Andrapradesh

Aug 02 2019, 12:30

ఏపీలోని గ్రామ సచివాలయాల్లో ఏఏ సేవలు అందుతాయంటే...  

రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని రకాల సేవలను వీటి నుంచే అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో గ్రామ సచివాలయాల వ్యవస్థ కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో గ్రామ సచివాలయాల్లో అందే సేవల జాబితా ఇది..

సచివాలయాల్లో అందే సేవలు
పెన్షన్‌లు, పట్టాదారు పాస్‌పుస్తకాలు, రేషన్‌ కార్డులు, విద్యార్థుల ఉపకార వేతనాలు, రైల్వే, ఆర్టీసీ టిక్కెట్ల రిజర్వేషన్‌, జనన మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డులు, పల్స్‌ సర్వే, విద్యుత్‌, టెలిఫోన్‌ బిల్లులు, ఇంటి పన్నుల చెల్లింపు, రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలు, పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు, డ్వాక్రా సంఘాలకు బ్యాంక్‌ల ద్వారా రుణాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్‌), బ్యాంకుల్లో పంట రుణాలు, పంటల బీమా పథకంలో పేరు నమోదు, పాస్‌పోర్ట్‌ దరఖాస్తులు, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు, ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు, ఓటరు గుర్తింపు కార్డులు, బ్యాంక్‌ ఖాతాలు ప్రారంభం, తదితర సేవలు.

Andrapradesh

Aug 02 2019, 12:29

ఏపీ సర్వశిక్షా అభియాన్ గ్రీన్ చానెల్ ద్వారా కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ విడుదల 

ప్రభుత్వ ఆదేశాల మేరకు సమగ్ర శిక్షా సంస్థ ఆధీనంలో పని చేస్తున్న పాఠశాల యాజమాన్య కమిటీలకు, మండల రిసోర్స్, క్లస్టర్ రిసోర్సు కేంద్రాలకు సర్వ శిక్షాభియాన్ ద్వారా నిధులు విడుదల చేసినట్టు ఏపీ పాథశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీనిలో కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ రూ. 9810.00 లక్షలు, మండల కేంద్రాల గ్రాంట్ రూ. 408.00 లక్షలు, క్లస్టర్ కేంద్రాలకు రూ. 847.14 లక్షల రూపాయలు (మొత్తం రూ. 11065.14 లక్షలు) విద్యాసంవత్సరం మొత్తానికి బుధవారం (31.7.19)న 13 జిల్లాల ఎస్ఎస్ఏ ప్రాజెక్టు అధికారుల గ్రీన్ చానెల్ పీడీ ఖాతాలకు జమచేశారు. ఈ నిధులను పాఠశాలల యాజమాన్య కమిటీలకు విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీలు కూడా ఈ సంవత్సరం నుండి పీడీ ఖాతాలు తెరవాల్సి ఉంది. అందుకోసం పాఠశాల యాజమాన్య కమిటీలచే పీడీ ఖాతాలు తెరిపించి తదుపరి ఈ నిధులను వారికి నేరుగా విడుదల చేయాల్సిందిగా జిల్లా ప్రాజెక్టు అధికారులకు ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెంటనే సీఎఫ్ఎంఎస్ హెల్ప్ డెస్క్ ద్వారా గ్రీన్ చానెల్ పీడీ అకౌంట్లు తెరవాల్సిందిగా కోరుతున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.*

Andrapradesh

Aug 02 2019, 12:01

ఇలా చేస్తేనే జగన్‌ది బంద్‌ల ప్రభుత్వమంటారు: సీపీఐ నేత రామకృష్ణ 

అమరావతి: అన్న క్యాంటీన్ల మూసివేత, పోలవరం పనుల నిలిపివేత సరికాదని సీపీఐ నేత రామకృష్ణ పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇలానే చేస్తే జగన్‌‌ది బంద్‌ల ప్రభుత్వమని అంటారని ఎద్దేవా చేశారు. జగన్ వచ్చాక ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారన్నారు. దీంతో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో తీవ్ర స్థాయిలో ఆందోళన నెలకొందన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదని రామకృష్ణ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇసుక.. బంగారం కంటే ఎక్కువగా ఉందన్నారు. నీటి పంపకాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Andrapradesh

Aug 02 2019, 11:58

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల 

తిరుమల: నవంబరు మాసానికి సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తితిదే విడుదల చేసింది. మొత్తం 69,254 టికెట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.టికెట్లను ‌www.tirumala.org వెబ్‌సైట్‌ ద్వారా ఉదయం 10 గంటల నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానం కింద 10,904 సేవా టికెట్లను విడుదల చేసింది. సుప్రభాతం 7549, తోమాల 120, అర్చన 120, అష్టదళ పాదపద్మారాధన 240, నిజపాద దర్శనం కోసం 2875 టికెట్లను విడుదల చేసింది. కరెంటు బుకింగ్‌ కింద 58,350 ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసింది. దీనిలో విశేష పూజ 1,500, కల్యాణోత్సవం 13,300, ఊంజల్‌సేవ 4,200, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం 14,850, సహస్రదీపాలంకరణ కోసం 16,800 టికెట్లు విడుదల చేసింది. మరోవైపు జులైలో శ్రీవారికి రూ.106.28 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని, ఇటీవలి కాలంలో ఇది రికార్డు అని తితిదే ఓ ప్రకటనలో వెల్లడించింది.

Andrapradesh

Aug 02 2019, 11:57

తగ్గనున్న మద్యం దుకాణాల సంఖ్య

ప్రస్తుతం 352 షాపులు ఉండగా అక్టోబరు నుంచి 280 షాపులకు తగ్గించేందుకు కసరత్తు
ఇప్పటికే దొరకని పలు బ్రాండ్లు
గుంటూరు: మద్యం దుకాణాల కుదింపునకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. గత ఎన్నికల ప్రచారంలో సంపూర్ణ మద్య నిషేధం తెస్తామని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో దశల వారీగా రాష్ట్రంలో మద్యం షాపులను తగ్గిస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే గుంటూరు జిల్లాలో కూడా మద్యం షాపులను తగ్గించేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మద్యం షాపుల్లో 20 శాతం కోత విధిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. జిల్లాలో మద్యం అమ్మకాలు ఏటేటా భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 350 మద్యం దుకాణాలు, 184 రెస్టారెంట్‌ అండ్‌ బార్‌ల ద్వారా రూ. 5.50 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అత్యధికంగా బీరు అమ్మకాలు జోరందుకున్నాయి. జిల్లాలో అనేక బ్రాండ్‌ల మద్యం దొరకడం లేదు. ఒక పక్క మద్యం షాపులను తగ్గిస్తున్నప్పటికీ మరో పక్క కోరిన బ్రాండ్‌ మద్యం దొరక్కపోయినప్పటికీ మద్యం అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి.
70 మద్యం దుకాణాల తగ్గింపు...
సంపూర్ణ మద్యం నిషేధం అమలులో భాగంగా దశల వారీగా మద్యం దుకాణాలను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా జిల్లాలో 70 మద్యం దుకాణాలను తొలగించేందుకు రంగం సిద్ధం అయింది. ఆ మేరకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో ఇప్పటి వరకు 352 వైన్‌ షాపులు ఉన్నాయి. అందులో 20 శాతం కోత విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో 70 షాపులను తొలగిస్తున్నారని తెలుస్తోంది. గుంటూరు డివిజన్‌లో 25, నరసరావుపేటలో 25, తెనాలిలో డివిజన్‌లో 20 షాపుల చొప్పున మద్యం దుకాణాలకు కోత విధించనున్నారు.
అక్టోబర్‌ నుంచి 280 షాపులే...
ఈ ఏడాది అక్టోబర్‌ 1 నుంచి కొత్త మద్యం పాలసీని అమలు చేస్తున్నారు. కేరళ, తమిళనాడు తరహాలో ఆంధ్రాలో కూడా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించే విధంగా కొత్త పాలసీని తెస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ ఎం మల్లికార్జున నాయక్‌ విధి విధానాలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి సమగ్ర నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కొత్త మద్యం విధానంలో జిల్లాలో 280 షాపులే మిగలనున్నాయి.

