జగన్‌ ‘కారు’ కథలు!

మా నాయకుడికి కేటాయించిన కారు మాటికీ మాటికీ ఆగిపోతోంది’ అంటూ వైసీపీ రచ్చ చేసింది. చివరికి... కారు బాగానే ఉందని, వైసీపీయే ఎప్పట్లాగా తప్పుడు కోతలతో యాగీ చేసిందని రుజువైంది. అసలేం జరిగిందంటే... వైసీపీ అధికారంలో ఉండగా అప్పటి వినుకొండ ఎమ్మెల్యే పెంచి పోషించిన ‘గ్యాంగ్‌’ వార్‌ కారణంగా రషీద్‌ అనే యువకుడు హత్యకు గురయ్యారు. దీనిని రాజకీయం చేసిన జగన్‌...

రషీద్‌ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు శుక్రవారం వినుకొండ పర్యటనకు బయలుదేరారు. జగన్‌ భద్రత రీత్యా ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ (ఐఎ్‌సడబ్ల్యూ) బుల్లెట్‌ ప్రూఫ్‌ టాటా సఫారీ కారు ఏర్పాటు చేసింది

శుక్రవారం ఉదయం 10.05 గంటలకు తాడేపల్లి నుంచి ప్రయాణం మొదలుపెట్టిన జగన్‌ కేవలం ఐదు నిమిషాల్లోనే కిందికి దిగారు. వైసీపీ నాయకుడికి చెందిన ఫార్చూనర్‌లో కూర్చున్నారు. అంతే... వైసీపీ సోషల్‌ మీడియా రెచ్చిపోయింది. ‘‘జగన్‌కు కేటాయించిన కారు అడుగడుగునా ఆగిపోతోంది. మాజీ సీఎంకు భద్రత కల్పించేది ఇలాగేనా? ఇది పోలీసుల వైఫల్యమే’’ అంటూ ప్రచారం మొదలుపెట్టింది. ఇక... జగన్‌ కూలి, నీలి మీడియా కూడా ఇదే పాట పాడాయి. నిజానికి... ప్రభుత్వం జగన్‌ పర్యటనకోసం కేటాయించిన బుల్లెట్‌ ప్రూఫ్‌ సఫారీ వాహనం ఎక్కడా ఆగలేదు. ఆయన కాన్వాయ్‌లోనే వినుకొండ దాకా రయ్య్‌మని దూసుకెళ్లింది.

జగన్‌ పర్యటన కోసం కేటాయించిన సఫారీ (ఏపీ 39 పి0014) పూర్తి కండీషన్‌లో ఉంది. ఎన్నికల్లో విజయం సాధించే వరకూ ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు అందులోనే ప్రయాణించారు. చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేసినప్పుడు... అక్కడి నుంచి విజయవాడ మీదుగా రాజమండ్రి వరకు ఇందులోనే ప్రయాణించారు. ‘చంద్రబాబు వాడిన కారు నేను ఎక్కడమేమిటి’ అనుకున్నారో ఏమో! ఎక్కిన ఐదు నిమిషాల్లోనే జగన్‌ అందులో నుంచి దిగిపోయారు. రచ్చ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీయగా మరిన్ని ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి.

జగన్‌ పర్యటన కోసం టయోటా ఫార్చూనర్‌ లేదా ల్యాండ్‌ క్రూజర్‌ ప్రడో పంపాలని తాడేపల్లి నుంచి ఐఎ్‌సడబ్ల్యూకు ఫోన్‌ వెళ్లింది. అయితే... ఆ వాహనాలు అందుబాటులో లేకపోవడంతో బుల్లెట్‌ ప్రూఫ్‌ సఫారీని కేటాయించారు. అది కూడా విజయవాడలో సిద్ధంగా లేకపోవడంతో విజయనగరం నుంచి తెప్పించారు. గురువారం రాత్రి 11 గంటలకు అక్కడ బయలుదేరిన సఫారీ... ఉదయానికి తాడేపల్లి చేరుకుంది. పూర్తి కండిషన్‌లో... ఎక్కడా ఆగకుండా పరుగులు తీసింది. కానీ... జగన్‌ ఎక్కిన ఐదు నిమిషాల్లోనే అది బ్రేక్‌డౌన్‌ అయ్యిందంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేసింది. 

అదే వాహనం జగన్‌ కాన్వాయ్‌లో వినుకొండ వరకు ఎక్కడా ఆగకుండా దూసుకెళ్లిందంటూ ఐఎ్‌సడబ్ల్యూ వీడియో ఆధారాలు కూడా చూపించింది. ‘‘మొన్నటిదాకా ముఖ్యమంత్రి హోదాలో ల్యాండ్‌ క్రూజర్‌ ప్రడో కారులో ప్రయాణించిన జగన్‌కు...

