తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 24 2024, 17:53

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణకు హాజరు కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీచేసింది.

ఓటుకు నోటు ఈడీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణకు హాజరు కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ రోజు జరిగిన విచారణకు మత్తయ్య ఒక్కరే హాజరయ్యారు. రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ హాజరు కాలేదు. ఈడీ కేసు విచారణలో నిందితులు హాజరు కాకపోవడంపై నాంపల్లి ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ రోజు విచారణకు మినహాయింపు ఇచ్చేందుకు అంగీకరించింది. తదుపరి విచారణకు తప్పకుండా హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. వచ్చేనెల 16వ తేదీకి విచారణను వాయిదా వేసింది. ఆ రోజు సీఎం రేవంత్ సహా నిందితులు అందరూ కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీపెన్ సన్‌కు రేవంత్ రెడ్డి డబ్బులు ఎర చూశారని ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. ఏసీబీ కేసు నమోదు చేయడంతో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లారు. తర్వాత బెయిల్ రావడంతో బయటకు వచ్చారు. ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసే సమయంలో ఆయన వద్ద ఉన్న బ్యాగులో రూ.50 లక్షల నగదు ఉంది. ఆ నగదు అక్రమంగా చలామణి జరిగిందని ఏసీబీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి రిఫర్ చేసింది. ఓటుకు నోటు కేసులో ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు.

ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచారణతోపాటు ఈడీ విచారణ కూడా జరుగుతోంది. ఏసీబీ కేసును ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసును విచారించిన సర్వోన్నత న్యాయస్థానం మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు అంగీకరించలేదు. తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి సీఎం అయినందున కేసు దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకోవద్దని రేవంత్ రెడ్డికి స్పష్టం చేసింది. ఓటుకు నోటు కేసులో జెరూసలెం మత్తయ్య ఒక్కరే ఏసీబీ కేసు, ఈడీ కేసులో విచారణకు హాజరవుతున్నారు. మిగతా నిందితులు గైర్హాజరు అవుతున్నారు. విచారణ మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈడీ కేసులో నాంపల్లి కోర్టు తాజా ఆదేశాలతో అక్టోబర్ 16వ తేదీన ఏం జరగనుందనే ఉత్కంఠ నెలకొంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 24 2024, 14:43

డెలివరీ లొకేషన్‌ షేర్‌ చేయమంటూ సందేశం పంపి..

ఇప్పటి వరకు ఫెడెక్స్‌, సీబీఐ, ఈడీ వంటి సంస్థల పేరుతో కొల్లగొట్టిన సైబర్‌ నేరగాళ్లు(Cyber criminals) ఇండియన్‌ పోస్టల్‌ సర్వీస్‌ పేరును కూడా దుర్వినియోగం చేస్తున్నారు. మీ పార్సిల్‌ డెలివరీ చేసేందుకు లొకేషన్‌ షేర్‌ చేయమంటూ సందేశం పంపిన సైబర్‌ నేరగాళ్లు బాధితుడి క్రెడిట్‌ కార్డు నుంచి రూ. 1.55 లక్షలు కాజేశారు. మీకు వచ్చిన పార్సిల్‌ కోసం డెలివరీ లొకేషన్‌ షేర్‌ చేయమని, లేకపోతే పార్సిల్‌ రిటర్న్‌ అవుతుందని నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి ఫోన్‌కు సందేశం వచ్చింది.

ఇప్పటి వరకు ఫెడెక్స్‌, సీబీఐ, ఈడీ వంటి సంస్థల పేరుతో కొల్లగొట్టిన సైబర్‌ నేరగాళ్లు(Cyber criminals) ఇండియన్‌ పోస్టల్‌ సర్వీస్‌ పేరును కూడా దుర్వినియోగం చేస్తున్నారు. మీ పార్సిల్‌ డెలివరీ చేసేందుకు లొకేషన్‌ షేర్‌ చేయమంటూ సందేశం పంపిన సైబర్‌ నేరగాళ్లు బాధితుడి క్రెడిట్‌ కార్డు నుంచి రూ. 1.55 లక్షలు కాజేశారు. మీకు వచ్చిన పార్సిల్‌ కోసం డెలివరీ లొకేషన్‌ షేర్‌ చేయమని, లేకపోతే పార్సిల్‌ రిటర్న్‌ అవుతుందని నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి ఫోన్‌కు సందేశం వచ్చింది. పార్సిల్‌ కోసం ఎదురుచూస్తున్న అతడు లింక్‌ ఓపెన్‌ చేశాడు.

