హైడ్రా దూకుడు.. నెక్ట్స్ టార్గెట్ ఎవరు...?
నగరంలో ఒక సంచలనం.. కబ్జాలు, అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణలు అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ హైడ్రా. ఇప్పటికే నగరంలోచాలా చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. తాజాగా మాదాపూర్‌లోని నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను సయితం కూల్చివేసింది. ఇక ఇప్పుడు హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఎవరు?
నగరంలో ఒక సంచలనం.. కబ్జాలు, అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణలు అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ హైడ్రా. ఇప్పటికే నగరంలోచాలా చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. తాజాగా మాదాపూర్‌లోని నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను సయితం కూల్చివేసింది. ఇక ఇప్పుడు హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఎవరు? ఏం జరగబోతోంది?. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఆక్రమణలు చేసిన ప్రముఖుల్లో టెన్షన్ పెంచుతోంది.
ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ఇప్పుడు అందరి దృష్టి మాజీ మంత్రి మల్లారెడ్డిపై హైడ్రా అధికారులు దృష్టిసారించినట్టు తెలుస్తోంది. చెరువులు, నాలాలు ఆక్రమించి మల్లారెడ్డి నిర్మించిన యూనివర్సిటీ, కాలేజీ, హాస్పిటల్‌పై హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. మల్లారెడ్డి ఆక్రమించి నిర్మించిన చెరువులు, నాలాలను హైడ్రా అధికారులు పరిశీలించారు.
రేపో, మాపో మల్లారెడ్డి అక్రమ కట్టడాలను కూల్చివేతకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చట్ జిల్లా, ఘట్‌కేశరి మండలం, వెంకటాపూర్‌లోని అనురాగ్ విశ్వవిద్యాలయం భవనాలను వెంకటాపూర్ నాదం చెరువులో నిర్మించారని నీటిపారుదలశాఖ ఏఈ ఐటీ కారిడర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Aug 25 2024, 08:58