బహుశా ఇప్పుడు ‘సఫారీ’ ప్రయాణం నచ్చలేదేమో! మాజీ అయిన తర్వాత కూడా అదే దర్పం ప్రదర్శించాలంటే ఎలా? సెక్యూరిటీ రివ్యూ కమిటీ-2024 నిబంధనల మేరకు మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్‌కు భద్రత కల్పిస్తున్నాం. సీఎంగా ఉండగా ప్రధాని తరహాలో ఆయన ఏర్పాటు చేసుకున్న స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌(ఎ్‌సఎ్‌సజీ)ను కొనసాగించేందుకు నిబంధనలు అంగీకరించవు’’ అని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి

ఏపీలో తహసీల్దార్లకు గుడ్‌న్యూస్.. చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర జిల్లాలకు బదిలీ అయిన తహసీల్దార్లను సొంత జిల్లాలకు బదిలీ చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రం లో సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం తహసీల్దార్లను ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ప్రభుత్వ ఆదేశాలతో తహసీల్దార్లను సొంత జిల్లాలకు పంపించాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఇతర జిల్లాలకు వెళ్లిన తహసీల్దార్లు త్వరలోనే వారి సొంత జిల్లాలకు రానున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో తహసీల్దార్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల సమయంలో తహసీల్దార్లను బదిలీ చేయగా.. వారిని మళ్లీ సొంత జిల్లాలకు బదిలీపై వెళ్లబోతున్నారు. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 650 మంది తహసీల్దార్లను మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో బదిలీ చేయగా.. నిబంధనలు అనుసరించి ఇతర జిల్లాలకు పంపించారు.

అయితే ఏపీలో ఎన్నికల నియమావళి జూన్‌ 6వ తేదీతో ముగియడంతో.. తహసీల్దార్లను గతంలో పనిచేసిన స్థానాలకు తిరిగి పంపాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఇటీవల ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఇతర ఉద్యోగ సంఘాల నేతలు మంత్రి అనగాని సత్యప్రసాద్‌ని కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి.. తహసీల్దార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఈ బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాత కలెక్టర్‌ వారికి మండలాలను కేటాయించనున్నారు. జిల్లాలకు వచ్చే రెవెన్యూ అధికారులను ఆయా మండలాల్లో అదే కేడర్‌‌కు పంపించనున్నారు. కలెక్టరేట్, రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయాలు, వివిధ భూసేకరణ విభాగాల్లో వీరికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

మరోవైపు ఏపీలో వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయం శాఖ డైరెక్టర్‌ ఎన్‌ ఢిల్లీరావు కీలక ప్రకటన చేశారు. రైతులు అధిక దిగుబడులిచ్చే వంగడాలను ఎంపిక చేసుకుంటారని.. కాబట్టి డిమాండ్‌ మేరకు వాటిని అందుబాటులో ఉంచాలని అధికారుల్ని ఆదేశించారు. ఢిల్లీరావు మంగళగిరిలోని వ్యవసాయశాఖ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సేంద్రీయసాగు విధానాలపై సిబ్బంది విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లాల్లో అధికారులకు సూచన చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర జిల్లాలకు బదిలీ అయిన తహసీల్దార్లను సొంత జిల్లాలకు బదిలీ చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రం లో సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం తహసీల్దార్లను ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ప్రభుత్వ ఆదేశాలతో తహసీల్దార్లను సొంత జిల్లాలకు పంపించాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఇతర జిల్లాలకు వెళ్లిన తహసీల్దార్లు త్వరలోనే వారి సొంత జిల్లాలకు రానున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో తహసీల్దార్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల సమయంలో తహసీల్దార్లను బదిలీ చేయగా.. వారిని మళ్లీ సొంత జిల్లాలకు బదిలీపై వెళ్లబోతున్నారు. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 650 మంది తహసీల్దార్లను మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో బదిలీ చేయగా.. నిబంధనలు అనుసరించి ఇతర జిల్లాలకు పంపించారు.

అయితే ఏపీలో ఎన్నికల నియమావళి జూన్‌ 6వ తేదీతో ముగియడంతో.. తహసీల్దార్లను గతంలో పనిచేసిన స్థానాలకు తిరిగి పంపాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఇటీవల ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఇతర ఉద్యోగ సంఘాల నేతలు మంత్రి అనగాని సత్యప్రసాద్‌ని కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి.. తహసీల్దార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఈ బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాత కలెక్టర్‌ వారికి మండలాలను కేటాయించనున్నారు. జిల్లాలకు వచ్చే రెవెన్యూ అధికారులను ఆయా మండలాల్లో అదే కేడర్‌‌కు పంపించనున్నారు. కలెక్టరేట్, రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయాలు, వివిధ భూసేకరణ విభాగాల్లో వీరికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

మరోవైపు ఏపీలో వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయం శాఖ డైరెక్టర్‌ ఎన్‌ ఢిల్లీరావు కీలక ప్రకటన చేశారు. రైతులు అధిక దిగుబడులిచ్చే వంగడాలను ఎంపిక చేసుకుంటారని.. కాబట్టి డిమాండ్‌ మేరకు వాటిని అందుబాటులో ఉంచాలని అధికారుల్ని ఆదేశించారు. ఢిల్లీరావు మంగళగిరిలోని వ్యవసాయశాఖ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సేంద్రీయసాగు విధానాలపై సిబ్బంది విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లాల్లో అధికారులకు సూచన చేశారు.

మరోవైపు ఏపీలోని ఐదు మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాదే జాతీయ వైద్య కమిషన్‌ అనుమతి నిరాకరించిన ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు ప్రిన్సిపల్స్. ఈ మేరకు ఆయా కాలేజీల ప్రిన్సిపల్స్‌ లేఖలు రాశారు. పాడేరు, ఆదోని, నంద్యాల, మదనపల్లె, పులివెందుల కాలేజీల్లో 2024-25కి సంబంధించిన ప్రవేశాలకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం గతంలో ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేసింది. ఈ కాలేజీలను తనిఖీ చేసిన ఎన్‌ఎంసీ టీమ్.. ఇక్కడ ఫ్యాకల్టీ సరిపడా లేరని, తరగతుల నిర్వహణకు తగ్గట్లు నిర్మాణాలు లేవని అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా ప్రవేశాలకు ఎన్‌ఎంసీ అనుమతి నిరాకరించింది. తనిఖీల్లో గుర్తించిన లోపాలను త్వరలో పరిష్కరిస్తామని.. సరైన వసతులు సమకూరుస్తామని హామీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఎన్‌ఎంసీకి మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్స్‌కు విజ్ఞప్తి చేశారు.

