/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz పతంగ్ కారెక్కుతుందా? ‘చేతి’కి చిక్కుతుందా?? Yadagiri Goud
పతంగ్ కారెక్కుతుందా? ‘చేతి’కి చిక్కుతుందా??

అసెంబ్లీ ఎన్నికలు మరో ఎనిమిది నెలల్లో జరగనున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మజ్లిస్ పార్టీ ఇప్పుడు చర్చోపచర్చలకు కేంద్ర బిందువైంది. అసెంబ్లీలో ‘నువ్వా-నేనా’ అన్నట్లు మంత్రి కేటీఆర్, మజ్లిస్ శాసన సభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదాలు జరిగిన నేపథ్యంలో.. అధికార బీఆర్ఎస్‌కు, మజ్లిస్‌కు మధ్య గ్యాప్ పెరిగిందనే వాదనలు తెరపైకి వచ్చాయి. ఆ వెంటనే.. కాంగ్రెస్ ముఖ్య నేత అక్బరుద్దీన్‌ను కలవడం.. సుదీర్ఘంగా భేటీ అవ్వడంతో పతంగ్(మజ్లిస్ పార్టీ గుర్తు) కాంగ్రెస్‌తో జతకట్టే అవకాశాలపై చర్చలు జరిగాయి. హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్, అక్బరుద్దీన్ పక్కపక్కనే కూర్చొని, పిచ్చాపాటి మాట్లాడడం.. పాతనగర అభివృద్ధిపై సమీక్ష నిర్వహించడం మళ్లీ చర్చనీయాంశమైంది.

మజ్లిస్ వ్యూహమే సపరేటు..!

మజ్లిస్ పార్టీ రాజకీయ ప్రస్తానం 60లలో అప్పటి మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్(ఎంసీహెచ్) ఎన్నికలతో ప్రారంభమైంది. ఆ ఎన్నికల్లో అప్పటి పత్తర్‌గట్టీ డివిజన్ నుంచి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ(సాలార్) పోటీ చేసి, విజయం సాధించారు. ఆ తర్వాత.. క్రమంగా పాతనగరంపై పట్టు సాధించారు. చార్మినార్, బహదూర్‌పుర, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర నియోజకవర్గాలను కంచుకోటగా మార్చుకున్నారు. పాతనగరం పరిధిలోని మలక్‌పేట్, కార్వాన్‌లు అప్పట్లో బీజేపీ కంచుకోటలు కాగా.. ఆసిఫ్‌నగర్(ప్రస్తుతం నాంపల్లి)పై కాంగ్రెస్ పట్టు ఉండేది. మజ్లిస్ తాను టార్గెట్‌గా చేసుకున్న నియోజకవర్గాల్లో తొలుత క్యాడర్‌ను పెంచుకుంటుంది. తర్వాత ఓటుబ్యాంకును అభవృద్ధి చేసుకుంటుంది. ఆపై స్థానిక సంస్థల ఎన్నికల్లో హవా కొనసాగిస్తుంది. ఓటుబ్యాంకు, ఓట్ల శాతాన్ని బేరీజు వేసుకుని.. అవసరమైన చోట సెంటిమెంట్‌ను అడ్డంపెట్టుకుని, అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతుంది.

అలా.. 1999లో కార్వాన్‌ను, 2004లో ఆసిఫ్‌నగర్(ప్రస్తుతం నాంపల్లి)ను దక్కించుకుంది. అప్పట్లో ఆసిఫ్‌నగర్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు టికెట్ దొరక్క.. సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలని అధిష్ఠానం ఆదేశాలతో ఆయన పార్టీకి రాజీనామా చేసి, టీడీపీ టికెట్‌పై గెలిచారు. ఆ తర్వాతి పరిణామాలతో మళ్లీ కాంగ్రెస్‌లో చేరి, తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీన్ని అవకాశంగా మలచుకున్న మజ్లిస్.. వివాద రహితుడైన నవాబ్ మౌజంఖాన్‌ను బరిలోకి దింపి, ఆ స్థానంలో పాగా వేసింది. అప్పటి నుంచి.. ఇప్పటి వరకు మజ్లిస్‌కు హైదరాబాద్ పార్లమెంటరీ సెగ్మెంట్ పరిధిలోని ఈ ఏడు నియోజకవర్గాలు కంచుకోటల్లా ఉన్నాయి. ఇదే క్రమంలో రెండేళ్ల క్రితం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో.. ఇతర ప్రాంతాల్లోనూ పాగా వేసింది. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లలో తమ బలాబలాలు, ఓటుబ్యాంకును బేరీజు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే.. అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఘంటాపథంగా 50 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించడమే కాకుండా.. 15 స్థానాలను గెలుచుకుంటామని తేల్చిచెప్పారు.

