బలవంతంగా వినాయకుని చందా.. అడిగినంత ఇవ్వకుంటే చెప్పులతో దాడి..!
బలవంతంగా వినాయకుని చందా..!
అడిగినంత ఇవ్వకుంటే చెప్పులతో దాడి..!
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : సిర్పూర్ నియోజక వర్గం లోని వెంకట్రావ్ పెట్ గ్రామం నుండి మహారాష్ట్రకు వెళ్ళే అంతరాష్ట్ర మార్గంలో అదే గ్రామానికి చెందిన యువకులు వచ్చేవాళ్ళ దగ్గర,పోయేవారి దగ్గర వినాయకుని పేరు మీద బలవంతంగా చందాలు వసూలు చేస్తున్నారు.అడిగినంత ఇవ్వకుంటే దాడి చేస్తున్నారు. గురువారం రోజున కౌటాల మండలం గుడ్లభోరి గ్రామానికి చెందిన ధంద్రే బాలాజీ, శంకర్ లు వైద్యం కోసం చంద్రపూర్ వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు వాహన్నాని ఆపి వినాయకుని చందా ఇవ్వాలి అని అడిగారు.సదరు ప్రయాణికులు మా దగ్గర మీరు అడిగినన్ని డబ్బులు లేవు ఎంతో కొంత ఇస్తామంటే, చందాదారులు ఆగ్రహించి రాళ్ళతో, చెప్పులతో దాడి చేసారు. ఇది ఎంతవరకు న్యాయమో గ్రామస్తులే చెప్పాలని పోలీస్ స్టేషన్ కు వెళ్లారు భాదితులు దాడి చేసిన వారిపై పిర్యాధు చేశారు.
Nov 04 2025, 23:04
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0.4k