/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz కోడి కత్తి కేసులో కీలక పరిణామం-మినహాయింపు కోరిన జగన్ ... Yadagiri Goud
కోడి కత్తి కేసులో కీలక పరిణామం-మినహాయింపు కోరిన జగన్ ...

ఇవాళ జరిగే విచారణకు సీఎం జగన్ హాజరయ్యేలా చూడాలని విజయవాడ ఎన్ఐఏ కోర్టు గతంలో ప్రాసిక్యూటర్ కు ఆదేశాలు ఇచ్చింది.

అయితే చివరి నిమిషంలో ఈ కేసు విచారణకు తాను హాజరు కాలేనని, మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ ఎన్ఐఏ కోర్టును కోరారు.

ఈ మేరకు ఆయన న్యాయవాదితో కోర్టుకు సమాచారం ఇచ్చారు. దీంతో కోర్టు దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది. కోడి కత్తి కేసులో ఇప్పటివరకూ సీఎం జగన్ వాంగ్మూలం నమోదు చేయకపోవడంపై ఎన్ఐఏ కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.

BRS: భారాస నుంచి జూపల్లి, పొంగులేటి సస్పెన్షన్‌

హైదరాబాద్‌: భారాస నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్‌ చేశారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఇద్దరిపై వేటు వేసింది..

భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.

TS News.. : నాలుగు రోజులు మంటలే!

సాధారణం కన్నా 2-4 డిగ్రీల ఉష్ణోగ్రతల పెరుగుదల

హైదరాబాద్‌: రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు ఎండలు మండనున్నాయి. సోమవారం నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది..

ఈ నాలుగు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశాలున్నాయని పేర్కొంది. సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో పెరుగుదల ఉంటుందని, ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.

పలు జిల్లాలకు ప్రత్యేకంగా సూచనలు జారీ చేసింది. సోమవారం రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో, 11న ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, నల్గొండ, 12, 13 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వివరించింది.

యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,

సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్ లను

ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్

యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు గారు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్ లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

ఇందుకు సంబంధించి తక్షణ చర్యల్లో భాగంగా రేపు ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సంబంధిత ఏర్పాట్లు, కార్యాచరణకు చర్యలు చేపట్టాలని సిఎస్ శాంతి కుమారిని సీఎం గారు ఆదేశించారు. గతంలో నిర్వహించిన విధంగానే 7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను అన్నింటినీ ప్రారంభించి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.

భానుడి భగభగలు.. ఐదు రోజులు భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు..

ఎండల తీవ్రత పెరుగుతున్నది. దాంతో జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరో వైపు రాగల ఐదురోజుల్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

రాబోయే రెండు రోజుల్లో మధ్యప్రదేశ్‌, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా వేడిగాలులు వీచే అవకాశమున్నట్లు పేర్కొంది. అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకురావొద్దని తెలిపింది. ఏప్రిల్‌- జూన్‌ మధ్య కాలంలో దేశంలోని ఆగ్నేయ ప్రాంతంతో పాటు, దక్షిణ భారత దేశంలో ఎండలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదవుతాయని వాతావరణశాఖ పేర్కొంది. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసింది.

బిహార్‌, ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమ్‌ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగే అవకాశం ఉందని, వేడిగాలుల తీవ్రత అధికంగా ఉండొచ్చని ఐఎండీ డైరెక్టర్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర వెల్లడించారు. అయితే, ఈ ఉష్ణోగ్రతల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండకపోవచ్చని పేర్కొన్నారు. మరోవైపు వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా భూతాపం పెరిగిపోతున్నది. దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి నెలలో భారత్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. 1901 తర్వాత ఇంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఇదే తొలిసారి వెల్లడించింది. పశ్చిమ ప్రాంతాల మీదుగా వీచిన గాలుల మూలంగా మార్చి నెలలో భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో అసాధారణ స్థాయిలో వర్షపాతం నమోదైందని, . దీంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు అదుపులోకి వచ్చాయని వివరించింది.

