ట్రంప్ పై హత్యాయత్నం సీన్ ను రిక్రియేట్ చేసిన ఉగాండా కిడ్స్..

అమెరికా మాజీ ప్రెసిడెంట్, 2024 ప్రెసిడెంట్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై ఇటీవల హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. కొద్దిలో ప్రాణాపాయం తప్పించుకున్న ట్రంప్ మళ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

దుండగుడు కాల్పులు జరపడం, సెక్యూరిటీ సిబ్బంది అతడిని తుదముట్టించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన జరిగిన రెండు గంటల్లోనే చైనాలో లోకల్ కంపెనీ ఒకటి ట్రంప్ పై హత్యాయత్నానికి సంబంధించిన ఫొటోతో టీషర్టులు అమ్మకానికి సిద్ధం చేసింది. నిమిషాల వ్యవధిలోనే సదరు టీషర్టులకు ఆన్ లైన్ ద్వారా వేలల్లో ఆర్డర్లు వచ్చాయని కంపెనీ వివరించింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో మరో వీడియో వైరల్ అవుతోంది. ట్రంప్ పై హత్యాయత్నానికి సంబంధించిన ఘటనను ఉగాండా పిల్లలు రిక్రియేట్ చేశారు.

ఓ పిల్లాడు ట్రంప్ ను అనుకరిస్తూ స్టేజిపై మాట్లాడుతుండగా.. చుట్టూ కర్ర తుపాకులతో బుల్లి ట్రంప్ కు సెక్యూరిటీగా నలుగురు భద్రతా సిబ్బంది నిలుచున్నారు. ఇంతలో బుల్లెట్ సౌండ్ వినిపించగా.. చెవి పట్టుకుని ట్రంప్, ఆయనను చూసి భద్రతా సిబ్బంది స్టేజీ పైనే కూర్చుండిపోతారు.

ఆపై ట్రంప్ ‘ఫైట్ ఫైట్’ అంటూ నినాదాలు చేస్తుండగా సెక్యూరిటీగా నటిస్తున్న పిల్లలు ఆయనను పట్టుకుని కిందికి తీసుకెళతారు.

అచ్చంగా డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన హత్యాయత్నాన్ని ఉగాండా పిల్లలు నటించి చూపించారు. ఈ వీడియోను టిక్ టాక్ లో పోస్ట్ చేయగా.. వైరల్ గా మారింది. దీంతో ఓ నెటిజన్ ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశాడు.

రుణమాఫీ సగం మందికే.. ప్రభుత్వ కొర్రీలతో దూరంకానున్న లబ్ధిదారులు!

మీరు పంట రుణాలు రెన్యువల్‌ చేసుకోండి. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే అందరి రుణాలను మాఫీ చేస్తాం.’ ‘ఆగస్టు 15లోగా రైతులందరినీ రుణ విముక్తులను చేస్తాం.’..

ఇవీ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు వల్లెవేసిన వ్యాఖ్యలు.

మీరు పంట రుణాలు రెన్యువల్‌ చేసుకోండి. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే అందరి రుణాలను మాఫీ చేస్తాం.’ ‘ఆగస్టు 15లోగా రైతులందరినీ రుణ విముక్తులను చేస్తాం.’.. ఇవీ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు వల్లెవేసిన వ్యాఖ్యలు.

కానీ, సోమవారం విడుదల చేసిన రుణమాఫీ మార్గదర్శకాల ప్రకారం అవన్నీ గాలిమాటలేనని, రుణమాఫీ సగం మందికి కూడా అందడం కష్టమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గణాంకాలతో సహా వివరిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇందులో సుమారు 55 లక్షల మంది పంట రుణాలు తీసుకున్నట్టు వ్యవసాయ శాఖ వర్గాల అంచనా.

రుణమాఫీకి పీఎం కిసాన్‌ యోజన మార్గదర్శకాలను అమలుచేస్తామని ప్రభుత్వం చెప్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో పీఎం కిసాన్‌ యోజన లబ్ధిదారులు 33 లక్షల మంది ఉన్నారు. ఈ డాటాను చివరగా 2019లో అప్‌డేట్‌ చేశారు. అప్పటినుంచి ఈ పథకానికి అర్హులైన వారి సంఖ్య ఐదేండ్లలో మరో ఐదు లక్షల వరకు పెరిగి ఉంటుందని అంచనా

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్... ఘోష్ కమిషన్ ఎదుట హాజరైన స్మితా సబర్వాల్, సోమేశ్ కుమార్

కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, దస్త్రాల విషయంలో విధానపరమైన నిర్ణయాల్లో 'మీ పాత్ర ఏమిటి' అంటూ ప్రస్తుత, మాజీ ఐఏఎస్ అధికారులను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. ప్రాజెక్టు స్థలం, నిర్మాణ సమయం, నిధుల కేటాయింపు, ప్రాజెక్టు అంచనాల్లో మార్పు, లక్ష్యాల మేరకు పనులు పూర్తి చేయించడం తదితర అంశాలపై అధికారుల పాత్రను కమిషన్ ప్రశ్నించింది.

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా, నీటిపారుదల శాఖ కార్యదర్శిగా పని చేసిన స్మితా సబర్వాల్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేసిన రజత్ కుమార్, కార్యదర్శిగా పని చేసిన వికాస్ రాజ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేసిన సోమేశ్ కుమార్ హాజరైన వారిలో ఉన్నారు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఎస్‌కే జోషి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల్లో లోపాలు, అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ విచారణ జరుపుతోంది. బ్యారేజీల నిర్మాణ ప్రాంతాల ఎంపిక, నిర్మాణాలలో వారి పాత్ర తదితర అంశాలపై కమిషన్ వారి నుంచి ఆరా తీసింది.

బ్యారేజీల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులు, కాంట్రాక్టర్లకు పనులు అప్పగించిన తీరు, వారితో ఒప్పందాలు-అమలు, అంచనాల సవరణ, ఉల్లంఘనలు తదితర అంశాలపై ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. అఫిడవిట్ల రూపంలో సమాచారం సమర్పించాలని వారిని కమిషన్ ఆదేశించింది.

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల్లో లోపాలు, అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ విచారణ జరుపుతోంది. బ్యారేజీల నిర్మాణ ప్రాంతాల ఎంపిక, నిర్మాణాలలో వారి పాత్ర తదితర అంశాలపై కమిషన్ వారి నుంచి ఆరా తీసింది.

బ్యారేజీల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులు, కాంట్రాక్టర్లకు పనులు అప్పగించిన తీరు, వారితో ఒప్పందాలు-అమలు, అంచనాల సవరణ, ఉల్లంఘనలు తదితర అంశాలపై ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. అఫిడవిట్ల రూపంలో సమాచారం సమర్పించాలని వారిని కమిషన్ ఆదేశించింది.

నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఇప్పటికే ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అధికారులను, మాజీ అధికారులను ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆర్థికపరమైన అంశాల మీద కూడా ప్రశ్నించిందని తెలుస్తోంది.

అంచనా వ్యయ ఆమోదం, పరిపాలనా అనుమతులు, సవరణ అంచనాలు, నిధుల విడుదల, కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటుకు అనుమతులు, దాని ద్వారా రుణాలు సమీకరించిన తీరు తదితర అంశాలపై ప్రశ్నించిందని సమాచారం.

High Court: అర్చకుల బదిలీలపై హైకోర్టు మధ్యంతర స్టే

రాష్ట్రంలోని పూజారులు, అర్చకుల బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలోని పూజారులు, అర్చకుల బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఎండోమెంట్‌ శాఖ పరిధిలోని ఉద్యోగులు ప్రత్యేకంగా పూజారులు, అర్చకుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తేస్తూ జారీ చేసిన ఆర్థికశాఖ జీవో 80, రెవెన్యూశాఖ (ఎండోమెంట్‌) జీవో 64లను సవాల్‌ చేస్తూ భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ఉప ప్రధాన అర్చకులుగా సేవలు అందిస్తున్న కోటి శ్రీమన్నారాయణాచార్యులు, అమరవాది మురళీకృష్ణమాచార్యులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై జస్టిస్‌ పుల్ల కార్తీక్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ వాదనలు వినిపిస్తూ.. ఎండోమెంట్‌ శాఖ ఉద్యోగుల బదిలీల పేరిట ప్రభుత్వం పూజారులు, అర్చకుల బదిలీలకు ఆప్షన్స్‌ ఇవ్వాలని కోరుతోందన్నారు.

తెలంగాణ చారిటబుల్‌ అండ్‌ హిందూ రిలీజియస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ అండ్‌ ఎండోమెంట్‌ యాక్ట్‌ ప్రకారం ఆధ్యాత్మిక కేంద్రాల్లోని సంప్రదాయాలు, పూజలు, ధర్మాలకు సంబంధించిన వ్యక్తుల విషయంలో జోక్యం చేసుకోరాదని పేర్కొన్నారు.

ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా వారి వ్యవహారాలను పర్యవేక్షించే అధికారం ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.

వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. అర్చకుల బదిలీలపై మధ్యంతర స్టే విధించింది. రెండువారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలిస్తూ విచారణను వాయిదా వేసింది.

రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం

సార్వత్రిక ఎన్నికల్లో బొటా బొటి మెజారిటీయే రావడం, మిత్రపక్షాల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతోపాటు తాజాగా వెల్లడైన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి జోరుమీద ఉండటంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షా ఆలోచనలో పడ్డారు.

ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ సంస్థలను విక్రయించడంమీద దృష్టిసారించగా ఇప్పుడు మాత్రం ప్రయివేటీకరించకుండా వాటికి కాయకల్ప చికిత్స చేద్దామని భావిస్తున్నారు. అలాగే భారతీయ రైల్వేలో టికెట్లపై సీనియర్ సిటిజన్లకు వర్తించే రాయితీని కరోనా సమయంలో రద్దు చేశారు. రాబోయే బడ్జెట్ లో దాన్ని పునరుద్ధరించే అవకాశం కనపడుతోంది.

ఉచితాలు, రాయితీలకు నిర్మల వ్యతిరేకం కరోనా ముందు వరకు 58 సంవత్సరాలు దాటిని మహిళకు, 60 సంవత్సరాలు దాటిన పురుషులకు ప్రయాణ టికెట్లలో 50 శాతం, 40 శాతం చొప్పున రాయితీ ఇచ్చేవారు.

రాయితీని తొలగించడంవల్ల సీనియర్ సిటిజన్లు ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల మెప్పు పొందాలని భావిస్తున్న మోడీ ప్రభుత్వం వీటిని పునరుద్ధరించబోతోంది. ఈనెల 23వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. వాస్తవానికి ఉచితాలు ఇవ్వడం, రాయితీలు ఇవ్వడంలాంటివి ఆమెకు ఇష్టం ఉండదు.

వ్యాపార ధోరణితో కేంద్రం దాదాపుగా అన్ని రైళ్లల్లో సీనియర్ సిటిజన్లకు రాయితీ ఇచ్చేవారు. వీటిని తొలగించిన తర్వాత రైల్వేకు రూ.2242 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రజల అవసరాలు తీర్చడానికి, వారికి భారం కాకుండా ఉండేందుకు రాయితీలు వర్తింపచేస్తూ పాలన కొనసాగించాల్సిన కేంద్ర ప్రభుత్వం వ్యాపార ధోరణితో వాటిని ఎత్తేసి ముక్కుపిండి వారినుంచి డబ్బులు వసూలు చేస్తోంది. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోవడంలేదు.

ఎన్నికల్లో మెజారిటీ రాకపోవడం, ఉప ఎన్నికల్లో ఓడిపోవడంలాంటివన్నీ చూసి కేంద్ర పెద్దల మనసు మారింది. అవసరం రీత్యా వీరికి మనసు మారిందేకానీ నిజంగా సీనియర్ సిటిజన్లకు రాయితీ ఇవ్వాలనే మంచి ఉద్దేశం మాత్రం లేదని ఇండియా కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం భారతీయ రైల్వే.. రకరకాల కేటగిరీల్లో ప్రయాణికులకు రాయితీలు, తగ్గింపులూ ఇస్తోంది. వీరిలో దివ్యాంగులు, 11 రకాల కేటగిరీల పేషెంట్లు, 8 రకాల కేటగిరీల విద్యార్థులూ ఉన్నారు. ఇంతమందికి ఇస్తున్నప్పుడు మాకు కూడా ఇవ్వొచ్చుగా అని సీనియర్ సిటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవే స్వయంగా చెప్పారు. అందువల్ల ఈ బడ్జెట్‌పై సీనియర్ సిటిజన్లు దృష్టి పెడుతున్నారు. గుడ్ న్యూస్ వస్తే పండగే

ఎన్నికలు సమీపిస్తున్నా మారని బైడెన్‌ తీరు.. బ్యాలెట్‌ బాక్సులకు బదులు.. బ్యాటిల్‌ బాక్సులంటూ..!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) మాటల తడబాటు కొనసాగుతూనే ఉంది..!

ప్రెసిడెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్షుడి ప్రవర్తనతో డెమోక్రాటిక్‌ పార్టీలో తీవ్ర ఆందోళ వ్యక్తమవుతోంది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) మాటల తడబాటు కొనసాగుతూనే ఉంది..!

ప్రెసిడెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్షుడి ప్రవర్తనతో డెమోక్రాటిక్‌ పార్టీలో తీవ్ర ఆందోళ వ్యక్తమవుతోంది.

ఎన్నికల వేళ బైడెన్‌ తడబడుతుండటం డెమోక్రాట్లకు ఇబ్బందికరంగా మారుతోంది.

ఇప్పటికే మతిమరుపు, తడబాట్లతో తీవ్ర విమర్శలపాలైన బైడెన్‌.. తాజాగా మరోసారి అదేపొరపాటు చేసి మీడియాకు చిక్కారు.

Nita Ambani: మీడియాకు క్షమాపణ చెప్పిన నీతా అంబానీ

భారతదేశ శ్రీమంతుడు ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ముంబైలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.

జులై 12 వివాహ వేడుక జరిగింది. పెళ్లి తర్వాత శుభ్ ఆశీర్వాద్, నిన్న మంగళ్ ఉత్సవ్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు నీతా అంబానీ కృతజ్ఞతలు తెలియజేశారు.

అంతేకాదు, తమ వల్ల ఏదైనా తప్పులు జరిగి ఉంటే క్షమించాలని మీడియాను కోరారు. పెళ్లి సందర్భంగా చిన్నిచిన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉందని తెలిపారు. మీరంతా రేపు మా అతిథులుగా రావాలని కోరారు. మీకు స్వాగతం పలకడం సంతోషంగా ఉందని చెప్పారు. 

మరోవైపు నీతా అంబానీ మీడియాను ఉద్దేశించి మాట్లాడిన విధానాన్ని చూసి గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అంతులేని సంపద ఉన్నప్పటికీ...

ఆమెకు కొంచెం కూడా గర్వం లేదని కొనియాడుతున్నారు. ఇంకోవైపు, నిన్న జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ మరోసారి బాలీవుడ్ స్టార్లతో మెరిసిపోయింది.

షారుక్ ఖాన్ వంటి కొందరు స్టార్లకు రూ. 2 కోట్ల విలువైన వాచ్ లను అనంత్ అంబానీ బహూకరించినట్టు సమాచారం.

పింఛన్ల రికవరీలపై కాంగ్గ్రెస్‌ సర్కార్‌ వెనకడుగు!

అనర్హుల పేరుతో ఆసరా పెన్షన్లను రికవరీ చేయాలన్న నిర్ణయంపై ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కు తగ్గింది.

దీనిపై స్పష్టమైన మార్గరద్శకాలు వెలువడే వరకు ఎటువంటి నోటీసులు జారీచేయడం కానీ, రికవరీ చర్యలు చేపట్టడం కానీ చేయరాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులను ఆదేశిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు.

అనర్హుల పేరుతో ఆసరా పెన్షన్లను రికవరీ చేయాలన్న నిర్ణయంపై ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కు తగ్గింది. దీనిపై స్పష్టమైన మార్గరద్శకాలు వెలువడే వరకు ఎటువంటి నోటీసులు జారీచేయడం కానీ,

రికవరీ చర్యలు చేపట్టడం కానీ చేయరాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులను ఆదేశిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు.

సంక్షేమ పథకాల ద్వారా అనర్హులు లబ్ధిపొందుతున్న అంశంపై ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎటువంటి రికవరీ చర్యలు చేపట్టరాదని స్పష్టంచేశారు.

వివిధ సంక్షేమ పథకాల్లో అనర్హులు లబ్ధ్దిపొందుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు మరింత మెరుగైన పద్ధతుల్లో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు సంప్రదింపులు చేపట్టినట్టు తెలిపారు.

PM Modi : ట్రంప్‌ త్వరగా కోలుకోవాలి

ట్రంప్‌పై హత్యాయత్నాన్ని ప్రపంచ దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ, ఫ్రెంచ్‌ అధ్యక్షుడు మెక్రాన్‌, బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌.. ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటనపై స్పందిస్తూ

ట్రంప్‌పై హత్యాయత్నాన్ని ప్రపంచ దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ, ఫ్రెంచ్‌ అధ్యక్షుడు మెక్రాన్‌, బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌..

ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటనపై స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదన్నారు.

‘‘నా మిత్రుడైన ట్రంప్‌పై హత్యాయత్నం తీవ్ర వేదన కలిగించింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.

ఆయన త్వరగా కోలుకోవాలి’’ అని మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు. ట్రంప్‌ త్వరగా కోలుకోవాలని రాహుల్‌గాంధీ, ఖర్గే ఆకాంక్షించారు.

ట్రంప్‌పై హత్యాయత్నం అమెరికన్‌ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయం అని భారతీయ అమెరికన్లు పేర్కొన్నారు. భారతీయ అమెరికన్ల నాయకుడు డాక్టర్‌ భరత్‌ బరయ్‌ మాట్లాడుతూ...

ఈ ఘటన చాలా విచారకరమన్నారు. బైడెన్‌కు బలమైన మద్దతుదారు అయిన అజయ్‌ భుటోరియా మాట్లాడుతూ... ఈ హత్యాయత్నంపై అన్ని కోణాల్లో విచారించాలన్నారు.

సర్వం స్వాహా!

సహజ వనరులైన భూములు, గనులు, అటవీ వనరులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం శ్వేతపత్రం విడుదల చేయనున్నారు.

సహజ వనరులైన భూములు, గనులు, అటవీ వనరులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎంకు సమర్పించేందుకు గనుల శాఖ నివేదికను తయారు చేసింది. అందులో అనేక కీలకమైన అంశాలను పొందుపరిచింది. ‘జగన్‌ ఏలుబడిలో గనుల తవ్వకాలు, అమ్మకాల్లో అంతులేని దోపిడీ జరిగింది. ఖనిజాల తవ్వకాలకు ఇచ్చే పర్మిట్లు, రవాణా, ఇతర వ్యవహారాల్లో అంతుచిక్కని అనేకానేక అక్రమాలున్నాయి. కేవలం ఐదారు అంశాలను ప్రాథమికంగా పరిశీలన చేస్తేనే గత ఐదేళ్ల కాలంలో 19 వేల కోట్లపైనే అక్రమాలు జరిగాయి. ఇంకా లెక్క తేలాల్సినవి ఎన్నో ఉన్నాయి. కాబట్టి గనుల శాఖలో జరిగిన అక్రమాలు, ఘోరాలపై సమగ్ర విచారణ జరగాలి’ అని గనుల శాఖ నివేదించనుంది.

చంద్రబాబు వద్ద జరిగే సమావేశంలో... జగన్‌ హయాం నాటి అక్రమాలను నిగ్గుతేల్చడానికి సమగ్ర విచారణ చేయించాలని గనుల శాఖ ప్రధాన డిమాండ్‌గా ఉంచనుంది. సీఐడీ విచరణా లేక విజిలెన్స్‌తోనా అన్నది ప్రభుత్వ నిర్ణయానికే వదిలేయనున్నది. విచారణ మాత్రం జరిగి తీరాలని, అప్పుడే అసలైన అక్రమాలు, ఘోరాలు బయటికి వస్తాయని ఆ శాఖ సీఎంను కోరనుంది. గనుల శాఖ తయారు చేసిన నివేదికలో అనేక కీలకమైన అంశాలను పొందుపరిచింది. 2019-24 మధ్యకాలంలో జగన్‌ పాలనలో సమర్థులు, నైపుణ్యం ఉన్నవారిని కాకుండా అస్మదీయులను తీసుకొచ్చి గనుల శాఖ డైరెక్టర్‌ గా నియమించడం మొదలు, అనేక అక్రమాలు, అవినీతి బాగోతాలు గనుల శాఖలో జరిగిపోయాయి

ఫలితంగా 19,137 కోట్ల అక్రమాలు జరిగాయని గనుల శాఖ చెబుతోంది. అసమర్థ పరిపాలన వల్ల ఐదేళ్లలో 9,750 కోట్ల నష్టం వాటిల్లిందని ఆ శాఖ చెబుతోంది. 2016 నుంచి అమల్లో ఉన్న ఉచిత పాలసీని రద్దు చేయడం, అడ్డగోలు ఇసుక తవ్వకాల వల్ల సర్కారుకు 6,940 కోట్ల నష్టం జరిగిందని పేర్కొంది.

తెలుగుదేశం ప్రభుత్వంలో ఉచిత ఇసుక అమలైనప్పుడు రీచ్‌లో టన్ను ఇసుక 75 రూపాయలు ఉంటే... జగన్‌ సర్కారు తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీలో దాన్ని రూ.475 చేశారని, ఆచరణలో టన్నుకు వెయ్యి రూపాయలపైనే వసూలు చేశారని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.

గత ఐదేళ్లలో ఇసుక, ఇతర ఖనిజాల తవ్వకాల్లో పెద్దఎత్తున పర్యావరణ విధ్వంసం జరిగిందని గనుల శాఖ సీఎంకు నివేదించనుంది. ఇసుక తవ్వకాల్లో ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయని నివేదికలో పేర్కొంది.

చ ట్టవిరుద్ధమైన తవ్వకాలు నిలిపివేయాలని, పర్యావరణాన్ని కాపాడాలని జాతీయ హరి త ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ), హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశించినా ప్రైవేటు సంస్థలు ఇష్టానుసారంగా వ్యవహరించాయని నిర్ధారించింది.