/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఉనికిని కోల్పోతున్న స్వతంత్ర సంస్థలు Yadagiri Goud
ఉనికిని కోల్పోతున్న స్వతంత్ర సంస్థలు

సాధారణ పౌరులకు సమస్య ఎదురైనప్పుడు ఏ దిక్కూ లేని పరిస్థితుల్లో న్యాయం కోసం ఆశ్రయించే స్వతంత్ర సంస్థలు.. తమ ఉనికినే కోల్పోతున్నాయి. సామాన్యులకు ఎవరి నుంచి ఎటువంటి హాని జరిగినా, అపాయం పొంచి ఉన్నా తామున్నామని భరోసానివ్వాల్సిన కమిషన్లు.. నియామకాలకు నోచుకోక వెలవెలబోతున్నాయి. నెలలు, ఏళ్ల తరబడి ఆయా కమిషన్లను ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేయడమే ఇందుకు కారణం. కమిషన్ల చైర్మన్‌, సభ్యుల పదవీకాలం ముగిసినా.. పునరుద్ధరణ చేపట్టకపోవడంతో అవి ఖాళీ కమిషన్లుగా ఉండిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందన్న ఆరోపణలువస్తున్నాయి. సాధారణంగా పౌరుల హక్కులకు భంగం కలిగినా, అధికారులు, ప్రత్యర్థుల నుంచి అపాయం పొంచి ఉన్నా బాధితులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తుంటారు. కానీ, కొన్ని నెలలుగా హక్కుల కమిషన్‌.. చైర్మన్‌, సభ్యులు లేకుండా స్తబ్దంగా మిగిలిపోయింది. రాష్ట్ర సమాచార కమిషన్‌ గడువు గత ఫిబ్రవరిలో ముగిసినా.. పునరుద్ధరణపై ప్రభుత్వం ఇప్పటివరకు దృష్టి సారించలేదు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఖాళీ అయి దాదాపు రెండేళ్లవుతున్నా.. ప్రభుత్వం ఇంతవరకూ నియామకానికి చర్యలు తీసుకోవడంలేదు. వినియోగదారుల ఫోరం అధ్యక్షుడి పదవీ విరమణ తర్వాత సీనియర్‌ సభ్యుడికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి కొనసాగిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (హెచ్చార్సీ) చుక్కాని లేని నావగా మారింది. దాదాపు నాలుగు నెలలుగా హెచ్చార్సీ చైర్మన్‌ పోస్టు ఖాళీగా ఉంది. చైర్మన్‌, సభ్యుల పదవీకాలం గత డిసెంబరులో ముగియడంతో.. అప్పటినుంచి హెచ్చార్సీ పనితీరు నెమ్మదించింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర హెచ్చార్సీ మొదటి చైర్మన్‌గా జస్టిస్‌ చంద్రయ్యను 2019 డిసెంబరు 23 ప్రభుత్వం నియమించింది. ఆయన మూడేళ్ల పదవీకాలం 2022 డిసెంబరు 22తో ముగిసింది. కమిషన్‌ సభ్యులపదవీకాలం కూడా ముగిసింది. దీంతో అప్పటినుంచి అన్ని కుర్చీలూ ఖాళీగానే ఉన్నాయి. రెండు నెలలుగా దాఖలైన పిటిషన్లన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. పోలీస్‌ అధికారుల వేధింపులు, ప్రభుత్వ ఉద్యోగులతో ఎదురవుతున్న ఇబ్బందులు.. ఇలా అనేక సమస్యలపై రాష్ట్రంలోని నలు మూలల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో బాధితులు న్యాయం కోసం హెచ్చార్సీని ఆశ్రయిస్తుంటారు. సగటున రోజుకు 30 పిటిషన్లు హెచ్చార్సీలో దాఖలవుతాయి. అవన్నీ ఇప్పుడు విచారణ లేకుండా మిగిలిపోయాయి. కాగా, హెచ్చార్సీ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్యతోపాటు సభ్యుల పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగిస్తుందని అంతా భావించారు. కానీ, ఇప్పటివరకు ఇందుకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు.

సమాచార కమిషన్‌ ఖాళీ..