అక్కడ గేట్లు ఎత్తివేత- శ్రీశైలానికి వరద

కర్ణాటక సహా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల వల్ల కృష్ణానది జలకళను సంతరించుకుంది. వరదనీటితో పోటెత్తుతోంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

ఫలితంగా జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. గరిష్ఠస్థాయి నీటిమట్టాన్ని అందుకుంది.

మహారాష్ట్ర, కర్ణాటకల్లో కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. దీని ప్రభావంతో అటు గోదావరి, ఇటు కృష్ణానదికి వరద పోటుకు గురయ్యాయి.

భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. కృష్ణా ఉపనదులు ఘటప్రభ, మలప్రభ, భీమా, తుంగ, భద్ర సైతం పొంగిపొర్లుతున్నాయి.

కర్ణాటకలోని ఉత్తర కన్నడ, బెళగావి, హవేరి, విజయపురా, బాగల్‌కోటె, కలబురగి, బళ్లారి.. వంటి జిల్లాల్లో అతి భారీగా వర్షాలు కురుస్తోన్నాయి. ఆయా ప్రాంతాలన్నీ కూడా కృష్ణా బేసిన్ పరిధిలోకి వచ్చేవే. అటు మహారాష్ట్రలోనూ కృష్ణా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షాలు పడుతున్నాయి.

ఫలితంగా కృష్ణానది ఉరకలేస్తోంది. కర్ణాటకలో దీనిపై నిర్మించిన ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. ఆలమట్టి, నారాయణ్‌పూర్ ప్రాజెక్టులు గరిష్ఠ నీటి మట్టానికి చేరుకున్నాయి. దీనితో రెండు రోజుల కిందటే వాటి గేట్లను ఎత్తివేశారు కర్ణాటక జలవనరుల అధికారులు. లక్షకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

దీని ప్రభావం తెలంగాణపై పడింది. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుకుంటోంది. జూరాల ఇన్‌ఫ్లో 65,000 క్యూసెక్కులుగా రికార్డయింది. ఈ ప్రాజెక్టు గరిష్ఠ స్థాయి నీటి మట్టం 318.51 అడుగులు.. ప్రస్తుతం 317 అడుగుల నీటిమట్టం అందుకుంది. ఈ కొద్దిరోజుల్లోనే ఆరు టీఎంసీలకు పైగా వరదనీరు జూరాలకు వచ్చి చేరింది.

తాడిపత్రిలో అడుగుపెట్టిన పెద్దారెడ్డి.. హై టెన్షన్

అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ తెల్లవారుజామున తాడిపత్రికి చేరుకున్నారు.

పెద్దారెడ్డిని అనంతపురం జిల్లా నుంచి బహిష్కరించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే పంచె ఊడదీసి కొడతామని జేసీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, పెద్దారెడ్డి రాకతో తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణలో అరెస్ట్ అయిన పెద్దారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో, ష్యూరిటీలు సమర్పించేందుకు ఆయన అనంతపురం నుంచి తాడిపత్రికి వచ్చారు.

నేరుగా తాడిపత్రిలోని పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పెద్దారెడ్డి... ష్యూరిటీలు సమర్పించి, సంతకం చేసి వెళ్లిపోయారు. ష్యూరిటీలు సమర్పించిన తర్వాత...

పెద్దారెడ్డిని ఎక్కువ సేపు తాడిపత్రిలో ఉంచకుండా పోలీసులు అనంతపురంకు తరలించారు. పెద్దారెడ్డి కూడా అడ్డు చెప్పకుండా తాడిపత్రి నుంచి వెళ్లిపోయారు.

దీంతో, అందరూ ఊపిరిపీల్చుకున్నారు. రెండు నెలల తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రికి రావడం గమనార్హం.

మైక్రోసాఫ్ట్‌ ఎర్రర్‌పై స్పందించిన సీఈవో సత్యనాదెళ్ల

శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ (Microsoft) సర్వర్లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా ఉంది. సర్వర్లలో లోపం కారణంగా ప్రపంచమే ఆగిపోయేలా చేసింది.

బ్యాంకుల నుండి విమానయాన సంస్థల వరకు సేవలకు అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా ఇండిగో, అకాసా ఎయిర్‌లైన్స్, స్పైస్‌జెట్‌తో సహా అనేక విమానయాన సంస్థలు తమ విమానాలను గ్రౌండ్ చేయవలసి వచ్చింది...

శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ (Microsoft) సర్వర్లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా ఉంది. సర్వర్లలో లోపం కారణంగా ప్రపంచమే ఆగిపోయేలా చేసింది. బ్యాంకుల నుండి విమానయాన సంస్థల వరకు సేవలకు అంతరాయం ఏర్పడింది.

దీని కారణంగా ఇండిగో, అకాసా ఎయిర్‌లైన్స్, స్పైస్‌జెట్‌తో సహా అనేక విమానయాన సంస్థలు తమ విమానాలను గ్రౌండ్ చేయవలసి వచ్చింది. విమాన కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీంతో బ్యాంకులు, స్టాక్ ఎక్స్ఛేంజీల పనితీరుపైనా ప్రభావం పడింది. చాలా మంది విండోస్ వినియోగదారులు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) ఎర్రర్‌ను చూస్తున్నారు.

