జగన్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ వెహికిల్‌, జామర్‌.. హైకోర్టు కీలక ఆదేశాలు

మాజీ ముఖ్యమంత్రి భద్రత విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంటుందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ సెక్యూరిటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

జగన్‌కు భద్రత కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది. తన భద్రతకు ముప్పు ఉందని, సెక్యూరిటీ తగ్గించేశారని, రిపేర్‌కు వచ్చిన వెహికిల్‌ను కేటాయించారని హైకోర్టులో జగన్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. జగన్‌ సెక్యూరిటీపై విచారణ జరిపిన హైకోర్టు.. మరో బుల్లెట్ ప్రూఫ్‌ వెహికిల్ కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కోర్టు ఆదేశాలతో జగన్‌కు మరొక బుల్లెట్ ప్రూఫ్‌ వెహికిల్‌ కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇక దాడులు జరుగుతాయని అనుమానం ఉన్న చోట జగన్‌ పర్యటించే సమయంలో జామర్‌ కూడా కేటాయిస్తామని కోర్టుకు తెలిపింది. మాజీ ముఖ్యమంత్రి భద్రత విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంటుందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

మాజీ సీఎంలకు భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేకంగా ఎలాంటి నిబంధనలు లేనప్పటికీ.. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. దీంతో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.

తనకు ఉన్న సెక్యూరిటీని యథావిథిగా కొనసాగించేలా ఆదేశాలివ్వాలని జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన భద్రత సిబ్బందిని తగ్గించారని, ఇల్లు, ఆఫీసు దగ్గర సెక్యూరిటీని పూర్తిగా తొలగించారని పిటిషన్‌లో పేర్కొన్నారు జగన్.

తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్‌ కూడా ప్రయాణానికి అనుకూలంగా లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అందులో ఏసీ పని చేయడం లేదని పిటిషన్‌లో స్పష్టం చేశారు. దీంతో ఓ పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకోవాల్సి వచ్చిందన్నారు జగన్.

వినేష్ ఫొగాట్‌పై ఒలింపిక్ సంఘం అనర్హత వేటు.. రెజ్లింగ్‌లో బరువుకు సంబంధించిన నియమాలు ఏమిటి?

వినేష్ ఫొగాట్‌పై ఒలింపిక్ సంఘం అనర్హత వేటు.. రెజ్లింగ్‌లో బరువుకు సంబంధించిన నియమాలు ఏమిటి

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు భారీ షాక్‌ తగిలింది. అధిక బరువు కారణంగా స్టార్ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది.

వినేష్ మహిళల 50 కిలోల విభాగంలో ఫైనల్ ఆడాల్సి ఉంది, అయితే మ్యాచ్‌కు ముందు బరువును పరిశీలించినప్పుడు,ఆమె అధిక బరువుతో ఉన్నట్లు తేలింది.

ఆ తర్వాత ఆమెను అనర్హురాలిగాగా ప్రకటించారు. ఆమె దాదాపు 100 గ్రాముల బరువుతో ఉన్నట్లు చెబుతున్నారు.

అటువంటి పరిస్థితిలో,రెజ్లింగ్‌లో బరువుకు సంబంధించిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆ తర్వాత ఆమెని ఎందుకు అనర్హులుగా ప్రకటించారో మీకే అర్థమవుతుంది.

తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణ విభాగం

తెలంగాణలో రాగల రెండురోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

తెలంగాణలో రాగల రెండురోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

బుధవారం నుంచి గురువారం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట

మహబూబాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి

నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని పేర్కొంది.

బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ జోలికొస్తే సహించేది లేదు...చాడ కిషన్ రెడ్డి

 రేవంత్ మెప్పు పొందేందుకే కోమటిరెడ్డి వింత చేష్టలు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది

విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి

నల్లగొండలో బిఆర్ఎస్ ఆఫీసును కూల్చేస్తాం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పదేపదే అనే మాటలను ఇక ఆపాలని పార్టీ ఆఫీసు జోలికి వస్తే సహించేది లేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి హెచ్చరించారు.

ఆయన బుధవారం నల్లగొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమిలోనే బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించడం జరిగిందని

పార్టీ ఆఫీసు కోసం ఏ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించలేదు అనే విషయాన్ని కోమటిరెడ్డి గ్రహించాలన్నారు. మీ కాంగ్రెస్ పార్టీకి ఆఫీసు లేకపోతే మీరు కూడా భూమి ప్రభుత్వం నుంచి కేటాయించుకొని నిర్మించుకోండి కానీ ఇతర పార్టీ ఆఫీసుల మీద పడి కూల్చేస్తాం అనే మాటలు మాట్లాడడం సరికాదన్నారు. మేము చంద్రబాబు రేవంత్ రెడ్డి ల తొత్తులం కాదు.

