దారుణం - పల్నాడు కేరాఫ్ హైదరాబాద్

ఆంధ్రలో అధికారం చేతులు మారింది. అరాచకం జడలు విప్పింది. ఎన్నికలు ముగిసిన తరువాత హత్యా రాజకీయాలు, దాడులు, దహనాలు అన్నది పల్నాడు, రాయలసీమ జనాలకు కొత్త కాదు.

గత అయిదేళ్ల హడావుడి చూసిన తరువాత ఈసారి సీన్ మరింత దారుణంగా వుంటుంది అని అందరూ ముందుగానే అనుకున్నారు. భయపడ్డారు. పైగా లోకేష్ ముందుగానే రెడ్ బుక్ అంటూ హెచ్చరించుకుంటూ వచ్చారు. మొత్తానికి అధికారం చేతులు మారింది. అదే జరిగింది. జరుగుతోంది. ఇంకా జరుగుతుందేమో అన్న భయమో పల్నాడులో ప్రబలింది

పల్నాడులో వైకాపాను తట్టుకోవడానికి చంద్రబాబు చాలా బలమైన నాయకుడిని రంగంలోకి దింపారు. అప్పటి నుంచి గొడవలు రగులుతూనే వున్నాయి. సదరు నాయకుడి దారుణాల గురించి కథనాలు ఎన్నో వున్నాయి. అధికారం చేతిలోకి రాగానే పల్నాడులో ఆ నాయకుడి అనుచరగణం గ్రామాల్లో సాగిస్తున్న అరాచకాలు ఏవీ మీడియాకు ఎక్కడం లేదు.

నిన్నగాక మొన్న జరిగిన మర్డర్ మాత్రమే కాదు, అసలు గ్రామాల్లో వుండకూడదు అని హుకుం జారీ చేసిన సంఘటనలు వున్నాయి. విత్తనాలు జల్లి, పంట సాగుచేయకూడదు అనే ఆదేశాలు. దీంతో భయం భయంగా, బిక్కు బిక్కు మంటూ వేరే చోట్ల కాలం గడుపుతూ వస్తున్నారు నెలరోజులుగా.

ఇప్పుడు ఈ దారుణమైన మర్డర్ చూసిన తరువాత ఇక గ్రామాలు వదిలిన వారు, పొలిమేరలు కూడా వదిలేసారు. హైదరాబాద్ కు చేరిపోయారు. ఇక ఇప్పుడు చాలా మంది రైతు కూలీలు, చిన్న రైతులు హైదరాబాద్ లో పని వాళ్లుగా మారిపోతున్నారు. పరాయి పంచల్లో బతుకుతున్నారు. దాదాపు 1500 మంది ఇలా ఒక్క పల్నాడు నుంచే హైదరాబాద్ కు వలస వచ్చారని ఓ అంచనా.

ఎంతటి దారుణమైన పరిస్థితి. పవన్ కళ్యాణ్ నీతులు చెబుతారు. ఇప్పుడు ఎక్కడ వున్నారు. చంద్రబాబు సుద్దులు చెబుతారు. ఏం జరుగుతోందో చూస్తున్నారా? లోకేష్ ఇది మీ రెడ్ బుక్ పర్యవసానం అంటే సమాధానం ఏమి వస్తుంది.

తెలుగుదేశం అనుకుల మీడియా ఇది వ్యక్తిగత కక్షలు అని చెప్పవచ్చు. మీ హయాంలో వాడు పోయాడు.. వీడు పోయాడు.. అప్పుడు మీకు నొప్పి తెలియలేదు. ఇప్పుడు తెలిసి వస్తోందో అని సోషల్ మీడియా ఎదురుదాడికి దిగవచ్చు. కానీ జగన్ ప్రభుత్వం బాగా లేదని చెప్పి కదా తేదేపాను గెలిపించమని అడిగారు, మరి తామూ అదే చేస్తామని అంటే దానికి ఇక సమాధానం ఏం వుంటుంది. అయిదేళ్ల తరువాత ఓ బాధితులు సమాధానం చెబుతారు.

IMD: ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. కమ్ముకొస్తున్న మబ్బులు

తెలుగు రాష్ట్రాలను వరుణ దేవుడు వణికిస్తున్నాడు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్న(Heavy Rains) వేళ ఐఎండీ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ 4 జిల్లాల్లో, శనివారం ఆరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(IMD) హెచ్చరికలు జారీ చేసింది.

తెలుగు రాష్ట్రాలను వరుణ దేవుడు వణికిస్తున్నాడు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్న(Heavy Rains) వేళ ఐఎండీ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ 4 జిల్లాల్లో, శనివారం ఆరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(IMD) హెచ్చరికలు జారీ చేసింది.

జులై 19న ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, కుమురంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ పరిసర జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్ కుమురంభీం, నిర్మల్, కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీగా, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయంది.

కొన్ని ప్రాంతాల్లో 20 సెం.మీ.లకు పైగా వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ వెల్లడించింది.

పలు ప్రాంతాల్లో గంటకు 50కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని వెల్లడించింది. గురువారం ఒక్క రోజే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో 11.3 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది.

పూజా ఖేద్కర్‌పై కేసు.. ఐఏఎస్‌ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసేందుకు యూపీఎస్సీ చర్యలు

సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు అంగవైకల్యం సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలున్న ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌పై (Puja Khedkar) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం కేసు నమోదు చేసింది.

అలాగే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2022కు సంబంధించి ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసేందుకు, భవిష్యత్తు పరీక్షల నుంచి కూడా ఆమెను డిబార్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు షోకాజ్ నోటీసును పూజా ఖేద్కర్‌కు జారీ చేసింది.

కాగా, ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా మనోరమ దిలీప్ ఖేద్కర్ దుష్ప్రవర్తన, ఆమెపై వచ్చిన ఆరోపణలపై వివరణాత్మక, సమగ్ర దర్యాప్తు నిర్వహించినట్లు యూపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆమె తన పేరు, తండ్రి, తల్లి పేరు, ఫొటో, సంతకం, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, చిరునామాను మార్చడం, నకిలీ గుర్తింపు వంటివి మోసపూరితంగా పొందినట్లు విచారణలో గుర్తించినట్లు పేర్కొంది.

ఈ నేపథ్యంలో పూజా ఖేద్కర్‌పై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌తో సహా పలు చర్యలను చేపట్టినట్లు వెల్లడించింది.

రాజ్యాంగ నిబద్ధత, ఉన్నతమైన విశ్వాసం, విశ్వసనీయతకు నిస్సందేహంగా కట్టుబడి ఉన్నట్లు వివరించింది.

 

హైదరాబాద్‌ విడిచివెళ్లం!

దీర్ఘకాలంగా హైదరాబాద్‌లో తిష్టవేసిన ప్రభుత్వ వైద్యులు జిల్లాలకు వెళ్లకుండా ఉండేందుకు మార్గాలను వెతుకుతున్నారు. తాము వెళ్లిపోతే మెడికల్‌ కళాశాలలకే నష్టమంటూ బెదిరింపులకు దిగుతున్నట్టు తెలిసింది.

దీర్ఘకాలంగా హైదరాబాద్‌లో తిష్టవేసిన ప్రభుత్వ వైద్యులు జిల్లాలకు వెళ్లకుండా ఉండేందుకు మార్గాలను వెతుకుతున్నారు. తాము వెళ్లిపోతే మెడికల్‌ కళాశాలలకే నష్టమంటూ బెదిరింపులకు దిగుతున్నట్టు తెలిసింది.

లాంగ్‌ స్టాండింగ్‌ పేరుతో మమ్మల్ని ఇక్కడి నుంచి పంపిస్తే.. కొత్తగా ఎవరూ రాకపోతే ఎంబీబీఎస్‌, పీజీ సీట్లు తగ్గిపోతాయి.

ఎక్కడో మారుమూల జిల్లాలో మెడికల్‌ కాలేజీ అనుమతి కోసం హైదరాబాద్‌లో సీట్లను తగ్గించుకుంటారా’ అంటూ ఉన్నతాధికారులనే దబాయిస్తున్నట్టు తెలిసింది.

వైఎస్ జగన్ వినుకొండ పర్యటన నేపథ్యంలో గుంటూరు ఐజీ కీలక ప్రకటన

పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో బుధవారం రాత్రి ముండ్లమూరు బస్టాండ్‌ వద్ద నడిరోడ్డుపై, అందరూ చూస్తుండగా హత్యకు గురైన షేక్‌ రషీద్‌ అనే యువకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు.

పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో బుధవారం రాత్రి ముండ్లమూరు బస్టాండ్‌ వద్ద నడిరోడ్డుపై, అందరూ చూస్తుండగా హత్యకు గురైన షేక్‌ రషీద్‌ అనే యువకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. హతుడు షేక్ రషీద్, హంతకుడు షేక్ జిలానీ ఇద్దరూ గతంలో మిత్రులే. ఇద్దరూ గతంలో ఖాన్‌ ముఠాలో సభ్యులే. అయినప్పటికీ ‘చావు రాజకీయం’ కోసం మాజీ సీఎం జగన్ ఇవాళ (శుక్రవారం) వినుకొండ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కీలకమైన ప్రకటన చేశారు.

వినుకొండలో 144 సెక్షన్ అమలులో ఉందని, ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదని సర్వశ్రేష్ఠ త్రిపాఠి స్పష్టం చేశారు. అయితే వైసీపీ అధినేత జగన్ మోహ్మన్ రెడ్డి వచ్చి రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించవచ్చునని క్లారిటీ ఇచ్చారు. కానీ జన సమీకరణతో ప్రదర్శనలు చేయవద్దని, ప్రస్తుతం వినుకొండ పట్టణంలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, అనవసరంగా ఎవ్వరూ రోడ్లు పైకి రావద్దని ఆయన పిలుపునిచ్చారు.

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి శుక్రవారం వినుకొండకు వెళ్తున్నారు. వైసీపీలో గ్యాంగ్‌ వార్‌ కారణంగా మరణించిన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన నిర్ణయించుకున్నారు. జరిగింది దారుణం.. ఘోరం! కానీ ఈ హత్యను టీడీపీపైకి నెట్టేసి పరామర్శకు బయలుదేరడమే జగన్‌ మార్కు రాజకీయంగా కనిపిస్తోంది.

ఐదేళ్ల తన పాలనలో పల్నాడులో వైసీపీ నేతలు ఎన్ని అరాచకాలు సాగించినా పట్టించుకోకుండా, హత్యలు జరిగినా స్పందించని జగన్‌...ఇప్పుడు వినుకొండకు బయలుదేరడమే పెద్ద విచిత్రమని జనాలు చెప్పుకుంటున్నారు.

బుధవారం రాత్రి వినుకొండలో నడి రోడ్డుపై రషీద్‌ అనే యువకుడు దారుణ హత్యోదంతం తెలిసిన విషయమే. షేక్‌ జిలానీ ఈ హత్యకు పాల్పడ్డాడు. అయితే వీళ్లిద్దరూ ఒకప్పుడు మిత్రులే. ఇద్దరూ వైసీపీలో క్రియాశీలంగా వ్యవహరించారు.

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రోత్సాహంతో వినుకొండలో రౌడీగా ఎదిగిన పీఎస్‌ ఖాన్‌ గ్యాంగ్‌లో రషీద్‌, జిలానీ పనిచేశారు. అయితే వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఏటా తొలి ఏకాదశి రోజున వినుకొండలో కొండ తిరునాళ్లు నిర్వహిస్తుంటారు. 

గత ఏడాది తిరునాళ్ల సందర్భంగా గ్యాంగ్‌ లీడర్‌ ఖాన్‌ ఓ లాడ్జిలో పార్టీ ఏర్పాటు చేశాడు. జిలానీ ఆ రోజు బీర్‌ బాటిళ్లతో దాడి చేయడంతో ఒక యువకుడు గాయపడ్డాడు. ఈ ఘటనలో పీఎస్‌ ఖాన్‌ రషీద్‌కు మద్దతుగా నిలిచాడు.

రషీద్‌, ఖాన్‌ గ్యాంగ్‌లో మరి కొందరు కలిసి గత సంవత్సరం జూలైలో జిలానీ ఇంటిపై దాడికి ప్రయత్నించారు. జిలానీ ఇంట్లో లేకపోవడంతో అతడి అన్న జిమ్‌ జానీపై దాడి చేసి గాయపరిచారు. తాజాగా ఈ హత్య జరిగింది.

Supreme Court: కఠిన చట్టాల పేరుతో బెయిలివ్వకుండా ఆపలేరు: సుప్రీం

నేర శిక్షాస్మృతిలోని కఠిన చట్ట నిబంధనలు నిందితులకు బెయిలివ్వకుండా రాజ్యాంగబద్ధ కోర్టులను ఆపలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 21వ రాజ్యాంగ నిబంధన ప్రసాదించిన జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛ విస్తృృతమైనవీ, పవిత్రమైనవని తేల్చి చెప్పింది.

నేర శిక్షాస్మృతిలోని కఠిన చట్ట నిబంధనలు నిందితులకు బెయిలివ్వకుండా రాజ్యాంగబద్ధ కోర్టులను ఆపలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 21వ రాజ్యాంగ నిబంధన ప్రసాదించిన జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛ విస్తృృతమైనవీ, పవిత్రమైనవని తేల్చి చెప్పింది.

చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం(ఉపా) కింద అరెస్టయిన నేపాలీ పౌరుడు షేక్‌ జావేద్‌ ఇక్బాల్‌కు బెయిలు మంజూరు చేస్తూ విడుదల చేయాలని ఆదేశించింది. జస్టిస్‌ జేబీ పార్థీవాలా, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ల ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఎంత కఠినమైన శిక్షాస్మృతి చట్ట నిబంధన అయినా దాని అర్థాన్ని తీసుకొనే సమయం లో రాజ్యాంగ న్యాయస్థానం(హైకోర్టు, సుప్రీంకోర్టు) రాజ్యాంగ విలువలకు, చట్టబద్ధ పాలనకు కట్టుబడి ఉండాలని చెప్పింది. ఆ రెండింటిలోనూ వ్యక్తి స్వేచ్ఛ అంతర్లీనంగా ఉంటుందని వివరించింది.

ఈ నేపాలీ వ్యక్తి కేసులో రాజ్యాంగ న్యాయస్థానం బెయిలు ఇవ్వొచ్చు.. ఇవ్వకపోవచ్చు కానీ ఫలానా చట్టం కింద బెయిలు ఇవ్వడం కుదరదని చెప్పడం తప్పే అవుతుందని స్పష్టం చేసింది. ఇక్బాల్‌ నేపాల్లో భారతదేశపు నకిలీ నోట్లను చెలామణి చేస్తున్నట్లు అంగీకరించాడని పోలీసులు ప్రకటించారు.

అతని మీద 489(బి), 489(సి) కింద నకిలీ నోట్లు ఉంచుకున్నాడని, నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నాడని కేసు పెట్టారు. దానికి తీవ్రవాదులపై ప్రయోగించే ఉపా చట్టాన్ని జోడించారు. ఇక్బాల్‌ తొమ్మిదేళ్లుగా కస్టడీలో ఉన్నాడని, ఈకేసు ఇప్పట్లో తేలే వాతావరణం కనబడటం లేదని నిందితుడి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ఇక్బాల్‌ తీవ్రమైన నేరానికి పాల్పడ్డాడని, నేపాలీ పౌరుడు అయినందున దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీంకోర్టుకు విన్నవించారు. నత్తనడకన నడుస్తున్న ఈ కేసు ఎప్పట్లోగా తేలుతుందో స్పష్టత లేదని కోర్టు అభిప్రాయపడింది. పాస్‌పోర్టు, పౌరసత్వ పత్రాలను తీసుకొని అతన్ని విడుదల చేయాలని ఆదేశించింది.

ఇప్పటికే స్వాధీ నం చేసుకుంటే ట్రయల్‌ కోర్టుకు అప్పగించాలని పేర్కొంది. ట్రయల్‌ కోర్టు విచారణకు క్రమం తప్పకుండా హాజరు కావాలని నిందితుడికి చెప్పింది. విచారణ పూర్తయ్యే దాకా పక్షం రోజులకు ఒకసారి పోలీసు స్టేషన్‌కు వచ్చి సంతకం పెట్టాలని ట్రయల్‌ కోర్టు నిబంధన పెట్టొచ్చని సూచించింది.

317 GO : నేడు 317 జీవో అంశాలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి స్పౌజ్, మెడికల్, మ్యుచువల్ తదితర బదిలీలకు సంబంధించి ఇప్పటివరకూ సానుకూలంగా స్పందించిన కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం సమావేశం కానున్నది. తొలుత నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం గురువారమే భేటీ కావాల్సి ఉన్నా ఒక రోజు వాయిదా పడింది. గతంలోనే రాష్ట్రంలోని జిల్లా, మల్టీ జోనల్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీలపై ఇప్పటివరకూ వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన సబ్ కమిటీ... శాఖలవారీగా జాబితాను తయారుచేసి సమర్పించాలంటూ గత వారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నది. సాధారణ పరిపాలన శాఖ వాటిని తదుపరి భేటీకి అందజేయాల్సిందిగా ఆదేశించింది. ఆ ప్రకారం జీఏడీకి అన్ని శాఖల నుంచి నివేదికలు అందాయి. వీటిని పరిశీలించిన తర్వాత సబ్ కమిటీ తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.

ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 2008 బ్యాచ్ డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని కూడా కేబినెట్ సబ్ కమిటీ చర్చించనున్నది. వీరికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించినట్లయితే దానికి సంబంధించిన విధివిధానాలపై చర్చిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలంటూ క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నది.

అదే తరహాలో తెలంగాణలోనూ ఆలోచించాలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సానుకూల నిర్ణయం తీసుకున్నట్లయితే విధివిధానాలను ఖరారు చేయాల్సిందిగా కేబినెట్ సబ్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బాధ్యతలను అప్పగించింది.

ఉమ్మడి జిల్లావారీగా నష్టపోయిన అభ్యర్థుల వివరాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఆరు వారాల్లోగా ఉద్యోగాలను ఇస్తామంటూ గత నెల 27న హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

తదుపరి విచారణ వచ్చే నెల 8న జరగనున్నందున అప్పటికల్లా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని కోర్టుకు తెలియజేయాల్సి ఉన్నది. దీంతో కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం జరిపే సమావేశంలో దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశమున్నది. విధివిధానాలను ఏ తరహాలో రూపొందిస్తున్న ఆసక్తి నెలకొన్నది.

మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు సమావేశం కానున్నారు.

స్పౌజ్, మ్యుచువల్, మెడికల్, కేంద్ర ప్రభుత్వ సర్వీసులో భార్యభర్త ఉద్యోగం రీత్యా చేసుకున్న బదిలీ దరఖాస్తులపై జీఏడీ ఇచ్చే జాబితాను పరిశీలించి స్పష్టమైన ప్రకటన చేయడంతో పాటు 2008 డీఎస్సీ బాధితుల విషయంలోనూ కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశమున్నది.

BJP: ఉప ఎన్నికలపై బీజేపీ నజర్‌!

బీఆర్‌ఎ్‌సలోని ఐదారుగురు బలమైన నేతలను ఆకర్షించి.. వారితో రాజీనామా చేయించి, వారిని తమ పార్టీలోకి తీసుకుని.. ఉపఎన్నికలకు వెళ్లాలని కమలనాథులు యోచిస్తున్నారా?

బీఆర్‌ఎస్‌లోని ఐదారుగురు బలమైన నేతలను ఆకర్షించి.. వారితో రాజీనామా చేయించి, వారిని తమ పార్టీలోకి తీసుకుని.. ఉపఎన్నికలకు వెళ్లాలని కమలనాథులు యోచిస్తున్నారా? తద్వారా రాష్ట్రంలో మరింత బలపడాలని భావిస్తున్నారా? అంటే..

ఆ పార్టీ వర్గాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. ఇలా చేయడంవల్ల.. ఇప్పటికే కాంగ్రె్‌సలో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై కూడా రాజీనామా చేయాలనే ఒత్తిడి పెరుగుతుందని రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలు కొందరు అంచనా వేస్తున్నారు.

దీనిపై వారు పార్టీ జాతీయ నాయకత్వం వద్ద ఒక ప్రతిపాదన చేసినట్టు సమాచారం. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వస్తేనే తీసుకుంటామన్న నిబంధన కారణంగా పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు ముందుకు రావడం లేదని బీజేపీ వర్గాలు తెలిపాయి

ఇప్పటికే కాంగ్రె్‌సలోచేరిన ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు వాస్తవానికి బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారని.. కానీ, రాజీనామా అంశంపై తమ విస్పష్ట వైఖరి కారణంగా వారు చేరలేదని ఆ వర్గాలు వివరించాయి.

మరికొందరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నా, మునుగోడు ఫలితం నేపథ్యంలో వారు పునరాలోచిస్తున్నట్టు సమాచారం.

రాజీనామా చేశాక మళ్లీ కచ్చితంగా గెలిచే సత్తా ఉన్నవారిని ఆకర్షించి ఉప ఎన్నికలకు వెళ్లడం ద్వారా అటు కాంగ్రెస్‌ దూకుడుకు కళ్లెం వేయడంతో పాటు ఇటు బీఆర్‌ఎ్‌సనూ మరింత దెబ్బకొట్టినట్లు అవుతుందన్న అభిప్రాయం కొంతమంది ముఖ్యనేతల్లో ఉంది.

ట్రంప్ పై హత్యాయత్నం సీన్ ను రిక్రియేట్ చేసిన ఉగాండా కిడ్స్..

అమెరికా మాజీ ప్రెసిడెంట్, 2024 ప్రెసిడెంట్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై ఇటీవల హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. కొద్దిలో ప్రాణాపాయం తప్పించుకున్న ట్రంప్ మళ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

దుండగుడు కాల్పులు జరపడం, సెక్యూరిటీ సిబ్బంది అతడిని తుదముట్టించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన జరిగిన రెండు గంటల్లోనే చైనాలో లోకల్ కంపెనీ ఒకటి ట్రంప్ పై హత్యాయత్నానికి సంబంధించిన ఫొటోతో టీషర్టులు అమ్మకానికి సిద్ధం చేసింది. నిమిషాల వ్యవధిలోనే సదరు టీషర్టులకు ఆన్ లైన్ ద్వారా వేలల్లో ఆర్డర్లు వచ్చాయని కంపెనీ వివరించింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో మరో వీడియో వైరల్ అవుతోంది. ట్రంప్ పై హత్యాయత్నానికి సంబంధించిన ఘటనను ఉగాండా పిల్లలు రిక్రియేట్ చేశారు.

ఓ పిల్లాడు ట్రంప్ ను అనుకరిస్తూ స్టేజిపై మాట్లాడుతుండగా.. చుట్టూ కర్ర తుపాకులతో బుల్లి ట్రంప్ కు సెక్యూరిటీగా నలుగురు భద్రతా సిబ్బంది నిలుచున్నారు. ఇంతలో బుల్లెట్ సౌండ్ వినిపించగా.. చెవి పట్టుకుని ట్రంప్, ఆయనను చూసి భద్రతా సిబ్బంది స్టేజీ పైనే కూర్చుండిపోతారు.

ఆపై ట్రంప్ ‘ఫైట్ ఫైట్’ అంటూ నినాదాలు చేస్తుండగా సెక్యూరిటీగా నటిస్తున్న పిల్లలు ఆయనను పట్టుకుని కిందికి తీసుకెళతారు.

అచ్చంగా డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన హత్యాయత్నాన్ని ఉగాండా పిల్లలు నటించి చూపించారు. ఈ వీడియోను టిక్ టాక్ లో పోస్ట్ చేయగా.. వైరల్ గా మారింది. దీంతో ఓ నెటిజన్ ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశాడు.

రుణమాఫీ సగం మందికే.. ప్రభుత్వ కొర్రీలతో దూరంకానున్న లబ్ధిదారులు!

మీరు పంట రుణాలు రెన్యువల్‌ చేసుకోండి. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే అందరి రుణాలను మాఫీ చేస్తాం.’ ‘ఆగస్టు 15లోగా రైతులందరినీ రుణ విముక్తులను చేస్తాం.’..

ఇవీ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు వల్లెవేసిన వ్యాఖ్యలు.

మీరు పంట రుణాలు రెన్యువల్‌ చేసుకోండి. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే అందరి రుణాలను మాఫీ చేస్తాం.’ ‘ఆగస్టు 15లోగా రైతులందరినీ రుణ విముక్తులను చేస్తాం.’.. ఇవీ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు వల్లెవేసిన వ్యాఖ్యలు.

కానీ, సోమవారం విడుదల చేసిన రుణమాఫీ మార్గదర్శకాల ప్రకారం అవన్నీ గాలిమాటలేనని, రుణమాఫీ సగం మందికి కూడా అందడం కష్టమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గణాంకాలతో సహా వివరిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇందులో సుమారు 55 లక్షల మంది పంట రుణాలు తీసుకున్నట్టు వ్యవసాయ శాఖ వర్గాల అంచనా.

రుణమాఫీకి పీఎం కిసాన్‌ యోజన మార్గదర్శకాలను అమలుచేస్తామని ప్రభుత్వం చెప్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో పీఎం కిసాన్‌ యోజన లబ్ధిదారులు 33 లక్షల మంది ఉన్నారు. ఈ డాటాను చివరగా 2019లో అప్‌డేట్‌ చేశారు. అప్పటినుంచి ఈ పథకానికి అర్హులైన వారి సంఖ్య ఐదేండ్లలో మరో ఐదు లక్షల వరకు పెరిగి ఉంటుందని అంచనా