ఇండియన్‌ పోస్టల్‌ పేరుతో ఉన్న వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేశాడు. డెలివరీ కోసం రూ. 25 క్రెడిట్‌ కార్డు నుంచి చెల్లించాడు.

కొద్దిసేపటి తర్వాత మీ ఖాతా నుంచి డబ్బులు బదిలీ అయ్యాయన్న సందేశం రాగానే క్రెడిట్‌ కార్డును బ్లాక్‌ చేశాడు. బ్యాంకు అధికారులను సంప్రదించగా.. గుర్తుతెలియని వ్యక్తులు అతడి క్రెడిట్‌ కార్డు నుంచి రూ. 1.55 లక్షలు కాజేసి దుబాయ్‌లో ఉన్న ఖాతాలో జమ చేశారు. సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారని తెలుసుకున్న బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 24 2024, 14:38

రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో కీలక పరిణామం..

తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారులపై కేసు నమోదు చేయాలని గుంటూరులో రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన గుంటూరు నగరపాలెం పోలీసులు.. విజయపాల్‌తో పాటు అప్పటి సీఎం జగన్, సీఐడీ డీజీ సునీల్, ప్రభుత్వాసుపత్రి.. సూపరింటెండెంట్‌ డాక్టర్ ప్రభావతిని నిందితులుగా పోలీసులు చేర్చారు. కేసులో ముందస్తు బెయిల్ కోసం విజయపాల్‌ కోర్టులో పిటిషన్ వేశారు.

అప్పటి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (RaghuramaKrishnam Raju)పై థర్డ్ డిగ్రీ (Third Degree) ప్రయోగించిన కేసు (Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పటి దర్యాప్తు అధికారి విజయ పాల్‌ (Vijay Paul)కు హైకోర్టు (High Court)లో చుక్కెదురైంది. ఆయనకు ముందస్తు బెయిల్ (Anticipatory Bail) ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజును.. సీఐడీ కస్టడీలో విజయ్‌పాల్‌ చిత్రహింసలు పెట్టారు.

తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారులపై కేసు నమోదు చేయాలని గుంటూరులో రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన గుంటూరు నగరపాలెం పోలీసులు.. విజయపాల్‌తో పాటు అప్పటి సీఎం జగన్, సీఐడీ డీజీ సునీల్, ప్రభుత్వాసుపత్రి.. సూపరింటెండెంట్‌ డాక్టర్ ప్రభావతిని నిందితులుగా పోలీసులు చేర్చారు. కేసులో ముందస్తు బెయిల్ కోసం విజయపాల్‌ కోర్టులో పిటిషన్ వేశారు. విజయ్‌పాల్ తరఫున సుప్రీంకోర్టు కౌన్సిల్‌ సిద్ధార్థ లూథ్రా, పీపీ లక్ష్మీనారాయణ,.. రఘురామ కృష్ణంరాజు తరపున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. న్యాయస్థానం విజయపాల్‌కు బెయిల్ నిరాకరించడంతో మిగతా అధికారుల్లో వణుకు మొదలైంది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. విజయ్‌పాల్‌ తన ఆరోగ్యం బాగోలేదని ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టులో పిటిషన్‌ వేశారని.. ఈరోజు విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్‌ నిరాకరించడం శుభపరిణామమని అన్నారు. తనను అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టడానికి అనువైన వాతావరణాన్ని విజయ్‌పాల్‌ సృష్టించారని అన్నారు. ఇలాంటి పనికిమాలిన పనులన్నీ విజయ్‌పాల్‌ చేశారని మండిపడ్డారు. త్వరలో రిటైర్డ్‌ ఎస్పీ మహిపాల్‌ అరెస్ట్‌ అవుతారని, అలాగే సునీల్‌కుమార్‌ కూడా అరెస్ట్‌ అవుతారని.. విచారణ వేగవంతమవుతుందనే ఆశాభావంలో ఉన్నానని రఘురామకృష్ణంరాజు ఏబీఎన్‌తో పేర్కొన్నారు.

కాగా నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు కేసులో ఎట్టకేలకు పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఆయనపై హత్యాయత్నం, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన పోలీసు అధికారులు, సిబ్బందిని త్వరలోనే అరెస్టు చేయనున్నారు. అప్పటి సీఎం జగన్మోహన్‌రెడ్డిపై రఘురామరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 2021లో ఆయనపై దేశద్రోహం కింద కేసు నమోదుచేసిన సీఐడీ అధికారులు.. ఆ ఏడాది మే 14న జన్మదినం రోజున ఆయన్ను హైదరాబాద్‌ నుంచి బలవంతంగా గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆరోజు రాత్రి కస్టడీలో తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడినట్లు రఘురామరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఏడాది జూలై 11న గుంటూరు నగరంపాలెం పోలీసు సేషన్లో కేసు నమోదైంది.

నాటి సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌ కుమార్‌(ఏ-1), అప్పటి నిఘా విభాగం అధిపతి పీఎస్ఆర్‌ ఆంజనేయులు (ఏ-2), మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి (ఏ-3), సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్‌(ఏ-4), అప్పటి జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభావతి (ఏ-5)తదితరులపై ఐపీసీ 120బీ, 166, 167, 197, 307, 326, 465, 506(34) తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే రోజులు గడుస్తున్నా కేసులో ఎటువంటి పురోగతీ లేదంటూ రఘురామరాజు పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. నేరుగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్‌కుమార్‌ను కలిసి దర్యాప్తు వేగవంతం చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 24 2024, 14:24

తెలంగాణా ప్రజలకు అదిరిపోయే శుభవార్త!

తెలంగాణా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్ 2వ తేదీన తేదీ నుండి తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ హెల్త్ కార్డులను ఇచ్చేందుకు రెడీ అయ్యింది . ఇక ఇదే విషయాన్ని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా, వైద్యం, అభివృద్ధి, సంక్షేమం పై ప్రత్యేక దృష్టి సారించిన్నట్లు మంత్రి తెలిపారు.

ప్రతి కుటుంబానికి డిజిటల్ హెల్త్ కార్డులు

వరంగల్ పట్టణంలోని ఎల్బీ నగర్ క్రిస్టల్ గార్డెన్స్ లో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిధిగా పాల్గొని 454 మంది లబ్ధిదారులకు రూ. 3,97,96,308 రూపాయల సీఎం ఆర్ ఎఫ్, కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీనుండి డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డులను ప్రతి కుటుంబానికి అందించనున్నట్లు మంత్రి తెలిపారు.

హైదరాబాద్ కు ధీటుగా వరంగల్

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, 104, 108 వాహనాల ద్వారా లక్షల మంది ప్రాణాలను రక్షించడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరమైన వరంగల్ పై ప్రత్యేక దృష్టి సారించి హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు.త్వరలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తామని మంత్రి అన్నారు.

వరంగల్ మాస్టర్ ప్లాన్ పై స్పెషల్ ఫోకస్

వరంగల్ నగరం ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపడుతున్నామని, వరంగల్ లో ఎయిర్ పోర్టు నిర్మాణానికి కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. 2050 వరకు జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా వరంగల్ నగర అవసరాలకు సరిపోయేలా మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తున్నామన్నారు.

ఈ అంశాలతో వరంగల్ మాస్టర్ ప్లాన్

ఫార్మా సిటి, ఐటి సర్వీసెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, స్టేడియం, ఎయిర్ పోర్టు, మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఎకో టూరిజం, లాజిస్టిక్స్ పార్కు, టూరిజం వంటి అంశాలు ప్రధానంగా ఉండేలా మాస్టర్ ప్లాన్ ను తయారు చేస్తున్నామని అన్నారు. కోటి మంది మహిళలను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తున్నదన్నారు.

బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి

అందులో భాగంగా వరంగల్ నగరంలో కూడా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరుగుతోందని మంత్రి తెలిపారు. ఇది ప్రజా ప్రజా ప్రభుత్వమని, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 24 2024, 14:17

హైకోర్టులో క‌ర్ణాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య‌కు షాక్!

ముడా' కుంభ‌కోణం కేసులో క‌ర్ణాట‌కు ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య‌కు ఆ రాష్ట్ర హైకోర్టు షాకిచ్చింది.

ద‌ర్యాప్తు కోసం గ‌వ‌ర్న‌ర్ ఇచ్చిన ఆదేశాల‌కు వ్య‌తిరేకంగా సిద్ధ‌రామ‌య్య దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కొట్టివేసింది. మైసూరు ప‌ట్ట‌ణాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) భూ కేటాయింపుల విష‌యంలో ఖ‌రీదైన భూముల‌ను త‌న భార్య పార్వ‌తికి ద‌క్కేలా సిద్ధ‌రామ‌య్య కుట్ర చేశార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌పై విచార‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ ఆదేశాలు జారీ చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 24 2024, 14:15

మెట్ల మార్గాన తిరుమలకు.. డిప్యూటీ సీఎం పవన్ నిర్ణయం

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మెట్ల మార్గాన తిరుమలకు వెళ్లనున్నారు. అక్టోబర్ 1న అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 2న శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. ఇక 3న తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యిని వాడారని నిర్ధారణ అయిన నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఆయన.. దీక్ష విరమణ కోసం తిరుమల కొండకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

మెట్ల మార్గాన ఆయన తిరుమలకు వెళ్లనున్నారు. అక్టోబర్ 1న అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. 2న శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. ఇక 3న తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు.

కాగా తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. అపచారం జరిగిపోవడంతో 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు ఆయన పూనుకున్నారు. గుంటూరు జిల్లాలోని నంబూరులో ఉన్న శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి దీక్ష తీసుకున్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రమైన నేపథ్యంలో క్షమించమని వెంకటేశ్వర స్వామిని కోరుతూ ఆయన దీక్ష మాలధారణ తీసుకున్నారు.

ఇవాళ ఇంద్రకీలాద్రికి పవన్..

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ (మంగళవారం) ఇంద్రకీలాద్రికిి వెళ్లనున్నారు. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా కనకదుర్గమ్మ ఆలయంలో ఆయన శుద్ధి కార్యక్రమం చేపట్టనున్నారు.

దీక్ష తీసుకునే సందర్భంలో పవన్ కల్యాణ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. చర్చికి, మసీదులో జరిగితే జగన్ ఊరుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. మరి హిందూ ధర్మానికి జరిగితే ఎందుకు వెనుకేసుకొస్తున్నారని నిలదీశారు. కేబినెట్, అసెంబ్లీలో దీనిపై చర్చ జరగాలని, సీబీఐ విచారణకు ఇవ్వాలో లేదో సీఎం నిర్ణయం తీసుకోవాలని డిప్యూటీ సీఎం అన్నారు. ప్రజలంతా ఆయన వెనుకే ఉంటారని అభిప్రాయపడ్డారు. నెయ్యి తక్కువ ధరకు ఇస్తారని చెప్పిన మధ్యవర్తి ఎవరో తేలాలని పవన్ అన్నారు.‘‘స్వామి వారి పూజా విధానాలను మార్చేశారు.శ్రీవాణి ట్రస్ట్ పేరుతో టిక్కెట్లు అమ్ముకున్నారు. వైసీపీ పాలనలో 300 ఆలయాలను అపవిత్రం చేశారు. ఏ మతమైనా కావచ్చు. ఏ ప్రార్థనా మందిరం కావచ్చు. మనోభావాలు దెబ్బతినకూడదు. ప్రసాదాలు కల్తీ జరుగుతోంది, నాణ్యత లేదని ముందు నుంచి చెబుతున్నాం. టీటీడీపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతున్నాం. ఈ స్థాయిలో కల్తీ జరుగుతోందని అనుకోలేదు. దారుణం ఏంటంటే అయోధ్యకి లక్ష లడ్డూలు పంపించారు. రాజకీయ లబ్ది కోసం చేస్తున్నామని వైసీపీ అంటుంది. రామతీర్థం దేవుడి విగ్రహం ధ్వంసం చేసినప్పుడే రోడ్డు మీదకు వచ్చేవాడిని. ఆరోజు రాజకీయం చేయలేదు’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 24 2024, 14:11

నామినేటెడ్ పదవుల భర్తీ.. ఎంతమందికి అంటే

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకు పెద్ద పీట వేస్తుంది. ఈ నేపథ్యంలో 99 మందితో మొదటి నామినేటెడ్ పదవుల లిస్ట్‌ను కూటమి ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకు పెద్ద పీట వేసింది. 99 మందితో తొలి నామినేటెడ్ పదవుల జాబితాను మంగళవారం ప్రకటించింది. అందులో బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీలకు పెద్ద పీట వేసింది. 11 మంది క్లస్టర్ ఇంఛార్జ్‌లకు పదవులు కేటాయించింది.

ఒక క్లస్టర్ ఇంఛార్జీను చైర్మన్ పదవిలో నియమించింది. అలాగే ఆరుగురు యూనిట్ ఇంఛార్జ్‌లకు పదవులు కేటాయించింది. 20 కార్పొరేషన్లకు చైర్మన్లు, ఒక కార్పొరేషన్‌కు వైస్ చైర్మన్‌తోపాటు వివిధ కార్పొరేషన్లకు సభ్యులను సైతం కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటించిన నామినేటేడ్ పోస్టుల్లో 99 శాతం పదవులు యువతకే ప్రాధాన్యత ఇచ్చింది. పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు ఈ పదవులు కేటాయించారు.

గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకోలేక పోయిన వారికి.. అలాగే పొత్తుల్లో భాగంగా టిక్కెట్లు త్యాగం చేసిన వారికి ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆ క్రమంలో టీడీపీ -16, జనసేన -3, బీజేపీ -1 చొప్పున మొత్తం 20 నామినేటెడ్ పోస్టుల భర్తీ చేశారు.

వక్ఫ్ బోర్డు: అబ్దుల్ అజీజ్

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP): అనిమిని రవినాయుడు

AP హౌసింగ్ బోర్డ్: బత్తుల తాత్యబాబు

AP షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్థిక సహకారం (AP TRICAR): బొరగం శ్రీనివాసులు

AP మారిటైమ్ బోర్డ్: దామచర్ల సత్య

APలో ఉపాధి కల్పన & ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ కోసం సొసైటీ (SEEDAP): దీపక్ రెడ్డి

20 పాయింట్ ఫార్ములా: లంకా దినకర్ (బీజేపీ)

AP మార్క్‌ఫెడ్: కర్రోతు బంగార్రాజు

AP స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్: మన్నె సుబ్బారెడ్డి

ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ APIIC : మంతెన రామరాజు

AP పద్మశాలి సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ: నందం అబద్దయ్య

AP టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్: నూకసాని బాలాజీ

APSRTC చైర్మన్, APSRTC వైస్ చైర్మన్: కొనకళ్ల నారాయణ, పిఎస్‌ మునిరత్నం

AP అర్బన్ ఫైనాన్స్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: పీలా గోవింద సత్యనారాయణ

లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: పిల్లి మాణిక్యాల రావు

AP రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి: పీతల సుజాత

A.P. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APMSME DC): తమ్మిరెడ్డి శివశంకర్ (జనసేన)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్: తోట మెహర్‌ సుధీర్‌ ( జనసేన)

ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APTPC): వజ్జా బాబురావు

AP టౌన్‌షిప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ APTIDCO: వేములపాటి అజయ్‌కుమార్‌ (జనసేన)

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 24 2024, 14:06

తిరుమల లడ్డూ వ్యవహారంలో అనుకోని మలుపు- తెరపై సాధువులు

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం.. రోజుకో మలుపు తిరుగుతోంది. కలియుగ వైకుంఠంలా అలరారుతున్న, సాక్షాత్ శ్రీమహావిష్ణువే కొలువుదీరిన తిరుమలపై, అక్కడి పవిత్రతపై, స్వామివారి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగడం అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు, చేపనూనెలను వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు- గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.

ఈ వ్యవహారంపై ఆరోపణలను ఎదుర్కొంటోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సీబీఐ విచారణ కోసం డిమాండ్ చేస్తోన్నారు. అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటూ తేల్చి చెబుతున్నారు. తాము ఎలాంటి తప్పూ చేయలేదని, అలాంటప్పుడు దేనికీ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తోన్నారు.

అదే సమయంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు. ఏకంగా తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద బహిరంగంగా ప్రమాణం చేశారు. తప్పు చేసివుంటే తాను, తన కుటుంబం సర్వనాశనం కావాలని వేంకటేశ్వరస్వామిని కోరుకున్నారు.