మజ్లిస్ మద్దతు కీలకమే!

మజ్లిస్ పార్టీ మద్దతు ప్రధాన పార్టీలకు అవసరమే అని గత ఎన్నికల్లో ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం వరకు కాంగ్రెస్-మజ్లిస్ కలిసే ఎన్నికల బరిలోకి వెళ్లేవి. మజ్లిస్ కంచుకోటల్లో కాంగ్రెస్ నామమాత్రపు పోటీ చేయగా.. ఇతర నియోజకవర్గాల్లోని మజ్లిస్ ఓటుబ్యాంకు కాంగ్రెస్‌కు కలిసి వచ్చేది. కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో మజ్లిస్‌కు-కాంగ్రెస్‌కు మధ్య గ్యాప్ పెరిగింది. రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసిన అక్బరుద్దీన్‌పై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. దీంతో.. 2014లో మజ్లిస్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ సర్కారుకు అండగా నిలవడంతో.. 2018లో ఇరుపార్టీలు అవగాహనతో తమ అభ్యర్థులను నిలబెట్టాయి.

టీఆర్ఎస్‌కు మజ్లిస్ మద్దతు అవసరమా?

2014లో నిజామాబాద్ అర్బన్ స్థానంలో మజ్లిస్ పోటీ చేసి.. 23% ఓట్లను సాధించగా.. బీఆర్ఎస్ అభ్యర్థి 31% ఓట్లను పొందారు. అలా.. రాజేంద్రనగర్‌లో మజ్లిస్ తరఫున పోటీ చేసిన సున్నం రాజమోహన్‌కూ ఓట్ల శాతం ఫర్వాలేదనిపించింది. అప్పట్లో టీడీపీ తరఫున బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్(ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్నారు) విజయం సాధించారు. ఇలా పలు నియోజకవర్గాల్లో మజ్లిస్‌ తనకు ఓటుబ్యాంకు ఉందని నిరూపించుకుంది. పలు స్థానిక సంస్థల్లోనూ మజ్లిస్ ప్రతినిధులున్నారు. ఈ నేపథ్యంలో మూడోసారి అధికారంలోకి రావడమే కాకుండా.. కేంద్రంలో మోదీ సర్కారును గద్దెదింపాలని కంకణబద్ధుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టిపరిస్థితుల్లోనూ మజ్లిస్ దోస్తీని వదులుకోబోరని తెలుస్తోంది. ఆ క్రమంలోనే హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సుల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ మజ్లిస్ నేత అక్బరుద్దీన్‌ను ఆహ్వానించారని, పాతనగర అభివృద్ధిపై అప్పటికప్పుడు సమీక్ష జరిపారని స్పష్టముతోంది.

కాంగ్రెస్‌కూ అవసరమే..!

తెలంగాణను ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి అటు ఏపీలో మొత్తానికి ఖాళీ అయినంతపనైంది. తెలంగాణలో అత్తెసరు సీట్లు వచ్చినా.. ఆ పార్టీ శాసనసభ్యులు చాలా వరకు బీఆర్ఎస్‌లో చేరడంతో.. ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేని పరిస్థితి నెలకొంది. అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఆవేశంగా మాట్లాడడం.. పాతనగరానికి ఏమిచ్చారంటూ ప్రభుత్వాన్ని నిలదీయడంతో.. కాంగ్రెస్ ఆ పార్టీకి దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్బరుద్దీన్‌తో టీపీసీసీ నేత భట్టి విక్రమార్క సుమారు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. అయితే.. ఈ భేటీలో వివరాలేమీ బయటకు రాలేదు. అటు ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’లో ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం.. మజ్లిస్‌తో పొత్తుపై ఎలాంటి చర్చలు జరపలేదని స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ వ్యూహంలో భాగమేనా?

