/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Bopparaju: అప్పుడు జీతం పెరిగితే.. ఇప్పుడు పడితే సంతోషించాల్సి వస్తోంది: బొప్పరాజు Yadagiri Goud
Bopparaju: అప్పుడు జీతం పెరిగితే.. ఇప్పుడు పడితే సంతోషించాల్సి వస్తోంది: బొప్పరాజు

అమరావతి: ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితి రాష్ట్రంలో తప్ప మరెక్కడా లేదని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు..

జీతాలు సకాలంలో అందక ఉద్యోగులు, వారి కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నాయని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డితో ఏపీ ఐకాస అమరావతి నేతలు సమావేశమయ్యారు. ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణ లేఖను ఆయనకు అందజేశారు. అనంతరం నేతలు బొప్పరాజు మీడియాతో మాట్లాడారు.

ఫిబ్రవరిలో సీఎస్‌కు లేఖ ఇచ్చినా డిమాండ్లు పరిష్కారం కాలేదని బొప్పరాజు చెప్పారు. ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తామని సీఎస్‌కు తెలిపినట్లు వెల్లడించారు. ''ఉద్యోగ సంఘాల పోరాట కార్యాచరణపై సీఎస్‌కు నోటీసిచ్చాం. న్యాయబద్ధంగా రావాల్సిన జీతభత్యాలు ఇవ్వట్లేదు. మేం దాచుకున్న డబ్బుకూ ప్రభుత్వం

లెక్కలు చెప్పడం లేదు. జీతాలు రాక ప్రభుత్వ ఉద్యోగులు కష్టాలు పడుతున్నారు. బ్యాంకులకు ఈఎంఐలు చెల్లించలేక వడ్డీలు కట్టాల్సిన దుస్థితి నెలకొంది. కొంతమంది ఉద్యోగులు లోన్‌ యాప్‌ల ద్వారా డబ్బులు తీసుకొని తిరిగి చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

డీఏలు, పీఆర్సీ బకాయిలు ఎప్పుడు ఇస్తారో చెప్పకపోవడం దారుణం. ఇవన్నీ పరిష్కరించకపోవడం వల్లే ఉద్యమానికి దిగాం. ఒకటో తేదీన జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. తెలంగాణలో ఒక్క డీఏ కూడా పెండింగ్‌లో లేదు. గతంలో జీతం పెరిగితే సంతోషించేవాళ్లం.. ఇప్పుడు జీతం పడితే సంతోషించాల్సి వస్తోంది. పోరాటంలో కలిసి రావాలని ఏపీ ఎన్జీవో ఐకాసను కోరాం. మాతో కలిసొచ్చినా.. లేక విడిగా పోరాటం చేసినా ఫర్వాలేదు'' అని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

Kiran Kumar Reddy: భాజపా ఎదిగేకొద్దీ.. కాంగ్రెస్‌ దిగజారింది: కిరణ్‌కుమార్‌రెడ్డి..

దిల్లీ: దేశ నిర్మాణం, పేదరిక నిర్మూలనకు భాజపా చేస్తున్న కృషి నచ్చడంతోనే ఆ పార్టీలో చేరినట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు..

దిల్లీలో కాషాయ పార్టీలో చేరిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ కార్యకర్తల అమోఘమైన కృషి వల్లే భాజపా బలీయమైన శక్తిగా తయారైందని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో అలాంటి పరిస్థితి లేదన్నారు. అక్కడ పార్టీ పటిష్ఠత, కార్యాచరణపై నాయకులతో కనీస చర్చ కూడా ఉండదని కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌తో తమ కుటుంబానికి ఉన్న ఆరు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నట్లు చెప్పారు.

''కాంగ్రెస్‌ అధిష్ఠానం తప్పుడు నిర్ణయాలతో ఆ పార్టీ అధికారం కోల్పోయింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పార్టీ నాయకత్వం చెల్లాచెదురైంది. ఎవరి నాయకత్వంలో పనిచేయాలో తెలియని అయోమయం ఏర్పడింది. భాజపా ఎదిగేకొద్దీ కాంగ్రెస్‌ దిగజారుతూ వచ్చింది. పరిస్థితులు, పరిణామాలను అర్థం చేసుకుని కాయకల్ప చికిత్స చేసుకోవడంలో ఆ పార్టీ విఫలమైంది. వాస్తవాలు గ్రహించకుండా మేం చేసిందే సరైనదనే ధోరణి కాంగ్రెస్‌లో ఉంది. దేశ నిర్మాణం పట్ల భాజపా నాయకత్వంలో స్పష్టమైన అవగాహన ఉంది. శక్తిమంతమైన నాయకులే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. పేదలకు సేవ చేయడమే జాతి నిర్మాణన్న సంకల్పం భాజపాకు ఉంది. దేశం కోసం మోదీ, అమిత్‌షా కంకణబద్ధులై ఉన్నారు'' అని కిరణ్‌కుమార్‌రెడ్డి కొనియాడారు..

Balakrishna: ఏపీలో మళ్లీ సైకో పాలన వస్తే.. ప్రజలు మరో చోటికి వెళ్లాలి: నందమూరి బాలకృష్ణ

శింగనమల: వైకాపా పాలనలో ఏపీ సర్వనాశనమైందని తెదేపా ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ విమర్శించారు. అభివృద్ధి శూన్యం, దోపిడీ ఘనం అన్నట్లుగా పాలన సాగుతోందని ధ్వజమెత్తారు.

అనంతపురం జిల్లా శింగనమలలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ 'యువగళం' పాదయాత్రలో బాలయ్య పాల్గొన్నారు. మార్తాడులోని క్యాంప్‌ సైట్‌ నుంచి లోకేశ్‌తో కలిసి ఆయన ముందుకు సాగారు. అంతకుముందు బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. లోకేశ్‌ పాదయాత్ర యువతరానికి స్ఫూర్తి అన్నారు. గతంలో యువత కోసం తెదేపా ఏం చేసిందో ఆయన చెబుతున్నారని.. సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న లోకేశ్‌కు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు.

''జగన్‌ సీఎం అయ్యాక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యం. పరిశ్రమలు రాలేదు.. ఉపాధి కల్పన జరగలేదు. రాష్ట్రమంతటా ల్యాండ్, శాండ్‌ మాఫియా రెచ్చిపోతోంది. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ కేసులతో వేధిస్తున్నారు. రాష్ట్రంలో పేదవాళ్లు బతికే పరిస్థితి లేదు. చెత్తపైనా పన్ను వేసే దౌర్భాగ్య పరిస్థితి ఏపీలో ఉంది. రాష్ట్రంలో మళ్లీ సైకో పాలన వస్తే ఏపీ ప్రజలు మరోచోటికి వెళ్లాల్సి వస్తుంది. ఎవరినైనా బెదిరించవచ్చని జగన్‌ చూస్తున్నారు. వైకాపా ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉంది. చాలా మంది మా పార్టీతో టచ్‌లో ఉన్నారు. తెదేపాలో చేరి ప్రజాసేవ చేద్దామని అనుకుంటున్నారు. ముఖ్యమంత్రికి పబ్‌జీ ఆడుకోవడం తప్ప ఏమీ తెలియదు. వైకాపా ఓటమి అంచుల్లో ఉందని జగన్‌కూ తెలుసు. వైకాపా అరాచకాలను ఎదిరించేందుక ప్రజలంతా ముందుకు రావాలి. తెదేపా పాలన మళ్లీ వస్తుంది.. అందరి సమస్యలు పరిష్కరిస్తుంది'' అని బాలయ్య అన్నారు.

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు నోటీసులు..

తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నాపత్రాలు వరుసగా రెండు రోజులు అవడంతో అటు విద్యార్థులు మరియు తల్లితండ్రులు ఎంతో భయపడ్డారు. కానీ తెల్నగన ప్రభుత్వం వెంటనే రెండు పేపర్ లను లీక్ చేసిన వారిని పట్టుకుని అరెస్ట్ చేసింది..

ఇదే పేపర్ లీక్ విషయంలో పాత్ర ఉందన్న కారణానికి బండి సంజయ్ ను అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ కు పంపారు. కాగా తాజాగా ఈ కేసులో మరో బీజేపీ ఎమ్మెల్యేకు పోలీసులు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు కలకలం రేపుతోంది.

బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు పోలీసులు నోటీసులు అవ్వడం జరిగింది.

ఈయనకు 160 CRPC కింద నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రేపు ఉదయం 11 గంటలకు వరంగల్ డీసీపీ ఆఫీస్ లో విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంకా విచారణకు వచ్చే సమయంలో ఫోన్ ను ఖచ్చితంగా తీసుకురావాలని కూడా నోటీసు లో పేర్కొన్నారట. మరి ఈయన విచారణలో ఏమేమి విషయాలు బయటకు వస్తాయో తెలియాల్సి ఉంది?

బండి సంజయ్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 10కి వాయిదా

▪️బెయిల్‌ పిటిషన్‌కు అనుమతించిన హైకోర్టు.

▪️రిమాండ్‌పై ఆర్డర్ తప్పని వాదనలు వినిపించిన లాయర్.

▪️బెయిల్ పిటిషన్ విచారణ ఇవాళే ముగించేలా ఆదేశాలు ఇవ్వాలన్న న్యాయవాది.

▪️ఎల్లుండి ప్రధాని పర్యటన ఉందని విజ్ఞప్తి.

అరెస్ట్ చేసిన సమయంలో తన వద్ద ఉన్న ఫొన్‌ను తరువాత తన అనుచరుడికి ఇచ్చిన బండి సంజయ్.

▪️చివరిగా బండి సంజయ్ ఫోన్ సిద్దిపేటలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.

Komatireddy: కొత్త పార్టీ పెడుతున్నారా?.. ఎంపీ కోమటిరెడ్డి క్లారిటీ

దిల్లీ: తాను కొత్త పార్టీ పెడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు..

కార్యకర్తలను అయోమయానికి గురిచేసేలా కొందరు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీని తాను వీడే ప్రసక్తే లేదని చెప్పారు. దిల్లీలో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

పలువురు కేంద్రమంత్రులను కలిసినప్పటికీ అది అభివృద్ధి కార్యక్రమాల కోసమేనని కోమటిరెడ్డి చెప్పారు చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచారం చేయడం తగదన్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆదేశిస్తే మళ్లీ ఎమ్మెల్యే, ఎంపీ.. దేనికి పోటీ చేయమంటే దానికి పోటీ చేస్తానని చెప్పారు. తనకు పార్టీ మారే ఉద్దేశముంటే పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వకపోయినపుడే మారే వాడినన్నారు. నిరాధార వార్తలతో కాంగ్రెస్‌ కార్యకర్తలను గందరగోళానికి గురిచేయొద్దని కోమటిరెడ్డి కోరారు.

రాజకీయ చదరంగంలో పదవ తరగతి విద్యార్థులను పావులుగా చేయకండి

•"ఆబాద్" పార్టీ రాష్ట్ర అధ్యక్షులు హసన్ షేక్

10 సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి చదివి తొలిసారిగా పబ్లిక్ పరీక్షలు రాస్తున్న పదవ తరగతి విద్యార్థులను రాజకీయ చదరంగంలో పావులుగా ఉపయోగించుకోరాదని ఇది ఎంత మాత్రం సమంజసం కాదని దీనిని ఎవరు కూడా సమర్థించరని "ఆబాద్" పార్టీ రాష్ట్ర అధ్యక్షులు హసన్ షేక్ అన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలు తెలుగు, హిందీ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి అని జరుగుతున్న తతంగం అంతా ఇంతా కాదు ఈ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం విద్యార్థులను, వారి కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తుంది. రాజకీయ ఆధిపత్యం కోసం కాకుండా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరీక్షలకు సంబంధించి ఏదైనా సమాచారం బయటకు వచ్చింది అంటే వెంటనే ఆ శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారులకు గాని లేదా పోలీసు అధికారులకు గాని సమాచారం అందించి అనర్థం జరుగకుండా ఆపాలని అంతే కాని సోషల్ మీడియాలో అవసరానికంటే ఎక్కువ ప్రచారం చేయడం వల్ల అటు తాత్కాలికంగా ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొన్నా అంతిమంగా దాని ప్రభావం విద్యార్థులకు మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తోంది ఇది మనం అందరం గుర్తించి పరీక్షల సక్రమ నిర్వహణకు ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేద్దాం.

విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయుల పైనే ఉంటుంది. పరీక్షా కేంద్రాలలో పర్యవేక్షకులు, ఇన్విజిలేటర్లుగా వ్యవహరించే ఉపాధ్యాయులు నిబద్ధతతో వ్యవహరించాలని" ఆబాద్ పార్టీ" రాష్ట్ర అధ్యక్షులు హసన్ షేక్ పిలుపునిచ్చారు, ఒకరో ఇద్దరో తెలిసో, తెలియకో అమాయకంగా అనుకోకుండా అనైతిక పద్ధతులకు పాల్పడితే మొత్తం ఉపాధ్యాయులు ఆ నిందను మోయాల్సి వస్తుంది. కనుక ఎస్ ఎస్ సి పరీక్షల్లో ఏ విధమైన అక్రమాలకు ఆస్కారం లేకుండా ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. తద్వారా మాత్రమే భావిభారత పౌరులుగా పదవ తరగతి విద్యార్థులను సైతం అందించినవారం అవుతామని "ఆబాద్" పార్టీ రాష్ట్ర అధ్యక్షులు హసన్ షేక్ కోరారు

జనగామలో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై దంపతులు..

•ఉదయం బాత్రూంలో ఉరేసుకున్న ఎస్సై భార్య

•కాసేపటికే గదిలోకి వెళ్లి సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్న ఎస్సై

జనగామ జిల్లాలో ఈరోజు ఉదయం ఎస్సై దంపతుల ఆత్మహత్య కలకలం రేపింది. ఎస్సై శ్రీనివాస్ భార్య ఉదయం ఉరి వేసుకుని చనిపోయింది. భార్య మరణంతో కన్నీరుమున్నీరైన ఎస్సై.. ఆ తర్వాత ఇంట్లోనే సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయాడు. గంటల వ్యవధిలో భార్యాభర్తలు ఇరువురూ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి ఎస్సై శ్రీనివాస్, ఆయన భార్య స్వరూపల మధ్య గొడవ జరిగింది. గురువారం ఉదయం స్వరూప బాత్రూంలో ఉరి వేసుకుని చనిపోయింది. భార్య ఆత్మహత్యతో శ్రీనివాస్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. భార్య మృతదేహం చూసి కన్నీరుమున్నీరయ్యారు. 'ఎంత పనిచేశావు స్వరూపా' అంటూ శ్రీనివాస్ గుండెలవిసేలా రోదించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

ఏడుస్తున్న శ్రీనివాస్ ను బంధువులు, స్నేహితులు ఓదార్చుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. శ్రీనివాస్ నుదుట గాయం అయినట్లు కనిపిస్తోంది. అయితే, ఆ తర్వాత కాసేపటికి మరో గదిలోకి వెళ్లిన శ్రీనివాస్.. తన సర్వీస్ రివాల్వర్ తో నుదుటిపై కాల్చుకుని చనిపోయాడు. కాగా, గంటల వ్యవధిలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడంపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్, స్వరూప దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పారు. కాగా, ఎస్సై దంపతుల ఆత్మహత్యలపై దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు..

ఎలికట్టే గ్రామంలో ఘనంగా బీజేపీ పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం

•బూత్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి సందీప్ ఆధ్వర్యంలో

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం ఎలికట్టే గ్రామంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి సందీప్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ 43వ, ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్య అతిధిగా నల్లగొండ జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు గారు పాల్గొని పార్టీ జెండాకు కొబ్బరికాయలు కొట్టి జెండా ఆవిష్కరించి అరటి పళ్ళు పంచడం జరిగింది.

అనంతరం పల్లపు బుద్ధుడు మాట్లాడుతూ బిజెపి పార్టీ మహా నాయకుల ఆత్మబలిదానాలతో వెలసిన పార్టీ ఇద్దరు వ్యక్తులతో మొదలుకొని నేడు ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వాలు నమోదైన పార్టీగా వెలిసింది బిజెపి కార్యకర్తలు సిద్ధాంతంతో ఒక్కొక్క సైనికుడై పోరాడుతున్నారని తెలిపారు. 

అదే విధంగా ఈరోజు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ రాక్షస పాలన అవినీతి పాలన దొర పాలన అంతమొందించాలంటే ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కంకణబద్ధులై పని చేయాలన్నారు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టులను మీడియాను ఇబ్బందులకు గురి చేస్తూ వారి గొంతు నొక్కేస్తూ వాస్తవాలు బయటికి రాకుండా బెదిరింపు చర్యలకు పాల్పడుతూ ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారిని అరెస్టు చేసినందుకు బిఆర్ఎస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తెలంగాణ ప్రజల కూడా బిఆర్ఎస్ పార్టీని రానున్న ఎన్నికల్లో కూకటి వేళ్ళతో పీకి పడేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో గొలనుకొండ మదన్ మోహన్, దుబ్బాక నవీన్ రెడ్డి, చెరుకుపల్లి నాగరాజు, సోమనబోయిన విగ్నేష్, గుణగంటి రాఘవేంద్ర, ఉయ్యాల సుమంత్, కొండ రమేష్ లింగస్వామి రాజు పవన్ తదితరలు పాల్గొన్నారు.

Renu Desai: కొందరు మన జీవితంలోకి అనుకోకుండా వస్తారు..: రేణూ దేశాయ్‌

హైదరాబాద్‌: 'బద్రి', 'జాని' లాంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారికి ఎంతో చేరువయ్యారు నటి రేణూ దేశాయ్‌ (Renu Desai)..

ఎప్పుడూ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటూ తన సినిమా విషయాలను, వ్యక్తిగత సమాచారాన్ని అభిమానుతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా రేణూ దేశాయ్‌ ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్ట్‌ వైరలవుతోంది. విమానంలో ప్రయాణిస్తున్న వీడియో పెట్టిన ఆమె అందమైన నోట్‌ను రాశారు..

''కొంతమంది మన జీవితంలోకి అనుకోకుండా వస్తారు. వాళ్ల పరిచయం మండు వేసవిలో చల్ల గాలిలా మనసుకు ఊరటనిస్తుంది. వాళ్ల చూపులు నేరుగా మన హృదయంతో మాట్లాడతాయి. అది ఒక అందమైన భాష. మనం వాళ్లతో కొన్ని గంటల సమయం గడిపినప్పటికీ.. వాళ్ల ప్రభావం మనపై జీవితాంతం ఉంటుంది. అలాంటి పరిచయాల్లో కొన్ని మనల్ని బాధపెడతాయి కూడా. వాళ్లు మన జీవితానికి పరిపూర్ణతను ఇస్తారు. మన కన్నీళ్లను తుడిచి.. మన జీవితాల్లో వెలుగును నింపుతారు. మనల్ని నవ్విస్తుంటారు'' అని రేణూ దేశాయ్‌ తన పోస్టులో పేర్కొన్నారు. ఇటీవల అకీరాతో కలిసి ఆమె ప్రయాణిస్తోన్న వీడియో కూడా నెట్టింట సందడి చేసింది. ఇక కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్న రేణూ దేశాయ్ త్వరలోనే వెండితెరకు రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. 18 ఏళ్ల విరామం తర్వాత రవితేజ (Raviteja) హీరోగా తెరకెక్కుతోన్న 'టైగర్‌ నాగేశ్వరరావు' (Tiger Nageswara Rao)చిత్రంలో ఆమె నటిస్తున్నారు. హేమలతా లవణం అనే స్ఫూర్తిదాయకమైన పాత్రలో రేణు కనిపించనున్నారు.