 • Andrapradesh
   @Andrapradesh రోజుకు రూ. 5.50 కోట్ల వ్యాపారం...
  జిల్లాలో రోజుకు రూ. 5.50 కోట్ల మద్యం వ్యాపారం జరుగుతోంది. ఏటేటా అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. పలు బ్రాండ్ల మద్యం అందుబాటులో లేకపోవడంపై ప్రశ్నిస్తే ఐఎంఎల్‌ డిపోల నుంచే సరఫరా లేదని మద్యం వ్యాపారులు చెబుతున్నారు. 
Andrapradesh

Aug 02 2019, 11:57

తగ్గనున్న మద్యం దుకాణాల సంఖ్య

ప్రస్తుతం 352 షాపులు ఉండగా అక్టోబరు నుంచి 280 షాపులకు తగ్గించేందుకు కసరత్తు
ఇప్పటికే దొరకని పలు బ్రాండ్లు
గుంటూరు: మద్యం దుకాణాల కుదింపునకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. గత ఎన్నికల ప్రచారంలో సంపూర్ణ మద్య నిషేధం తెస్తామని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో దశల వారీగా రాష్ట్రంలో మద్యం షాపులను తగ్గిస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే గుంటూరు జిల్లాలో కూడా మద్యం షాపులను తగ్గించేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మద్యం షాపుల్లో 20 శాతం కోత విధిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. జిల్లాలో మద్యం అమ్మకాలు ఏటేటా భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 350 మద్యం దుకాణాలు, 184 రెస్టారెంట్‌ అండ్‌ బార్‌ల ద్వారా రూ. 5.50 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అత్యధికంగా బీరు అమ్మకాలు జోరందుకున్నాయి. జిల్లాలో అనేక బ్రాండ్‌ల మద్యం దొరకడం లేదు. ఒక పక్క మద్యం షాపులను తగ్గిస్తున్నప్పటికీ మరో పక్క కోరిన బ్రాండ్‌ మద్యం దొరక్కపోయినప్పటికీ మద్యం అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి.
70 మద్యం దుకాణాల తగ్గింపు...
సంపూర్ణ మద్యం నిషేధం అమలులో భాగంగా దశల వారీగా మద్యం దుకాణాలను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా జిల్లాలో 70 మద్యం దుకాణాలను తొలగించేందుకు రంగం సిద్ధం అయింది. ఆ మేరకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో ఇప్పటి వరకు 352 వైన్‌ షాపులు ఉన్నాయి. అందులో 20 శాతం కోత విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో 70 షాపులను తొలగిస్తున్నారని తెలుస్తోంది. గుంటూరు డివిజన్‌లో 25, నరసరావుపేటలో 25, తెనాలిలో డివిజన్‌లో 20 షాపుల చొప్పున మద్యం దుకాణాలకు కోత విధించనున్నారు.
అక్టోబర్‌ నుంచి 280 షాపులే...
ఈ ఏడాది అక్టోబర్‌ 1 నుంచి కొత్త మద్యం పాలసీని అమలు చేస్తున్నారు. కేరళ, తమిళనాడు తరహాలో ఆంధ్రాలో కూడా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించే విధంగా కొత్త పాలసీని తెస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ ఎం మల్లికార్జున నాయక్‌ విధి విధానాలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి సమగ్ర నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కొత్త మద్యం విధానంలో జిల్లాలో 280 షాపులే మిగలనున్నాయి.

Andrapradesh

Aug 02 2019, 11:54

శ్రీశైలానికి కొనసాగుతున్న నీటి ప్రవాహం 

శ్రీశైలం: కృష్ణమ్మ వేగం పెరుగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు దిగువకు 2,10,000 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా.. శ్రీశైలం జలాశయానికి 1,75,656 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి వరద ఎక్కువగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో దిగువకు ప్రవాహం పెరుగుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 832.30అడుగులుగా ఉంది. జలాశయ పూర్తిస్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలుకాగా.. మూడు రోజుల కిందట ప్రారంభమైన వరదతో 51.96 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు ఆల్మట్టి నుంచి వస్తున్న ప్రవాహం కూడా 2 లక్షల క్యూసెక్కులను దాటింది. నారాయణపూర్‌ నుంచి 19 గేట్లను 2 మీటర్లు ఎత్తి 2.10 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.

