/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Cyclone Mocha: ముంచుకొస్తున్న 'మోచా'.. తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు..! Yadagiri Goud
Cyclone Mocha: ముంచుకొస్తున్న 'మోచా'.. తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు..!

దిల్లీ: అకాల వర్షాలతో అల్లాడిపోతున్న రైతన్నలకు మరో పిడుగులాంటి వార్త. వచ్చే వారంలో తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను (cyclone) ముప్పు పొంచి ఉంది..

ఆగ్నేయ బంగాళాఖాతం (Bay of Bengal)లో తుపాను బలపడే అవకాశాలున్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మత్య్సకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. (Cyclone Mocha)

దిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో భారత వాతావరణ శాఖ (IMD) డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహపాత్ర ఈ వివరాలను వెల్లడించారు. ''మే 6 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశముంది. ఆ మరుసటి రోజు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమై మే 9వ తేదీ నాటికి తుపానుగా బలపడే అవకాశముంది. ఈ తుపాను cyclone) ఉత్తర దిశగా కదులుతూ మరింత తీవ్రమయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది'' అని ఆయన తెలిపారు..

కేదార్‌నాథ్‌లో భారీగా మంచు వర్షం.. చిక్కుకుపోయిన యాత్రికులు

కేదార్‌నాథ్‌లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. దీంతో చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన భక్తులు అష్టకష్టాలు పడుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఎడతెగని హిమపాతంతో భక్తులు అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.

కేదార్‌నాథ్‌లో భారీగా మంచు వర్షం.. చిక్కుకుపోయిన యాత్రికులు.. ఊపిరాడక ఇబ్బందులు

కేదార్‌నాథ్‌లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. దీంతో చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన భక్తులు అష్టకష్టాలు పడుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఎడతెగని హిమపాతంతో భక్తులు అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. ఎక్కువమంది వయస్సు మీద పడినవారే కావడంతో కొందరికి ఊపరి అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ప్రతికూల వాతావరణంతో కేదార్‌నాథ్‌ను నిలిపివేశారు. అక్కడి నుంచి భక్తులు వీలైనంత తర్వగా తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ యాత్రలో దాదాపు 150 మంది తెలుగువారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆలయ పరిసరాల్లో భారీగా మంచు వర్షం కురుస్తుండటంతో ఆలయ పరిసరాల్లో క్షణాల్లో వాతావరణం మారిపోతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కేదార్‌నాథ్‌ యాత్రను నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు.

Vikram : తంగలాన్ షూటింగ్ లో ప్రమాదం.. విక్రమ్ కు విరిగిన పక్కటెముక.. హాస్పిటల్ కు తరలింపు

తాజాగా చియాన్ విక్రమ్ కు తంగలాన్ సినిమా సెట్ లో ప్రమాదం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది..

ఇన్ని రోజులు పొన్నియిన్ సెల్వన్ ప్రమోషన్స్ లో ఉన్న విక్రమ్ నిన్ననే తంగలాన్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు..

చెన్నైలోని ఈపీవి ఫిలిం సిటీలో తంగలాన్ షూటింగ్ జరుగుతుంది..

నేడు ఉదయం కొన్ని యాక్షన్ సీన్స్ తీస్తున్న సమయంలో ప్రమాదం జరిగి విక్రమ్ కు పక్కటెముక విరిగింది..

వెంటనే చిత్రయూనిట్ విక్రమ్ ను హాస్పిటల్ కు తరలించారు.

