పెళ్లికి ఒప్పుకోని పెద్దలు, ప్రేమజంట ఆత్మహత్య
ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో వీరు బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించిన పోలీసులు విచారణ చేపట్టారు.
కామరెడ్డి జిల్లా దోమకొండ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ జంట ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని కఠిన నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసులు, బంధులవులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమకొండ మండలం అంబార్‌పేటకు చెందిన వీణ, కోనాపూర్ గ్రామానికి చెందిన సాయి కుమార్ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోని హాయిగా జీవించాలని ఎన్నో కలలకన్నారు.
పెద్దల వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకురాగ అందుకు వారు ఒప్పుకోలేదు. దీంతో మనస్థాపం చెందిన ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వీణ తన ఇంట్లో దూలానికి ఉరేసుకొని ప్రాణం తీసుకోగా.. సాయి కుమార్ పొలం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు రెండు గ్రామాలకు చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
బాలికలతో కేర్‌టేకర్ అనుచిత ప్రవర్తన
ఇక హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఓ బాలికల అనాథాశ్రమంలో ఉన్న విద్యార్థినులతో గత కొంతకాలంగా కేర్‌టేకర్ అనుచితంగా ప్రవర్తిస్తోంది. అందులో పనిచేసే ఇద్దరు పురుషుల ఎదుట బాలికల దుస్తులిప్పించి నగ్నంగా నిలబెడుతూ చిత్రహింసలకు గురిచేస్తోంది. వారు చదువుతున్న స్కూల్ టీచర్ల చొరవతో ఈ విషయం పోలీస్ స్టేషన్‌కు చేరింది. వివరాల్లోకి వెళితే.. అనాథల పిల్లల కోసం ఓ మహిళ కిస్మత్‌పూర్‌లో 15 సంవత్సరాల క్రితం ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఇందులో ప్రస్తుతం 45 మంది బాలికలు ఉన్నారు. విద్యార్థుల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న బాలికలు ఉన్నారు.
రెండేళ్ల క్రితం ఓ మహిళను పిల్లల బాగోగులు చూసేందుకు కేర్ టేకర్‌గా నియమించారు. ఆమె బాలికలను చిత్రహింసలకు గురి చేస్తోంది. తాను చెప్పిన మాట వినకపోతే దుస్తులు పూర్తిగా విప్పించి.. ఆశ్రమంలోనే పని చేస్తున్న ఇద్దరు పురుషుల ఎదుట నిగ్నంగా నిలబెడుతోందని బాలికలు వాపోయారు. సెల్‌ఫోన్‌లో నీలిచిత్రాలు పెట్టి వాటిని చూడాలని బలవంతం చేస్తోందని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. వారు చదువుతున్న స్కూల్ టీచర్ల సాయంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేర్‌టేకర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Sep 22 2024, 08:00