అలాంటి వారికి భయపడే ప్రసక్తే లేదు. మేమంతా తెలంగాణ ఉద్యమకారులం . టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ . మా జోలికొచ్చిన, మా ఉద్యమకారుల జోలికి వచ్చిన, మా పార్టీ ఆఫీస్ జోలికి వచ్చిన, ఉపేక్షించేది లేదని హెచ్చరించారు .

30 ఏళ్లు మీరు రాజకీయంలో ఉండి నల్లగొండలో కనీసం పార్టీ ఆఫీసు నిర్మించుకోలేదని ..కార్యకర్తలు మొత్తం మీ ఇంటి చుట్టూ తాబేదారులుగా తిరగాలని ఆలోచనతోనే పార్టీ ఆఫీసు నిర్మించకుండా ఉన్నారన్నారు.. రేవంత్ రెడ్డి మెప్పు పొందేందుకే బిఆర్ఎస్ పార్టీపై మాటల తూటాలు పేల్చుతున్నారని మీరు ఏందో నల్లగొండ ప్రజలతోపాటు రాష్ట్ర ప్రజలకు తెలుసు అన్నారు. ఆర్ఎస్ పార్టీ ఆఫీసు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సైతం ఢిల్లీలో భూమి ఇస్తే అక్కడ ఆఫీసు నిర్మాణం చేశామని

కానీ రాష్ట్రంలో మీరు ఎందుకు టిఆర్ఎస్ పార్టీ ఆఫీసుల మీద పడ్డారు అని ప్రశ్నించారు.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో మీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేస్తుందని రానున్న రోజుల్లో ప్రజల నుంచి మీకు బహిష్కరణ తప్పదని హెచ్చరించారు.. వ్యక్తిగత కుట్రలు ద్వేషాలకు స్వస్తి చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.. 6 గ్యారంటీలతోపాటు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 420 హామీలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ పయనించాలి తప్ప టిఆర్ఎస్ పార్టీపై ఏడవడం సరికాదన్నారు.. పదేళ్ల కాలంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ ఆఫీసు జోలికి వెళ్లకుండా ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్లిన విషయం దృష్టిలో ఉంచుకోవాలని గుర్తు చేశారు. రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఇప్పటివరకు సగం మంది రైతులకు కూడా చేయని మీరు రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.. టిఆర్ఎస్ పార్టీ పై విమర్శలు ఆపి ఇక రాష్ట్ర ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని అది వీడి పార్టీ ఆఫీసును కూల్చాలని టిఆర్ఎస్ పార్టీ వాళ్లపై విమర్శలు చేయాలని ఆలోచిస్తే మాత్రం ప్రజల నుంచి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కనగల్ పిఎసిఎస్ చైర్మన్ తోటి శ్రీనివాస్ ఎస్కే లతీఫ్ పోలే వెంకటాద్రి కర్నాటి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

సమస్యలపై డిప్యూటీ సీఎంకు మెురపెట్టుకున్న ఏపీ క్యాబ్ డ్రైవర్లు..

హైదరాబాద్‌లో ఏపీ క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆ సంఘం ప్రతినిధులు పవన్‌కు అర్జీలు సమర్పించారు. తెలంగాణలో ఏపీ వాహనాలు తిరిగేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయనకు మెురపెట్టుకున్నారు. దీంతో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, కుటుంబం గడవడం కూడా కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. అందుకు అనుగుణంగా పలు సమస్యల పరిష్కార దిశగా పావులు కదుపుతోంది.

ముఖ్యంగా ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని తెచ్చి ఆ సమస్య తీర్చింది. దీని వల్ల ప్రజలు సహా నిర్మాణ రంగ కార్మికులకు ఎంతో లబ్ధి చేకూరుతోంది. అలాగే అమరావతి రైతుల పోరాటాన్ని ప్రశంసిస్తూ వారికి తగిన న్యాయం చేస్తోంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి సమస్యలు విన్నవించేందుకు ప్రజలు భారీ ఎత్తున కూటమి ఎమ్మెల్యేలు, మంత్రుల వద్దకు క్యూ కడుతున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ప్రతి రోజూ వందల కొద్ది అర్జీలు వస్తున్నాయి.మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయానికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.

