Nara Lokesh: తెదేపా అధికారంలోకి రాగానే కర్నూలులో హైకోర్టు బెంచ్: నారా లోకేశ్
కర్నూలు: తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు.
యువగళం పాదయాత్రలో భాగంగా కర్నూలులోని జిల్లా కోర్టు భవనం వద్దకు లోకేశ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు ఆయన్ను కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ తమది సీఎం జగన్ మాదిరి మాట మార్చి, మడమ తిప్పే బ్యాచ్ కాదన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ కచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతాం స్పష్టం చేశారు. తెదేపా అధికారంలోకి రాగానే బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు. హైకోర్టు బెంచ్ హామీపై లోకేశ్‌కు న్యాయవాదులు ధన్యవాదాలు తెలిపారు.
SB NEWS
SB NEWS











May 08 2023, 13:14
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.4k