/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Atchannaidu: 'సీఎంకు కర్రకాల్చి వాతపెట్టేలా పట్టభద్రుల తీర్పు' Yadagiri Goud
Atchannaidu: 'సీఎంకు కర్రకాల్చి వాతపెట్టేలా పట్టభద్రుల తీర్పు'

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి (AP CM YS Jaganmoha Reddy) కి కర్రకాల్చి వాతపెట్టేలా పట్టభద్రుల తీర్పు ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (TDP Leader Atchannaidu) అన్నారు..

శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజల తిరగబడితే ఫలితం ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి (AP CM) కి ప్రత్యక్షంగా కనిపిస్తోందన్నారు. ప్రజాస్వామ్యo సిగ్గుపడేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరిగినా ప్రజలు తమ పక్షానే నిలిచారన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులని భావించి మూడు రాజధానులంటూ మోసాగించే యత్నం చేశారని మండిపడ్డారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఓడిపోతే మూడు రాజధానులకు ప్రజలు వ్యతిరేకంగా అనే భావన వ్యక్తమవుతుందని వైసీపీ నేతలే ప్రచారం చేశారన్నారు..

అభివృద్దే తమ నినాదం అని ఉత్తరాంధ్ర ప్రజలు చాటి చెప్పారని అన్నారు. విశాఖలో రూ.40 వేల కోట్ల భూములను వైసీపీ కొల్లగొట్టిందని తాము చూపిన ఆధారాలు ప్రజలు నమ్మి ఓటు వేశారని తెలిపారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

అసంతృప్తి లో ఉన్న చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేల (YCP MLAs) కు తాజా పట్టభద్రుల ఫలితాలు చూసి అంతరాత్మప్రభోదానుసారం ఓటేయబోతున్నారని చెప్పారు. రేపు జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఈ పట్టభద్రుల ఎన్నికలు సెమీఫైనల్‌గా భావిస్తున్నామన్నారు. రేపు పులివెందుల కూడా గెలవబోతున్నామని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు..

అరెస్ట్ చేయవద్దని చెప్పలేం: వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు..

హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనపై సీబీఐ తవ్ర చర్యలు తీసుకోవద్దని హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ వివేకానందరెడ్డి..

ఈ పిటిషన్ ను హైకోర్టు శుక్రవారంనాడు తోసిపుచ్చింది. వైఎస్ అవినాష్ రెడ్డి మధ్యంతర పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది.

అవినాష్ రెడ్డిని విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డు చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది. అవినాష్ రెడ్డిని విచారించే ప్రాంతానికి న్యాయవాదిని అనుమతించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.

అవినాష్ రెడ్డి తదుపరి విచారణపై స్టే కూడా ఇవ్వలేమనిహైకోర్టు తేల్చి చెప్పింది..

Heavy Rains: ఐఎండీ తాజా వార్నింగ్‌.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వాతావరణం పూర్తిగా మారిపోయింది.. కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు..

రాబోవు మూడు రోజుల రాష్ట్రంలో వాతావరణం ఎలా ఉండబోతోందనే వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది..

ఇక, శనివారం రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందని..

ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.. ఇక, ఆదివారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ ఓ ప్రటనలో పేర్కొన్నారు..

టి.ఎస్.పి.ఎస్.సి పేపర్ లీకేజీ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలి.

- బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్.

తెలంగాణ రాష్ట్రంలో టీ.ఎస్.పి.ఎస్.సి. నిర్వహిస్తున్న వివిధ పోటీ పరీక్షల ప్రశ్నా పత్రాల లీకేజీ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే సమగ్ర విచారణ జరిపి, కారకులను కఠినంగా శిక్షించాలని బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం బీసీ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో టీ.ఎస్.పి.ఎస్.సి ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ పోటీపరీక్షల పేపర్ లీకేజీ ఘటనలను నిరసిస్తూ నల్గొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన వ్యక్తం చేసిన అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థి, నిరుద్యోగులు టీ.ఎస్.పి.ఎస్.సి విడుదల చేసే పలు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి గత కొన్ని

సంవత్సరాలుగా అహర్నిశలు కష్టపడి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతుంటే పేపర్ లీకేజీ ఘటనలు చోటు చేసుకోవడం చాలా విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలోని వివిధ జిల్లా కేంద్రాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ వర్గాల విద్యార్థులు రేయింబవళ్లు ఒక్క పూట భోజనం చేస్తూ, అనేక ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొని కష్టపడి ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు అన్యాయం చేయాలని చూసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టీ.ఎస్.పి.ఎస్.సి పేపర్ లీకేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సిట్టింగ్ జడ్జి చే సమగ్ర విచారణ జరిపించి ఘటనకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహించి టి ఎస్ పి ఎస్ సి చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

విద్యార్థి, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న టీ.ఎస్.పి.ఎస్.సి. బోర్డును తక్షణమే ప్రక్షాళన చేయాలని అన్నారు. పేపర్ లీకేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, విద్యార్థి నిరుద్యోగుల జీవితాలకు భరోసా కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో టీ.ఎస్.పి.ఎస్.సి. కార్యాలయాన్ని పెద్ద ఎత్తున ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, మారోజు రాజ్ కుమార్, యలిజాల రమేష్, సాయి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

టి.ఎస్.పి.ఎసి నిర్వహించిన అన్ని పరీక్షలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి..

•తెలంగాణ విద్యావంతుల వేదిక డిమాండ్

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన అన్ని పరీక్షలకు సంబంధించి సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ విద్యావంతుల వేదిక డిమాండ్ చేస్తుంది.

తెలంగాణ వస్తే అవినీతికి,అక్రమాలకు, లంచగొండితనానికి తావు ఉండదని అంతా పారదర్శకంగా జరుగుతుందని తెలంగాణ సమాజం భావించింది.

కానీ అన్ని డిపార్ట్మెంట్లో అవినీతి పేర్కొనపోయిందని లంచగొండితనం విలాయ తాండవం చేస్తుందని స్పష్టంగా అర్థమవుతుందన్నారు.

పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం యొక్క నియంత్రణ కొరవడినట్లు స్పష్టంగా కనబడుతుందన్నారు అందుకు నేడు బయటపడిన భాగోతమే నిదర్శనం అన్నారు.ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన రంగం లోకి దిగి విచారణ ను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.

H3N2 Virus: డేంజర్ బెల్స్.. తెలుగు రాష్ట్రాల్లో వ్యాపిస్తున్న వైరస్

దేశంలో వైరస్ హెచ్3ఎన్2 వేగంగా వ్యాపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో ఈ వైరస్ కేసులు నమోదవుతున్నాయి.

తాజాగా హెచ్3ఎన్2 తెలుగు రాష్ట్రాలకు పాకింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ఐసీఎమ్ఆర్ అప్రమత్తం చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు జరుగుతుండడం, వైద్యం కోసం తెలుగు రాష్ట్రాలకు క్యూకడుతున్న విదేశీయులు ఊపందుకున్న పర్యాటకం వైరసి.హెచ్3ఎన్2 వైరస్ వేగంగా వ్యాపించేందుకుకారణమవుతున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

ప్రజలు మాస్కులు వాడటం లేదని కూడా వెల్లడించాయి.

కరోనా కేసులు తగ్గిన తర్వాత ఇప్పుడు భారత్ లో హెచ్3ఎన్2 రకం వైరస్ బారిన పడేవారి సంఖ్య ఎక్కువైంది.

సాధారణ జలుబు, ఫ్లూ జ్వరంలాగే దీన్ని కూడా లైట్ తీసుకున్నారు.

అయితే, ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరస్ విజృంభిస్తోంది.

మరణాల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది.

Chandrababu: ఎన్నికలు అపహాస్యమవుతున్నా చర్యలు తీసుకోరా?: చంద్రబాబు

అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) అపహాస్యం అవుతుంటే అధికారులు చర్యలకు దిగకపోవడం దారుణమని తెదేపా(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యనేతలతో ఆయన చర్చించారు. పోలింగ్‌లో అక్రమాలు, వైకాపా దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులను పార్టీ నేతలు అధినేతకు వివరించారు.

నేతలు తన దృష్టికి తీసుకొచ్చిన అంశాల నేపథ్యంలో వైఎస్సార్‌, తిరుపతి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో చోటుచేసుకున్న అక్రమాలు, ఉదయం నుంచి జరిగిన ఘటనలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు, ప్రత్యేక వాహనాల్లో ప్రజలను తరలించి దొంగ ఓట్లు వేయిస్తున్నా యంత్రాంగం మౌనంగా ఉందని ఆయన ఆరోపించారు.

పట్టభద్రులు ఓటు వేయాల్సిన ఈ ఎన్నికల్లో అనర్హులు, నిరక్ష్యరాస్యులతో వైకాపా నేతలు బోగస్‌ ఓట్లు వేయిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. దీనిపై రాజకీయపక్షాలు చేసే ఫిర్యాదులను ఎన్నికల అధికారులు సీరియస్‌గా తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. తిరుపతిలో బోగస్‌ ఓట్లపై అభ్యంతరాలు తెలిపిన తెదేపా నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమన్నారు. మరోవైపు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ ప్రకాశం జిల్లా ఎస్పీకి చంద్రబాబు ఫిర్యాదు చేశారు.

ఫేక్ డాక్టర్ ముసుగు లో క్షుద్ర పూజలు: ఇద్దరి అరెస్ట్

వరంగల్ : మంత్రాల నెపంతో, చేతబడులను క్షుద్రపూజలతో తగ్గిస్తానని అమాయక పేద ప్రజలను మానసికంగా వేధిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు మంత్రగాళ్లను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు హనమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఏం. ఏ బారి, సెంట్రల్ జోన్ డీ సి పి గారు ఈ మేరకు వివరాలు తెలిపారు. హన్మకొండ ఠాణా పరిధిలోని నయీంనగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఖదీర్ అహ్మద్ (53) మరియు అతని అన్న కుమారుడు సయ్యద్ షబ్బీర్ అహ్మెద్ (47) ఇద్దరు కలిసి ఫారహీన పేరిట ఆసుపత్రి ప్రారంబించి, ఆసుపత్రి ముసుగులో క్షుద్రపూజలకు పాల్పడుతున్నారు.

టాస్క్ ఫోర్స్ పోలీసులకి వచ్చిన అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఏం. జితేందర్ రెడ్డి, టాస్క్ఫోర్స్ , ఏ సి పి గారి ఆద్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందాలు మరియు వైద్యశాఖ సిబ్బంది తో ఫారహీన ఆసుపత్రి పై ఈ రోజు 13.03.2023 ఉదయం దాడులు చేసి, ఫేక్ డాక్టర్ ముసుగు లో క్షుద్రపూజలు చేసి చేతబడి చేసినవారికి తగ్గిస్తామని , సంతానం లేని వారికి సంతానం కలిగేలా చేస్తామని, ఆరోగ్య, ఉద్యోగం, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని స్థానికులతో పాటు దూర ప్రాంతాల ములుగు, కరీంనగర్, జమ్మికుంట, కొంకపాక, అదిలాబాద్ మరియు ఇతర గ్రామాల నుంచి వచ్చే పేదలను మోసం చేస్తున్న సయ్యద్ ఖదీర్ అహ్మద్ (53) మరియు అతని అన్న కుమారుడు సయ్యద్ షబ్బీర్ అహ్మెద్ (47) అదుపులోకి తీసుకొని విచారించారు.

పోలీసు విచారణలో విస్తుపోయే నిజాలు :

వీరు ఎక్కవగా పౌర్ణమి, అమావాస్య లలో క్షుద్రపూజాలు చేసి, తన దగ్గరికి వచ్చిన వారికి వారి యొక్క రోగాలను నయం చేసే నెపం తో క్షుద్రపూజాలు చేసి, వారిని నమ్మించి అదిక మొత్తం లో డబ్బులు వసూలు చేశారు. సయ్యద్ ఖాదిర్ అహ్మెద్ గతంలో కరీంనగర్ లోని ఒక డాక్టర్ వద్ద సహాయకునిగా కొంత కాలం పనిచేసి అక్కడ వైద్యం ఏ విధంగా చేయాలో నేర్చుకొని , తన తండ్రి ఖరిముళ్ల ఖాద్రి గతంలో పూజలు చేసి తాయత్తులు కట్టేవాడు. ఈ అనుబావం తో అతను హనమకొండ లోని నయీంనగర్ లోని కె యు సి క్రాస్ రోడ్డు వద్ద గత 35 సం.. ల నుండి తన స్వంత భవనం లో ఫారహీన క్లినిక్ పేరిట నిబంధనలకు విరుద్దంగా ఎలాంటి అనుమతి మరియు ల్యాబూ పత్రాలు లేకుండా ఒక ఆసుపత్రి ఏర్పాటు చేసుకొని తన వద్దకు వచ్చిన రోగులకు వారి పై గిట్టని వారు చేతబడులు చేశారని, దయ్యం పట్టినధి అని, నర దృష్టి ఉంది అని, మీలో దోషాలు ఉండడం వల్ల సంతనాలు కలుగడం లేదని , ఉద్యోగాలు రావడం లేదని , కుటుంబ తగాదాలు పరిష్కారం కోసం వారికి లేని పోనీ భయలును కలిగించి క్షుద్రపూజాలు చేసి వాటిని పరిష్కరిస్తానని ఒక్కొక్కరి దగ్గరి నుండి లక్ష నుండి లక్ష యాభై వేల రూపాయలను వసూలు చేస్తున్నారు. కొంతమంది దీర్గ కాలం గాట్రీట్మెంట్ ఇస్తూ డబ్బులు దోచుకోవడం చేస్తున్నాడు. కూడా వారి యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటానికి వారికి ఆలోపతి మందులు మంత్రించి ఇస్తున్నట్లు ఇచ్చి అవి వాడిన తరువాత రోగం నయం అయితే క్షుద్రపూజాలు వలనే చేయడం వల్లనే తగ్గినధి అని నమ్మిస్తున్నారు. ఇతను హన్మకొండ లోనే కాకుండా హైదరాబాద్ లో మరియు కొంత మంది రోగుల స్థితి ని బట్టి వారి యొక్క స్వస్థలకి వెళ్ళి క్షుద్రపూజాలు నిర్వహిష్టడు. ఇతనికి ఇట్టి క్షుద్రపూజాలు కు సహాయకులు గా ఉన్న సయ్యద్ షబ్బీర్ అహ్మెద్ (46) తండ్రి పేరు నూర్ నివాసం ఉప్పల్, హైదరాబాద్ అదుపులోకి తీసుకొనినది. ఇట్టి క్షుద్రపూజలకి సహకరించిన యాకూబ్ బాబా మరియు అతని భార్య సమరీన్, ఏం. డీ ఇమ్రాన్ వారు పరారీలో ఉన్నారు. సయ్యద్ ఖదీర్ అహ్మెద్ తండ్రి పేరు ఖరిముళ్ల ఖాద్రి, 53 సం.. లు, ముస్లిం, ఫేక్ డాక్టర్ నివాసం 5-11-509, నియర్ కె యు సి, నయీంనగర్. పై గతం లో గుప్తా నిదుల తవ్వకం పై ములుగు ఘనపూర్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్. నెంబర్ 30/2017 U/s 447,427,420 r/w 34 IPC , 20 ITTA Ac t. .

వీరి వద్ద నుంచి పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. క్షుద్రపూజల పేరుతో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, రౌడీ షీట్ తోపాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డిసిపి హెచ్చరించారు.

అరెస్ట్ అయిన వారు : 02

1. సయ్యద్ ఖదీర్ అహ్మెద్ తండ్రి పేరు ఖరిముళ్ల ఖాద్రి, 53 సం.. లు, ముస్లిం, ఫేక్ డాక్టర్ నివాసం

5-11-509, నియర్ కె యు సి,

2. సయ్యద్ షబ్బీర్ అహ్మెద్ (47) నివాసం హబ్సిగూడ హైదరాబాద్

పరారీ లో ఉన్నవారు : 03

1.యాకూబ్ బాబా మరియు అతని 2.భార్య సమరీన్, 3.ఏం. డీ ఇమ్రాన్

స్వాదిన పరుచుకున్న వస్తువులు:

1. ఆలోపతి మందులు

2. క్షుద్రపూజ సామగ్రి-2.

3. ల్యాబ్ టెస్ట్ సామగ్రి.

4. చరవాణి-01

5. తవేర వాహనం. 01

6. పేషెంట్ రిజిస్టర్ : 01 మరియు కరపత్రం

7. నగదు: 3,00,000/-

వీరిని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన టాస్క్ఫోర్స్ ఏ సి పి ఏం. జితేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావ్, ఎస్సై లు నిస్సార్ పాషా, లవన్ కుమార్, ఏ ఏ వో సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుల్ స్వర్ణలతా మరియు కానిస్టేబుల్ బిక్షపతి, రాజేష్, రాజు, శ్రీనివాస్, శ్రావణ కుమార్, నాగరాజు, నవీన్ లను ఆబినందిచారు.

మోసం చేసిన ప్రియుడు.. సలసల కాగే నూనెతో ప్రియురాలు దాడి

ఇప్పటివరకూ తమ ప్రేమని అంగీకరించలేదనో, లేక మోసం చేశారనో అమ్మాయిలపై అబ్బాయిలు యాసిడ్ దాడి చేయడమో, ఇతర అఘాయిత్యాలకు పాల్పడటమో చూశాం. కానీ.. తాజాగా అందుకు భిన్నంగా ఓ అబ్బాయిపై ఒక అమ్మాయి ఎటాక్ చేసిన ఘటన వెలుగు చూసింది. తనని మోసం చేశాడన్న కోపంతో.. తన ప్రియుడిపై ఓ యువతి సలసల కాగే నూనె పోసింది. దీంతో.. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. చెన్నైలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

చెన్నై ఈరోడ్‌కి చెందిన మీనాదేవి, కార్తి రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. అయితే.. కొంతకాలం నుంచి కార్తిలో మార్పు రావడాన్ని మీనా గమనించింది. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడల్లా.. అతడు మాట దాటవేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే వేరే అమ్మాయితో తిరుగుతున్నాడనే విషయం మీనాదేవికి తెలిసింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి.

చివరికి తాను మోసపోయానని తెలుసుకున్న మీనాదేవి.. ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఓ పథకం రచించింది. ప్లాన్ ప్రకారం.. శనివారం మాట్లాడాలని ఉందని కార్తిని తన రూమ్‌కి పిలిచింది. ప్రియురాలి పిలుపు మేరకు కార్తి ఆమె రూమ్‌కి వెళ్లాడు. అప్పటికే అతనిపై దాడి చేసేందుకు ఆమె నూనెని వేడి చేసి పెట్టింది. ప్రియుడు రూమ్‌కి రాగానే.. అదును చూసి, అతనిపై సలసల కాగే ఆ నూనెని పోసేసింది. అనంతరం ‘‘ఇప్పుడు నిన్ను ఎవరు ప్రేమిస్తారో నేను చూస్తా’’ అంటూ గట్టిగా అరిచింది.

ఈ ఘటనలో కార్తికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖం, చేతులు కాలిపోయాయి. సహాయం కోసం అతడు కేకలు వేయగా.. ఇరుగుపొరుగు వారు మీనా రూమ్ వద్దకు వచ్చారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న కార్తిని చూసి.. అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కార్తి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో.. మీనా దేవిని పోలీసులు అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నారు. బాధితుడు కార్తి.. పెరుందురైలోని ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. కార్తి, మీనాదేవి దగ్గరి బంధువులే అవుతారు. ఆ బంధుత్వంతోనే ఇద్దరికి పరిచయం ఏర్పడటం, అది ప్రేమగా మారడం జరిగింది. అయితే.. సుఖాంతంగా ముగుస్తుందని అనుకున్న ఈ ప్రేమకథ, కార్తి మోసం చేయడంతో విషాదాంతంగా మారింది.

గుంటూరు..పేద కాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

రెయిన్ ట్రీ పార్క్ వద్ద ఉన్న ఓ అపార్ట్మెంట్ లో గుట్టు చప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్ నడుస్తున్న వైనం

బెట్టింగ్ కి పాల్పడుతున్న ఆరుగురు అరెస్ట్ , వారి వద్ద నుంచి 4.30లక్షలు 4ల్యాప్ టాప్స్,బెట్టింగ్ కి వాడే పరికరాలు స్వాధీనం

బెట్టింగ్ కి వాడే "కి ప్యాడ్"సెల్ ఫోన్లు 29 స్వాధీనం

బెట్టింగ్ పై విచారణ చేస్తున్న పోలీసులు