మజ్లిస్‌తో తమకు గ్యాప్ పెరిగిందని బీఆర్ఎస్ తన వ్యూహంలో భాగంగానే క్రియేట్ చేస్తోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణలో అధికారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న బీజేపీ.. హిందుత్వ కార్డుతోనే ఎన్నికల బరిలో దిగుతుందనేది నిర్వివాదాంశం. మజ్లిస్‌తో పొత్తు బూచీని చూపి, బీఆర్ఎస్ ఓటుబ్యాంకులోని హిందువుల ఓట్లను చీల్చే అవకాశాలు లేకపోలేదు. మజ్లిస్‌కు దూరమైతే ఆ పరిస్థితి ఉండదనేది బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. ఇక కాంగ్రెస్‌తో మజ్లిస్ జతకడితే.. అది టీఆర్ఎస్‌కే లబ్ధి చేకూర్చే అవకాశాలున్నట్లు గులాబీ నేతలు భావిస్తున్నారు. 50 స్థానాల్లో పోటీపై ప్రకటన చేసిన మజ్లిస్.. ఆ స్థాయిలోనే స్థానాలను పొత్తులో భాగంగా అడిగే అవకాశాలున్నాయి. ముస్లింలు చాలా వరకు సెక్యులర్ పార్టీ కాంగ్రెస్‌కు మద్దతిస్తారు. అయితే.. మజ్లిస్ బరిలో ఉంటే.. కాంగ్రెస్ ఓటుబ్యాంకు చీలిపోయి, టీఆర్ఎస్‌కు కలిసి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో.. మజ్లిస్-బీఆర్ఎస్‌ల గ్యాప్ గులాబీ సృష్టే అనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరన్నట్లు.. ఎన్నికల నాటికి వ్యూహాలు-ప్రతివ్యూహాలు ఎలా ఉండబోతాయి? పతంగ్ కారెక్కుతుందా? లేక ‘చేతి’కి చిక్కుతుందా? అనేది తేలాలంటే.. ఎన్నికల నోటిఫికేషన్ వరకు వేచిచూడాల్సిందే..!

Lok Sabha: ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయకండి : ఉత్తమ్‌కు స్పీకర్‌ సూచన

దిల్లీ: అదానీ గ్రూప్‌(Adani group) వ్యవహారంపై లోక్‌సభలో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం గౌతం అదానీ(Gautam adani)కి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ తాజాగా నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి(Uttam kumar Reddy) లోక్‌సభ(Lok sabha)లో చేసిన ఆరోపణలపై స్పీకర్‌ ఓం బిర్లా(Om birla) హెచ్చరించారు.

ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దన్నారు. బుధవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుండగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అదానీ వ్యవహారాన్ని ప్రస్తావించారు. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదిక అంశంపై విచారణకు ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్న విషయాన్ని పునరుద్ఘాటించారు. గత 10 రోజుల్లో రూ.10లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ కుప్పకూలిందని.. కేంద్ర ప్రభుత్వం దీనిపై సంయుక్త పార్లమెంటరీ సంఘం(జేపీసీ) ఏర్పాటు చేయాలన్న విపక్షాల డిమాండ్‌కు అంగీకరించాలన్నారు. లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు.

అయితే, కేంద్ర ప్రభుత్వం అదానీకి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఉత్తమ్‌ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్‌ ఓం బిర్లా అభ్యంతరం తెలిపారు.ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయరాదని సూచించారు. ‘‘మీరు వాస్తవాలు, ఆధారాల్లేకుండా మాట్లాడుతున్నారు. సభ మర్యాదను కాపాడేలా నడుచుకోవాలి’’ అని హెచ్చరించారు.

అయితే, దీనిపై స్పందించిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని.. సభకు సమర్పిస్తానని చెప్పారు. దీనిపై స్పందించిన స్పీకర్‌.. ‘‘మనం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చిస్తున్నాం. కానీ మీరు ఒక్క వ్యక్తి గురించే ఇక్కడ మాట్లాడుతున్నారు. బహుశా అదే మీకు ఇష్టం కావొచ్చు. కానీ దేశానికి కాదు’’ అని వ్యాఖ్యానించారు. విమర్శలు, ఆరోపణలు చేయడానికి మధ్య తేడా ఉంటుందన్న ఆయన.. ‘‘మీరు విమర్శించండి.. కానీ మీరు చేసే ఆరోపణలకు ఆధారాలు ఉండాలి’’ అన్నారు. మరోవైపు, నిన్న రాహుల్‌ గాంధీ సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించి మోదీ, అదానీ కలిసి ఉన్న ఫొటోలను ప్రదర్శించగా స్పీకర్‌ తీవ్ర అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే.