ప్రజాదర్బార్‌లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సమస్యలు విన్నవించేందుకు అర్జీదారులు పోటీ పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని పవన్ నేరుగా కలిశారు. వారి సమస్యలు ఓపికగా విని పరిష్కార దిశగా చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లో ఏపీ క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆ సంఘం ప్రతినిధులు పవన్‌కు అర్జీలు సమర్పించారు. తెలంగాణలో ఏపీ వాహనాలు తిరిగేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయనకు మెురపెట్టుకున్నారు.

దీంతో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, కుటుంబం గడవడం కూడా కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాబ్ డ్రైవర్ల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు సహకరించుకోవాలని డిప్యూటీ సీఎం హితవు పలికారు. దీనిపై తగు చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.

అమెరికాలో విద్య పేరుతో కన్సల్టెన్సీ మోసం చేసిందని ఓ విద్యార్థిని డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేసింది. విద్యార్థినిని మోసం చేసిన కన్సల్టెన్సీపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో ఆయన స్వయంగా మాట్లాడి వారి సమస్యలు, ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. సంబంధిత సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.

ఉపాధి’లో అక్రమాలపై చర్యలు

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో జాతీయ ఉపాధి పథకంలో వెలుగు చూసిన అక్రమాలపై అధికారులు చర్యలు చేపట్టారు. పలువురు ప్రభుత్వ ఉద్యోగులను ఉపాధి కూలీలుగా చూపుతూ వారి ఖాతాల్లో నగదు బదిలీ చేసిన వ్యవహారంలో ఓ ఫీల్డ్‌ అసిస్టెంట్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో జాతీయ ఉపాధి పథకంలో వెలుగు చూసిన అక్రమాలపై అధికారులు చర్యలు చేపట్టారు. పలువురు ప్రభుత్వ ఉద్యోగులను ఉపాధి కూలీలుగా చూపుతూ వారి ఖాతాల్లో నగదు బదిలీ చేసిన వ్యవహారంలో ఓ ఫీల్డ్‌ అసిస్టెంట్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. మరొకర్ని బదిలీ చేశారు. ముగ్గురు మేట్లను ఉపాధి హామీ పనుల నుంచి తొలగించారు.

బర్లగూడెం పంచాయతీలో జరిగిన ఉపాధి అక్రమా లపై జూలై 9న ‘ఉపాధి సొమ్ము ఉద్యోగుల ఖాతా ల్లోకి’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఉపాధి హామీ’లో అక్రమాలపై విచారణ చేపట్టాలని ఖమ్మం జిల్లా డీఆర్‌డీఏ అడిషనల్‌ పీవోను ఉన్నతాధికారులు ఆదేశించారు.

ఈ విచారణ లో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రాజేష్‌, ముగ్గురు సీనియర్‌ మేట్లు అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. రాజేష్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీఏ డేవిడ్‌ రాజును డిప్యుటేషన్‌పై వైరాకు బదిలీ చేశారు.

ఉపాధి’ అక్రమాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంలో పలువురు ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో ఉపాధి సొమ్ము జమ అయినట్లు సవివరంగా ప్రచురించింది. కానీ అధికారుల విచారణ నివేదికలో కొందరి పేర్లు లేకపోవడం గమనార్హం.

నివేదికలో భూక్య చంద్రశేఖర్‌ అనే వ్యక్తి పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ పోస్ట్‌మాస్టర్‌గా పనిచేస్తున్నారని, అతడికి 12 రోజులకు రూ.2,470 జమ అయ్యాయని నివే దికలో పేర్కొన్నారు. దాంతో ఆ సొమ్ము రికవరీ చే యాలని ఆదేశించారు.

అయితే అక్రమంగా ఉపాధి నిధులు పొందిన కొందరి పేర్లు నివేదికలో లేకపోవడం గమనార్హం. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు

హైదరాబాద్‌కు మహర్దశ..ఎంట్రీ ఇస్తోన్న మరో ఇంటర్నేషన్ కంపెనీ

టెక్నాలజీ, సర్వీస్ సొల్యూషన్స్ లో పేరొందిన ఆర్సీసియం కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించనుంది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అమెరికాలో పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబుతో పాటు అధికారుల బృందం ఆర్సీసియం సీఈవో గౌరవ్ సూరి నేతృత్వంలో కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు.

