ఏపీలో స్పేస్ పార్క్ ఏర్పాటుపై డిప్యూటీ సీఎం చర్చలు..
శాస్త్ర, సాంకేతిక రంగం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిలో స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమావేశమై.. అంతరిక్ష రంగంలో సంస్థ చేసిన పరిశోధనల గురించి తెలుసుకున్నారు. స్పేస్ కిడ్జ్ సంస్థ పరిశోధనలు, తయారు చేసిన శాటిలైట్ల గురించి డిప్యూటీ సీఎంకు సంస్థ ప్రతినిధులు వివరించారు. ఇటీవల తయారుచేసిన అతి చిన్న శాటిలైట్ డిప్లయర్‌ను పవన్ కళ్యాణ్‌కు చూపించి.. దాని పని విధానం, ఉపయోగాలను వివరించారు.
పిల్లల్లో దాగిఉన్న అపరిమితమైన ఊహాశక్తిని వెలికి తీసి.. వారిని శాస్త్రవేత్తలుగా తయారుచేయడమే లక్ష్యంగా స్పేస్ కిడ్జ్ సంస్థ పనిచేస్తుంది. విద్యార్థి దశలోనే శాస్త్ర, సాంకేతిక రంగాలపై మక్కువ పెంచడమే ఈ సంస్థ లక్ష్యం. ముఖ్యంగా అంతరిక్ష పరిశోధనవైపు విద్యార్థులు మళ్లించే ఉద్దేశంతో సంస్థ పనిచేస్తుంది. దేశంలో యువ శాస్త్రవేత్తలను తయారుచేయడమే లక్ష్యంగా స్పెస్ కిడ్జ్ సంస్థ పనిచేస్తోంది. ముఖ్యంగా పలు ఉపగ్రహాలను ఈ సంస్థ అభివృద్ధి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో సంస్థ కార్యకలాపాలను విస్తృతం చేసే లక్ష్యంతో స్పెస్ కిడ్జ్ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిశారు.
విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విద్యార్థులు శాస్త్రవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో స్పెస్ పార్క్ ఏర్పాటుపై స్పెస్ కిడ్జ్ ప్రతినిధులతో ఆయన చర్చించారు. అంతరిక్ష పరిశోధన ఫలాలను సక్రమంగా వినియోగించుకుంటే దేశం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని తెలిపారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంపొందించడం ఎంతైనా అవసరమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. శాస్ర్తవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాస్త్ర, సాంకేతిక రంగాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. సాంకేతికతను ఉపయోగించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇదే సమయంలో విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికితీసి.. వారిని శాస్త్ర, సాంకేతిక రంగాల వైపు ఆకర్షితులయ్యేలా ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
Aug 25 2024, 21:46