సర్వర్లలో అంతరాయం ఏర్పడటంతో ప్రపంచవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో సేవలు నిలిచిపోయాయి. దీంతో పలు కంపెనీల విమానాలు ఎగరలేకపోతున్నాయి. టికెట్ బుకింగ్ నుండి చెక్-ఇన్ వరకు సమస్యలు ఉన్నాయి. భారతదేశంలోని అనేక విమానాశ్రయాలు కూడా సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నాయి. అయితే సమస్య పరిష్కారం అయినా ఇంకా పూర్తి స్థాయిలో విండోస్‌ సిస్టమ్స్‌లో బ్లూ స్క్రీన్ ఎర్రర్‌ సమస్య తొలగలేదు. దేశవ్యాప్తంగా 200కిపైగా విమానాల రద్దు అయ్యాయి. ఇండిగో 192 విమానాలను రద్దు చేసింది. అలాగే అమెరికా, ఆస్ట్రేలియాలో ఇంకా ఇబ్బందులు తొలగలేదు. అమెరికా, డల్లాస్‌, చికాగోలో విమానాలు 18 గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌ వినియోగదారులు తీవ్ర కష్టాలను ఎదుర్కొన్నారు. ఔటేజ్‌ సమస్యతో 77 శతం విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.

ఇదిలా ఉండగా, దీనిపై మైక్రోసాఫ్ట్‌ CEO సత్యనాదెళ్ల స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ సిస్టమ్స్‌పై ప్రభావం కనిపించిందని, ఈ సమస్య పరిష్కారం కోసం క్రౌడ్‌ స్ట్రైక్‌తో కలిసి పనిచేస్తున్నామని అన్నారు. ప్రపంచ చరిత్రలోనే ఇది అతిపెద్ద సంక్షోభమని వ్యాఖ్యానించారు.

త్వరలోనే పరిష్కారం చూపుతామన్నారు. శని, ఆదివారాలు కావడంతో సర్వర్లపై తక్కువ ఒత్తిడి ఉందని, సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. వినియోగదారులకు క్లౌడ్‌ స్ట్రెక్‌ సీఈవో క్షమాపణలు చెప్పారు. ఔటేజ్‌ సమస్యేనని, సైబర్‌ అటాక్‌ కాదని ప్రకటించారు. ఇదిలా ఉంటే మైక్రోసాఫ్ట్‌ కంపెనీకి కొత్త చిక్కులు వస్తున్నాయి. జరిగిన నష్టాలపై పలు కంపెనీలు దావా వేయనున్నట్లు తెలుస్తోంది.

నెరవేరనున్న విమానం కల

దొనకొండలో బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన విమానాశ్రయ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఇటీవల భోగాపురం విమానాశ్రయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు సమక్షంలో అధికారులు దొనకొండ విమానాశ్రయం గురించి వివరించటంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

దొనకొండలో బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన విమానాశ్రయ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఇటీవల భోగాపురం విమానాశ్రయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు సమక్షంలో అధికారులు దొనకొండ విమానాశ్రయం గురించి వివరించటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. దీని అభివృద్ధికి వెయ్యి ఎకరాల భూమి కేటాయిస్తామని ఎయిర్‌పోర్ట్‌ అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించినట్లు ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలోనే కలెక్టర్‌ ఆదేశాల మేరకు కనిగిరి ఆర్డీవో జాన్‌ఇర్విన్‌ మంగళవారం దొనకొండ విమానాశ్రయం భవనం, అందుకు సంబంధించిన భూములను పరిశీలించారు

పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలంటూ రెవెన్యూ సిబ్బందికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో అందరి దృష్టి దొనకొండ విమానాశ్రయం అభివృద్ధిపైనే పడింది. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం దీనిపై ఏమాత్రం దృష్టి పెట్టకపోవడం, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్దిరోజులకే దీని అభివృద్ధికి కదలికలు ప్రారంభమవడం గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు.

1934లో బ్రిటీష్‌ పాలకులు మద్రాస్‌, హైదరాబాద్‌కు మధ్యలో ఉన్న దొనకొండను గుర్తించి 136.50 ఎకరాల విస్తీర్ణంలో టెర్మినల్‌, నిర్వహణ భవనాలతో విమానాశ్రయాన్ని నిర్మించారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో విమానాల్లో ఇంధనం నింపుకునేందుకు, ఆయుధాల తరలింపునకు బ్రిటీష్‌ వారు దీనిని ఉపయోగించుకున్నట్లు సమాచారం. 1960 తర్వాత దొనకొండకు విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో అప్పటినుంచి నిరుపయోగంగా మారింది. ఎయిర్‌పోర్టు అథారిటీ వారు దాదాపు పదేళ్ల క్రితం రూ.40 లక్షల వ్యయంతో చుట్టూ ఐరన్‌ ఫెన్షింగ్‌ ఏర్పాటు చేయడం, నేటికీ ఇన్‌చార్జిగా ఒక ఉద్యోగి ఇక్కడ విధులు నిర్వహిస్తుండటం గమనార్హం.

