/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz BREAKING : టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు..పుష్ప షూటింగ్ రద్దు ! Yadagiri Goud
BREAKING : టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు..పుష్ప షూటింగ్ రద్దు !

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ కు ఊహించని షాక్‌ తగిలింది..

ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇంట్లో తాజాగా ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు..

జీఎస్టీ సరిగా కట్టలేదనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే..

సుకుమార్ ఇంట్లో తాజాగా ఐటీ దాడులు నిర్వహిస్తున్నారని సమాచరం..

తెలంగాణలో మరో కొత్త పార్టీ ... "తెలంగాణ నిర్మాణ పార్టీ"

చర్లపల్లి జైలు ముందే పార్టీ పేరు ప్రకటించిన తీన్మార్ మల్లన్న.

చర్లపల్లి జైలు నుంచి విడుదలైన క్యు న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న తాను కొత్తగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు.

తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.

కేసులు సెక్షన్ గా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

వీకర్ సెక్షన్ గా తీన్మార్ మల్లన్న పోరాటం చేస్తున్నారన్నారు వచ్చే నాలుగు నెలల్లో తెలంగాణలో కేసీఆర్ పేరు వినీపించకోకుండా చేస్తామన్నారు.

Viveka Case Update: అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట..

హైదరాబాద్‌: వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై వాదనల తర్వాత..

మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల్లో ఈ నెల 25వ తేదీ వరకు అరెస్ట్‌ చేయొద్దని సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

డీజీపీతో సీఎం జగన్ కీలక భేటీ..

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఏపీ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు..

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో వివేకా హత్య కేసు పరిణామాలపైనా చర్చించినట్లు తెలుస్తోంది..

ఈ కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తే ఎలా ముందుకెళ్లాలనే అంశంపై సమీక్షలో చర్చ జరిగినట్లు సమాచారం..

IMD Heatwave Alert : ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు...ఐఎండీ హీట్ వేవ్ హెచ్చరిక జారీ

ఆంధ్రప్రదేశ్‌ సహా దేశంలో పలు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్షియస్ కు చేరుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో వడ గాలులు వీచవచ్చు...

ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కూడా బుధవారం వరకు వేడిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాలకు హీట్ వేవ్ హెచ్చరికలను శాస్త్రవేత్తలు జారీ చేశారు.రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలు,రాయలసీమ ప్రాంతంలో మంగళవారం 38 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

National Highway : కశ్మీర్‌-కన్యాకుమారి.. పొడవైన జాతీయ రహదారి 'ఎన్‌హెచ్‌-44'!

ఎన్‌హెచ్‌-44 (National Highway 44).. దేశంలోనే అత్యంత పొడవైన జాతీయ రహదారి (Indias longest highway) ఇది. ఉత్తర-దక్షిణ భారతాన్ని కలిపే రహదారిగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది..

కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌లో (Jammu kashmir) మొదలై.. పంజాబ్‌ (Punjab), హరియాణా (Haryana), దేశ రాజధాని దిల్లీ (Delhi), ఉత్తరప్రదేశ్‌ (Uttar pradesh), రాజస్థాన్‌ (Rajasthan), మధ్యప్రదేశ్‌ (Madhya pradesh), మహారాష్ట్ర (Maharashtra), తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్‌ (Andhra pradesh), కర్ణాటక (Karnataka) మీదుగా ప్రయాణిస్తూ తమిళనాడు (Tamil nadu) రాష్ట్రంలోని కన్యాకుమారి వద్ద ముగుస్తుంది.

ఈ జాతీయ రహదారి మొత్తం పొడవు 4112 కిలోమీటర్లు. మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 492 కి.మీ, ఏపీలో 260 కి.మీ మేర ఎన్‌హెచ్‌-44 ఉంది. తొలుత ఇది ఒకే జాతీయ రహదారి కాదు. ఏడు జాతీయ రహదారులను (ఎన్‌హెచ్‌-1ఎ, ఎన్‌హెచ్‌-1, ఎన్‌హెచ్‌-2, ఎన్‌హెచ్‌-3, ఎన్‌హెచ్‌-75, ఎన్‌హెచ్‌-26, ఎన్‌హెచ్‌-7) విలీనం చేసి 'ఎన్‌హెచ్‌-44'ను ఏర్పాటు చేశారు. భారత మ్యాప్‌పై ఒక నిలువు గీత గీసిన తరహాలో ఈ జాతీయ రహదారి

కన్పిస్తుంది..

Nara Lokesh: వచ్చే ఎన్నికల్లో 'ఫ్యాన్‌'ను పీకిపారేయండి: లోకేశ్‌

ఆలూరు: వైకాపా పాలనలో నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయని.. ప్రజల ఆదాయం మాత్రం పెరగలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు..

74వరోజు 'యువగళం' పాదయాత్రలో భాగంగా ఆలూరు నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తున్నారు.

నియోజకవర్గ పరిధిలోని దేవనకొండ శివార్లలోని శనగ చేలో దిగి రైతుల కూలీలతో లోకేశ్‌ మాట్లాడారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. పెరిగిన విద్యుత్‌ ఛార్జీల గురించి రైతులు ప్రస్తావించగా.. వచ్చే ఎన్నికల్లో 'ఫ్యాన్‌'ను పీకిపారేయడమే దానికి పరిష్కారమన్నారు. కుంటిసాకులతో జగన్‌ ప్రభుత్వం తొలగించిన పింఛన్లను తెదేపా అధికారంలోకి వచ్చాక పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని.. రాబోయే చంద్రన్న ప్రభుత్వంలో అంతా మంచే జరుగుతుందని బాధితులకు లోకేశ్‌ భరోసానిచ్చారు..