Andrapradesh

Aug 02 2019, 11:53

జీతాలు ఆలస్యం.. ఆర్థికశాఖ ప్రకటన 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల ఆలస్యంపై ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. దాదాపు 4 లక్షల మంది ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో గురువారం జీతం జమ కాలేదు. దీంతో ఉద్యోగులంతా ఆర్థికశాఖను సంప్రదించారు. దీనిపై తాజాగా ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. ఒకటో తేదీన జీతాలు చెల్లించలేకపోవడానికి నిధుల కొరత కారణం కాదని స్పష్టం చేసింది. సాధారణంగా ప్రతి నెల 1న ఆర్బీఐ ఈ-కుభేర్ ద్వారా చెల్లింపులు జరుగుతాయని వివరించింది. అన్ని జిల్లాల పింఛన్లు, జీతాల దస్త్రాలు యధాప్రకారం జూలై 31నే ఆర్బీఐకి పంపామని ఏపీ ఆర్థిక శాఖ తెలిపింది. ఒకటో తేదీ మధ్యాహ్నానికి పింఛన్లు పూర్తిగా, కొంతమంది జీతాల చెల్లింపులు జరిగాయని వివరించింది.అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ- ముద్ర ద్వారా పొందిన సర్టిఫికెట్లు పని చేయకపోవడం వల్ల మిగిలిన దస్త్రాల చెల్లింపు ఆలస్యమైనట్లు ప్రకటనలో తెలిపింది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి.. మిగిలిన జీతాల చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకున్నామని స్పష్టం చేసింది. ఇవాళ సాయంత్రం లేదా రేపటి లోగా చెల్లింపులు చేస్తామని వెల్లడించింది. మరోవైపు నిధుల కొరత వల్లే జీతాల చెల్లింపులు ఆలస్యమైందని ఉద్యోగులు ఆందోళ చెందుతున్నారు.

Andrapradesh

Aug 02 2019, 11:51

పోలవరాన్ని చుట్టుముట్టిన గోదారి 

పోలవరం : గోదావరి వరద నీరు పోలవరం ప్రాజెక్టును చుట్టుముట్టింది. స్పిల్‌వే వైపునకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. కాఫర్‌ డ్యాం ప్రభావం వల్ల ముంపు గ్రామాలకు ముప్పు ఉండడం వల్ల వరదను స్పిల్‌వే మీదుగా మళ్లించారు. దాదాపు 2 వేల క్యూసెక్కుల వరద నీరు స్పిల్‌వే రివర్స్‌ స్లూయిజ్‌ గేట్ల ద్వారా బయటకు వెళ్తోంది. స్పిల్‌వే గేట్ల క్లస్టర్‌ లెవెల్‌ ఎత్తు 25.72 మీటర్లుకాగా.. ప్రస్తుతం నీరు గరిష్ఠ స్థాయికి చేరుకుంది. మరో అరమీటరు ఎత్తు పెరిగితే వరద నీటిని విడుదల చేయనున్నారు. స్పిల్‌వేపై నుంచి వరద నీరు సాఫీగా వెళ్తుండటం వల్ల ముంపు గ్రామాలకు కొంత వరకు ముప్పు తప్పిందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో స్వల్పంగా పెరిగింది. బ్యారేజీ లోకి 6.5 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా 6.39లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.

Andrapradesh

Aug 02 2019, 11:51

పోలవరంపై పులివెందల పంచాయతీ, వైసీపీ తప్పుడు ప్రచారం.. దేవినేని కామెంట్స్ 

పోలవరం పనులు దాదాపు పూర్తయ్యాయని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. పోలవరంపై పులివెందల పంచాయాతీ మొదలుపెట్టారని ఆయన ఎద్దేవా చేశారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన సీఎం జగన్, వైసీపీ నేతలపై మండిపడ్డారు.

15రోజుల్లో సెటిల్మెంట్ చేసుకోవాలని జగన్ చెబుతున్నారని దేవినేని అన్నారు. పోలవరం పనులు దాదాపు పూర్తయ్యాయని చెప్పారు. అయితే... పోలవరం పనుల్లో అవినీతి జరిగిందంటూ కావాలనే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం డ్యామ్ దగ్గర గోదావరి వరదను మళ్లించేందుకు నవయుగ ఇంజినీర్లు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని దేవినేని ఉమా స్పష్టం చేశారు.

కాగా..60సీ నిబంధన ప్రకారం 2018 ఫిబ్రవరిలో నవయుగ సంస్థకు హెడ్ వర్క్స్ పనులు అప్పగించారు. రూ.3వేల కోట్ల విలువైన పులను నవయుగకు అప్పగిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.3220 కోట్ల జల విద్యుత్ టెండర్లను కూడా నవయుగ దక్కించుకుంది.

జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి కూడా తప్పుకోవాలని నవయుగకు తాజాగా ఇరిగేషన్ శాఖ సూచించింది. కాగా... పోలవరం పనులపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ.. ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పోలవరం టెండర్లు, పనుల అప్పగింత, అంచనాల పెంపుతో అవినీతి జరిగిందని నివేదికలో పేర్కొంది. దీంతో నవయుగను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని జగన్ సూచించారు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమా స్పందించారు.