VijayaKumar

Aug 28 2024, 22:38

రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడిచి చేయాలి: AISF


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఏ ఐ ఎస్ ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 8 వేల కోట్ల పైచిలుకు బకాయిలు ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని విద్యా వ్యవస్థ సక్రమంగా నడవడానికి వెంటనే విద్యాశాఖకు మంత్రిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు స్కాలర్షిప్ బకాయిల పేరుతో సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి వెంటనే బకాయిలను విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా పక్షాన డిమాండ్ చేశారు లేనిపక్షంలో విద్యార్థుల కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి నిర్వహిస్తామని అన్నారు.

VijayaKumar

Aug 28 2024, 17:28

సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మల్లం వెంకటేశం ఏకగ్రీవ ఎన్నిక

సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జాతీయ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్,జాతీయ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులు,రాష్ట్ర అధ్యక్షులు ఎలిగేండ్ల వెంకటేష్ ఆదేశాల మేరకు బుదవారం జాతీయ ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సురా స్రవంతి మల్లం వెంకటేశం కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మల్లం వెంకటేశం మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన జాతీయ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ కు మరియు జాతీయ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులు కు,రాష్ట్ర అధ్యక్షులు ఎలిగేండ్ల వెంకటేష్ కు, జాతీయ ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్ కు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సురా స్రవంతి కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మల్లం వెంకటేశం మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల నుంచి సహకారం లభించడం లేదన్నారు. అధికారుల్లో జవాబుదారితనం కొరవడిందన్నారు. సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో ఆ వ్యక్తికి కోరిన సమాచారం అందించాల్సిన బాధ్యత ఆయా అధికారులపై ఉందన్నారు. నిర్ణీత సమయంలోపు అందించకపోతే అప్పిలేట్ అధికారికి అప్పీల్ చేసుకోవచ్చన్నారు. ఇక్కడా స్పందన రాకపోతే రాష్ట్ర సమాచార చట్టం చీఫ్ కమిషనర్ కు అప్పీల్ చేసుకోవాలన్నారు. కమిషన్ స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటుందన్నారు.సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును నిరాకరించే అధికారం ప్రభుత్వ వ్యవస్థలో ఏ శాఖ, అధికారికి లేదన్నారు. సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి బయటకు తీస్తూ సమాచార హక్కు చట్టం గురించి పౌరులకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సురా స్రవంతి,మాదగోని శ్రీనివాస్ గౌడ్, పందుల రాజు గౌడ్, బత్తుల మహేష్ గౌడ్ పాల్గొన్నారు.

VijayaKumar

Aug 27 2024, 18:55

బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డిని పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య,ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ జిట్టా బాలకృష్ణా ని మంగళవారం  పరామర్శించిన ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య ,భువనగిరి పార్లమెంట్ సభ్యులు  చామల కిరణ్ కుమార్ రెడ్డి . జిట్టా బాల కృష్ణ రెడ్డి కి అందిస్తున్న వైద్యం వివరాలను యశోద డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని చెప్పారు.

VijayaKumar

Aug 27 2024, 18:44

సెప్టెంబర్ 2న కర్ణాటకలో IFWJ 78వ జాతీయ కౌన్సిలింగ్ మహాసభలను విజయవంతం చేయండి:TJU జిల్లా అధ్యక్షులు శానూర్ బాబా

తెలంగాణా జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు షానూర్ బాబా* భువనగిరి టౌన్ మంగళవారం 27 మంగళవారం దేశవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (ఐ ఎఫ్ డబ్ల్యు జె )78వ జాతీయ కౌన్సిల్ సమావేశాలు కర్ణాటక రాష్ట్రంలోని తుంకూరు జిల్లా టిప్టూర్ రీజినల్ సెంటర్ లో సెప్టెంబర్ 2న జరుగుతాయని తెలంగాణా జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్.షానూర్ బాబా పిలుపునిచ్చారు. మంగళవారం రోజున జిల్లా కార్యాలయం లొ జర్నలిస్టుల సమావేశంలో షానూర్ బాబా పాల్గొని మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో టిప్టూర్ లో రాష్ట్ర అధ్యక్షులు శివానంద్ తగ్గూర్ అధ్యక్షతన ఈ జాతీయ కౌన్సిల్ మహాసభలు మూడు రోజులు జరుగుతున్నాయని దేశంలో ఉన్న ఐఎఫ్డబ్ల్యూజే కమిటీ అనుబంధ సంఘాల రాష్ట్ర కమిటీ నాయకులు మరియు అన్ని జిల్లాల అధ్యక్షులు,కమిటీ సభ్యులు, హాజరవుతున్నారని ప్రతి ఒక్కరూ పాల్గొని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహమ్మద్ కాజఫసివుద్దీన్, జిల్లా గౌరవ అధ్యక్షులు చిన్నబత్తి నీ మత్యాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న, జిల్లా కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్ రహమాన్, జిల్లా కోశాధికారి బైరపాక సీరిల్, జిల్లా కార్యవర్గ సభ్యులు గట్టికొప్పుల శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 27 2024, 18:09

హైడ్రా పై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

హైడ్రా పై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన హైడ్రా వ్యవస్థ,దాని పనితీరు మీద ప్రజల నుండి వస్తున్న స్పందన చూసి  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  సీఎం రేవంత్ రెడ్డి గారికి లేఖ రాసారు. హైడ్రా పై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని. చెరువులు,కుంటలు కాపాడుకోవడానికి హైడ్రా తరహా వ్యవస్థను జిల్లాలో కూడ ఏర్పాటు చేయాలని ప్రజల నుండి వస్తున్న డిమాండ్ ను లేఖ ద్వారా బీర్ల ఐలయ్య   రేవంత్ రెడ్డికి కి విజ్ఞప్తి చేయడం జరిగింది.

