నేడు అచ్యుతాపురం ప్రమాద స్థలానికి చంద్రబాబు..
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ప్రమాద ఘటన స్థలాన్ని, బాధిత కుటుంబాలను నేడు సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. ఉదయం 10:30 కు విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి విశాఖకు చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ప్రమాద ఘటన స్థలాన్ని, బాధిత కుటుంబాలను నేడు సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. ఉదయం 10:30 కు విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి విశాఖకు చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు. 12 :10 కి విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి మెడికవర్ హాస్పిటల్, వెంకోజిపాలెంకు చేరుకోనున్నారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులను పరామర్శించి, వైద్య బృందాలతో చంద్రబాబు మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రమాద ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లనున్నారు. ప్రమాదం జరిగిన ఎస్ఎన్షియ అడ్వాన్స్డ్ మెడికల్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీని పరిశీలించనున్నారు. అనంతరం తిరిగి విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడకు బయలుదేరి ఉండవల్లి నివాసానికి సాయంత్రం నాలుగున్నరకు చంద్రబాబు చేరుకోనున్నారు.
ఫార్మా ప్రమాదంలో మృతుల వివరాలు..
1. నీలాపు రామిరెడ్డి (48) అసిస్టెంట్ జనరల్ మేనేజర్
2. ప్రశాంత్ హంస (33) ప్రొడక్షన్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్
3. నారాయణరావు (33) అసిస్టెంట్ మేనేజర్
4. గణేష్ కుమార్ (32) సీనియర్ ఎగ్జిక్యూటివ్
5. హారిక (22) ట్రైని ఇంజనీర్
6. రాజశేఖర్ (21) ట్రైనీ ప్రాసెస్ ఇంజనీర్
7. సతీష్ (31) సీనియర్ ఎగ్జిక్యూటివ్
8. నాగబాబు (35) అసిస్టెంట్ మేనేజర్
9. నాగేశ్వర రామచంద్ర రావు 47 (అసిస్టెంట్ మేనేజర్, టీం లీడర్)
10. సన్యాసినాయుడు (55) హౌస్ కీపింగ్
11. చిన్నారావు (33) పెయింటర్
12. పార్థసారథి (27) ఫీట్టర్
13. మోహన్ దుర్గాప్రసాద్ (19) హౌస్ కీపింగ్ బాయ్
14. ఆనందరావు (36) అసిస్టెంట్ మేనేజర్
15. సురేంద్ర (37) అసిస్టెంట్ మేనేజర్
16. వెంకట సాయి (27) సీనియర్ ఎగ్జిక్యూటివ్
17. చిరంజీవి (24) ఫిట్టర్
18. గుర్తు తెలియని వ్యక్తి
ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి చెందిన 8 మంది, ఇంజనీరింగ్ కి చెందిన ఐదుగురు, ల్యాబ్ కు నలుగురు చెందిన మృతి చెందారు. ఫార్మాలో చేరిన నెలరోజుల్లోనే రాజశేఖర్, సతీష్, మోహన్ దుర్గాప్రసాద్ మృతి చెందారు. ట్రైనీ ప్రాసెస్ ఇంజనీర్ రాజశేఖర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ సతీష్, హౌస్ కీపింగ్ బాయ్‌గా మోహన్ దుర్గాప్రసాద్ మృతి చెందారు. నిన్న అర్ధరాత్రి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు 18 మృతదేహాలను తరలించారు. నష్టపరిహారం ప్రకటించేంత వరకూ పోస్టుమార్టం చేయడానికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేదా జిల్లా అధికారి కలెక్టర్ అధికారికంగా ప్రకటిస్తేనే పోస్టుమార్టానికి అంగీకరిస్తామని బంధువులు తెలిపారు.
Aug 22 2024, 17:45