చిట్యాల మండలం ఎలికట్టే గ్రామంలో బిజెపి పార్టీ బలోపేతానికి పార్టీ బూత్ స్థాయి కమిటీలు

•దిశా నిర్దేశం చేసిన బిజెపి జిల్లా నాయకులు శక్తి కేంద్రం ఇంచార్జ్ పల్లపు బుద్ధుడు

భారతీయ జనతా పార్టీ గెలుపే లక్ష్యంగా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం ఎలికట్టే గ్రామంలో ఈరోజు బిజెపి జిల్లా నాయకులు శక్తి కేంద్రం ఇంచార్జ్ పల్లపు బుద్ధుడు గారు బిజెపి పార్టీ బలోపేతానికి పార్టీ బూత్ స్థాయి కమిటీలు వేసి దిశా నిర్దేశం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల ఉపాధ్యక్షులు పులుగు శ్రీనివాసులు అధ్యక్షతన ఎలికట్టే గ్రామ 89వ బూత్ కమిటీ అధ్యక్షులుగా చర్లపల్లి లింగస్వామి గారిని, 90వ బూత్ కమిటీ అధ్యక్షులు గా గుడిపాటి సందీప్ గారిని నియమించడం జరిగింది.

ఈ బూత్ కమిటీలను 22 మంది సభ్యులతో పూర్తిస్థాయిగా కమిటీలు వేసి భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అనునిత్యం ప్రజా సేవలో ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలకు దగ్గరగా ఉండాలని ఆయా కాలనీలలో తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకొని వారికి చేదోడువాదాడుగా ఉంటూ

భారతీయ జనతా పార్టీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు తెలియపరుస్తూ వారికి ధైర్యాన్నిస్తూ పార్టీ అండగా ఉంటుందని భరోసానిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పల్లపు బుద్ధుడు గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శవగోని దేవానంద్ గౌడ్, గొలనుకొండ మదన్ మోహన్, అంజయ్య, నరేష్ ,నవీన్, శ్రీను, అనసూర్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక భేటీ - ఆ ఎమ్మెల్యేలకు డేంజర్ బెల్స్..!?

ముఖ్యమంత్రి ఎన్నికల కసరత్తు వేగవంతం చేసారు. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి..పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలను గడప గడపకు ప్రభుత్వం పేరుతో ప్రజల వద్దకు పంపిన సీఎం..త్వరలో తాను ప్రజల మధ్యకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు..

అందులో భాగంగా పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేసారు.

ఇప్పటికే ఎమ్మెల్యేల పని తీరు పైన సీఎం జగన్ క్షేత్ర స్థాయి సర్వే నివేదికలు తెప్పించుకున్నారు. కొంత మంది ఎమ్మెల్యేల పని తీరు పైన ఆగ్రహంగా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో కఠిన నిర్ణయాలకు సీఎం సిద్దమయ్యారు. ఇదే సమయంలో ప్రజల్లో ఎమ్మెల్యేల గ్రాఫ్ పైన ఫోకస్ పెట్టారు. ఈ సమావేశంలో ఆ అంశమే కీలకం కానుంది.

మంత్రులు - ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక భేటీ

ఈ నెల 13న మంత్రులు..ఎమ్మెల్యేలు..పార్టీ సమన్వయకర్తలతో ముఖ్యమంత్రి జగన్ సమావేశం ఏర్పాటు చేసారు. ఇప్పటికే పార్టీ రీజలన్ కో ఆర్డినేటర్లతో సమావేశమైన సీఎం..ఈ సారి మంత్రులు.. ఎమ్మెల్యేల తో మీటింగ్ కు నిర్ణయం తీసుకున్నారు. గత సమావేశంలో ప్రతీ సచివాలయ పరిధిలో కన్వీనర్లు..గృహ సారథుల నియమాకం పై నిర్ణయించినా..ఇప్పటికీ నియామకాలు పూర్తి కాలేదు.

రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంలో వీరి నియామకం పైన సీఎం గట్టిగానే హెచ్చరించారు. ఇప్పుడు ఇదే అంశం పైన మరోసారి ఎమ్మెల్యేలకు స్పష్టత ఇవ్వనున్నారు. అదే సమయంలో గత సమావేశంలో దాదాపు 28 మంది ఎమ్మెల్యేల పని తీరుకు సంబంధించి ముఖ్యమంత్రి సర్వే వివరాలను వెల్లడించారు..ప్రజల్లో గ్రాఫ్ పెరగకపోతే సీట్లు ఇవ్వటం కష్టమని తేల్చి చెప్పారు. పని తీరు మెరుగు పర్చుకోవటానికి వారికి మరో అవకాశం ఇచ్చారు. దీంతో. ఈ సమావేశంలో సీఎం ఏం చెప్పబోతున్నారనేది ఉత్కంఠ పెంచుతోంది..

ఎమ్మెల్యే ప్రోగ్రస్ రిపోర్టులు సిద్దం

వైసీపీ ఎమ్మెల్యేలు...నియోజకవర్గ ఇంఛార్జ్ లకు సంబంధించిన ప్రోగ్రస్ రిపోర్టులు ఐ పాక్ తో పాటుగా మరో రెండు సర్వే సంస్థలు ముఖ్యమంత్రికి నివేదికలు ఇచ్చినట్లు సమాచారం. అందులో ప్రధానంగా ఎమ్మెల్యేలు ప్రజలతో ..పార్టీ కేడర్ తో మమేకం అవుతున్న విధానం.. వారికి ప్రజల్లో ఉన్న ఆదరణ ఆధారంగా మార్కులు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ఈ ప్రత్యక సమావేశంలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల పని తీరు పైన ఫైనల్ వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఎన్నికలకు ఆరు నెలల ముందే టికెట్లు ఖరారు చేస్తామని ఇప్పటికే సీఎం స్పష్టం చేసారు. ప్రతిపక్ష టీడీపీ సిట్టింగ్ లకు సీట్లు ఖరారు చేయటం తో పాటుగా కొత్తగా ఇంఛార్జ్ లను నియమిస్తోంది.

దీంతో..ప్రత్యర్ది పార్టీల వ్యూహాలను గమనిస్తూ..గెలుపే ప్రామాణికంగా నియోజకవర్గాల్లో అభ్యర్దుల ఎంపిక..గెలుపు దిశగా నిర్ణయాలు ఉంటాయని ముఖ్యమంత్రి ఖరా ఖండిగా చెబుతున్నారు. గెలిచే వారికే టికెట్లు అనే సిద్దాంతం మాత్రమే అభ్యర్ధు ఎంపికకు కీలక సూత్రంగా చెబుతున్నారు. ఈ వ్యవహారం పై సీఎం స్పష్టత ఇవ్వనున్నారు..

సీఎంతో సహా నేతలంతా ప్రజల్లోనే..

ఇక..పార్టీ - ప్రభుత్వ వ్యవహారాలను సమన్వయం చేసుకుంటూ నేతలంతా ప్రజల్లోనే ఉండేలా సీఎం జగన్ కార్యాచరణ సిద్దం చేసినట్లు సమాచారం, అందులో భాగంగా ముఖ్యమంత్రి సైతం ఇక రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ పల్లెనిద్రకు నిర్ణయించారని సమాచారం.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తరువాత ఇక సీఎం తో పాటుగా ఎమ్మెల్యేలంతా ప్రజల్లోనే ఉండేలా కొత్త కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేలకు సీట్లు..ఇవ్వలేని వారికి ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చే గుర్తింపు పైన సంకేతాలు ఇస్తున్నారు. దీంతో.. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఏం ప్రకటన చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది..

ఫార్మా పరిశ్రమలో ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

తెలంగాణ: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారం పారిశ్రామికవాడలోని లీ ఫార్మా పరిశ్రమలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవాశాత్తు అగ్ని ప్రమాదం జరిగి పరిశ్రమలో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు.

ఫార్మా కంపెనీల్లో పెద్ద ఎత్తు కెమికల్స్‌ నిలువ ఉండడంతో మంటల దాటికి కెమికల్స్‌ డ్రమ్స్‌ పేలిపోతున్నాయి.

కార్మికులు మంటలు అర్పడానికి ప్రయత్నం చేసినా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో పరిశ్రమ అధికారులు వెంటనే సమాచారం అందించడంతో నాలుగు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్నారు.

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశంలో మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

కేబినెట్‌ నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు.