VijayaKumar

Aug 27 2024, 17:58

వలిగొండ మండల కేంద్రంలో ఘనంగా పివి శ్యామ్ సుందర్ రావు జన్మదిన వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో పీవీ శ్యామ్ సుందర్ రావు  జన్మదినోత్సవం వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు .భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు,రాష్ట్ర నాయకులు శ్రీ పీవీ శ్యామ్ సుందర్ రావు  జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మండల కేంద్రంలోని లలిత కలెక్షన్ దగ్గర కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో రాచకొండ కృష్ణ,మాజి ఉప సర్పంచ్ మైసోల్ల మచ్చ గిరి రేగూరి అమరేందర్ , బుంగమట్ల మహేష్,దయ్యాల వెంకటేష్ ,రావుల పద్మారెడ్డి,వెల్లంకి మురళి, ఎర్రబోలు జంగయ్య పాతకోట నరేష్,కొక్కల ఆనంద్,తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 27 2024, 08:56

నీర్నెముల గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: ఆవుల నరసింహ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నెముల గ్రామంలో మంగళవారం  ఐ లవ్ నీర్నెముల ఫ్లెక్సీ ఏర్పాటు చేసి అనంతరం గ్రామ శాఖ అధ్యక్షులు ఆవుల నరసింహ  మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికై ఎల్లవేళలా ముందు ఉంటామని నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తూ గ్రామానికి మా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని వారు అన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం  అండదండలు గ్రామానికి నిండుగా ఉన్నాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఓర్సు తిరుమలయ్య, ఆవుల మురళి, ఆవుల పర్వతాలు, నోముల స్వామి, సుర్వి బాలరాజు, పాక నరసింహ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 26 2024, 22:19

కనుల పండుగగా కృష్ణాష్టమి వేడుకలు

కనులపండువగా కృష్ణాష్టమి వేడుకలు* నార్కట్ పల్లి మండలం అవురవాణి గ్రామంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను కనులపండువగా నిర్వహించారు. దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఉట్టిగొట్టే కార్యక్రమం ప్రారంభించారు.ఈ సందర్భంగా యాదవ సంఘం నాయకులు మాట్లాడుతూ ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుందని ప్రజలందరూ ఉత్సవంలో పాలుపంచుకోవాలని అన్నారు.అనంతరం గెలుపొందిన అభ్యర్థులకు బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దగోళ్ళ జక్కలి రాము, సరేగోళ్ళ ముక్కామూల లింగయ్య సభ్యులు నారబోయిన యాదయ్య, జక్కలి మల్లేష్, జక్కలి లింగయ్య, సైదులు, పెద్ద గోపాల్, యాదయ్య, సత్తయ్య, మారయ్య, పాండు, పరమేష్, వెంకన్న యాదవ్, బెల్లాలు, నరబోయిన బుచ్చయ్య, లక్ష్మయ్య మేకల శివ శంకర్ ఉట్టి కొట్టి అందరి మనసుని గెలుచుకొన్నారు ఇందులో ముఖ్య అతిధులుగా కాలం రవీందర్ రెడ్డి, ముక్కముల శ్రీను స్వామి,జక్కలి పరమేష్, ముప్పిడి రవి నడిగోటి అంజయ్య జలంధర్, బొంతల రమేష్ తదితరులు పాల్గొన్నారు

VijayaKumar

Aug 26 2024, 19:58

ఎల్ వో సి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని  మొగిలిపాక గ్రామ నివాసి అయిన పన్నాల నర్సిరెడ్డి s/o మల్లారెడ్డి కి మోకాళ్ళ అప పరేషన్ ఖర్చుల నిమిత్తం భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుంభం అనీల్ కుమార్  రెడ్డి సోమవారం ఒక లక్ష రూ.ఎల్ ఓ సీ చెక్ ను నర్సిరెడ్డి కి అందజేయడం జరిగింది .ఈ సందర్భంలో నాయకులు  మామిడి సత్తి రెడ్డి , ముద్దసని జయసింహా రెడ్డి, గ్రామశాఖ అద్యక్షులు పబ్బు ఎల్లయ్య , మాజీ అధ్యక్షులు జడిగే వెంకన్న , కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు మొగిలిపాక రాంబాబు , గుండేపురి సత్యం , గ్రామ కాంగ్రెస్ పార్టి నాయకులు మరియు కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమoలో పాల్గొనడం జరిగింది.

VijayaKumar

Aug 26 2024, 19:39

ఇంద్రపాలనగరం లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలోని ఇంద్రపాల నగరం గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా మండల నరసింహస్వామి బాబా ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకృష్ణుని పూజ గోవుల పూజ నిర్వహించడం జరిగింది .ఈ సందర్భంగా శ్రీకృష్ణుని అవతార లీలలు గురించి వివరించడం జరిగింది .శంకర్ గుట్ట ప్రాంతంలో గోశాలను ఏర్పాటు చేసే ఆలోచన వారు వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో తవుటం శంకరయ్య గురు స్వామి రుద్రాల గోపాల్ స్వామి రచ్చ దానయ్య జోగు నరసింహ పగడాల వేణుగోపాల్ మాజీ వార్డ్ నెంబర్ మండల అనిత జానయ్య బిజెపి మండల అధ్యక్షులు పల్లపు దుర్గయ్య బిజెపి ఉపాధ్యక్షులు బోనగిరి వెంకటేశం పలుగుల మల్లేశం చెవ్వ శ్రీనివాస్ నాగరాజు మహిళా భక్తులు పాల్గొన్నారు.