Joe Biden: హత్యా రాజకీయాలను అమెరికా సహించదు.. ట్రంప్ ఘటనపై బైడెన్ ఉద్ఘాటన
రిపబ్లికన్ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై(Donald Trump) కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హత్యా రాజకీయాలను అమెరికా ఎన్నిటికీ సహించదని ఉద్ఘాటించారు.
రిపబ్లికన్ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై(Donald Trump) కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
హత్యా రాజకీయాలను అమెరికా ఎన్నిటికీ సహించదని ఉద్ఘాటించారు. ఆయన ఆదివారం ఓవల్ కార్యాలయంలో జాతినుద్దేశించి ప్రసంగించారు.
2020లో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఓవల్ ఆఫీస్‌లో బైడెన్ మాట్లాడటం ఇది మూడోసారి. ఓవల్ కార్యాలయం జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రసంగాల కోసం ఉద్దేశించింది. కాగా ఈ కార్యాలయం నుంచి అమెరికా అధ్యక్షులు చాలా అరుదుగా ప్రసంగిస్తుంటారు. గతంలో మాజీ అధ్యక్షులు ట్రంప్ రెండు సార్లు, ఒబామా మూడు సార్లు ప్రసంగించారు.
బైడెన్ మాట్లాడుతూ.. "హత్యా రాజకీయాలను సహించం. రాజకీయంగా ఒక్కొక్కరికి ఇష్టాఇష్టాలు ఉండటం సహజం. కానీ ఎప్పుడూ హింసకు దిగొద్దు. హింసకు పాల్పడిన వారిని అమెరికా ఎన్నటికీ క్షమించదు. మనం శత్రువులం కాదు. పొరుగువారం.. ఒకరికొరం స్నేహితులం, సహోద్యోగులం, అమెరికా పౌరులం. మనమంతా ఐక్యంగా నిలబడాలి" అని బైడెన్ పేర్కొన్నారు.
ట్రంప్‌పైకి థామస్ మాథ్యూ క్రూక్స్ (20) అనే యువకుడు తుపాకీ గురిపెట్టినట్లు భద్రతా దళాలు గుర్తించాయి. రైఫిల్‌తో మాథ్యూ తలను భద్రతాబలగాలు ఛిద్రం చేశాయి.సీక్రెట్ ఏజెంట్లు, సెక్యూరిటీ సిబ్బంది ట్రంప్ వద్దకు వచ్చి అతనికి వలయంగా నిలబడ్డారు.
ట్రంప్‌ను ఆయన బుల్లెట్‌ప్రూఫ్ ఎస్‌యూవీ వద్దకు తీసుకెళ్తుండగా ఆయన తన కుడిచేతి పిడికిలిని పైకెత్తి చూపుతూ ‘‘పోరాడతా (ఫైట్)’’ అని నినదించారు. తర్వాత ట్రంప్‌ను చికిత్స నిమిత్తం బట్లర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని రిపబ్లిక్ పార్టీ ప్రతినిధులు తెలిపారు. కాగా దుండగుడి కాల్పుల్లో ర్యాలీలో పాల్గొన్న ఓ వ్యక్తి మరణించాడని, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది.
Jul 15 2024, 09:42