ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ డిమాండ్
భువనగిరి: ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని, గ్రామ సభల ద్వారా టెక్నికల్ సమస్యలను పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రోజున భువనగిరి ఆర్డీవో కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో నర్సింహ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ కోసం తక్షణమే 13 వేల కోట్ల రూపాయలను విడుదల చేయాలని అన్నారు. సగం మంది రైతులకే మాఫీ కావడం వల్ల మిగతా సగం మంది రైతులు అయోమయానికి గురవుతున్నారని అన్నారు. బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ అధికారుల చుట్టూ అన్ని పనులు మాని తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రుణమాఫీ కోసం 45 వేల కోట్ల రూపాయలు అవుతుందని అంచనాకొచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 31 వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పికేవలం 18 వేల కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసిందన్నారు. వారు చెప్పిన ప్రకారమే 13వేల కోట్ల రూపాయలను వెంటనే చేయాలన్నారు. రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను సవరించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. రేషన్ కార్డులు, ఐటీ రిటర్న్స్, రీ షెడ్యూల్ లాంటి వాటిని సవరించాలని డిమాండ్ చేశారు. రైతు వేదికల ద్వారా కాకుండా గ్రామపంచాయతీ పరిధిలో గ్రామసభలు నిర్వహించి సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 మాసాల అవుతున్న రెండు సీజన్లకు రైతు బరోసా డబ్బులు ఇవ్వకుండా తాత్సార్యం చేస్తుందన్నారు. జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్న ఈ తరుణంలో కరెంటు కోతలను నివారించే నాణ్యమైన కరెంటును 24 గంటల పాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు గౌడ్, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు నాయకులు దయ్యాల నర్సింహ, మాయ కృష్ణ , రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి, సిపిఎం బొమ్మలరామారం మండల కార్యదర్శి రాకల శ్రీశైలం, నాయకులు ఏదునూరి మల్లేశం, పల్లెర్ల అంజయ్య, కొండమడుగు నాగమణి, అబ్దుల్లాపురం వెంకటేష్ , వనం రాజు,సిలివేరు ఎల్లయ్య, కొండా అశోక్, కూకుట్ల కృష్ణ, చింతల శివ, వడ్డబోయిన వెంకటేష్, మచ్చ భాస్కర్, ఐతరాజు కిష్టయ్య, పండాల మైసయ్య, బోడ ఆంజనేయులు బందెల ఎల్లయ్య, మోకు దేవేందర్ రెడ్డి, రంగా కొండల్, కడారి కృష్ణ, ముత్యం ప్రకాష్, పాలడుగు రవి , గోరేమియా పాల్గొన్నారు.
Aug 31 2024, 17:14