తెలంగాణలో కూరగాయల సాగుకు భారీ ప్రణాళికలు

తెలంగాణలో పెద్ద ఎత్తున కూరగాయల సాగు కోసం భారీ ప్రణాళికలు రూపొందిస్తున్న ప్రభుత్వం

రంగారెడ్డిలో ఏటా 28 వేల ఎకరాల్లో 34 వేల మెట్రిక్ టన్నుల కూరగాయల పంటలు సాగవుతుండగా, వికారాబాద్ లో 20 వేల ఎకరాల్లో ఏటా 25 వేల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతోంది. సంగారెడ్డిలో 12 వేల ఎకరాల్లో 13 వేల మెట్రిక్ టన్నుల కూరగాయలు సాగు చేస్తున్నారు.

ప్రతి రోజు హైదరాబాద్ నగరానికి వచ్చే కూరగాయలు ప్రధానంగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి వంటి పరిసర ప్రాంతాల నుండి వస్తాయి. అయితే డిమాండ్ సప్లై లో 50 శాతం అంతరం ఉండటంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ , ఇతర రాష్ట్రాల నుండి కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ అంతరాన్ని తగ్గించడానికి, మరింతగా కూరగాయల సాగును పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలను సిద్దం చేసింది.

రంగారెడ్డిలో ఏటా 28 వేల ఎకరాల్లో 34 వేల మెట్రిక్ టన్నుల కూరగాయల పంటలు సాగవుతుండగా, వికారాబాద్ లో 20 వేల ఎకరాల్లో ఏటా 25 వేల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతోంది. సంగారెడ్డిలో 12 వేల ఎకరాల్లో 13 వేల మెట్రిక్ టన్నుల కూరగాయలు సాగు చేస్తున్నారు.

ఉద్యానవన శాఖ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డిలో 74,000 ఎకరాల్లో కూరగాయల సాగు జరుగుతుంది. అయితే హైదరాబాద్ అవసరాలు తీరాలంటే 1.51 లక్షల ఎకరాల విస్తీర్ణంలో కూరగాయలు సాగుచేయాల్సి ఉంది.

కూరగాయల పంటల ఉత్పత్తిని పెంచేందుకు ఉద్యానవన శాఖ జీడిమెట్ల, ములుగు ప్రాంతాల్లోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కేంద్రాల ద్వారా రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ పలు చర్యలు తీసుకుంటోంది. అవగాహన కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు, నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయడంలో రైతులకు సహాయం చేస్తున్నది. రైతులకు 5,000 నుండి 10,000 నాణ్యమైన మొక్కలను సరఫరా చేస్తోంది.

రంగారెడ్డిలో యాచారం, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్‌నగర్‌ ప్రాంతాల్లో అత్యధికంగా కూరగాయలు సాగవుతున్నాయి. అలాగే ప్రస్తుతం రంగారెడ్డి సహా రాష్ట్రవ్యాప్తంగా 80 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. అదేవిధంగా 30 వేల ఎకరాల్లో పూలు సాగు కావాల్సి ఉండగా 10 వేల ఎకరాల్లో సాగవుతోంది.

PM Modi: బండీపుర టైగర్‌ రిజర్వును సందర్శించిన మోదీ..

ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటకలోని బండీపుర టైగర్‌ రిజర్వును సందర్శించారు. ఈ విషయాన్ని ఆయన వెల్లడిస్తూ టైగర్‌ రిజర్వుకు చెందిన పలు ఫొటోలను ట్విటర్లో పంచుకొన్నారు..

''రమణీయమైన బండీపుర టైగర్‌ రిజర్వులో నేటి ఉదయం గడిపాను. భారత దేశ ప్రకృతి సౌందర్యాన్ని, వన్యప్రాణుల వైవిధ్యాన్ని ఆస్వాదించాను'' అని పేర్కొన్నారు. ఈ టైగర్‌ రిజర్వులో దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించి అటవీ అందాలను ప్రధాని ఆస్వాదించారు. ఖాకీ ప్యాంట్‌, కామోఫ్లాజ్‌ టి-షర్ట్‌, స్లీవ్‌లెస్‌ జాకెట్‌ ధరించిన మోదీ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ టైగర్‌ రిజర్వ్‌ను సందర్శించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు.