►కర్నూలు జిల్లా డోన్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బోధనా సిబ్బంది నియామకానికి కేబినెట్‌ ఆమోదం

►ఈ నెల రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సీడీ చెల్లింపునకు కేబినెట్‌ ఆమోదం

►ఈ నెల 28న జగనన్న విద్యాదీవెన చెల్లింపునకు కేబినెట్‌ ఆమోదం

►1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థుల పోస్టుల భర్తీకి ఆమోదం

►డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం

►విశాఖలో టెక్‌ పార్క్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం

►నెల్లూరు బ్యారేజ్‌ను నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి బ్యారేజ్‌గా మారుస్తూ నిర్ణయం

►రామాయపట్నం పోర్టులో 2 క్యాపిటివ్‌ బెర్త్‌ల నిర్మాణానికి ఆమోదం

►లీగల సెల్‌ అథారిటీలో ఖాళీ పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం

►పంప్‌ స్టోరేజ్‌ హైడ్రో ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులకు ఆమోదం

Amaravati: విభజన చట్టం ప్రకారం రాజధానిగా అమరావతిని నోటిఫై చేశారు: కేంద్రం

దిల్లీ: విభజన చట్టం ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌ (Andhra pradesh) రాజధానిగా అమరావతి (Amaravathi)ని 2015లో ఏపీ ప్రభుత్వం నోటిఫై చేసిందని కేంద్రం తెలిపింది..

బుధవారం వైకాపా పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. విభజన చట్టంలోని సెక్షన్‌ 5, 6 ప్రకారం రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు సంబంధించిన విషయంపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని..

ఈ కమిటీ ఇచ్చిన సూచనలు, సలహాలు, నివేదికలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించగా.. దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రాజధానిగా అమరావతినే ఎంపిక చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ క్యాపిటల్‌ రీజినల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని (ఏపీసీఆర్‌డీఏ) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చినట్లుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పార్లమెంట్‌కు వివరించింది.

Breaking: హైస్కూల్లో ఫుడ్ పాయిజన్.. 45 మంది విద్యార్థులకు అస్వస్థత..

హైస్కూల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో 45మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని పార్వతీపురం మన్యం పరిధిలోని కోన హైస్కూల్ లో ఫుడ్ పాయిజన్ అయ్యింది..

ఆ హైస్కూల్ లోని 45మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.

మా భూములు ఆక్రమించుకొని దాడులు చేస్తున్నారు

కూడేరు తహశీల్దార్ కార్యాలయం ధర్నా లో SC,ST JAC సాకే హరి

ఎస్సీ,ఎస్టీల భూములు అన్యాయంగా ఆక్రమించుకొని వారిపైనే దాడులు చేయడమేమిటని ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి మండిపడ్డారు.బుధవారం కూడేరు తహశీల్దార్ కార్యాలయం ముందు ఎస్సీ,ఎస్టీ భూ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేపట్టారు.అనంతరం సాకే హరి మాట్లాడుతూ..దళిత,గిరిజనులకు చెందిన భూములను దౌర్జ్యన్య పరుల నుండి కాపాడాలని కోరారు. పాలకులు మాత్రం పేదలకు భూ పంపిణీ చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్న ఎస్సీ,ఎస్టీలకు మాత్రం తీవ్రమైన అన్యాయం జరిగిందని వాపోయారు.ఎన్నో ఏళ్లుగా భూ సమస్యలు పరిష్కారం లేక ఇబ్బందులు పడుతున్నారు.విడతల వారి భూ పంపిణీలో ఎంత మంది ఎస్సీ,ఎస్టీలకు న్యాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.ఎం ఎం హళ్లిలో 6వ విడుత భూ పంపిణీలో 4దళితులకు భూమిస్తే నేటికి భూమి చూపకపోగా,ఏకంగా అన్ లైన్ తొలగించారని వాపోయారు.

భూ పంపిణీ చేసిన వారే అన్యాయం చేస్తే మాకు దిక్కేవరన్నారు.పేరుక పోయిన భూ సమస్యలకు మార్గం చూపలేరుకాని కొత్తగా భూములు పంచుతామనడం విడ్డూరమన్నారు.తాతాల కాలనుండి సాగులో ఉన్న భూములకు అన్యాయంగా అన్ లైన్ నమోదు చేయించుకోవడం,రికార్డులో తాముంటే దౌర్జ్యాన్యపరులు సాగులోకి వస్తున్నారని వీటిని రెవెన్యూ,పోలీస్ అధికారులు చూచి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు.

అమాయక ఎస్సీ,ఎస్టీల భూములను అక్రమంగా సంబంధం లేని వ్యక్తులు, అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని తెలిపారు.ఎస్సీ,ఎస్టీలకు చెందిన భూములు సాధించు కోవడానికి ఎంతటి పోరాటాలకైనా సిద్ధమన్నారు.ఎస్సీ,ఎస్టీల స్మశాన వాటికలను సైతం కబ్జాలు చేస్తున్నారని ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు లక్ష్మన్న. జే,ఏ,సీ నాయకులు మన్నల శివయ్య.రేకల కుంట రామాంజనేయులు.రామకృష్ణ.మంజునాథ్.ప్రతాప్.చెన్న కేశవ.గణేష్ నాయక్.భూ బాధిత శ్రీరాములు.ముత్యాలప్ప.రమేష్.నారాయణ స్వామి.గంగన్నతదితరులు పాల్గొన్నారు.

పెయిల్ అయినా రాయదుర్గం ప్రభుత్వ కే.టీ.స్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఇవ్వండి

PDSU అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు : మల్లెల ప్రసాద్,

రాయదుర్గం ప్రభుత్వ కేటీఎస్ డిగ్రీ కాలేజీలో గతంలో ఉన్నటువంటి 9 సంవత్సరాల ఫెయిల్ అయిన విద్యార్థుల సమయాన్ని ఇప్పుడు కేవలం 3 సంవత్సరాల్లకే పరిమితం VC గారు దానిని గతంలో తొమ్మిది సంవత్సరాల సమయాన్ని ఎలా ఉంటే అలా కొనసాగించాలని నిరసన తెలియజేయడం జరిగింది.

గతంలో డిగ్రీ అయిపోయి ఫెయిల్ అయిన విద్యార్థిని విద్యార్థులకు ఎగ్జామ్ రాయడానికి 9 సంవత్సరాలు ఉన్నటువంటి సమయాన్ని ఈ సంవత్సరం జనవరిలో 24వ తారీఖు రోజున ఐదు సంవత్సరాలకు కుదిచడం జరిగింది. దాన్ని తర్వాత జనవరి 31 వ తారీఖున మూడు సంవత్సరాలకు

కుదిచడం జరిగింది.

ఈ కుదిoచడం అనేది విద్యార్థిని విద్యార్థులకు గాని సామాజిక మద్యమాల్లో గాని వార్తాపత్రికల్లో గాని ఎక్కడ విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయకుండా అకస్మాత్తుగా ఒకేసారి పది రోజుల్లో 9 సంవత్సరాలు ఉన్నటువంటి ఫెయిల్ అయిన విద్యార్థిని విద్యార్థుల సమయాన్ని మూడు సంవత్సరాలకు కుదించడం చాలా దుర్మార్గం విద్యార్థిని విద్యార్థుల జీవితాలను ఎస్కేయూ VC నాశనం చేస్తున్నాడు, 2014 15 16 17 సంవత్సరాలకు చెందిన గవర్నమెంట్ ప్రైవేట్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు దాదాపు 14 నియోజకవర్గాల్లో కూడా కొన్ని వేలమంది ఉండడం జరుగుతుంది వారందరివి కూడా కేవలం 1సబ్జెక్టు లేదా 2సబ్జెక్టు లు మాత్రమే ఉన్నాయి.వారు అందరి జీవితాలను కూడా లెక్క చేయకుండా ఎవరి ప్రతిపాదనలు కూడా తీసుకోకుండా కనీసం విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి సమాచారం తెలియజేయకుండా కేవలం విద్యార్థి జీవితాలను నాశనం చేయాలనీ SKU VC ఆలోచనతో ప్రవేశపెట్టినటువంటి ఈ 3 సంవత్సరాల కుదింపును 9 సంవత్సరాలుగా యధాతధంగా కొనసాగించాలని PDSU ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘo నుండి డిమాండ్ చేస్తున్నాం.

వేల మంది విద్యార్థుని విద్యార్థులను వారి తల్లిదండ్రులని కలుపుకొని పాదయాత్ర చేపట్టడం గాని చలో ఎస్కేయూ ముట్టడికి పిలుపునిస్తాం వెంటనే మీరు ఏదైతే ఈ మూడు సంవత్సరాలకు కుదించడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా VC గారికి ఎగ్జామ్ కంట్రోల్ గారికి తెలియజేస్తున్నాం, ఫెయిల్ అయిన విద్యార్థుల కు అవకాశం ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.