2014లో అధికారం చేపట్టిన అనంతరం దొనకొండను పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. కారిడార్‌కు అనుసంధానంగా విమానాశ్రయం ఏర్పాటు నిమిత్తం అప్పటి భోగాపురం ఎయిర్‌పోర్టు మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు దొనకొండ విమానాశ్రయాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఇక్కడ 15 సీట్ల మినీ విమానాలు రన్‌వేపై దిగడానికి సౌకర్యవంతమని ప్రభుత్వానికి నివేదించారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రాంతీయ అనుసంధాల పథకాలకు దొనకొండలోని విమానాశ్రయం ఎంపికైంది. అప్పటి గన్నవరం ఎయిర్‌పోర్టు అథారిటీ సహాయ మేనేజర్‌ సురేష్‌ బృందం విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించింది. ఉన్న 136 ఎకరాలతోపాటు మరో 340 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. 

రెవెన్యూ అధికారులు నరసింహనాయునిపాలెం, ఇండ్లచెరువు రెవెన్యూ పరిధిలోని 340 ఎకరాల భూములను అప్పట్లో ఎంపిక చేశారు. మొత్తం 1,575 మీటర్ల పొడవున రన్‌వే ఏర్పాటుకు ప్రాథమిక సర్వే చేపట్టారు. ఎయిర్‌పోర్టు ఏర్పాటు అనంతరం ఈప్రాంత డిమాండ్‌ను బట్టి ప్రయాణికుల విమానాల రాకపోకలు జరుగుతాయని అప్పట్లో అధికారులు ప్రకటించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు సర్వే విభాగం అసిస్టెంట్‌ మేనేజర్‌ అరివోలి బృందం దొనకొండలో ఉన్న 136 ఎకరాలు, అదనంగా గుర్తించిన 340 ఎకరాల్లో విమానం సేఫ్‌ ల్యాండింగ్‌ నిమిత్తం రన్‌వే ఏర్పాటుకు స్థానిక సిబ్బందితో కలిసి వారంరోజులు సర్వే నిర్వహించారు. పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని అప్పట్లో వారు ప్రకటించారు

దొనకొండలో విమానాశ్రయ అభివృద్ధికి పలు చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టింది. దీంతో ఈ అంశాలన్నీ జగన్‌మోహన్‌రెడ్డి తొక్కిపెట్టారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే దొనకొండ విమానాశ్రయం అభివృద్ధిపై కదలికలు రావడం ప్రజల్లో చర్చనీయాంశమైంది. కూటమి ప్రభుత్వంలో రానున్న రోజుల్లో దొనకొండ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుతోపాటు అందుకు సౌకర్యవంతంగా విమానాశ్రయం సైతం అభివృద్ధి చెందుతుందని అందరూ భావిస్తున్నారు. దొనకొండలో విమానాశ్రయం ఏర్పాటైతే పశ్చిమ ప్రకాశంలో నూతనంగా ఏర్పడే మార్కాపురం జిల్లా ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ప్రజలు చర్చించుకోవడం ప్రారంభించారు.

ఈ ప్రాంతాల్లో నేడు, రేపు భారీ వర్షాలు.. 11 జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్

భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. ఉత్తర తెలంగాణా లోని 11 జిల్లాలలో ఈనెల 20 , 21 తేదీలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిందన్నారు.జూలై 20, 21 తేదీలలో 11 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్‌లో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, హన్మకొండ, జగిత్యాల, ఖమ్మం,కొత్తగూడెం, నిర్మల్ జిల్లాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ జిల్లాల కలెక్టర్లు ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలసి ముందు జాగ్రత చర్యలు తీసుకోవాలని తెలియ చేశారు. ప్రధానంగా వాగుల వద్ద తగు బందోబస్తును ఏర్పాటు చేసి, ప్రమాదకరంగా ప్రవహించే వాగులను ప్రజలు దాటకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ 11 జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని, పోలీస్ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలన్నారు. ఏ విధమైన సహాయం కావాలన్న రాష్ట్ర రాజధానికి ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చునని ఆమె అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్ద వాగు కు వచ్చిన ఆకస్మిక వరదల వల్ల చిక్కుకుపోయిన దాదాపు 40 మందికి ఏవిధమైన అపాయం జరుగకుండా వివిధ శాఖల సమన్వయంతో కాపాడినందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ను శాంతి కుమారి అభినందించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాకలో బానరి రాజు అనే వ్యక్తి వాగులో చేపల వేటకు వెళ్లి గల్లంతైనట్లు తెలుస్తోంది.

పడవల సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పలుచోట్ల పత్తి, వరి చేళ్లు మునిగిపోయాయి. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాలో చెరువులు, కుంటలు వర్షపు నీటితో నిండిపోతున్నాయి.

భారీ వర్షాలతో పెద్దపల్లి జిల్లా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. రామగుండం రీజీయన్ లో నాలుగు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో రోజుకు 80 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది.

మంచిర్యాలలోని ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులలో ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీరాంపూర్, ఇందారం, ఆర్కేపీ, మందమర్రి, ఖైరీగూడ గనుల్లోకి వర్షపు నీరు చేరడంతో 60వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి కి విఘాతం ఏర్పడింది. సంస్థకు 10 కోట్ల మేర నష్టం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.

నటాషాకు దెబ్బకు భారీగా ఆస్తులు పొగొట్టుకున్న హార్దిక్ పాండ్యా..?

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాకు విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించారు. తన సోషల్ మీడియా ద్వారా విడుకుల గురించి ఓ ప్రకటన చేశారు. ఇది తమకు చాలా కఠినమైన నిర్ణయమని పేర్కొన్నారు. ఇద్దరూ విడిపోయినా.. తమ మూడేళ్ల కొడుకు అగస్త్య బాధ్యతలను తల్లిదండ్రులుగా కొనసాగిస్తామని తెలిపారు. నటాషా సైతం విడాకులపై తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. మేము కలిసి ఉండేందుకు చాలా ప్రయత్నం చేసాము.

