ఏపీలో స్పేస్ పార్క్ ఏర్పాటుపై డిప్యూటీ సీఎం చర్చలు..

శాస్త్ర, సాంకేతిక రంగం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిలో స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమావేశమై.. అంతరిక్ష రంగంలో సంస్థ చేసిన పరిశోధనల గురించి తెలుసుకున్నారు. స్పేస్ కిడ్జ్ సంస్థ పరిశోధనలు, తయారు చేసిన శాటిలైట్ల గురించి డిప్యూటీ సీఎంకు సంస్థ ప్రతినిధులు వివరించారు. ఇటీవల తయారుచేసిన అతి చిన్న శాటిలైట్ డిప్లయర్‌ను పవన్ కళ్యాణ్‌కు చూపించి.. దాని పని విధానం, ఉపయోగాలను వివరించారు.

పిల్లల్లో దాగిఉన్న అపరిమితమైన ఊహాశక్తిని వెలికి తీసి.. వారిని శాస్త్రవేత్తలుగా తయారుచేయడమే లక్ష్యంగా స్పేస్ కిడ్జ్ సంస్థ పనిచేస్తుంది. విద్యార్థి దశలోనే శాస్త్ర, సాంకేతిక రంగాలపై మక్కువ పెంచడమే ఈ సంస్థ లక్ష్యం. ముఖ్యంగా అంతరిక్ష పరిశోధనవైపు విద్యార్థులు మళ్లించే ఉద్దేశంతో సంస్థ పనిచేస్తుంది. దేశంలో యువ శాస్త్రవేత్తలను తయారుచేయడమే లక్ష్యంగా స్పెస్ కిడ్జ్ సంస్థ పనిచేస్తోంది. ముఖ్యంగా పలు ఉపగ్రహాలను ఈ సంస్థ అభివృద్ధి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో సంస్థ కార్యకలాపాలను విస్తృతం చేసే లక్ష్యంతో స్పెస్ కిడ్జ్ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిశారు.

విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విద్యార్థులు శాస్త్రవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో స్పెస్ పార్క్ ఏర్పాటుపై స్పెస్ కిడ్జ్ ప్రతినిధులతో ఆయన చర్చించారు. అంతరిక్ష పరిశోధన ఫలాలను సక్రమంగా వినియోగించుకుంటే దేశం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని తెలిపారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంపొందించడం ఎంతైనా అవసరమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. శాస్ర్తవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాస్త్ర, సాంకేతిక రంగాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. సాంకేతికతను ఉపయోగించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇదే సమయంలో విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికితీసి.. వారిని శాస్త్ర, సాంకేతిక రంగాల వైపు ఆకర్షితులయ్యేలా ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

అల్లు అరవింద్ నాకు లైఫ్ ఇచ్చారు : పవన్ కల్యాణ్

మెగా వర్సెస్ అల్లు వివాదం రోజు రోజుకి మరింత ముదురుతున్నట్టు కనిపిస్తోంది. పైకి అంతా బాగానే ఉన్నప్పటికి లోలోపల మాత్రం ఇరు ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. ఇక అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. అల్లు అర్జున్ ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం, దానికి బన్ని అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అవ్వడం చక చక జరిగిపోయాయి. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్‌ను కూడా డిలీట్ చేశారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ సైతం పరోక్షంగా అల్లు అర్జున్ గురించి కామెంట్స్ చేయడం చర్చనీయంశంగా మారింది.

మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టిన రోజు సందర్బంగా అల్లు అర్జున్ , ఆయన భార్య స్నేహారెడ్డి ఎవరూ స్పందించలేదు. ఇది చాలదన్నట్టు పవన్ కల్యాణ్ ఇటీవల అల్లు అర్జున్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. 40 ఏళ్ల క్రితం హీరోలు అడువులను కాపాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు దీనికి పూర్తి విరుద్ధంగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న హీరోలు అడువులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పి పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. నేను ఇండస్ట్రీకి చెందిన వాడినేనని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.