ఈ క్రమంలో మరో డిమాండ్ తెర మీదికి వచ్చింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, చేప నూనెను కల్తీ చేసిన వారిపై ఎఫ్ఐఆర్‌ను నమోదు చేయాలంటూ ఏపీ హిందూ సాధు పరిషత్ ఆందోళనకు దిగింది. పెద్ద ఎత్తున ధర్నా చేపట్టింది

టీటీడీ అడ్మినిస్ట్రేషన్ భవన్ వద్ద ఈ ఉదయం సాధు పరిషత్ ప్రతినిధులు ధర్నాకు దిగారు. అక్కడే బైఠాయించారు. శంఖనాదం చేశారు. ఈ ఉదంతానికి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని, వారిపై అత్యంత కఠిన చర్యలను తీసుకోవాలంటూ నినాదాలు చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 23 2024, 19:31

కేఏ పాల్ పిటిషన్ ఎఫెక్ట్.. ఆ 10 మంది తెలంగాణ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు..!

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రోజుకో పరిణామంతో.. ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్ వేయగా.. ఆ పది మంది ఎమ్మల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేసిన పిటిషన్‌.. 10 మంది తెలంగాణ ఎమ్మెల్యేలకు ఏకంగా హైకోర్టే నోటీసులు జారీ చేసేలా చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచి.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కేఏ పాల్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జరీ చేసిన ధర్మాసనం.. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఒక పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన తర్వాత.. మరో పార్టీలోకి మారటమనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని కేఏ పాల్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కేఏ పాల్ కోరారు.

ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ టికెట్ మీద విజయం సాధించిన ఎమ్మెల్యే దానం నాగేందర్.. ఆరు నెలల తిరగకముందే పార్టీ మారటమే కాకుండా.. ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసినట్టుగా పిటిషన్‌లో కేఏ పాల్ పేర్కొన్నారు. తాను పోటీ చేసి గెలిచిన పార్టీకి రాజీనామా చేయకుండానే.. వేరే పార్టీలో చేరి అధికారాలను అనుభవిస్తున్నారని.. అది తప్పు అని అభిప్రాయపడ్డారు. ఇది చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని పిటిషన్‌లో కేఏ పాల్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ మీద విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 23 2024, 19:19

ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్..

హైడ్రా హైదరాబాద్ లోని చెరువులను పరిరక్షించడానికి నడుబిగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మాదాపూర్ కావూరిహిల్స్ లోని పార్కులో అక్రమ కట్టడాలని హైడ్రా సోమవారం కూల్చివేసింది. ఆదివారం కూడా హైడ్రా అమీన్ పూర్, కూకట్ పల్లిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అయితే కూకట్ పల్లిలో నల్ల చెరువు వద్ద ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చి వేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. తమకు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారని వారు వాపోయారు.

కనీసం సామాన్లు బయట పెట్టుకోవడానికి సమయం కూడా ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు బాగానే ఉన్నారు... భూమి లీజ్ ఇచ్చినవాడు బాగానే ఉన్నాడు. కానీ తమ పరిస్థితి దారుణంగా మారిందని అన్నారు. హైడ్రా ఉన్నవారి పట్ల ఓ రకంగా.. పేదవారి పట్ల మరో రకంగా వ్యవహరిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. కూకుట్ పల్లిలో బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు డిమాండ్ చేశారు.

చాలా మంది లీజ్ కు తీసుకుని రేకుల షేడ్లు వేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారని ఇప్పుడు వారి ఉపాధి మీద దెబ్బపడిందని అన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును పరిశీలించారు. చెరువు బఫర్, ఎఫ్టీఎల్ లో ఉన్న నిర్మాణాలను ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారుల సమాచారం అడిగి తెలుసుకున్నారు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ లో ఉన్న భవన యజమానులకు హైకోర్టులో ఊరట లభించింది. దుర్గం చెరువు చుట్టూ కూల్చివేత చర్యలపై హైకోర్టు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో భవన యజమానులు ఊరట లభించినట్లయింది.

వాపోయారు.

అలాగే 2014లో జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై దుర్గం చెరువు ప్రాంత వాసుల అభ్యంతరాలను పరిశీలించాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. అక్టోబర్ 4న భవన యజమానులు పరిరక్షణ కమిటీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. యజమానుల పరిగణనలోకి తీసుకుని అక్టోబరు 4 నుంచి ఆరు వారాల్లోగా తుది నోటిఫికేషన్‌ జారీ చేయాలని లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీనికి చెప్పింది. నోటీసులు తీసుకున్న వారిలో సీఎం సోదరుడు ఎనుముల తిరుపతి రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. దుర్గం చెరువు 100 ఎకరాల్లో ఉండగా.. 84 ఎకరాలకు తగ్గిపోయినట్లు తెలుస్తోంది.