తెప్పకాడు ఎలిఫెంట్‌ క్యాంప్‌ వద్ద ప్రధాని ఏనుగులకు చెరకుగడలను ఆహారంగా ఇచ్చారు. ఆస్కార్‌ పురస్కారాన్ని అందుకున్న 'ఎలిఫెంట్ విష్పరర్స్‌' డాక్యుమెంటరీలో కనిపించిన బొమ్మన్‌, బెళ్లి దంపతులు, అందులో కనిపించిన ప్రతినిధులు, నిర్మాత దర్శకులు, మావటిలతో ముచ్చటించారు..

మైనార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా ఎండి నజీర్ నియామకం...

నల్గొండ పట్టణ కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్ లో యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ తాజుద్దీన్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ చాంద్ పాషా గారి ఆధ్వర్యంలో మైనారిటీ జిల్లా అధ్యక్షుడి గా మొహమ్మద్ నజీర్ గారికి నియామక పత్రం అందజేయడం జరిగింది..

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ చాంద్ పాషా గారు మాట్లాడుతూ నల్గొండలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న నవయువకుడైనటువంటి సోషల్ యాక్టివిస్ట్ ఎం.డి నజీర్ యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ లో పనిచేయడానికి వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. నజీర్ పై పూర్తి నమ్మకం ఉన్నదనీ, అతను మా ఆర్గనైజేషన్ తరుపున మైనార్టీ బాగు కోసం నిరంతరం కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

అలాగే జిల్లా జాయింట్ సెక్రెటరీ గా జావిద్ అలిని నియమించారని తెలియజేయడం జరిగింది. అనంతరం నజీర్ గారు మాట్లాడుతూ సంస్థ నియమ నిబంధనలకు లోబడి పని చేస్తానని సంస్థనీ అభివృద్ధి పరుచుటకు ఎల్లవేళలా కృషి చేస్తానని, మైనారిటీల హక్కుల కోసం పాటుపడతానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సద్దాం హుస్సేన్, జావిద్ అలీ, జి షాన్ తదితరులు పాల్గొన్నారు.

Hyderabad: హైదరాబాద్‌లో సీపీఐ, సీపీఎం ఉమ్మడి సమావేశం..

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సీపీఐ, సీపీఎం ఉమ్మడి సమావేశం ప్రారంభమైంది.

సభా ప్రాంగణనికి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ.రాజా, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం.

సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పల్లా వెంకట్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ చేరుకున్నారు. తెలంగాణలోని మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి రెండు కమ్యునిస్టు పార్టీల నేతలు భారీగా హాజరయ్యారు.

Pre wedding shoot : ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ ప్లాన్‌ చేస్తున్నారా.. అయితే ఓ లుక్కేయండి!

తెలుగు రాష్ట్రాల్లో.. మే నెలలో పెళ్లిళ్లకు (Marriages) అత్యధిక ముహుర్తాలున్నాయి. దాంతో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ (Pre wedding shoot) కోసం ఎక్కడికి వెళ్తే బాగుంటుందని కాబోయే వధూవరులు, వారి కుటుంబ సభ్యులు నెట్టింట్లో శోధిస్తున్నారు.

దేశంలోని సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే వ్యయ ప్రయాసలకు గురి కావాల్సి వస్తుంది. అతి తక్కువ బడ్జెట్‌లో.. మనకు సమీపంలోనే పురాతన కోటలు, అందమైన అటవీ ప్రాంతాలు, ఆహ్లాదకర సముద్ర తీరాలున్నాయి. అక్కడకు వెళ్తే ఖర్చులు కలిసి వస్తాయి. పైగా మన తెలుగింటి వారసత్వం కూడా ఫొటో (Photo), వీడియో ఆల్బమ్‌లలో (Album) ఉట్టిపడుతుంది. ఆ ప్రదేశాలేవో పరిశీలించండి.

