*ఘనంగా భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం*
*జెండా ఎగరవేసిన మండల నాయకుడు అయితగోని కృష్ణ గౌడ్*
భారత రాష్ట్ర సమితి 25 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుర్రంపోడు మండలంలోని కొప్పోలు గ్రామంలో నాయకులు కార్యకర్తలతో మండల నాయకుడు అయితగోని కృష్ణ గౌడ్ కొబ్బరికాయ కొట్టి జెండా ఎగర వేశారు అనంతరం కృష్ణ గౌడ్ మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న బంగారు తెలంగాణ రాబందుల పాలయ్యిందని ఎద్దేవా చేశారు ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని వృద్ధులకు పింఛను 4000 రూపాయలు ఇస్తామని మోసం చేసిందని మహాలక్ష్మి పేరుతో మహిళల ను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ గెలవడం ఖాయమని 2029 ఎలక్షన్లో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో ఆవుల కుమార్, ఐతరాజు ప్రసాద్,కోట్ర శ్రీనివాసులు, మాజీ వార్డ్ మెంబర్, మామిడి నరేష్,చినాల యాదయ్య,కొట్ర సత్తయ్య,జక్కల సైదులు,శ్రీకాంత్,రవితేజ, ప్రవీణ్ లక్ష్మయ్య, వెంకటయ్య, రాజశేఖర్ గ్రామ ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Apr 27 2025, 20:02