Kejriwal: దేశం కోసం ప్రాణాలైనా ఇస్తా: కేజ్రీవాల్‌

దిల్లీ: కొత్త మద్యం విధానంలో తాము ఎలాంటి తప్పు చేయలేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Kejriwal) అన్నారు. దీంట్లో దాచిపెట్టడానికి ఏమీ లేదని..

సీబీఐ ముందు నిజాయతీగా అన్నీ వాస్తవాలే చెబుతానని తెలిపారు. మద్యం విధాన కుంభకోణంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆదివారం తమ ఎదుట హాజరుకావాలని శుక్రవారం సీబీఐ (CBI) ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. బయలుదేరడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ భాజపాపై నిప్పులు చెరిగారు. అంతకుముందు విడుదల చేసిన ఓ వీడియో సందేశంలోనూ కేంద్రంలోని అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వాన్ని ఉద్దేశించి.. వారు చాలా శక్తిమంతమైనవారని.. ఎవరినైనా జైలుకు పంపగలరని కేజ్రీవాల్‌ (Kejriwal) ఆరోపించారు. తనను అరెస్టు చేయాలని భాజపా నేతలు బలంగా డిమాండ్‌ చేస్తున్నారన్నారు. బహుశా సీబీఐ (CBI)ని ఆ పార్టీ అలా ఆదేశించి ఉంటుందని వ్యాఖ్యానించారు. పార్టీ అలా ఆదేశిస్తే సీబీఐ తనను ఎందుకు అరెస్టు చేయకుండా ఉంటుందని అన్నారు. భాజపా నేతలకు అధికారం వల్ల వచ్చిన అహంకారం పెరిగిపోయిందని దుయ్యబట్టారు. వారికి అనుకూలంగా లేని మీడియా, న్యాయమూర్తులు.. ఇలా ఎవరిపైనైనా బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. వారి మాట వినకపోతే జైల్లో పెడతామని బెదిరిస్తున్నారన్నారు..

Fire Accident: హైదరాబాద్‌లో ఘోరం.. చిన్నారి సహా దంపతుల సజీవ దహనం..

హైదరాబాద్‌: నగరంలోని కుషాయిగూడలో ఘోరం జరిగింది. అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. టింబర్‌ డిపోలో వేకువజామున 3 గంటలకు అగ్నిప్రమాదం జరగడంతో మంటలు పక్కనే ఉన్న భవనానికి వ్యాపించాయి.

దీంతో అందులో నివాసముంటున్న దంపతులు సహా వారి చిన్నకుమారుడు మృతిచెందారు.

మృతులను యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తికి చెందిన నరేశ్‌ (35), సుమ(28), జోషిత్‌(5)గా గుర్తించారు. మరో చిన్నారి ఆచూకీ తెలియలేదు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు..

అన్ని సర్కార్‌ బడుల్లో రాగి జావ

•వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు

హైదరాబాద్‌: అన్ని ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు రాగి జావ అందజేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం 1-10 తరగతుల విద్యార్థులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్‌ భాగస్వామ్యంతో అమలు చేయనున్నారు. దాదాపు 22 లక్షల మంది పిల్లలు ప్రయోజనం పొందనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు రాగి జావ అని ఒకసారి, పల్లీ పట్టి అని మరోసారి, మొలకలు, బెల్లం అని ఇంకోసారి 2018-19 నుంచి ప్రతిపాదనలు పంపడం...

కేంద్ర విద్యాశాఖ 60% వ్యయాన్ని భరిస్తామని హామీ ఇవ్వడం...చివరకది అమలు కాకపోవడం షరా మామూలుగా మారింది. పిల్లల్లో రక్తహీనత నివారణకు వాటిని అందించాలనుకున్నా విద్యాశాఖ అధికారుల చొరవ లేని కారణంగా ఏటా అటకెక్కుతోంది. దీనిపై విమర్శలు వస్తుండటంతో ఈసారి దాన్ని పట్టాలెక్కించాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా బడుల్లో అందించాలంటే రూ.35 కోట్లు వ్యయం అవుతుందని అంచనావేశారు. అందులో సగం ట్రస్ట్‌, మిగిలిన సగాన్ని ప్రభుత్వం భరిస్తుందని అధికారులు తెలిపారు.

ట్రస్ట్‌ అమలు తీరును చూసి...

అన్నపూర్ణ ట్రస్ట్‌ 2022-23 విద్యా సంవత్సరంలో ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల్లో 6.50 లక్షల మందికి జాగి జావను ఉచితంగా అందించింది. ట్రస్ట్‌ ప్రతినిధులు రాగి మాల్ట్‌ పొడిని ఎంఈవో కార్యాలయాలకు పంపిస్తారు. దాన్ని విద్యాశాఖ అధికారులు అక్కడి నుంచి పాఠశాలలకు సరఫరా చేస్తారు. పొడిలోనే బెల్లం కూడా కలిపి ఉంటుంది. దాన్ని వేడి నీళ్లలో వేస్తే చాలు. నీటిని వేడి చేయడం, రాగి మాల్ట్‌ పొడిని మిక్స్‌ చేయడం...దాన్ని విద్యార్థులకు అందించే బాధ్యత మధ్యాహ్న భోజనపథకం కార్మికులు చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో దాన్ని అందిస్తున్నారు. కనీసం సగం మంది ఉదయం అల్పాహారం తీసుకోకుండానే బడికి వస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఏమీ తినకుండా ఉంటున్నారు. ఆ లోపాన్ని కూడా రాగి జావ భర్తీ చేస్తుందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అన్నపూర్ణ ట్రస్ట్‌ ద్వారానే అమలుకు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.