వైద్యులు ఆపరేషన్ చేయాల్సి వస్తుందని తెలిపినట్లు విక్రమ్ మేనేజర్, చిత్రయూనిట్ మీడియాకు తెలిపారు..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి తెలంగాణ సర్కార్ కసరత్తు

తెలంగాణ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకోవాలని భావిస్తున్న రాష్ట్ర సర్కారు.. ఇకపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌నూ (ఏఐ) వాడుకోవాలనుకుంటున్నది. రోజువారీ పాలనా అవసరాలకు ఈ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఆలోచిస్తున్నది. అందుకు సంబంధించి ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగా మైక్రోసాఫ్ట్ సంస్థ సహకారంతో వినియోగంలోకి వచ్చిన చాట్ జీపీటీ‌లోని టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలని భావిస్తున్నది. ఇప్పటికే ఆ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక స్థాయిలో సంప్రదింపులు మొదలుపెట్టింది. త్వరలో ఆ కంపెనీకి చెందిన నిపుణుల బృందం హైదరాబాద్‌కు వచ్చి రాష్ట్ర ఐటీ శాఖ అధికారులతో చర్చలు జరపనున్నది.

ఈ మీటింగ్ తర్వాత ఏఐ టెక్నాలజీని అడ్మినిస్ట్రేటివ్ అవసరాలకు ఏ విధంగా వినియోగించుకోవాలన్నదానిపై స్పష్టత రానున్నది. ఏఐను పరిపాలనాపరమైన అవసరాలకూ ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు రాష్ట్ర ఐటీ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే బ్లాక్ చైన్ టెక్నాలజీని కొన్ని అవసరాలకు వాడుతున్నామని గుర్తుచేశారు. కొత్త సచివాలయాన్ని నిర్మించాలనుకున్న టైంలోనే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సైతం అడాప్ట్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని, అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల్లో వీలైనంత ఎక్కువగా డిజిటల్ వినియోగం ఉండాలని భావించామని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. దానికి తగినట్లుగానే సచివాలయంలోని చాంబర్లు, వర్క్ స్టేషన్ల డిజైన్ జరిగినట్టు వివరించారు.

రెండేండ్లుగా..

ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న టెక్నాలజీల్లో ఏఐ కూడా ఒకటని, భవిష్యత్తు ఈ టెక్నాలజీదేనంటూ గతేడాది జూలైలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రానున్న కాలంలో అనేక అంశాల్లో ఏఐ ఆధిపత్యం పెరుగుతుందని, అనేక రంగాల్లో ఈ టెక్నాలజీ వినియోగంలోకి వస్తుందని చెప్పుకొచ్చారు. దీనిని దృష్టిలో పెట్టుకునే ఈ రంగంలో కనీసంగా లక్ష మంది హైస్కూల్ విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సు అందించే తరహాలో శిక్షణ అందిస్తామని, ఇందుకోసం ఒక స్కీమ్‌ను తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ‘టాస్క్’ (తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జి) ద్వారా వేలాది మంది విద్యార్థులకు, వివిధ కాలేజీల్లోని ఫ్యాకల్టీకి జాబ్-రెడీ స్కిల్స్‌లో శిక్షణ కల్పించిన అంశాన్ని గుర్తుచేశారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇంటెల్ ఇండియా, హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్‌ల సంయుక్త సహకారంతో అప్లయిడ్ ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ సెంటర్‌’ను నెలకొల్పింది. రానున్న కాలంలో గ్రాడ్యుయేషన్ స్థాయిలో విద్యార్థులకు ప్రత్యేక ట్రెయినింగ్ ఇవ్వాల్సిన ప్రాధాన్యంపై కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం కొత్త సచివాలయం అందుబాటులోకి రావడంతో అడ్మినిస్ట్రేషన్ అవసరాలకూ ఏఐ టెక్నాలజీని వాడడం ద్వారా పనుల్లో కొంత వేగం పెరిగే చాన్స్ ఉందనే చర్చలు అధికారుల స్థాయిలో జరుగుతున్నాయి. ఐటీ శాఖ అధికారులు నిర్దిష్టంగా ఏ రూపంలో ఏఐ టెక్నాలజీని రోజువారీ పరిపాలనా అవసరాలకు వాడుకోవాలన్నదానిపై స్పష్టత లేకపోయినప్పటికీ పలు దేశాల్లో పైలట్ ప్రాతిపదికన వాడుతున్న అనుభవాలను స్టడీ చేస్తున్నారు.

