ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ రికార్డ్.. ఒకే రోజు 13వేలకుపైగా, చాలా అరుదుగా!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ రికార్డును సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహణను వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. ఇందుకు సంబంధించిన రికార్డ్ పత్రాన్ని, మెడల్‌ను ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసంలో వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ టేలర్ డిప్యూటీ సీఎంకు అందజేశారు. ఆగస్టు 23వ తేదీన నిర్వహించిన గ్రామ సభలను నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరల్డ్ రికార్డును సాధించింది. ఆగస్టు 23న రికార్డు స్థాయిలో ఒకేరోజు 13,326 చోట్ల గ్రామ సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది.. ఈమేరకు రికార్డు ధ్రువపత్రాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అందజేశారు. దీనికి సంబంధించిన రికార్డ్ పత్రాన్ని, మెడల్‌ను పవన్ కళ్యాణ్‌కు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ అందజేశారు. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలిపారు. పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ప్రపంచ రికార్డు నమోదు కావడం విశేషం.
రాష్ట్రవ్యాప్తంగా ‘స్వర్ణ గ్రామ పంచాయతీ’ పేరుతో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించింది. గ్రామాల అభివృద్ధికి నాలుగు ప్రధాన ప్రణాళికలతో ఒకేసారి ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో నిర్వహించే గ్రామసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు.. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లె గ్రామసభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ గ్రామ సభల్ని సర్పంచి అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. ఆ ఊరిలో ప్రజలంతా పాల్గొని.. గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు అంశాలపై చర్చించి తీర్మానం చేశారు.
Sep 16 2024, 14:53