ఇలాంటి సినిమాలు చేయడానికి తాను చాలా ఇబ్బంది పడతానని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేశారని మెజార్టీ నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇటువంటి తరుణంలో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన తర్వాత తొలిసారి అల్లు అర్జున్ బయటకొచ్చారు. సుకుమార్ భార్య నిర్మాతగా వ్యవహరించిన మారుతీ నగర్‌ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ హాజరయారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మై డియర్‌ ఫ్యాన్స్‌.. మీరే నా ఆర్మీ, నా ఫ్యాన్స్‌ అంటే నాకు పిచ్చి. హీరోని చూసి చాలామంది ఫ్యాన్స్‌ అవుతారు, కానీ నేను నా ఫ్యాన్స్‌ని చూసి హీరోనయ్యా. నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లయినా మీరు చూపే ప్రేమ అస్సలు తగ్గలే. నన్ను ప్రేమించే వాళ్ల కోసం నిలబడగలగాలి. మన అనుకున్న వాళ్ల కోసం ఎంత వరకైనా వెళ్తా..! అంటూ కామెంట్ చేశారు. దీంతో మరోసారి మెగా వర్సెస్ అల్లు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది . సోషల్ మీడియా వేదికగా ఇరు వర్గాల అభిమానులు యుద్దానికి దిగుతున్నారు.

చిరంజీవి లేకపోతే అల్లు అర్జున్ అనేవాడు ఎవరంటూ మెగా అభిమానులు ప్రశ్నిస్తుండగా, అల్లు రామలింగయ్య లైఫ్ ఇవ్వకపోతే చిరంజీవి ఎవరంటూ అల్లు అభిమానులు మెగా అభిమానులకు కౌంటరిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. నాకు లైఫ్ ఇచ్చిన వారిలో అమ్మ-నాన్న తర్వాత మా అన్నయ్య చిరంజీవి రెండోది అల్లు అరవింద్‌ని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఆయనే నన్ను హీరోగా లాంచ్ చేశారని, నన్ను హీరోగా పెట్టి రెండు సినిమాలు చేశారని పవన్ కల్యాణ్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను అల్లు అర్జున్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. అల్లు అరవింద్ లేకపోతే పవన్ కల్యాణ్ ఎక్కడ ఉండేవాడో కూడా తెలియదంటూ అల్లు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై పవన్ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

రాజమౌళితో సినిమా చేయనని చెప్పిన త్రిష..?

దర్శకుడు ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా వరుస సినిమాలు హిట్ కొడుతున్న దర్శకుడు ఆయన. రాజమౌళి పేరు చెప్పగానే తెలుగు ఇండస్ట్రీ బాక్సాఫీస్ రికార్డుల గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన దర్శకుడు. అలాంటి దర్శకుడుతో సినిమా చేయాలని హీరో, హీరోయిన్స్ అయిన కలలు కంటారు. కానీ రాజమౌళి సినిమాలో నటించే అవకాశం వచ్చినా , చేయనని చెప్పారట హీరోయిన్ త్రిష.

రాజమౌళి దర్శకత్వంలో త్రిష మిస్ చేసుకున్న సినిమా మరేదో కాదు మర్యాద రామన్న. స్టార్ కమెడియన్ సునీల్ ఈ చిత్రంలో హీరోగా చేశాడు. అతనికి జోడిగా కొత్త భామ సలోని నటించినది. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ యాక్షన్ కామెడీ డ్రామా 2010లో విడుదలై సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. రూ. 12 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన మర్యాద రామన్న ఫుల్ రన్ లో రూ. 28 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిషను తీసుకుందామని అనుకున్నారట

ఆమెతో సంప్రదింపులు జరిపారగా... సునీల్ వంటి కమెడియన్ పక్కన తాను నటించిన‌ని త్రిష డైరెక్ట్‌గానే చెప్పేసింద‌ట‌. రాజమౌళి దర్శకత్వంలో పనిచేసే అవకాశాన్ని సునీల్ కార‌ణంగా వదులుకుందట. ఇక‌ ఆ తర్వాత మ‌రికొంతమంది హీరోయిన్లను పరిశీలించిన రాజమౌళి.. ఫైనల్ గా సలోనిని సెలెక్ట్ చేశార‌ట‌. గతంలో ఓ ఇంటర్వ్యూలో సునీల్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించడం విశేషం.అప్పటికే తెలుగు మరియు తమిళ భాషల్లో త్రిష స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది. ఆ కారణంగానే రాజమౌళి సినిమా నుంచి త్రిష తప్పుకుందని తెలుస్తోంది. త్రిష ఇటీవలే మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది.

పొన్నియర్ సెల్వం రెండు పార్ట్‌ల్లో అలరించిన త్రిష, తమిళ స్టార్ హీరో విజయ్ , లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్‌గా నటించింది. లియో సినిమా సక్సెస్ తో త్రిష డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీ అయిపోయింది బ్యూటీ. సౌత్ స్టార్ హీరోలుగా వెలుగు వెలుగుతున్న చిరంజీవి, విజయ్, అజిత్, కమల్, మోహన్ లాల్ సినిమాలలో నటిస్తూ బిజీ అయిపోయింది త్రిష. చిరుతో విశ్వంభర సినిమాలో నటిస్తోంది బ్యూటీ.