ఆర్సీసియం మొదటిసారిగా హైదరాబాద్ లో తమ ఆఫీసును విస్తరించనుంది. అమెరికా తర్వాత విదేశాల్లో కంపెనీ పెట్టడం ఇదే మొదటి సారి. ప్రపంచ వ్యాప్తంగా తమ సేవల విస్తరణకు హైదరాబాద్ సెంటర్ కీలకంగా నిలుస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో 500 మంది అత్యాధునిక సాంకేతిక నిపుణులను కంపెనీ నియమించుకోనుంది.

డీఈ షా గ్రూప్, బ్లాక్‌స్టోన్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ మద్దతుతో ఆర్సెసియం స్వతంత్ర సంస్థగా ప్రారంభమైంది. బ్యాంకులు, హెడ్జ్ ఫండ్‌లు, సంస్థాగత ఆస్తుల నిర్వాహకులు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు సంబంధించిన డేటాతో పాటు కార్యకలాపాలపై ఈ కంపెనీ విశ్లేషణలు అందిస్తుంది.

ప్రత్యేకంగా డేటా మేనేజ్మెంట్, డేటా స్ట్రాటజీలో ఈ కంపెనీకి గుర్తింపు ఉంది. హైదరాబాద్ ఆఫీసు విస్తరణతో రాష్ట్రంలో మరింత మంది యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గ్లోబల్ టెక్ కంపెనీలకు ప్రధాన గమ్య స్థానంగా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షించనుంది.

ఐటీ రంగంలో బహుముఖ వృద్ధిని సాధించేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో స్పష్టం చేశారు. కంపెనీ విస్తరణకు ప్రభుత్వం తప్పకుండా సహకరిస్తుందని ప్రకటించారు. ఈ కంపెనీ విస్తరణ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ అండ్ ఇన్సురెన్స్ రంగంలో హైదరాబాద్ పే కొత్త ఆవిష్కరణ కేంద్రంగా నిలబెడుతుందని అన్నారు.

సాంకేతిక వృద్ధికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య సహకారం తప్పనిసరిగా ఉండాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. ఆర్సీసియం లాంటి కంపెనీలకు తగినంత మద్దతు పాటు మౌలిక సదుపాయాలను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రపంచ స్థాయి టెక్ కంపెనీలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతుందని అన్నారు.

మౌలిక సదుపాయాలతో పాటు నైపుణ్యమున్న మానవ వనరులుండటంతో హైదరాబాద్ ను తమ అంతర్జాతీయ కార్యకలాపాలకు అనువైన ప్రదేశంగా ఎంచుకున్నట్లు కంపెనీ సీఈవో గౌరవ్ సూరీ తెలిపారు.

హసీనాను అప్పగించండి.. భారత్‌కు బంగ్లాదేశ్ డిమాండ్

షేక్ హసీనా‌తోపాటు ఆమె సోదరిని వెంటనే అరెస్ట్ చేసి బంగ్లాదేశ్‌కు అప్పగించాలని భారత్‌ను ఆ దేశపు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏఎం మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ డిమాండ్ చేశారు. ఢాకాలో మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ మాట్లాడుతూ.. పొరుగనున్న భారత్‌తో సానుకూల సంబంధాలు కొనసాగించడం తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.

తప్పని పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా వైదొలిగారు. అనంతరం సోదరి షేక్ రెహనాతో కలిసి ఆమె భారత్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత వీరు లండన్ వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు అయితే ఫలించలేదు. ఈ ప్రక్రియకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అలాంటి వేళ.. బంగ్లాదేశ్‌లో సరికొత్త డిమాండ్ ప్రారంభమైంది

షేక్ హసీనా‌తోపాటు ఆమె సోదరిని వెంటనే అరెస్ట్ చేసి బంగ్లాదేశ్‌కు అప్పగించాలని భారత్‌ను ఆ దేశపు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) అధ్యక్షుడు ఏఎం మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ డిమాండ్ చేశారు. ఢాకాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ మాట్లాడుతూ.. పొరుగనున్న భారత్‌తో సానుకూల సంబంధాలు కొనసాగించడం తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.