సమాచార హక్కు చట్టం-2005 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సమాచార కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ప్రధాన కమిషనర్‌గా డాక్టర్‌ ఎస్‌.రాజా సదారాం, కమిషనర్‌గా బుద్దా మురళిని నియమించింది. ప్రధాన కమిషనర్‌ రాజా సదారాం పదవీకాలం 2022 ఫిబ్రవరిలో ముగిసింది. అప్పటి నుంచి కమిషనర్‌ బుద్దా మురళికి ప్రధాన కమిషనర్‌గా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అనంతరం బుద్దా మురళి పదవీ కాలం గత సెప్టెంబరులో ముగిసింది. అప్పటి నుంచి ప్రధాన కమిషనర్‌, కమిషనర్‌ బాధ్యతలు ఎవరికీ అప్పగించకుండా ప్రభుత్వం ఖాళీగా ఉంచింది. ఈ ఏడాది ఫిబ్రవరితో కమిషన్‌ గడువు కూడా ముగిసింది. దీంతో పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని పలుమార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా.. ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. పైగా, సమాచార కమిషన్‌ కొనసాగింపును నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ కమిషన్‌కు శాశ్వత భవన నిర్మాణానికి ప్రభుత్వం గతంలో గచ్చిబౌలిలో ఎకరం స్థలం కేటాయించడం గమనార్హం.

ఏళ్ల తరబడి ఖాళీగా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌..

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఖాళీ అయి దాదాపు రెండేళ్లు అవుతున్నా.. ప్రభుత్వం ఇంతవరకూ నియామకానికి చర్యలు తీసుకోవడంలేదు. ఫలితంగా రాష్ట్రంలోని గిరిజనులు, దళితులు తమ సమస్యలకు చెప్పుకొనేందుకు అవకాశమే లేకుండా పోయింది. కమిషన్‌ నియామకం విషయంలో హైకోర్టు కలుగజేసుకొని నోటీసులు జారీ చేసినా.. సర్కారు స్పందించలేదు. 2018 నాటి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ పదవీకాలం 2021 ఫిబ్రవరికే పూర్తయినా ఇప్పటివరకు నూతన చైర్మన్‌ను, సభ్యులను నియమించలేదు. దీంతో తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ప్రతిసారీ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, దళిత, గిరిజన వర్గాలపై 2022లో రాష్ట్రవ్యాప్తంగా 12,864 దాడులు జరిగినట్లు సమాచారం. 2018-2021 మధ్య పనిచేసిన ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ తన హయాంలో 14 వేల కేసులకుగాను దాదాపు 13వేల కేసులను పరిష్కరించడంతోపాటు బాధితులకు సుమారు 80కోట్ల పరిహారం అందించింది. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ లేకపోవడంతో జరిగిన దాడులన్నింటిలోనూ బాధితులకు న్యాయం జరగడంలేదు. తమకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించేవారు లేక దళిత, గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రంగంలోకి జాతీయ కమిషన్‌..

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఖాళీగా ఉండటంతో ఆయా సమస్యల పరిష్కారానికి కొన్నిసార్లు నేరుగా జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషనే రంగంలోకి దిగుతోంది. తాజాగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్‌ వినీత్‌, కలెక్టర్‌ అనుదీ్‌పలను రెండేళ్ల కిందటి కేసుకు సంబంధించి జాతీయ కమిషన్‌ విచారించడమే ఇందుకు నిదర్శనం. దీంతోపాటు దళిత మహిళ మరియమ్మ లాక్‌పడెత్‌ విషయంలోనూ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషనే స్పందించింది. కాగా, ఇటీవల నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బాజకుంట గ్రామ సర్పంచ్‌.. వికలాంగ దళితుడిపై చెప్పుతో దాడి చేసిన ఘటనలో, 2019లో రాజన్న సిరిసిల్ల జిల్లా రామోజీపేటలో దళితవాడపై దాడి జరిగిన ఘటనలో ఇప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదు. సంగారెడ్డి జిల్లా పొట్టిపల్లి గ్రామంలో సోషల్‌ మీడియా వ్యవహారంపై చెలరేగిన ఘర్షణ 15 మంది దళిత యువకులపై దాడి వరకు వెళ్లింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కోయపోచగూడెం గ్రామంలో పోడు భూముల విషయంలో చోటుచేసుకున్న వివాదంలో పోలీసులే గిరిజన మహిళల్ని ఈడ్చుకెళ్లారు. మహబూబాబాద్‌ జిల్లాలో మూడు గ్రామాల్లో బతుకమ్మ సాక్షిగా దళిత మహిళలపై అగ్రవర్ణ మహిళలు వివక్షకు పాల్పడ్డ అంశం సంచలనం సృష్టించింది. వీటితోపాటు రాష్ట్రంలో ఏదో ఒక చోట దళిత, గిరిజనులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆయా ఘటనల్లో బాధితులకు న్యాయం లభించడంలేదు.

తక్షణమే కమిషన్‌ను నియమించాలి:

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ లేకపోవడంతో దళిత, గిరిజనులు గోడు చెప్పుకొనేందుకు వేదిక లేకుండా అయిపోయింది. రాష్ట్రంలో ఇటీవలి కాలం లో దళితులు, గిరిజనులపై దాడులు పెరుగుతున్నాయి. వారి అభ్యున్నతి కోసం పాటుపడుతున్నామని చెబుతున్న ప్రభుత్వం కమిషన్‌ను ఎందుకు నియమించడం లేదు? తక్షణమే ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ను, సభ్యులను నియమించాలి.

మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో పర్యటించిన సూరన్న

మహారాష్ట్ర లో నేను చేస్తున్న ఉద్యమం ఫలిస్తుందా లేదా అని చిన్నగా నన్ను నేను పరీక్ష చేసుకున్న

వారు మాట్లాడినట్లు అనర్గళమైన రీతిలో మరాఠీ మాట్లాడకపోవచ్చు కానీ నా వంతు నేను మరాఠీ మాట్లాడడానికి ప్రయత్నం చేసాను మాట్లాడినాను.

యావత్మాల్ జిల్లాలో 'వని' అనే పట్టణంలో బుద్ధ విహార్ లో వెళ్లి కాసేపు యువకులతో చర్చించడం జరిగింది

అంబేద్కర్ గారు కల్పించిన గొప్ప ఓటుహక్కును అమ్ముకొని మనం ఎన్ని జయంతిలు వర్ధంతిలు చేసిన ప్రయోజనము లేదని చెప్పడం జరిగింది.

పొలిట్రిక్స్ పుస్తకాన్ని మరాఠీ భాషలో తర్జుమా చేసి వీలైతే మహారాష్ట్ర లో అక్షరాస్యత లోపించిన గ్రామాల్లో ఈ పుస్తకాన్ని పట్టుకొని వాస్తవాలు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది.

ఈ ఉద్యమాన్ని ముందుకు నడపడంలో మీరు అందరూ భాగస్వామ్యం వహించాలని మనసారా వేడుకుంటున్నాను.

నా ఉద్యమంలో స్వార్థం లేదు కాబట్టే నేను అన్ని రాష్ట్రాల్లో ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి ఇష్టపడుతున్నాను.

ఒకవేళ స్వార్థం ఉంటే నాకు ఓటు హక్కు ఉన్న జిల్లాలోనే ఉద్యమం చేసేవాడిని.

మహారాష్ట్ర లో చేస్తే నాకేం వస్తుంది ? ఇక్కడేమైనా నాకు ఓటు హక్కు ఉందా ? లేదు కదా.

మనస్ఫూర్తిగా ఉద్యమాన్ని ముందుకు నడిపించడం కొరకు మీరు సహకరించగలరు.

8790031672

సూరన్న

పొలిట్రిక్స్ పుస్తక రచయిత

పలు రైళ్లు రద్దు..

ఈ నెల 9, 10 తేదీల్లో

ధన్‌బాద్‌-అలెప్పుజ-ధన్‌బాద్‌(13351-13352) బొకారో ఎక్స్‌ప్రెస్‌,

హావ్‌డా-జగదల్‌పూర్‌-హావ్‌డా(18005-18006),

10న పురిలియా-విల్లుపురం(22605), తాంబరం-సిల్గాట్‌ టౌన్‌-తాంబరం(15629-15630),

8న బరౌలి-కోయంబత్తూర్‌(03357),

12న కోయంబత్తూర్‌-బరౌలి(03358),

10న విశాఖ-రాయ్‌పుర్‌-విశాఖ(08527-08528)

రైళ్లు రద్దు చేసినట్లు తెలిపారు.

Amaravati: ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సవాళ్లు.. అమరావతిలో ఉత్కంఠ

144 సెక్షన్‌ అమలు..

చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరిక..

బందోబస్తుకు సిద్ధమైన పోలీసులు..

అమరావతి పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ సవాళ్లు ప్రతి సవాళ్ల నేపథ్యంలో అమరావతిలో ఉత్కంఠ నెలకొంది..

ఇరుపక్షాలు అవినీతిపై చర్చించి, ఆదివారం అమరేశ్వరాలయంలో ప్రమాణం చేద్దామని సవాళ్లు విసిరారు. ఈ నేపథ్యంలో వైకాపా, తెదేపా నాయకులు, కార్యకర్తలు సన్నద్ధమవుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు..

నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామంలో బలగం చిత్రం ప్రదర్శన..

•క్రీస్తు శేషులు. అలుగుబెల్లి హనుమంత్ రెడ్డి. రామ నర్సమ్మ గార్ల జ్ఞాపకార్థం

శనివారం రోజున బలగం చిత్రాన్ని గ్రామంలో (కరుణం వారి వాకిలి) నందు ప్రదర్శించడం జరిగింది... ఈ సందర్భంగా వారి కుమారులు మాట్లాడుతూ బంధాలకు బంధుత్వాలకు ప్రతీకగా నిలిచిన ఈ బలగం సినిమాని గ్రామ ప్రజలకు ఒక మంచి ఉద్దేశంతో ప్రదర్శింప చేశామని అన్నారు.

ఈ చిత్రాన్ని తిలకించిన గ్రామ పెద్దలకు యువకులకు మహిళలకు విద్యార్థులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.. అదేవిధంగా గ్రామ ప్రజలు బలగం సినిమా గ్రామంలో ప్రదర్శించినందుకు అలుగుబెళ్లి కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో.హనుమంత రెడ్డి గారి కుమారులైన అలుగుబెల్లి ప్రభాకర్ రెడ్డి. కరుణాకర్ రెడ్డి. సురేందర్ రెడ్డి. రవీందర్ రెడ్డి ఉపేందర్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు..

భావప్రకటనా స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి

•'ఫ్యాక్ట్‌ చెకింగ్‌' యూనిట్‌ ఏర్పాటు చేస్తూ ఏప్రిల్ 6 నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని ఐటీ మంత్రిత్వ శాఖకు లేఖ

•ఉద్యోగుల, ఆఫీసర్ల, పెన్షనర్ల జాతీయ నేత వి.కృష్ణ మోహన్

సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఆన్‌లైన్‌ కంటెంట్‌ కట్టడికి ఐటీ నిబంధనల్లో సవరణలు చేస్తూ భావ స్వేచ్ఛపై నిఘా విధిస్తూ 'ఫ్యాక్ట్‌ చెకింగ్‌' యూనిట్‌ ఏర్పాటు చేస్తూ ఏప్రిల్ 6 నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని ఐటీ మంత్రిత్వ శాఖకు వ్రాసిన లేఖలో ఉద్యోగుల, ఆఫీసర్ల, పెన్షనర్ల జాతీయ నేత వి.కృష్ణ మోహన్ అభ్యర్థించారు.

ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు, ఇతర వాస్తవాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చే మీడియాను ప్రభుత్వం నయానో, భయానో బెదిరించి కట్టడి చేస్తున్నదని, భారత్‌లోని జర్నలిస్టులకు భద్రత లేదనీ, పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడిపోయిందని పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలు సైతం స్పష్టం చేసిన విధానమే ఇందుకు నిదర్శనమని లేఖలో పేర్కొన్నారు.

విమర్శలను సహించని కేంద్రం, ప్రభుత్వంపై వచ్చే 'ఫేక్‌ న్యూస్‌' గుర్తింపు పేరుతో ఆన్‌లైన్‌ కంటెంట్‌ను నియంత్రించడానికి వివిధ చర్యలు తీసుకుంటున్నది. సామాన్య పౌరుడు సైతం తన భావాలను పంచుకోగలిగే సోషల్‌ మీడియానూ, ఆన్‌లైన్‌ కంటెంట్‌ను నియంత్రించడానికి, ప్రభుత్వం గురించి వచ్చే 'ఫేక్‌' వార్తల కట్టడి పేరుతో ఆంక్షలకు దిగుతున్నది. ఆన్‌లైన్‌లో పోస్ట్‌ అయిన 'తప్పుడు' సమాచారాన్ని గుర్తించేందుకు ''ఫ్యాక్ట్‌ చెకింగ్‌ టీమ్‌''ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా వేదికలు, ఇతర మధ్యవర్తులు.. అప్‌లోడ్‌ చేయబడిన కంటెంట్‌ ''ఫేక్‌ లేదా తప్పుదారి పట్టించేదిగా ఉన్నది'' అని ఫ్యాక్ట్‌ చెకింగ్‌ టీమ్‌ గుర్తిస్తే సదరు సమాచారాన్ని తొలగించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ.. సమాచార సాంకేతిక (ఐటీ) నిబంధనలు, 2021లో జరిగిన సవరణలను గురువారమే నోటిఫై చేసిందని తెలిపారు.

అనేక వార్తల విషయంలో ''ఫేక్‌ ముద్ర'' వేయడం ద్వారా నకిలీ వార్తలను గుర్తించే విషయంలో కేంద్ర సమాచార విభాగం అనేక సందర్భాల్లో విమర్శలను ఎదుర్కొన్నది. ఆ తర్వాత అధికారులే స్వయంగా ధృవీకరించారు. అలాగే, కేంద్రాన్ని విమర్శిస్తూ వచ్చే వార్తలను తిరస్కరిస్తూ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో కూడా విమర్శలను ఎదుర్కొన్నది. అయితే, సదరు వార్తలు అవాస్తవాలు అన్నదానిపై ఎలాంటి నిజ నిర్ధారణ లేకుండానే ఈ విధమైన చర్యలకు దిగడంతో ప్రతిష్టను దిగజార్చుకున్నది. ఇలాంటి తరుణంలో ఏర్పాటయ్యే 'ఫ్యాక్ట్‌ చెకింగ్‌' టీం స్వతంత్రంగా పని చేస్తుందనడానికి నమ్మకం ఏమిటని ప్రశ్నించారు. ఇది సోషల్‌ మీడియాలో స్వతంత్రంగా పని చేసే వ్యక్తులు, సంస్థల గొంతు నొక్కే చర్యగా అభివర్ణించారు.

ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) లేదా నిజ నిర్ధారణ కోసం ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన ఇతర ఏ ఏజెన్సీ ద్వారానైనా ''ఫేక్‌ న్యూస్‌'' అని గుర్తించబడితే సదరు పోస్టును తొలగించాల్సి ఉంటుందని జనవరిలో సదరు మంత్రిత్వ శాఖ డ్రాఫ్ట్‌ రూల్స్‌లో ప్రచురించింది.

ప్రభుత్వంలోని ఏదైనా యూనిట్‌కు అలాంటి ఏకపక్ష, విస్తృత అధికారాలు కేటాయించడం సహజ న్యాయ సూత్రాలను దాట వేస్తుందని ఈ సవరణలు దేశంలో పత్రికా స్వేచ్ఛకు లోతైన ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసారు. ఇదంతా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమనీ, సెన్సార్‌షిప్‌కు సమానమని వి. కృష్ణ మోహన్ వివరించారు.

పీఐబీ ద్వారా నకిలీ వార్తలుగా భావించే పోస్టులను తొలగించాలని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కోరడం ప్రమాదకరమైన ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ సవరణలను వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో సెన్సార్‌షిప్‌నకు చోటు లేదని పేర్కొన్నారు.

వి. కృష్ణ మోహన్

నేషనల్ వైస్ చైర్మన్,

కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీ.సీ.జీ.జీ.ఓ.ఓ)

9440668281

ఆల్ పెన్షనర్స్ & రిటైర్డ్ పర్సన్స్ Krishna Mohan

National Vice Chairman,

Confederation of Central Government Gazetted Officers Organisations

(CCGGOO)

9440668281

All Pensioners & Retired Persons Association Reception Committee Dy. General Secretary

కేంద్ర కొలువులు హిందీ వాళ్లకేనా?.. కేంద్ర హోంమంత్రికి రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ లేఖ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నిర్వహణకు హిందీ, ఇంగ్లిష్‌ భాషలను ప్రామాణికం చేయడం వల్ల కోట్లాది మంది హిందీయేతర నిరుద్యోగులు నష్టపోతున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ చెందేలా తెలుగుతోపాటు భారత రాజ్యాంగం గుర్తించిన అన్ని అధికారిక భాషల్లో ఉద్యోగ పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నిర్వహణకు హిందీ, ఇంగ్లిష్‌ భాషలను ప్రామాణికం చేయడం వల్ల కోట్లాది మంది హిందీయేతర నిరుద్యోగులు నష్టపోతున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ చెందేలా తెలుగుతోపాటు భారత రాజ్యాంగం గుర్తించిన అన్ని అధికారిక భాషల్లో ఉద్యోగ పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. సీఆర్పీఎఫ్‌ ఉద్యోగాల కోసం హిందీ, ఇంగ్లిష్‌లో మాత్రమే పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు కేటీఆర్‌ శుక్రవారం లేఖ రాశారు.

ఈ పరీక్షను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతోపాటు అన్ని అధికారిక భాషల్లో నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో మాత్రమే పోటీ పరీక్షలు నిర్వహించడం ఇతర ప్రాంతాలపై తీవ్ర వివక్ష చూపటమేనని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆంగ్ల మాధ్యమంలో చదవనివారు, హిందీ ప్రాంతాలకు చెందని నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. వివిధ ఉద్యోగాల కోసం నేషనల్‌ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ ద్వారా కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ విధానంలో 12 అధికార భాషల్లో పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొన్న నిర్ణయం సంపూర్ణంగా అమలు కావడంలేదని విమర్శించారు.

రాజ్యాంగ విరుద్ధం

అనేక అధికారిక భాషలున్న భారతదేశంలో హిందీవారికి మాత్రమే పోటీ పరీక్షలు రాసే అవకాశం ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. దేశంలో రాజ భాష అంటూ ఏదీలేదని రాజ్యాంగం స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ భాషలను పట్టించుకోకుండా హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లోనే ఉద్యోగ పరీక్షలు నిర్వహించడం దారుణమని మండిపడ్డారు. సమాన అవకాశాలు పొందేలా ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హకును సీఆర్పీఎఫ్‌ నోటిఫికేషన్‌ కాలరాస్తున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలను రాజ్యాంగం గుర్తించిన అన్ని అధికారిక భాషల్లోనూ నిర్వహించాలని 2020 నవంబర్‌ 18న కేంద్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్‌ లేఖ కూడా రాశారని గుర్తుచేశారు.

దక్షిణాదిలో వెల్లువెత్తిన నిరసనలు

సీఆర్పీఎఫ్‌లో దాదాపు 1.3 లక్షల కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి కేంద్ర హోంశాఖ జారీచేసిన నోటిఫికేషన్‌లో పరీక్షను ఇంగ్లిష్‌, హిందీలో మాత్రమే నిర్వహిస్తున్నట్టు ప్రకటించటం దక్షిణాది రాష్ర్టాల్లో అగ్గి రాజేసింది. కేంద్ర ఉద్యోగాల భర్తీలో దక్షిణాది రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తున్నదని ఆరోపిస్తూ నిరుద్యోగులు ఆందోళనబాట పట్టారు. 'లింగ్విస్టిక్‌ ఈక్వాలిటీ' కావాలంటూ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిర్ణయాన్ని వెంటనే సవరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి సహా పలువురు రాజకీయ విశ్లేషకులు, విద్యావేత్తలు గళం విప్పారు. 'బంగ్లా పోఖో' ప్రధాన కార్యదర్శి గార్గా ఛటర్జీ.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ ఈ విషయంపై స్పందించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని భాషల్లోనూ సీఆర్పీఎఫ్‌ పరీక్ష నిర్వహించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

Droupadi Murmu: సుఖోయ్‌లో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

గువాహటి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu ) ఈశాన్య రాష్ట్రం అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె తొలిసారిగా సుఖోయ్‌-30 MKI (Sukhoi-30) యుద్ధ విమానంలో ప్రయాణించారు..

ఈ ఉదయం తేజ్‌పూర్‌లోని భారత వాయుసేనకు చెందిన వ్యూహాత్మక వైమానిక స్థావరానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ము.. తొలుత భద్రతా దళాల నుంచి సైనిక వందనం అందుకున్నారు. అనంతరం ఆమె ఫ్లయింగ్‌ సూట్‌ ధరించి సుఖోయ్‌-30 విమానంలో కొద్దిసేపు విహరించారు.

ఈ విమానాన్ని గ్రూప్‌ కెప్టెన్‌ నవీన్‌ కుమార్‌ తివారీ నడిపారు. కాగా.. అంతకుముందు 2009లో భారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ కూడా యుద్ధ విమానంలో ప్రయాణించారు.

మూడు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) గత గురువారం అస్సాం (Assam) చేరుకున్నారు. శుక్రవారం కజిరంగ జాతీయ పార్కులో జరిగిన గజ్‌ ఉత్సవ్‌ను ఆమె ప్రారంభించారు. పర్యటనలో భాగంగా మౌంట్‌ కాంచనగంగ సాహసయాత్ర - 2023ను కూడా ఆమె ప్రారంభించారు.

బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ

మోదీ పర్యటన కార్యక్రమాలు ఇవీ..

- ఉదయం 11.30కు ప్రత్యేక విమానంలో బేగంపేటకు.. 11.45కు రోడ్డుమార్గాన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు..

- 11.47 నుంచి 11.55దాకా రైల్వేస్టేషన్‌లో సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ రైలు పరిశీలన, మొదటి బోగీలో పిల్లలతో మాటామంతీ, డ్రైవింగ్‌ కేబిన్‌లో సిబ్బందిని కలుసుకుంటారు.

- 11.55 గంటలకు జెండా ఊపి సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభిస్తారు.

- మధ్యాహ్నం 12.15 గంటలకు పరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకుంటారు.

- 12.20 నుంచి 12.30 దాకా కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగాలు

- 12.30 నుంచి 12.37 దాకా సీఎం కేసీఆర్‌ ప్రసంగం...

- 12.37 నుంచి 12.50 మధ్య రిమోట్‌ ద్వారా అభివృద్ధి పథకాల శిలాఫలకాల ఆవిష్కరణ. షార్ట్‌ వీడియోల ప్రదర్శన.

- 12.50 నుంచి 1.20 వరకు ప్రధాని మోదీ

- 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణం.

'నా రాజు ఎవరి మాటా వినడు'

•రాహుల్ గాంధీపై దాడి చేస్తూ బిజెపిలో చేరే ముందు ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ హైకమాండ్‌పై ఘాటు వ్యాఖ్యలు

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ మాజీ, చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈరోజు బీజేపీలో చేరారు. ప్రహ్లాద్ జోషి సమక్షంలో కిరణ్ బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన తర్వాత.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కిరణ్ ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు.

కాంగ్రెస్ హైకమాండ్ టార్గెట్

ఢిల్లీలో బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్‌ మాజీ నేత కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ హైకమాండ్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పెద్ద నాయకులు తన మాట వినడం లేదని సైగలతో అన్నారు. రెడ్డి మాట్లాడుతూ, 'నేను కాంగ్రెస్‌ను వీడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. రాహుల్‌పై విరుచుకుపడుతూ.. 'నా రాజు చాలా తెలివైనవాడు, తన గురించి ఆలోచించడు, ఎవరి సలహాలూ వినడు' అని ఒక సామెత ఉందని అన్నారు.

ప్రధాని మోదీని ఆకట్టుకున్నారు

కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబంలో చాలా మంది కాంగ్రెస్‌లో ఉన్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఎప్పుడో నేను ఆయన్ను కలిసినప్పుడు ప్రధాని మోదీని చూసి ఇంప్రెస్ అయ్యానని, అందుకే ఈరోజు బీజేపీలో చేరుతున్నానని చెప్పారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా చాలా క్లీన్ ఇమేజ్ ఉన్న కిరణ్ అవినీతిపై మా పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తానన్నారు.

తండ్రి మరణం తర్వాత సీఎం అయ్యారు

2009లో తన తండ్రి, ఆంధ్రా మాజీ ప్రధాని రాజశేఖరరెడ్డి మరణంతో కిరణ్ రెడ్డి రాష్ట్రానికి సీఎం అయ్యారు. 2010లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో ఆ కాలంలో రాజకీయ పరిణామాలు తలెత్తాయి, దాని కారణంగా రాష్ట్ర అధికారాన్ని ఆయన తన చేతుల్లోకి తీసుకున్నారు.

కిరణ్ రెడ్డి రాజకీయ జీవితం 1989లో మొదలైందని చెప్పండి. ఆయన కాంగ్రెస్ టికెట్‌పై వాయల్పాడు నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2014లో యూపీఏ ప్రభుత్వం ఆంధ్రా, తెలంగాణాగా విభజించడంతో కిరణ్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఆ తర్వాత జై సమైక్యాంధ్ర అనే కొత్త పార్టీని స్థాపించారు. అయితే, 2018లో రాహుల్ గాంధీ అతన్ని వెనక్కి తీసుకున్నారు.