మా ఇద్దరికి ఇది కఠినమైన నిర్ణయమే.. కానీ మా ఇద్దరికీ ఇది మంచి ప్రయోజనం చేకూరుస్తుందని మేము నమ్ముతున్నాము. మేము కలిసి ఆనందించిన సమయం, పరస్పర గౌరవం, ఒక కుటుంబంగా ఎదిగాము.

ఈ ప్రయాణాన్ని మేము సంతోషించాము. మా అబ్బాయి అగస్త్యకు మంచి కో పేరెంట్స్ గా ఉంటామని ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. హార్దిక్ పాండ్యా హీరోయిన్ నటాషా స్టాంకోవిచ్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు.

2020లో ఈ జంట వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందు రెండేళ్లు డేటింగ్ చేసిన వీరిద్దరు.. పెళ్లికి ముందే కమిట్ అయ్యారని తెలుస్తోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. హార్దిక్ పాండ్యా,నటాషా స్టాంకోవిచ్‌లు పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే నటాషా తల్లి కాబోతుందనే వార్త బయటకు వచ్చింది. ఇక పెళ్లి తర్వాత ఈ జంట తమ దాంపత్య జీవితాన్ని బాగానే ఎంజాయ్ చేశారు. అయితే ఇటీవల వీరి కాపురంలో విభేదాలు తలెత్తాయి.

హార్దిక్ పాండ్యా ,నటాషాల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో వీరు విడాకులు బాట పట్టారు. నటాషాకు భరణం అధికంగా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. నటాషా సెర్బియాకు చెందిన మహిళ కావడంతో భరణం అధికంగా అడిగే అకవాశాలు ఉన్నాయని న్యాయ నిపుణలు చెబుతున్నారు. హార్దిక్ పాండ్యా తన ఆస్తిలో 70 శాతం నటాషాకి ఇవ్వవలసి ఉంటుందని తెలుస్తోంది. ఈ కారణాలన్నింటి వల్లే పాండ్యా ఫ్యామిలీ ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడడం లేదని తెలుస్తోంది.

2024 లెక్కల ప్రకారం హార్దిక్ పాండ్యా నికర విలువ సుమారు రూ.91 కోట్లుగా అంచనా వేయబడింది. గ్రేడ్ A కేటగిరీ కింద బీసీసీఐ నుంచి ఏడాదికి అతను వార్షిక రూ. 5 కోట్లు తీసుకుంటున్నాడు. ఇక ఐపీఎల్ ద్వారా రూ. 15 కోట్ల వరకు తీసుకుంటున్నారని ఓ అంచనా.ఇటీవలి T20 ప్రపంచ కప్ విజయం కూడా అతని ఆదాయాన్ని మరింత పెంచింది. వడోదరలో విలాసవంతమైన ఇల్లుతో పాటు, రేంజ్ రోవర్ ,రోల్స్ రాయిస్ వంటి 8 ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి.

ఇవన్ని పరిగణలోకి తీసుకుంటే హార్దిక్ ఆస్తులు విలువ రూ. 120 కోట్ల వరకు ఉండవచ్చు. ఈ ఆస్తులన్నీ పరిగణలోకి తీసుకునే నటాషా హార్దిక్ నుంచి భారీ భరణం పొంది ఉంటుందని తెలుస్తోంది. అధికారికంగా దీనిపై లెక్కలు బయటకు రానప్పటికి, భరణం విలువ 30 నుంచి 40 కోట్ల వరకు ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

బంగ్లాదేశ్లో కర్ఫ్యూ- రంగంలోకి సైన్యం.. నిరసనలకు 109మంది బలి!

1971లో పాకిస్థాన్తో జరిగిన విమోచన యుద్ధంలో పాల్గొన్న సైనికుల పిల్లలతో సహా ప్రభుత్వ ఉద్యోగాల్లో సగానికి పైగా నిర్దిష్ట వర్గాల రిజర్వేషన్ కోసం ప్రవేశపెట్టిన కోటా విధానానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో జరుగుతున్న నిరసనలు తీవ్రస్థాయికి చేరాయి. పరిస్థితులు చెయ్యి దాటిపోవడంతో ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దింపింది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూని విధించింది.

కర్ఫ్యూ నేపథ్యంలో రాజధాని నగరం ఢాకాలో బహిరంగ సభలపై నిషేధం పడింది. ర్యాలీలను సైతం నిషేధించారు. ప్రజా భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు బంగ్లాదేశ్ అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గలేదు! భారీ ఎత్తున్న రోడ్ల మీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. ఫలితంగా పలు ప్రాంతాల్లో పోలీసులు- ఆందోళనకారుల మధ్య ప్రతిష్ఠంభన కనిపించింది.

బంగ్లాదేశ్లో నిరసనలు చేస్తున్న వారిలో ఎక్కువగా విద్యార్థులే ఉన్నారు. కోటా వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ.. షేక్ హసీనా 15ఏళ్ల ప్రభుత్వానికి సవాలు విసురుతున్నారు. నిరసనలను నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషిచేస్తున్నా, అవి మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.

బంగ్లాదేశ్ నిరసనల్లో ఇప్పటివరకు 109మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 50మందికిపైగా మంది ప్రజలు ఒక్క శుక్రవారమే మరణించారు. వీరిలో చాలా మంది పోలీసుల తూటాలకు ప్రాణాలు విడిచిన వారే ఉన్నారు. గురువారం మరో 25మంది ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థులపై కాల్పుల విషయంపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల చీఫ్ వొల్కర్ టర్క్ స్పందించారు. విద్యార్థులపై దాడులు చేయడం షాకింగ్, ఆమోదయోగ్యం కాని విషయం అన్నారు.

కానీ బంగ్లాదేశ్లో పరిస్థితులు రోజురోజుకు ఆందోళనకరంగా మారుతున్నాయి. నర్సింగ్ది జిల్లాలోని జైలులోకి చొరబడిన నిరసనకారులు ఖైదీలను విడుదల చేశారు. అనంతరం ఆ జైలుకు నిప్పంటించారు. వందకుపైగా మంది ఖైదీలు తప్పించుకున్నట్టు అధికారులు భావిస్తున్నారు.

ఇక ప్రభుత్వ ఆస్తులే లక్ష్యంగా నిరసనకారులు పేట్రేగిపోతున్నారు. పోలీసు భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నారు.

ఈ నిరసనలకు మూలమైన 'కోటా' వ్యవస్థపై పలు ఆరోపణలు వస్తున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన వారికే ఈ కోటాలో ప్రయోజనాలు జరుగుతాయని అంటున్నారు. ఇంతకాలం తనకు విధేయులుగా నిలిచిన వారికి రివార్డులు ఇచ్చేందుకే ఈ కోటా వ్యవస్థను షేక్ హసీనా తీసుకొచ్చినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు ఈ కోటాను ఆ దేశ సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. కానీ సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వం సవాలు చేసింది.

షేక్ హసీనా 2009 నుంచి బంగ్లాదేశ్ని పాలిస్తున్నారు. ఇటీవలే ముగిసిన ఎన్నికల్లో, ఎలాంటి విపక్షం లేకుండా మరోసారి విజయం సాధించారు.

బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ జీవిస్తున్న భారతీయులు, చదువుకుంటున్న విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని విదేశాంగశాఖ స్పష్టం చేసింది. కాగా నిరసనల నుంచి బయటపడేందుకు భారత విద్యార్థులు అన్ని విధాలుగా కృషి చేస్తున్నారు. ఏది దొరికితే అది పట్టుకుని సరిహద్దును దాటుతున్నారు. ఇప్పటికే 300మంది విద్యార్థులు భారత్కు చేరుకున్నారు.

ఈ 300 మందిలో చాలా మంది ఎంబీబీఎస్ చదువుకుంటున్న వారే ఉన్నారు. వీరందరు యూపీ, హరియాణా, మేఘాలయ, జమ్ముకశ్మీర్కి చెందినవారు.

మంగళవారం వరకు పరిస్థితులు బాగానే ఉన్నట్టు, కానీ ఆ తర్వాత ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగినట్టు విద్యార్థులు చెబుతున్నారు. అందుకే బంగ్లాదేశ్ని తాత్కాలికంగా వదిలి వచ్చినట్టు స్పష్టం చేశారు.

Runa Mafi | మాఫీకి మరో మెలిక.. రుణమాఫీ కాకుంటే ఫిర్యాదు చేయాలట.. నెలరోజుల్లో చెప్తామంటున్న సర్కార్‌

రైతుమాఫీపై వ్యవసాయ శాఖ శుక్రవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎవరైన రైతులకు రుణమాఫీ కాకపోతే, ఆయా రైతులు మండల వ్యవసాయాధికారులను కలిసి ఫిర్యాదుచేయాలని మెలిక పెట్టింది.

రైతు రైతుమాఫీపై వ్యవసాయ శాఖ శుక్రవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎవరైన రైతులకు రుణమాఫీ కాకపోతే, ఆయా రైతులు మండల వ్యవసాయాధికారులను కలిసి ఫిర్యాదుచేయాలని మెలిక పెట్టింది. ఆయా ఫిర్యాదులను 30 రోజుల్లోగా పరిష్కరిస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను ఇప్పటికే జిల్లా వ్యవసాయాధికారులకు జారీ చేసినట్టు పేర్కొన్నది.

ఎవరైనా రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ జరగకపోతే, ఆయా రైతులు ఆందోళన చెందకుండా మీ పరిధిలోని మండల వ్యవసాయ అధికారిని సంప్రదించగలరు. రైతు రుణమాఫీ-2024కు గాను ప్రతి మండలంలో రుణమాఫీ ఫిర్యాదుల విభాగాన్ని మండల వ్యవసాయ అధికారిని నోడల్‌ ఆఫీసర్‌గా జూలై 18న ఏర్పాటు చేయడం జరిగింది.

దీనికి సంబంధించిన ఆదేశాలను జిల్లా వ్యవసాయ అధికారి జిల్లాలో ఉన్న ప్రతి మండల వ్యవసాయ అధికారికి అదే రోజున జారీ చేయడం జరిగింది. రైతులు ఇచ్చిన ఫిర్యాదులను ప్రభుత్వం నిర్దేశించిన 30 రోజుల్లోగా పరిశీలించి పరిష్కరించడం జరుగుతుంది. పంటరుణం తీసుకున్న, రుణమాఫీకి అర్హులైన (తేదీ 12-12-2018 నుంచి 9-12-2023 మధ్య కాలంలో రైతులు పంట రుణం తీసుకున్న పంట రుణమాఫీ 2024కు అర్హులు) ప్రతి రైతుకు సంబంధించిన పంట రుణం సమాచారం, స్థితి తెలుసుకోవడానికి జిల్లాలో క్లస్టర్‌ పరిధిలో ఉన్న ప్రతి వ్యవసాయ విస్తర్ణ అధికారికి, మండల పరిధిలో ఉన్న ప్రతి మండల వ్యవసాయ అధికారికి లాగిన్స్‌ వ్యవసాయ శాఖ నుంచి ఇచ్చాం. రైతులు ఆధార్‌ నంబర్‌ను ఏఈవో, లేదా ఎంఈవోకు ఇస్తే పంట రుణమాఫీ 2024 రైతు సమాచారాన్ని తెలుసుకోవచ్చు’ అని జిల్లా వ్యవసాయ అధికారుల నుంచి ప్రకటనలు వెలువడ్డాయి. దీనిని బట్టి రైతుల్లో కొందరికి రుణమాఫీ జరగలేదని స్పష్టం అవుతున్నదని నిపుణులు చెప్తున్నారు.

రుణమాఫీ జాబితాలో పేర్లు రాని రైతులు శుక్రవారం మండల, జిల్లా వ్యవసాయ కార్యాలయాలకు వెళ్లారు. తమ పేర్లు ఎందుకు రాలేదని అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం రాష్ట్రంలో ఏ వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని పరిశీలించినా ఇదే దృశ్యం కనిపించింది. వారికి ఏమని సమాధానం చెప్పాలో తెలియక వ్యవసాయ అధికారులు తలలు పట్టుకున్నారు. రైతుల ఆధార్‌ వివరాలతో డాటాబేస్‌ను చెక్‌ చేసి, రుణమాఫీ కానివారి నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. ఈ ఫిర్యాదులను ఏం చేస్తారని ప్రశ్నిస్తే.. పై అధికారులకు పంపుతామని, ఎప్పుడు మాఫీ అవుతుందో తెలియదని సమాధానం వచ్చింది. మరికొన్నిచోట్ల రైతులు బ్యాంకులకు వెళ్లి తమ ఖాతాలోని రుణం మాఫీ అయ్యిందో లేదో మరోసారి చూడాలని అధికారులను విజ్ఞప్తిచేయడం కనిపించింది. కరీంనగర్‌ జిల్లాలో కొందరు బ్యాంకర్లు ‘ఇప్పుడు వచ్చింది మొదటి జాబితా మాత్రమే. త్వరలో కొత్త జాబితా వస్తుంది. అందులో మీ పేర్లు ఉండే అవకాశం ఉన్నది’ అంటూ సముదాయించి పంపుతున్నారు. ఇది వాస్తవమేనా? అని ‘నమస్తే తెలంగాణ’ ఆరా తీయగా ‘మా పై అధికారులు కూడా ఇదే చెప్తున్నారు. మార్పులు, చేర్పులతో త్వరలో కొత్త జాబితా వస్తుందని చెప్తున్నారు’ అని ఒక బ్యాంకు అధికారి పేర్కొన్నారు.

రాష్ట్రంలో పంట రుణాల మంజూరు ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నది. రైతుల పంట రుణం వివరాలు, వారి బ్యాంకు ఖాతా నంబర్‌, ఆధార్‌, పాస్‌బుక్‌ నంబర్‌.. వంటివన్నీ బ్యాంకర్ల దగ్గర ఉన్నాయి. ఈ వివరాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖకు, రెవెన్యూ శాఖకు చేరుతున్నాయి. ఈ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పక్కాగా ఉంటాయి కాబట్టి.. ఒక్క క్లిక్‌తోనే డాటా మొత్తం వస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇంత పక్కాగా వివరాలు ఉన్నా లోపాలు ఎందు కు జరిగాయని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం డిసెంబర్‌లో అధికారంలోకి రాగానే రుణమాఫీ కసరత్తు మొదలుపెట్టింది. అప్పటినుంచే రైతుల వివరాలు సేకరించి, పరిశీలిస్తున్నది. ఏడు నెలల సమయం దొరికినా, ఎందుకు కచ్చితమైన వివరాలు సేకరించలేకపోయారని ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. రుణమాఫీ కానివారు మండల కార్యాలయంలో ఫిర్యాదు చేయాలనడంపై రైతులు మండిపడుతున్నారు. వివరాలన్నీ బ్యాంకుల దగ్గర ఉన్నప్పుడు ఎందుకు మళ్లీ దరఖాస్తు చేయాల ని ప్రశ్నిస్తున్నారు. వీటిపై ఎప్పుడు మోక్షం కలుగుతుందో? ఎప్పుడు మాఫీ అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

నా పేరుమీద లక్షా అరవై వేల రూపాయలు, భార్యపేరు మీద అరవై వేల రూపాయలు పంట రుణం తీసుకున్నం. ఇప్పటి వరకు పైసలు పడలేదు. రుణమాఫీ సంగతి ఏందో తెలుసుకుందామని హుస్నాబాద్‌ ఎస్బీఐ బ్యాంకుకు వచ్చిన. రుణమాఫీ జరగలేదని చెప్పిన. మెసేజ్‌ కూడా రాలేదని ఫోన్‌ చూపించిన. మాకు రుణమాఫీ రాకుంటే సీఎం రేవంత్‌రెడ్డి దాక పోతం. అస్సలు ఊకోం. మాకెందుకు పైసలు రావద్దు? అర్హతలన్నీ ఉన్నప్పుడు రావాల్సిందే. నలుగురిని కూడగట్టుకొని హైదరాబాద్‌ దాక పోత. అస్సలు ఇడిసిపెట్టేదేలేదు.