ఆటోమేటిక్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతుంది.

డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) బృందం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో పాల్గొన్న సమయంలో కాల్పులు జరిగినట్లు సుక్మా పోలీస్ సూపరింటెండెంట్ సునీల్ శర్మ తెలిపారు. డీఆర్‌జీ పెట్రోలింగ్ బృందంపై నక్సలైట్లు కాల్పులు జరిపారని, ఆ తర్వాత పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులుజరిగాయని పేర్కొన్నారు.చెప్పారు.

జవాన్ల చేతిలో హతమౌన మావోయిస్టులను గుర్తించారు. రూ 8 లక్షల రివార్డ్ కలిగిన ఎస్‌ఓఎస్‌ కమాండర్ మావోయిస్ట్ మడ్కం ఎర్రతోపాటు మూడు లక్షల రివార్డ్ కలిగిన పొడియం భీమేగా గుర్తించారు..

SB NEWS

Nara Lokesh: తెదేపా అధికారంలోకి రాగానే కర్నూలులో హైకోర్టు బెంచ్‌: నారా లోకేశ్‌

కర్నూలు: తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు.

యువగళం పాదయాత్రలో భాగంగా కర్నూలులోని జిల్లా కోర్టు భవనం వద్దకు లోకేశ్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు ఆయన్ను కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ తమది సీఎం జగన్‌ మాదిరి మాట మార్చి, మడమ తిప్పే బ్యాచ్‌ కాదన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ కచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతాం స్పష్టం చేశారు. తెదేపా అధికారంలోకి రాగానే బెంచ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. హైకోర్టు బెంచ్‌ హామీపై లోకేశ్‌కు న్యాయవాదులు ధన్యవాదాలు తెలిపారు.

SB NEWS

SB NEWS