మహారాష్ట్రపై కన్నేసిన KCR

జాతీయ రాజకీయాల్లో కీ రోల్ పోషించేందుకు రెడీ అయిన గులాబీ పార్టీ.. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నది. అందులో భాగంగా ముఖ్యంగా మహారాష్ట్రపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అక్కడ ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమస్యలు ఎక్కువగా ఉండటం తమకు కలిసి వస్తుందని గులాబీ బాస్ భావిస్తున్నారు. దానికి తోడు శివసేన అంటే హిందుత్వ పార్టీ అనే భావన అక్కడి ప్రజల్లో ఉన్నది. ఇక దేశ వ్యాప్తంగా బలహీనంగా ఉన్న కాంగ్రెస్ ఇక్కడ బలపడే అవకాశాలు లేవనేది బీఆర్ఎస్ అభిప్రాయం. మరో వైపు ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేయడంతో ఆ పార్టీలో సంక్షోభం మరింత పెరగనుంది. ఈ పరిస్థితులన్నీ బీఆర్ఎస్‌కు అనుకూలంగా మారుతున్నాయని, యాంటీ బీజేపీ పార్టీగా తమ పార్టీకే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని గులాబీ బాస్ భావిస్తున్నారు. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి గెలవడం ద్వారా వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పార్లమెంటుకు రాస్తా క్లియర్ అవుతుందని నమ్ముతున్నారు.

తెలంగాణ గులాబీ పార్టీ బీఆర్ఎస్‌ గా పేరు మార్చుకున్న తర్వాత మహారాష్ట్రపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇందుకు నిర్దిష్టమైన కారణాలే ఉన్నాయి.

యాంటీ బీజేపీ ఫోర్స్‌గా చెప్పుకుంటూ జాతీయ పార్టీ‌గా ఎదగాలని బీఆర్ఎస్ ఆలోచిస్తున్న టైమ్‌లోనే మహారాష్ట్రను కార్యక్షేత్రంగా కేసీఆర్ ఎంచుకోవాలని భావించారు. ఈ ఏడాదిన్నర సమయంలో ఆయన అంచనాలకు తగ్గట్టుగానే అక్కడి రాజకీయ పరిస్థితులు గులాబీ పార్టీకి అనుకూలంగా మారుతున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల కన్నా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ శూన్యత, అక్కడి పార్టీలకు ఉన్న బలహీనతలు, నిలదొక్కుకోవడానికి బీఆర్ఎస్‌కు ఉన్న అనుకూల పరిస్థితులు కేసీఆర్‌కు కలిసొచ్చేలా ఉన్నాయనే అభిప్రాయాలు వారి నుంచి వినిపిస్తున్నాయి.

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

పారిశుధ్య కార్మికులకు వెయ్యి రూపాయల వేతనాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినందుకు బుధవారం మున్సిపల్‌ కార్యాల యం ఆవరణలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి మున్సిపల్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు క్షీరాభిషేకం చేశారు. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుదమల్ల హరికృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న వేతనం రూ. 15,600లను రూ.16,600లకు పెంచుతూ మేడే సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఉత్తర్వులు జారీ చేయడం సంతోషంగా ఉందన్నారు.

అనంతరం టపాసులు పేల్చి, స్వీట్లు పం చిపెట్టారు. నాయకులు సోహెల్‌ఖాన్‌, ఆశన్న, నవీన్‌, సత్తయ్య పాల్గొన్నారు.

రామకృష్ణాపూర్‌: మున్సిపల్‌ కార్మికుల వేతనం రూ.1000 పెంచడంతో క్యాతన్‌పల్లి మున్సిపల్‌ శాఖ ఆధ్వర్యంలో కేసీఆర్‌, కేటీఆర్‌, బాల్క సుమన్‌ల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కౌన్సిలర్లు మల్లయ్య, రవిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపట్టడమే కాకుండా కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేయడం, ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు.

వివాహిత కిడ్నాప్‌.. లైంగిక దాడి

మామిళ్లగూడెం:పొరుగూరు నుంచి వచ్చిన ఓ వివాహితను కిడ్నాప్‌ చేసిన దుండగులు.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమెను ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో వదిలేసి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మహిళ మృతిచెందింది. ఈ ఘటన మంగళవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు ఇలా.. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం రామన్నగుట్ట తండాకు చెందిన నీల(45).. తన అత్తతో కలిసి వైద్యం కోసం ఏప్రిల్‌ 27న ఖమ్మం నగరానికి వచ్చింది.

వైద్య పరీక్షల అనంతరం తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళ్తుండగా దుండగులు నీలను కిడ్నాప్‌ చేశారు. ఆ రాత్రంతా ఆమెను చిత్రహింసలకు గురిచేశారు.

మరుసటి రోజు 28న ఉదయం 10 గంటల సమయంలో తీవ్ర గాయాలతోపాటు అపస్మారక స్థితిలో ఉన్న నీలను ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో చేర్పించి వెళ్లిపోయారు. చికిత్స పొందుతున్న మహిళ అదేరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించి.. బంధువుల కోసం వాకబు చేశారు. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో గుర్తుతెలియని మృతదేహంగా మార్చురీలో భద్రపరిచారు. కేసు దర్యాప్తులో ఉన్నదని ఖమ్మం పట్టణ ఏసీపీ పీవీ గణేశ్‌ తెలిపారు.

గ్రేటర్’లో దళిత బంధు ప్రకంపనలు

దళిత బంధు పథకం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలలో ప్రకంపనలు సృష్టిస్తోంది . ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో వంద మందిని ఎంపిక చేసి జాబితాను కలెక్టర్‌కు పంపే బాధ్యత ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఇచ్చారు. అయితే లబ్ధిదారుల ఎంపిక కోసం కొంత మంది ఎమ్మెల్యేలు తమ అనుచరులతో మద్యవర్తిత్వం నడిపి వారికిచ్చే రూ 10 లక్షలలో 2 నుండి 3 లక్షల వరకు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఎంపిక జాబితాను కలెక్టర్లకు ఇచ్చినప్పటికీ ముందు ఇచ్చిన లిస్ట్ ను ఆపించి జాబితాలో పేర్లు మార్పించి రెండు, మూడు పర్యాయాలు కలెక్టర్ కు ఇచ్చారు. ఇదే విషయం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దృష్టికి పోవడంతో ఇటీవల జరిగిన పార్టీ మినీ ప్లీనరీలో మీ అవినీతి చిట్టా నా దగ్గరుంది.

ఎవరెవరు దళిత బంధులో పేర్లు చేర్చేందుకు డబ్బులు తీసుకున్నారో వారి వివరాలు నా దగ్గర ఉన్నాయి, అటువంటి వారికి టిక్కెట్లు ఇవ్వడం ఆలోచిస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మాకు టిక్కెట్ వస్తుందో ? రాదేమోనని ఆందోళన చెందుతున్నారు. కొంతమంది శాసనసభ్యులు తమ ముఖ్య అనుచరుల వద్ద ఇదే విషయాన్ని ప్రస్తావించి ముడుపులు తీసుకున్న విషయం బయటకు ఎలా పొక్కిందోనని ఆరా తీస్తున్నట్లు సమాచారం .ప్రస్తుతం గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా గ్రేటర్ ఎమ్మెల్యేల పరిస్థితి ఉంది. ఈ పథకం కింద ముడుపులు ఇచ్చి లబ్ధి పొందిన వారు ఎమ్మెల్యేల అవినీతి గురించి బయటకు చెప్పేందుకు ముందుకు రావడం లేదు.

ముఖ్య అనుచరులకే

ప్రతి నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక అధికారం ఎమ్మెల్యేలదే అని ఈ పథకం అమలు సమయంలో సీఎం ప్రకటించారు . అయితే వారికి ఇలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అర్హులైన వారిని ఎంపిక చేయకుండా తమ ముఖ్య అనుచరులు, వారు సూచించిన పేర్లను లిస్ట్ లో చేర్చారు. తర్వాత అవసరాలను బట్టి లబ్ధిదారుల పేర్లను మార్చారు. వాస్తవానికి ప్రతి నియోజకవర్గంలో దళిత బంధుకు అర్హులైన వారు వేల సంఖ్యలో ఉన్నారు . వారంతా తమకు దళిత బంధు ఇవ్వాలని ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి దరఖాస్తులు పెట్టుకున్నారు. అయితే ఇలా వచ్చిన దరఖాస్తుల నుండి ఎంపిక పారదర్శకంగా చేపట్టవలసినప్పటికీ ముఖ్య అనుచరులను దగ్గర పెట్టుకుని ముడుపులు ఇచ్చిన వారిని మాత్రమే అర్హులుగా గుర్తించి జాబితాలో పేర్లను చేర్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

ముఖ్యంగా దళిత బంధు ఆశించి భంగపడిన వారు ఎమ్మెల్యేల అవినీతిని ఎక్కడ పడితే అక్కడ చర్చించుకోవడంతో అసలు విషయం వెలుగు చూశాయి. దీనికితోడు ప్రభుత్వ నిఘా విభాగాల నుండి కూడా సేకరించిన సమాచారంతో సీఎం హెచ్చరికలు జారీ చేశారు . ఇదిలా ఉండగా దళిత బంధు పథకం కింద ప్రతి నియోజకవర్గంలో లబ్ధిదారులను పెంచుతామని సీఎం చెప్పడంతో ఆశావహులు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు

బి ఆర్ ఎస్ అంటే భారత రైతు సమితి

నూతన సచివాలయంలోకి సామాన్యులను అనుమతించకపోవడానికి కారణాన్ని మంత్రి కేటీఆర్‌ సరికొత్తగా నిర్వచించారు. సచివాలయం.. సచివులు ఉండే ఆలయం మాత్రమేనని ఆయన అన్నారు. తద్వారా సెక్రటేరియట్‌ కేవలం మంత్రుల కోసమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా విలేకరుల సమావేశంలో కొందరు ఈ విషయాన్ని ప్రస్తావించగా మంత్రి సమాధానం దాట వేశారు. జిల్లాలోని ముస్తాబాద్‌, గోపాలపల్లె, గుండపల్లి చెరువు తండా, వీర్నపల్లి గ్రామాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలు, తడిసిన ధాన్యాన్ని కేటీఆర్‌ మంగళవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి.. వారికి భరోసా కల్పించారు. లావణి పట్టా కలిగిన రైతులకు కూడా పంట నష్టం సాయం అందుతుందన్నారు.

కొందరు రైతులు ఇళ్ల గురించి ప్రస్తావించగా గృహలక్ష్మి పథకం కింద నిర్మించుకునే వారికి రూ.3 లక్షలు అందజేస్తామని తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిన్నమొన్నటి వరకు ఉచితాలు దేశానికి మంచిది కాదంటూ ప్రధాని మోదీ పదే పదే గొంతు చించుకున్నారని, కానీ.. కర్ణాటకలో మూడు సిలిండర్లు, పాలు ఫ్రీ అంటూ బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించారని విమర్శించారు. కర్ణాటకు ఇచ్చినప్పుడు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఫ్రీ సిలిండర్లు ఎందుకు ఇవ్వరని నిలదీశారు. అదానీ కొనే ఎయిర్‌పోర్టులకు జీఎస్టీ లేదని, కానీ.. పాలు, పెరుగు, సామాన్యులు వాడే మందులకు జీఎస్టీ వేశారని మండిపడ్డారు. ఇలాంటి పిరమైన ప్రధానికి, బీజేపీకి కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రజలు బుద్ధి చెప్తారన్నారు.

బీఆర్‌ఎస్‌ అంటే భారత రైతు సమితి..

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరుతో ఏర్పాటు చేసుకున్న కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్‌ అడుగు పెట్టిన మొదటిరోజే రాష్ట్రంలో పేదలు, రైతులు, కార్మికుల ప్రయోజనాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అకాల వర్షాలు, వడగండ్లకు రైతులు నష్టపోయిన సందర్భంలో స్వయంగా ముఖ్యమంత్రి ఐదు జిల్లాల్లో పర్యటించారని, రైతుల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారన్నారు. బీఆర్‌ఎస్‌ అంటే భారత రైతు సమితి అని, రైతుకు భరోసా ఇచ్చే పార్టీ అని కొత్త నిర్వచనం చెప్పారు. వడగండ్లు, అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా హెక్టారుకు రూ.25 వేలు, ఎకరానికి రూ.10 వేల పరిహారాన్ని సీఎం కేసీఆర్‌ ఇస్తున్నారని తెలిపారు. అధికారులు, పంట నష్టం అంచనాలు వేస్తున్నారని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న కాంగ్రెస్‌

పంటనష్టం పరిశీలనకు వచ్చిన మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌ను కాంగ్రెస్‌ నాయకులు అడ్డుకునే యత్నం చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ఎకరానికి రూ.25 వేల పంట నష్టపరిహారం ఇవ్వాలని ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ కాన్వాయ్‌కు అడ్డంగా వెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు వారిని పక్కకు లాగేశారు.

మహిళల రక్షణకు ‘అభయం’ యాప్‌

రాష్ట్రంలోనే తొలిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ నేతృతంలో పోలీసులు ‘అభయం సేఫ్‌ ఆటో’ యాప్‌ను రూపొందించారు. మంగళవారం జిల్లా పోలీస్‌ క్రీడల ముగింపు సందర్భంగా ఈ యాప్‌ను మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. జిల్లాలోని ఆటోల్లో సేఫ్‌ ఆటో క్యూఆర్‌ కోడ్‌ను ఏర్పాటు చేశారు. మహిళలు ప్రయాణిస్తున్నప్పుడు సురక్షితంగా లేమని అనిపిస్తే తమ ఫోన్‌ నుంచి క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే డ్రైవర్‌ ఫొటో వివరాలతోపాటు వాహనం లైవ్‌ లొకేషన్‌ పోలీస్‌ కమాండ్‌ ఏరియాకు వెళ్తుంది. ఈ యాప్‌ను రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా ప్రారంభిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్‌ తెలిపారు. పోలీస్‌ క్రీడల్లో గెలుపొందిన వారికి పతకాలను అందజేశారు

AP Weather Update: ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు

ఈ సారి ఎండాకాలం కాస్తా వానాకాలంగా మారింది. గత కొద్దిరోజులుగా వర్షాలు పడుతున్నాయి. పశ్చిమ విదర్భ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ద్రోణి / గాలుల కోత ఇప్పుడు నైరుతి మధ్యప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు మరఠ్వాడా మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉంది..

ఉపరితల ఆవర్తనము దక్షిణ ఛత్తీస్గఢ్ & పరిసరాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ వరకు ఉంది. ఉపరితల ఆవర్తనము దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు అనుబంధ తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ & 3.1 కి.మీ మధ్య ఉంది.

పైన పేర్కొన్న ఉపరితల ఆవర్తనము నుండి ఒక ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక అనుబంధ తమిళనాడు నుండి నైరుతి బంగాళాఖాతం వరకు ఉత్తర శ్రీలంక తీరం మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ & 3.1 కి.మీ మధ్య కొనసాగుతున్నది.ఆంధ్రప్రదేశ్ మరియు యానాం లలో దిగువ ట్రోపో ఆవరణము లో ఆగ్నేయ / దక్షిణ దిశలో గాలులు వీస్తున్నాయని వాతావవరణ శాఖ తెలిపింది.