కోహ్లి చేసిన ఆ తప్పుతోనే వరల్డ్ కప్ కోల్పోయాం: రోహిత్

2019 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీఫైనల్స్‌లోనే నిష్క్రమించడానికి గల కారణాలను రోహిత్ శర్మ వివరించాడు. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి పేలవమైన వ్యూహాలే తమ జట్టు ఓటమికి పరోక్ష కారణమని పేర్కొన్నాడు. అయితే ఈ వ్యాఖ్యలను భారత జట్టు కెప్టెన్ రోహిత్ తాజాగా చేయలేదు. గతంలో చేసిన ఈ కామెంట్స్ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్‌లోకి వచ్చింది.

2019 వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో ఓటమికి ప్రధాన కారణం భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానంలో సరైనోడే లేకపోవడమే అని హిట్ మ్యాన్ పేర్కొన్నాడు. నాలుగో స్థానంలో అంబటి రాయుడు అని ఈ మెగాటోర్నీకి ముందు టీమ్ మేనేజ్మెంట్ ఓ అంచనాకు వచ్చింది. కానీ అనూహ్యంగా రాయుడును ఆ ప్రపంచకప్‌కు ఎంపిక చేయలేదు.

అయితే నాలుగో స్థానంలో ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే ఫలితం మరోలా వచ్చి ఉండేదని రోహిత్ పేర్కొన్నాడు. కివీస్‌తో జరిగిన సెమీస్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ 72 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ''నాలుగో స్థానంలో వచ్చే బ్యాటర్ జట్టుకు ఎంతో ముఖ్యమని నేను భావిస్తాను. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ ఎలా ఆలోచిస్తారనే దానిపై ఇది ఆధారపడి ఉంది. ధోనీ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే బాగుండేది అని నా అభిప్రాయం'' అని రోహిత్ పేర్కొన్నాడు.

2019 వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా రోహిత్ నిలిచిన విషయం తెలిసిందే. 81 సగటుతో 648 పరుగులు చేశాడు. దీనిలో అయిదు శతకాలు కూడా ఉన్నాయి. కాగా, ఆ తర్వాత జరిగిన టీ20 ప్రపంచకప్ అనంతరం రోహిత్ టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న విషయం తెలిసిందే. హిట్ మ్యాన్ సారథ్యంలో టీమిండియా 2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్, 2023 వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్స్‌‌కు చేరింది. ఇటీవల జరిగిన 2024 టీ20 వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచింది.

తెలంగాణలో మరో ఐదురోజులు వానలే వానలు..!

తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. నిన్న సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు కురవగా.. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాపాతం రికార్డయ్యింది. మరో వైపు రాగల ఐదురోజుల పాటు తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. నిన్న సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు కురవగా.. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాపాతం రికార్డయ్యింది. మరో వైపు రాగల ఐదురోజుల పాటు తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఆదివారం పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది.

పలుచోట్ల గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వస్తాయని.. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని తెలిపింది.

హైడ్రా లిస్టులో ప్రముఖులు - కూల్చివేత జాబితా ఇదే..!!

హైడ్రా ఇప్పుడు సంచలనంగా మారింది. హీరో నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో ఒక్క సారిగా హైడ్రా నిర్ణయాల పైన ఉత్కంఠ పెరుగుతోంది. హైడ్రా ఇప్పటి వరకు పలువురు ప్రముఖుల ఆక్రమణలు కూల్చి వేసింది. 18 చోట్ల కూల్చివేతలు చేసినట్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజుతో సహా సునీల్ రెడ్డికి సంబంధించిన ఆక్రమణలను కూల్చివేసింది. ప్రభుత్వానికి చెందిన 43 ఎకరాల స్థలం ఇప్పటి వరకు స్వాధీనం చేసుకుంది

హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. నగర పరిధిలోని పలు చెరువుల్లో ఉన్న ఆక్రమణలను తొలిగిస్తోంది. ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో 43 ఎకరాల స్థలం స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి హైడ్రా నివేదిక ఇచ్చింది. జాబితాలో పలు రంగాలకు చెందిన ప్రముఖలు ఉన్నారు. చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్రాజు, కావేరీ సీడ్స్ భాస్కర్రావు, ప్రొ కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలు కూల్చివేసినట్లు రిపోర్ట్ లో వెల్లడించింది. లోటస్పాండ్, మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్ నగర్, గాజుల రామారం, అమీర్ పేట్ లో అక్రమ కట్టడాలు కూల్చేసినట్లు హైడ్రా రిపోర్ట్ లో పేర్కొంది

18 చోట్ల కూల్చివేత

ఇక, హైడ్రా నివేదిక ప్రకారం బంజారా హిల్స్ లో ఆక్రమించుకున్న రెస్టారెంట్ భవనం కూల్చివేసారు. చింతల్ చెరువులో కబ్జాలను కూల్చివేసినట్లు వెల్లడించింది. నందగిరి హిల్స్ లోఎకరం స్థలం స్వాధీనం చేసుకుంది. నందగిరి హిల్స్ కబ్జాలను అడ్డుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు నమోదు చేసింది. రాజేంద్రనగర్ చెరువులు కబ్జాలు కూల్చివేసింది. ఎంఐఎం ఎమ్మెల్యే మోబిన్ నిర్మిస్తున్న భవనం కూల్చివేసినట్లు నివేదికలో వెల్లడించింది. ఎంఐఎం ఎం ఎల్ సి మిర్జా బేగ్ నిర్మించిన రెండంతస్తుల భవనం కూల్చివేసినట్లు పేర్కొంది. చందానగర్ ఏర్ల చెరువులో కబ్జాలు నిర్మూలించింది

ప్రముఖుల పై గురి

ప్రగతి నగర్ ఎర్రగుంట లో నిర్మించిన అక్రమ కట్టడాలు కూల్చివేసినట్లు రిపోర్టులో పేర్కొంది. బోడుప్పల్ చెరువులో నిర్మించిన ఆక్రమణలతో పాటుగా గండిపేట చెరువులో నిర్మించిన ఫామోజులు కూల్చివేసినట్లు వెల్లడించింది. మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు సంబంధించిన ఒరో స్పోర్ట్ కూల్చివేసినట్లు రిపోర్టు చేసింది. టీటీడీ మాజీ సభ్యుడు కావేరి సీడ్స్ భాస్కర రావుఫామ్ హౌస్ కూల్చివేసింది. బీజేపీ నేత సునీల్ రెడ్డి ఫామ్ హౌస్ ఆక్రమించి కట్టటం తో కూల్చింది. ప్రో కబడ్డీ యజమాని అనుపమ అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా మాదాపూర్ లోని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో ఇప్పటి వరకు హైడ్రా స్వాధీనం చేసుకున్న భూముల గురించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

ఘనంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు

52వ జన్మదిన వేడుకల సందర్భంగా భూపాల్ రెడ్డి తన స్వగ్రామమైన ఉరుమండ్లలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు

అనంతరం వి.టి.కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితుల కోలాహలం మరియు వేద పండితుల ఆశీర్వచనాల మధ్యలో భారీ కేక్ ను భూపాల్ రెడ్డి కట్ చేశారు

ఈ సందర్భంగా మాజీ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ భూపాల్ రెడ్డి కి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

52వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు కంచర్ల భూపాల్ రెడ్డి గారిని భారీ గజమాలతో సత్కరించారు

కంచర్ల భూపాల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు... అనాథ శరణాలయంలో అన్నదాన కార్యక్రమాలు మరియు గొల్లగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు పంచడమే కాకుండా అనాధలకు దుప్పట్లు కూడా పంపిణీ చేశారు

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు భోనగిరి దేవేందర్, నల్గొండ, కనగల్ మండల అధ్యక్షులు దేప వెంకట్ రెడ్డి, ఐతగోని యాదయ్య, మహిళా నాయకులు శరణ్య రెడ్డి,కొప్పుల విమలమ్మ మరియు తదితర ప్రముఖ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

ఎవ్వరినీ వదిలేది లేదు.. చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వండి: మంత్రి పొన్నం

చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని మంత్రి పొన్నం హెచ్చరించారు. ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని చెప్పారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ చెరువులు ఆక్రమణకు గురయ్యాయో ఆయా సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

గ్రేటర్ హైదరాదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఉక్కుపాదం మోపుతోంది. చెరువులను ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తుంది. ఇప్పటికే నగరం, శివారు ప్రాంతాల్లోని చాలా అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. శనివారం (ఆగస్టు 24) మాదాపూర్‌లో సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూడా కూల్చేశారు. దీంతో హైడ్రా అంటేనే అక్రమ నిర్మాణదారులు వణికుపోతున్నారు.

ఈ నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్ నగరానికి ఇంఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్న పొన్నం ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువల ఆక్రమణలపై తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రకృతి, పర్యావరణాన్ని కాపాడాలని.. జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యయానే సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే దానిని ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంత పెద్ద వాళ్లు ఉన్నా చెరువులు , కుంటలు ఆక్రమణకు గురైతే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఈరోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్ తరాలకు ఇచ్చే వరం ఇది అని అన్నారు. మీ ప్రాంతంలో చెరువులు ఆక్రమణకు గురైతే ఎంత పెద్ద వారైనా.. ఏ పార్టీ వారైనా వదిలేది లేదని ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు.

ముఖ్యంగా హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ చెరువుల పరిరక్షణకు జరుగుతున్న కార్యక్రమంలో జంట నగరాల్లో హైదరాబాద్ ,రంగారెడ్డి ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. ప్రకృతిని, భవిష్యత్ తరానికి చెరువులను అందించటం కోసం ఈ ప్రక్రియలో స్వచ్ఛందంగా పాల్గొనాలని సూచించారు. మీ ప్రాంతంలోని చెరువులను రక్షించుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా, వ్యక్తిగతంగా, ఉద్దేశ్యపూర్వకంగా పోరాటం చేయటం లేదని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పరివర్తన తేవాలని చేస్తున్న చర్యలో భాగంగానే హైడ్రాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనలో తీసుకున్న గొప్ప చర్య ఇది అని అన్నారు. ఎక్కడెక్కడైతే చెరువుల ఆక్రమణకు గురయ్యేయో అక్కడ సమాచారం ఇవ్వాలని మంత్రి ప్రజలకు సూచించారు.

హైడ్రా దూకుడు.. నెక్ట్స్ టార్గెట్ ఎవరు...?

నగరంలో ఒక సంచలనం.. కబ్జాలు, అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణలు అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ హైడ్రా. ఇప్పటికే నగరంలోచాలా చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. తాజాగా మాదాపూర్‌లోని నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను సయితం కూల్చివేసింది. ఇక ఇప్పుడు హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఎవరు?

నగరంలో ఒక సంచలనం.. కబ్జాలు, అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణలు అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ హైడ్రా. ఇప్పటికే నగరంలోచాలా చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. తాజాగా మాదాపూర్‌లోని నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను సయితం కూల్చివేసింది. ఇక ఇప్పుడు హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఎవరు? ఏం జరగబోతోంది?. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఆక్రమణలు చేసిన ప్రముఖుల్లో టెన్షన్ పెంచుతోంది.

ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ఇప్పుడు అందరి దృష్టి మాజీ మంత్రి మల్లారెడ్డిపై హైడ్రా అధికారులు దృష్టిసారించినట్టు తెలుస్తోంది. చెరువులు, నాలాలు ఆక్రమించి మల్లారెడ్డి నిర్మించిన యూనివర్సిటీ, కాలేజీ, హాస్పిటల్‌పై హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. మల్లారెడ్డి ఆక్రమించి నిర్మించిన చెరువులు, నాలాలను హైడ్రా అధికారులు పరిశీలించారు.

రేపో, మాపో మల్లారెడ్డి అక్రమ కట్టడాలను కూల్చివేతకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చట్ జిల్లా, ఘట్‌కేశరి మండలం, వెంకటాపూర్‌లోని అనురాగ్ విశ్వవిద్యాలయం భవనాలను వెంకటాపూర్ నాదం చెరువులో నిర్మించారని నీటిపారుదలశాఖ ఏఈ ఐటీ కారిడర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున ఫైర్-కోర్టులోనే తేల్చుకుంటా..!

తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గచ్చిబౌలిలోని తన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను అక్రమ కట్టడం పేరుతో ఇవాళ కూల్చివేయడాన్ని టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు హైడ్రా, తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ చర్యలతో ప్రజలు తమను తప్పుగా అనుకోకుండా ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. చట్టవిరుద్ధంగా చేసిన కూల్చివేతపై కోర్టులోనే తేల్చుకుంటానని నాగార్జున వెల్లడించారు.

స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని అక్కినేని నాగార్జున తన ప్రకటనలో తెలిపారు. తమ ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం, చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలిపేందుకు ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. అదో ఓ పట్టా భూమి అని, ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదని నాగార్జున పేర్కొన్నారు. అది ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం అన్నారు. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపైనా కోర్టు స్టే ఇచ్చిందన్నారు.

స్పష్టంగా చెప్పాలంటే ఈ కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగిందని నాగార్జున తెలిపారు. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదన్నారు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడినని తెలిపారు.

తాజా పరిణామాల వల్ల, తాము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముందని, ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే తమ ప్రధాన ఉద్దేశమన్నారు. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా తాము కోర్టును ఆశ్రయిస్తామని, అక్కడ తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు నాగార్జున తెలిపారు.