గోల్కొండ కోట

హైదరాబాద్‌ నగర శివారులో గోల్కొండ కోట ప్రీ వెడ్డింగ్‌ షూట్‌కు చాలా అనువైన ప్రాంతం. ఎండ ఎక్కువగా లేని రోజున ఫొటో షూట్‌కు వెళ్తే అద్భుతమైన చిత్రాలు తీసుకోవచ్చు. నిజాం కాలంలోని రాతి కట్టడాలు బ్యాక్‌గ్రౌండ్‌కు ఒక రాయల్‌ లుక్‌ను తీసుకొస్తాయి. కోట ప్రవేశద్వారం.. మధ్యలో చూడచక్కని గ్రీనరీ కొత్త జంట స్టిల్స్‌కు సరికొత్త శోభనిస్తాయి. హైదరాబాద్‌ నగరం మొత్తం కన్పించేలా ఉన్న కొన్ని వ్యూ పాయింట్స్‌ ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి.

గండి కోట

గోల్కొండ కోట తరహా రాజసం వైయస్‌ఆర్‌ జిల్లా గండికోటలో కన్పిస్తుంది. కోటలోని జుమ్మా మసీదు, ఎర్ర కోనేరు, మాధవరాయస్వామి, రంగనాయకుల దేవాలయం వద్ద మైమరపించే చిత్రాలు తీసుకోవచ్చు. గండికోటకు సమీపంలోని కొట్టాలపల్లె వద్దనున్న గాలి మరలు కూడా ఫొటోషూట్‌కు అనువుగా ఉంటాయి. మైలవరం జలాశయం వద్ద సైతం వివిధ రకాల స్టిల్స్‌ తీసుకునే వెసులుబాటు ఉంటుంది..

వరంగల్‌ కోట

నాటి కాకతీయుల కోట నేటి ఖిలావరంగల్‌ కోటగా ప్రసిద్ధిగాంచింది. ఈ పురాతన కోటలో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం కన్పిస్తుంటుంది. 13వ శతాబ్దం నాటి కాకతీయ కళా తోరణాల వద్ద చూడచక్కని చిత్రాలు తీసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కనిపించే శిలాతోరణం ఇక్కడిదే. మెట్లబావులు సహా పుట్ట కోట, మట్టి కోట, రాతి కోట. నాలుగు దిక్కుల సింహ ద్వారాల వద్ద వైవిధ్యమైన చిత్రాలను క్లిక్‌ మనిపించొచ్చు..

రుషి కొండ బీచ్‌

విశాఖలోని అందమైన ప్రాంతాల్లో రుషి కొండ బీచ్‌ ఒకటి. కేరళ, గోవా తరహాలో ఇక్కడి తీరంలో కొన్ని చోట్ల కొబ్బరి చెట్లు కన్పిస్తాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మత్స్యకారులు ఒడ్డున నిలిపి ఉంచిన బోట్ల వద్ద రకరకాల పోజులిస్తూ ఫొటోలు తీసుకోవచ్చు.

తలకోన అటవీ ప్రాంతం

తిరుపతి నుంచి భాకరాపేట మీదుగా సిద్ధేశ్వరాలయానికి వెళ్లి.. అక్కడి నుంచి 2 కి.మీ.లు అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తే తలకోన అందాలు సాక్షాత్కరిస్తాయి. ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ కాబోయే వధూవరులు సరికొత్త స్టిల్స్‌ దిగొచ్చు. ఇక్కడి జలపాతం వద్ద తీసుకునే చిత్రాలు ఆల్బమ్‌కే హైలెట్‌గా నిలుస్తాయి. అరుదైన జీవ, వృక్ష జాతులకు ఆవాసమైన తలకోనలో బస చేయడానికి అటవీశాఖ అతిథి గృహాలు కూడా ఉన్నాయి.