బంగ్లాదేశ్ అల్లర్లలో వందలాది మంది ప్రజలు మరణించారన్నారు. అందుకు షేక్ హసీనా పూర్తి బాధ్యత వహించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోదరితోపాటు ఆమెను అరెస్ట్ చేసి బంగ్లాదేశ్‌కు తిరిగి పంపాలని భారత్‌కు ఈ సందర్భంగా ఆయన సూచించారు. దేశంలో అత్యయక స్థితిని విధించవద్దంటూ బంగ్లాదేశ్ నేషలిస్ట్ పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ విలేకర్ల సమావేశంలో బంగ్లాదేశ్ నేషలిస్ట్ పార్టీ అనుకూలురుతోపాటు షేక్ హసీనా వ్యతిరేకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రాజకీయ వ్యవహారాల్లో క్రియాశీలంగా వ్యవహరించిన సుప్రీంకోర్టు జడ్జిలు.. తమ పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అదే విధంగా షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో నియమించిన వివిధ సంస్థల అధినేతలు, ఉన్నతాధికారులను కూడా రాజీనామా చేయాలనే పేర్కొన్నారు. రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వానికి సూచించారు.

ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. దీంతో ఆగస్ట్ 5వ తేదీన తప్పని సరి పరిస్థితుల్లో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. దేశంలో రిజర్వేషన్లు సంస్కరించాలంటూ దేశవ్యాప్త ఆందోళనలు మొదలైనాయి. ఆ క్రమంలో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ్యవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. అందులోభాగంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు భారీగా చేపట్టిన విషయం విధితమే.

మరోవైపు బంగ్లాదేశ్‌లో ప్రభుత్వాన్ని ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ రద్దు చేశారు. ఆ క్రమంలో మధ్యంతర ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ ప్రభుత్వాన్ని నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, బ్యాంకర్ ప్రొ.యూనస్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక జైలు నుంచి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్ పర్సన్, మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా జైలు నుంచి విడుదలయ్యారు.

అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభం

రాజధాని అమ‌రావ‌తిలో జంగిల్ క్లియ‌రెన్స్ ప‌నులు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం మునిసిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పూజ చేసి మరీ జంగిల్ క్లియరెన్స్ పనులను స్వయంగా మొదలుపెట్టారు. దీంతో వాటిని శుభ్రం చేసే ప‌నులు ఈరోజు నుంచి మొదలయ్యాయి. మొత్తం 58 వేల ఎక‌రాల్లో ఉన్న తుమ్మ చెట్లు, ముళ్ల కంప‌ల‌ను నెల‌రోజుల్లోగా తొల‌గించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

రాజధాని అమ‌రావ‌తిలో (Capital Amaravati) జంగిల్ క్లియ‌రెన్స్ ప‌నులు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం మునిసిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) పూజ చేసి మరీ జంగిల్ క్లియరెన్స్ పనులను స్వయంగా మొదలుపెట్టారు. దీంతో వాటిని శుభ్రం చేసే ప‌నులు ఈరోజు నుంచి మొదలయ్యాయి.

మొత్తం 58 వేల ఎక‌రాల్లో ఉన్న తుమ్మ చెట్లు, ముళ్ల కంప‌ల‌ను నెల‌రోజుల్లోగా తొల‌గించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీని ద్వారా భూములు కేటాయించిన వారికి త‌మ స్థలంపై అవ‌గాహ‌న వ‌స్తుంద‌న్న మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో ప్రభుత్వ కాంప్లెక్స్‌ నిర్మాణాలు జరిపే చోట, ఎల్‌పీఎస్‌ ఇన్‌ఫ్రా జోన్లు, ట్రంక్‌ ఇన్‌ఫ్రా ప్రాంతాల్లో దట్టంగా అడవిలా పెరిగిపోయిన చెట్లను, ముళ్ల కంపలను తొలగించనున్నారు.

కాగా.. గత ఐదేళ్లుగా అమరావతిలో కట్టడాలు పూర్తిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో అమరావతిలో జంగిల్ దట్టంగా పేరుకుపోయింది. వైసీపీ ప్రభుత్వ చర్యల కారణంగా అమరావతి రాజధాని విధ్వంసంతో భారీ నష్టం సంభవించడంతో పాటు నష్ట నివారణ కోసం ఏ పని చేయాలన్నా ప్రభుత్వం భారీగానే ఖర్చు చేయాల్సిన పరిస్థితి.

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతికి మంచి రోజులు వచ్చాయి. రాజధానిని అభివృద్ధి చేయడంపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే అమరావతి రాజధాని నిర్మాణ పనులకు తొలి అడుగు పడింది. ప్రస్తుతం అమరావతిలో పిచ్చి చెట్లు, కంపలు పెరిగిపోయి కనీసం వేసిన సీసీ రోడ్లు కూడా కనిపించే పరిస్థితి లేదు. పెరిగిన పిచ్చి చెట్లు, కంపలను తొలగించాల్సి ఉంది. ఇందు కోసం ప్రభుత్వం భారీగానే ఖర్చు చేయాల్సి ఉంది.

వీటిని తొలగించటానికి సీఆర్‌డీఏ అధికారులు రూ.36.50 కోట్లతో టెండర్లు పిలవాల్సి వచ్చింది. టెండర్లను ఇటీవలే ఖరారు చేశారు. ఎన్‌సీసీఎల్‌ సంస్థ ఈ టెండర్లను దక్కించుకుంది. ఈరోజు ఉదయం నుంచి ఎన్‌సీసీఎల్‌ సంస్థ పిచ్చి, తుమ్మ చెట్ల తొలగింపు చేపట్టింది. సెక్రటేరియట్‌ వెనుక వైపున ఎన్‌ 9 రోడ్డు నుంచి ఈ పనులను ప్రారంభించారు.

ఈ పనులపై మంత్రి నారాయణ మంగళవారం సీఆర్‌డీఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... జంగిల్‌ క్లియరెన్స్‌ను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని, రాజధాని క్యాపిటల్‌ పరిధిలోని మొత్తం 99 డివిజన్లలో ఒకేసారి పనులు మొదలుపెట్టనున్నట్టు చెప్పారు. నెల రోజుల్లో జంగిల్‌ క్లియరెన్స్‌ పూర్తి చేస్తామన్నారు.

మరింత డేంజర్‌లోకి మేడిగడ్డ బ్యారేజ్ !

వర్షాలు పడ్డాయి.. వరదలొచ్చాయి.. మేడిగడ్డ బ్యారేజ్ మీదుగా నీళ్ల పారాయి.. ప్రపంచ అద్భుతాన్నికూలిపోయిందని.. కూలిపోతుందని ప్రచారం చేస్తారా అని బీఆర్ఎస్ చేసిన హడావుడి ఇంకా కళ్ల మందే ఉంది.

కానీ మేడిగడ్డ బ్యారేజ్ లో మరిన్ని పియర్స్ కు పగుళ్లు వచ్చాయని తాజాగా తేలింది. బ్యారేజ్‌లో గేట్లు అన్ని ఎత్తి పెట్టారు. నీరు నిల్వ చేయడానికి గేట్లు మూసి ఉంటే.. పెను ప్రమాదం సంభవించి ఉండేది. కానీ నీళ్లు ఎత్తిపోయలేదని ఆరోపిస్తూ కేటీఆర్ రెండు రోజుల పాటు టూర్ వేశారు. తామే మోటార్లు ఆన్ చేస్తామని కూడా ప్రకటించారు.

కానీ ఇప్పుడు మేడిగడ్డకు జరిగిన డ్యామేజ్ అలాంటి ఇలాంటి ది కాదని.. తాజాగా వెల్లడవుతున్న నివేదికలు వెల్లడిస్తున్నాయి. నీరు బ్యారేజీ మీదుగా ఇంకా వెళ్తోంది. వరద తగ్గిన తర్వాత పరిస్థితిని నిపుణులు మరోసారి పరిశీలన జరిపితే..

అసలు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో అర్థమయ్యే అవకాశం ఉంది. వర్షాలు..గోదావరికి వరద సీజన్ ముగిసిన తర్వాతనే మరమ్మత్తులో.. పగుళ్లిచ్చిన పియర్స్ ను తీసేసి మళ్లీ కొత్త వాటిని నిర్మంచడమో చేయాల్సి ఉంది.

కాళేశ్వరం విషయంలో తమ తప్పును చాలా చిన్నదిగా చూపించడానికి కేటీఆర్ బీఆర్ఎస్ చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ క్రమంలో ప్రతీ దాన్ని కాళేశ్వరంతో పోల్చేసుకుంటున్నారు.

వచ్చే ప్రతీ నీటిని కాళేశ్వరం నీళ్లంటున్నారు. కానీ ఈ ప్రాజెక్టు డొల్లతనంపై రోజు రోజుకు ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఆ ప్రాజెక్టుకు అసలు డ్యామేజీ జరగకపోయినా అతి పెద్ద నిరర్థక ప్రాజెక్టు అని..

అది సృష్టించే సంపద కరెంట్ బిల్లులకూ సరిపోదని ఇప్పటికే కాగ్ లాంటి రిపోర్టులు వెల్లడించాయని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు.