/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz AP Weather Update: ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు Yadagiri Goud
AP Weather Update: ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు

ఈ సారి ఎండాకాలం కాస్తా వానాకాలంగా మారింది. గత కొద్దిరోజులుగా వర్షాలు పడుతున్నాయి. పశ్చిమ విదర్భ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ద్రోణి / గాలుల కోత ఇప్పుడు నైరుతి మధ్యప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు మరఠ్వాడా మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉంది..

ఉపరితల ఆవర్తనము దక్షిణ ఛత్తీస్గఢ్ & పరిసరాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ వరకు ఉంది. ఉపరితల ఆవర్తనము దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు అనుబంధ తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ & 3.1 కి.మీ మధ్య ఉంది.

పైన పేర్కొన్న ఉపరితల ఆవర్తనము నుండి ఒక ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక అనుబంధ తమిళనాడు నుండి నైరుతి బంగాళాఖాతం వరకు ఉత్తర శ్రీలంక తీరం మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ & 3.1 కి.మీ మధ్య కొనసాగుతున్నది.ఆంధ్రప్రదేశ్ మరియు యానాం లలో దిగువ ట్రోపో ఆవరణము లో ఆగ్నేయ / దక్షిణ దిశలో గాలులు వీస్తున్నాయని వాతావవరణ శాఖ తెలిపింది.

సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన వాయిదా

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ వాయిదా పడింది. ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం మే2 మంగళవారం రోజున కేసీఆర్ ఢిల్లీకి వెళ్లాలి. కానీ అనివార్య కారణల వలన ఆయన టూర్ వాయిదా పడింది.

అయితే ఎందుకు వాయిదా పడిందో స్పష్టంగా తెలియరాలేదు. రేపు అంటే మే 03 బుధవారం రోజున కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు.

వాస్తవానికి ఇవాళ ఢిల్లీకి వెళ్లి.. అక్కడ వసంత్ విహార్ లో నిర్మించిన సెంట్రల్ పార్టీ కార్యాలయ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించాల్సి ఉంది.

మే 4న పార్టీ కార్యలయాన్ని ప్రారంభించనున్నట్లుగా కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. జాతీయ స్థాయి బీఆర్ఎస్ కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే జరగనున్నాయి. పార్టీ ప్రారంభోత్సవం తర్వాత తిరిగి హైదరాబాద్ కు రానున్నారు. అప్పటి వరకు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నారు.

గ్యాస్ ధ‌ర‌ల పెంపుపై రేపు నిరసన కార్యక్రమాలు : మంత్రి కేటీఆర్ పిలుపు

ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల ఎన్నిక‌లు అయిపోయిన వెంట‌నే ప్ర‌తిసారి గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను పెంచ‌డం కేంద్ర ప్ర‌భుత్వానికి ఆన‌వాయితీగా మారింద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

తాజాగా కేంద్రం భారీగా గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను పెంచ‌డంపై కేటీఆర్ మండిప‌డ్డారు. కేంద్రం గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను పెంచిన నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 3వ తేదీన నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్య‌క్షుల‌తో పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

SB NEWS

SB NEWS

కర్ణాటకలో మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్..

200 యూనిట్లతో ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రతి గృహిణి రూ. 2 వేలు , పది కిలోల బియ్యం. అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తామని తెలిపింది.

నిరుద్యోగ భృతి కింద నెలకు రూ. 3 వేలు,. డిప్లొమా చేసిన వారికి రూ. 1500 చెల్లించనున్నట్టుగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. 2006 తర్వాత నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ పొందుతారని కాంగ్రెస్ ప్రకటించింది..

మంగళవారంనాడు బెంగుళూరులో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.

కేసీఆర్‌లాంటి సీఎం కావాలంటున్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌

మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రలో కుల రాజకీయం చేస్తున్నరు. రెడ్డి, కాపు, కమ్మలు వేర్వేరుగా రాజకీయాలు చేస్తూ ప్రజలను పట్టించుకుంటలేరు. రేపు ఏపీలో ప్రజలను పట్టించుకునేది కూడా బీఆర్‌ఎస్‌ పార్టీనే. పోలవరం పూర్తి చేసేది.. విశాఖ ఉక్కును కాపాడేది కూడా కేసీఆరే. ఇంక ఎవరికీ ఆ దమ్ము లేదు. 2024లో ఆంధ్రలో కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తుంది’’ అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లోని ప్రజలు కేసీఆర్‌లాంటి సీఎం కావాలని, తెలంగాణలో ఉన్నటువంటి పాలన కావాలని కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్ర భారతిలో మే డే వేడుకలు నిర్వహించారు. పలు సంస్థలకు బెస్ట్‌ మెనేజ్‌మెంట్‌ అవార్డులను; పలువురు వ్యక్తులకు శ్రమ శక్తి పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు. ‘‘విభజన తర్వాత తెలంగాణ, ఏపీ రాష్ర్టాలు ఒకేసారి ఏర్పడ్డాయి.

తొమ్మిదేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితే.. ఆంధ్ర అవుట్‌ అయ్యింది. జాతీయ హోదా కల్పించి కేంద్రం నిధులిస్తున్నా.. పోలవరం పూర్తి కాలేదు. కానీ, రాష్ట్ర నిధులతోనే కేసీఆర్‌ సర్కారు ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును అనతికాలంలో పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఏపీలో పోలవరం పూర్తి చేసే దమ్ము కేసీఆర్‌కే ఉంది’’ అని వ్యాఖ్యానించారు. ఏపీకి చెందిన 75 వేల మంది విద్యార్థులు తెలంగాణలో ఎంసెట్‌ పరీక్ష రాశారని, ఉన్నత విద్యలో ఇక్కడున్న మెరుగైన వసతులు, ఉపాధి అవకాశాలే ఇందుకు కారణమని చెప్పారు. కేసీఆర్‌ సినిమా యాక్టర్‌ కాదని, అయినా, మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభలకు లక్షల మంది వస్తున్నారని, బ్రహ్మరథం పడుతున్నారని, అక్కడ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని అన్నారు. దేశంలో తెలంగాణ గాలి నడుస్తోందని, కేసీఆర్‌కు మనమంతా మద్దతుగా నిలవాలని కార్మికులను కోరారు. ఇక్కడ అభివృద్ధి జరుగుతుండడంతో దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన 25 లక్షలమంది ఉపాధి పొందుతున్నారన్నారు. అమెరికా పాతబడిందని, వచ్చే మూడున్నరేళ్లలో హైదరాబాద్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా మారుతుందని చెప్పుకొచ్చారు.

ఉసురు తాకి పోతరు

రాష్ర్టానికి బీజేపీ నిధులు ఇవ్వడం లేదని, కాంగ్రెస్‌ దేశాన్ని సర్వనాశనం చేసిందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ‘‘ఆ రెండు పార్టీలకు చెందిన రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ కోసం అహోరాత్రులు కష్టపడుతున్న రామచంద్రుల (కేసీఆర్‌, కేటీఆర్‌)ను దుర్భాషలాడుతున్నారు. పని చేసేటోళ్లను తిడితే ఆ ఉసురు తాకి గాలికి కొట్టుకుపోతారు’’ అంటూ శాపనార్థాలు పెట్టారు. మోదీ పిరమైన ప్రధాని అని, ఒక్కనికే ఆయన దోచిపెట్టడం దేవుడు చూస్తున్నాడని, పాపం పండుతుందని వ్యాఖ్యానించారు. ఇంకెన్నాళ్లు.. మరో ఏడాది ఉంటాడని, వచ్చే ఎన్నికల్లో ఆయనను ప్రజలు తరిమేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్మికులు, వారి పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందని, కరోనాతో ఆలస్యం జరిగిందని చెప్పారు. గతంలో తెలంగాణ ప్రజలు బతకడానికి దూర ప్రాంతాలకు పోయేవారని, ఇప్పుడు దేశానికి బతుకు దెరువుగా రాష్ట్రం మారిందని మరో మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. ఇటీవల హైదరాబాద్‌ను చూసి న్యూయార్కా..? హైదరాబాదా...? అని ఆశ్చర్యపోయానని సినీనటుడు రజనీకాంత్‌ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

తెలంగాణ సర్కారుకు మావోయిస్టుల లేఖ

 తెలంగాణ సర్కారుకు ఆజాద్ పేరిట మావోయిస్టులు లేఖ రాయడం కలకలం సృష్టించింది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని లేఖలో మావోయిస్టులు డిమాండ్ చేశారు.

నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తడిచిన ధాన్యంతో పాటు ఇతర పంటలను కొనుగోలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. రైతులు పంట నష్ట పరిహారం కోసం పోరాడాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.

SB NEWS

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు ఈ నెల మొదటి వారంలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెలలోనే ఇంటర్ మూల్యంకనం ప్రక్రియ ముగిసినా అధికారులు రిజల్ట్స్ వెలువరించేందుకు తాత్సారం చేస్తున్నారు. గతంలో ఇంటర్ ఫలితాల్లో ఎదురైన చిక్కులు, అవాంతరాలు తలెత్తకుండా ఉండేందుకే ఈసారి ఫలితాల వెల్లడి ప్రక్రియ ఆలస్యమైనట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ఒకేసారి ప్రారంభమయ్యాయి. మార్చి 15న ఫస్టియర్ విద్యార్థులు పరీక్ష రాశారు. కాగా ఏప్రిల్ 4వ తేదీన ముగిశాయి. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో గత నెల 26వ తేదీనే ఫలితాలు వెల్లడించారు. కానీ తెలంగాణలో మాత్రం అధికారులు జాప్యం వహిస్తుండటం గమనార్హం.

తెలంగాణలో ఇంటర్ ఫలితాల జాప్యానికి కారణం టెక్నికల్ సమస్యలేనని పలువురు చెబుతున్నారు. గతంలో ఇలాంటి సాంకేతిక కారణాల వల్లనే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ ఉద్దేశ్యంతోనే ఆలస్యమైనా సరే రిజల్స్ట్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దని అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇప్పటికే అధికారులు రిజల్ట్స్‌కు సంబంధించిన ప్రాసెస్‌ను పూర్తిచేసే పనిలో నిమగ్నమైనట్లు చెబుతున్నారు. ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుని అంతా ఒకే అనుకున్నాకే ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అధికారుల ప్రాసెసింగ్ సక్సెస్ అయ్యాక విద్యాశాఖ మంత్రి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒకే చెప్పిన మరుక్షణమే రిజల్ట్స్ అనౌన్స్ చేయాలని భావిస్తున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఫలితాల వెల్లడిలో అధికారులు కాస్త తాత్సారం వహిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి తొలుత మూల్యంకనం ప్రక్రియ ఆన్ లైన్ పద్ధతిలో చేపట్టాలని భావించారు.

ఇందుకు సంబంధించిన ఇంటర్ బోర్డు టెండర్లకు సైతం అహ్వానించింది. కానీ బిడ్డింగ్‌కు ఎవరూ ముందుకు రాకపోవడంతో అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇది కూడా రిజల్ట్స్‌ ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది. ఏది ఏమైనా సరే ఈనెల 10వ తేదీలోపు ఫలితాలు వెల్లడించాలని భావిస్తున్న అధికారులు అన్నీ ఒకే అనుకుంటే ఈనెల మొదటి శనివారంలోపే వెల్లడించాలని చూస్తున్నట్లు వినికిడి.

Minister Jogi Ramesh: పవన్‌, రజనీకాంత్‌పై జోగి రమేష్‌ సంచలన వ్యాఖ్యలు..

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి జోగి రమేష్‌ బీజేపీతో పెళ్లి టీడీపీతో కాపురం చేసే వ్యక్తి పవన్ అంటూ ఫైర్‌ అయ్యారు..

మేం ఎవ్వరితో పొత్తులు పెట్టుకోం అని స్పష్టం చేశారు.. పవన్ కి సత్తా ఉంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలంటూ సవాల్‌ చేశారు.. సన్నాసి అయితే జనసేనను టీడీపీలో కలిపేయాలి అంటూ హాట్‌ కామెంట్లు చేశారు.. అమాయకులు పవన్ ని సీఎం అంటున్నారు..

కానీ, చంద్రబాబును పవన్‌ కల్యాణ్‌.. సీఎం అంటున్నాడన్న ఆయన.. టీడీపీకి పవన్‌ అమ్ముడుపోతాడు అని ఆరోపించారు.. అందరినీ చంద్రబాబుకి హోల్ సేల్‌గా అమ్మేస్తాడు అంటూ జనసేన శ్రేణులను హెచ్చరించిన ఆయన.. జనసేన అభిమానులు కూడా జగనన్న బాటలో నడవాలంటూ పిలుపునిచ్చారు..

ఇక, చంద్రబాబు వేదిక మీద ఉండగా హాజరయ్యాడంటే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు మానవత్వం లేదు అంటూ ఫైర్‌ అయ్యారు జోగి రమేష్‌.. రజనీకాంత్ కి సిగ్గుగా లేదా..? అని ప్రశ్నించిన ఆయన.. ఒక దొంగ చంద్రబాబు, ఇంకొక దొంగ రజనీకాంత్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు..

AP High Court: రాజధానిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు.. పిటిషన్లపై హైకోర్టు విచారణ..

అమరావతి: ఆర్‌-5 జోన్‌లో స్థానికేతరులకు ఇళ్ల స్థలాల కేటాయించిపునకు రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోను సవాల్‌ చేస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది..

రాజధాని పరిధిలో టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయకుండా ఇళ్ల పట్టాల పంపిణీపై ప్రభుత్వానికి తొందర ఎందుకని పిటిషనర్లు ప్రశ్నించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం, పిటిషనర్లు ఎలాంటి వివరాలు ఇవ్వలేదని పేర్కొంది.

రాజధాని ప్రాంతంలో నిర్మించిన 5వేల టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల వివరాలు, ఇళ్ల మంజూరుకు అనుసరించిన విధివిధానాలను పూర్తి వివరాలతో అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది..

Chikoti Praveen: థాయిలాండ్‌లో చికోటి ప్రవీణ్ అరెస్ట్.. 14 మంది మహిళలు కూడా..

థాయిలాండ్‌లో ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠా అరెస్ట్ అయ్యింది. థాయిలాండ్‌లోని పటాయలో 90 మంది భారతీయులను అరెస్ట్ చేశారు..

భారీగా నగదు, గేమింగ్ చిప్స్ స్వాధీనం చేసుకున్నారు. 20.92 కోట్ల విలువైన గేమింగ్ చిప్స్.. 1.60 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు.

చీకొటి ప్రవీణ్ నేతృత్వంలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. చీకొటి ప్రవీణ్, మాధవరెడ్డిని అక్కడి పటాయా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు..