ఆ ప్రభుత్వంలో అలా, చంద్రబాబు సారధ్యంలో ఇలా - ఎన్వీ రమణ..!!

అమరావతి నగరంలో నూతన ఆధ్యాత్మిక ఒరవడికి శ్రీకారం చుట్టటం శుభసంకేతమని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.

సమాజంలో ఆధ్యాత్మికతతో పాటు సంస్కృతి, ఆచార వ్యవహారాలను కాపాడటం ఎంతో ముఖ్యమని ఎన్వీ రమణ పేర్కొన్నారు.

ఇందులో ఇస్కాన్ సంస్థ ముందుండటంతో పాటు ఎంతోమందికి అన్నదానం కూడా చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబుతో కలిసి జస్టిస్ ఎన్వీ రమణ హరే కృష్ణ గోకుల్ క్షేత్రం సందర్శించారు.

దేవాలయాల్లో కూడా రాజకీయాలు చొరబడి, ఆలయాలు నిర్మించకుండా చేసిన ప్రభుత్వాలను మనం చూశామన్నారు. దేవుడు ఉన్నాడు కాబట్టే ఎన్నో అవరాధాలు అధిగమించి గోకుల క్షేత్రం నిర్మాణానికి చంద్రబాబు సారధ్యంలో మార్గం సుగమమైందన్నారు.

సమాజంలో ఆధ్యాత్మికతతో పాటు సంస్కృతి, ఆచార వ్యవహారాలను కాపాడటం ఎంతో ముఖ్యమన్నారు. ఇందులో ఇస్కాన్ సంస్థ ముందుండటంతో పాటు ఎంతోమందికి అన్నదానం కూడా చేస్తోందన్నారు.

రానున్న రోజుల్లో అన్నా క్యాంటీన్లను సీఎం చంద్రబాబు ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించుడటం శుభపరిణామమని ఎన్వీ రమణ పేర్కొన్నారు. అక్షయపాత్ర ద్వారా గతంలో అన్న క్యాంటీన్లకు ఇస్కాన్ సంస్థ ఎంతో తోడ్పాటునిచ్చిందన్నారు.

ఎవరూ అర్థాకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఇస్కాన్ సంస్థ ఎంతోమందికి అక్షయపాత్ర ద్వారా అన్నదానం చేస్తోందన్నారు. దేవుడు ఉన్నాడు కాబట్టే ఎన్నో అవరాధాలు అధిగమించి గోకుల క్షేత్రం నిర్మాణానికి చంద్రబాబు సారధ్యంలో మార్గం సుగమమైందని ఎన్వీ రమణ అన్నారు.

22 నిమిషాల్లో.. 21.24 లక్షలు ఫ్రీజ్‌

సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకుని లక్షల్లో డబ్బు కోల్పోయిన బాధితులకు ఊరట కల్పించే అంశమిది. బాధితులు డబ్బు కోల్పోయిన వెంటనే గోల్డెన్‌ అవర్‌(Golden hour)లో ఎన్‌సీఆర్‌పీ (నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌)లో, లేదా 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేస్తే ఆయా ఖాతాలను పోలీసులు స్తంభింపజేసే అవకాశం ఉంటుంది.

సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకుని లక్షల్లో డబ్బు కోల్పోయిన బాధితులకు ఊరట కల్పించే అంశమిది. బాధితులు డబ్బు కోల్పోయిన వెంటనే గోల్డెన్‌ అవర్‌(Golden hour)లో ఎన్‌సీఆర్‌పీ (నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌)లో, లేదా 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేస్తే ఆయా ఖాతాలను పోలీసులు స్తంభింపజేసే అవకాశం ఉంటుంది.

తద్వారా డబ్బును వెనక్కి రప్పించే అవకాశం ఉంటుంది. గత మూడు రోజుల్లో జరిగిన మూడు సంఘటనల్లో బాధితులు గోల్డెన్‌ అవర్‌లో స్పందించడం వల్లే సైబర్‌ నేరగాళ్లు కొల్లగొట్టిన రూ. 21.24లక్షలు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఫ్రీజ్‌ చేశారు. పోగొట్టుకున్న డబ్బును రికవరీ చేయడంతో బాధితుల ఆనందానికి అవధుల్లేవు. పూర్తి వివరాలను సైబర్‌ క్రైమ్‌ డీసీపీ కవిత ధార వెల్లడించారు.

ముంబై క్రైమ్‌ బ్రాంచి పోలీసులం అంటూ మాట్లాడి, మనీల్యాండరింగ్‌(Money laundering) కేసులో మీ పాత్ర ఉన్నట్లు తేలిందని, మీ ఖాతా నుంచి అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగాయని నగరానికి చెందిన ఓ వైద్యుడిని బెదిరించి, భయపెట్టిన సైబర్‌ నేరగాళ్లు జూలై-9న రూ. 17,45,0413 కొల్లగొట్టారు. వెంటనే తేరుకున్న డాక్టర్‌.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎన్‌సీఆర్‌పీలో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన డ్యూటీ ఆఫీసర్‌ ఎండీ జావీద్‌ బాధితుడు కంప్లైంట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం..

డబ్బులు చెల్లించిన బ్యాంకు ఖాతా నుంచి ఆ డబ్బులు ఏ ఖాతాలకు జమయ్యాయో చూసి వెంటనే వాటిని స్తంభింపజేయాలని సంబంధింత బ్యాంకు అధికారులను సూచించారు. దాంతో బ్యాంకు అధికారులు టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా బాధితుడు పోగొట్టుకున్న రూ. 17.45లక్షల డబ్బును కేవలం 22 నిమిషాల్లోనే ఫ్రీజ్‌ చేశారు. డబ్బును ఫ్రీజ్‌ చేసిన విషయం తెలియగానే బాధితుడి ప్రాణం లేచి వచ్చినట్లయింది

మరో కేసులో ఈనెల 11న సైబర్‌ నేరగాళ్ల బారినపడిన నగరవాసి రూ. 3.79 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడు వెంటనే ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్‌ శ్రీకాంత్‌ నాయక్‌ వెంటసే స్పందించి సంబంధిత బ్యాంకు అధికారులను అప్రమత్తం చేశారు. వారి సహకారంతో కేవలం 21 నిమిషాల్లోనే మొత్తం రూ.3.79 లక్షలు ఫ్రీజ్‌ చేశారు.

మరో కేసులో పోలీసులు బాధితుడు పోగొట్టుకున్న రూ.97,312 రికవరీ చేశారు. 11వతేదీ అర్ధరాత్రి నగరానికి చెందిన వ్యక్తి సైబర్‌ నేరం బారినపడి రూ.97,312లు పోగొట్టుకున్నాడు. వెంటనే తేరుకొని రాత్రిపూట హైదరాబాద్‌ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్‌ బి.సందీప్‌ వెంటనే స్పందించి టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా ఆ డబ్బును రికవరీ చేశారు.

మోడీ, అమిత్ షా కోసం షర్మిల రాజకీయం

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిన్న వైఎస్ జగన్ ను, వైసీపీని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వైఎస్సార్ సీపీలో వైఎస్సార్ లేరని, వైఎస్సార్ పై పేటెంట్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పారు వైఎస్ షర్మిల. ఇదే సమయంలో ఇప్పుడు చంద్రబాబు తల్లికి వందనం , గతంలో జగన్ అమ్మ ఒడి పథకంలో ప్రజలను మోసం చేశారన్నారు.

జగన్ పై షర్మిల వ్యాఖ్యలకు పేర్ని నాని కౌంటర్ జగన్ చెప్పిన అబద్దాలను తాను కూడా నమ్మి ప్రచారం చేశానని, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబును మోసకారి అంటూ వైసీపీ మీడియా రాయటం విడ్డూరం అన్నారు షర్మిల.

వైఎస్ షర్మిల జగన్ ను, వైసీపీని టార్గెట్ చేసి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. అసలు షర్మిల ఎవరి కోసం రాజకీయం చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు.

షర్మిల రాజకీయం ఎవరికోసం? వైయస్‌ఆర్‌ కాంగ్రెస్, టీడీపీ, జనసేన, బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేసే కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న షర్మిల, ఆ పని కాకుండా అదే బీజేపీ కలిసి ఉన్న ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ, వారి చర్యలను సమర్థిస్తూ ప్రతిపక్షంలో ఉన్న పార్టీని విమర్శిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.

అసలు షర్మిల ఎవరి కోసం రాజకీయాలు చేస్తున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆమె నిజానికి బీజేపీ, టీడీపీ కోసమే రాజకీయాలు చేస్తున్నారన్నారు.

అడిగిన వారి నుండి ఆన్సర్ లేదు .. షర్మిల కు ఎందుకు మోడీ, అమిత్ షాల కోసం పని చేస్తున్నారన్నారు. తాము అడిగే ప్రశ్నలకు కూటమి నేతలు సమాధానం చెప్పాలి కానీ.. అందుకు భిన్నంగా షర్మిల సమాధానం చెబుతున్నారంటే రాజకీయాలు ఏ స్థాయికి దిగజారాయో అర్థం చేసుకోవాలని పేర్ని నాని పేర్కొన్నారు. చంద్రబాబు రాజకీయంలో షర్మిల పావుగా మారిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల గురించి తాము అడుగుతుంటే.. చంద్రబాబు సమాధానం చెప్పడం లేదని.. ఇప్పుడు షర్మిలను ఉసిగొల్పారన్నారు.

చంద్రబాబును కాపాడటం కోసమే షర్మిల కామెంట్స్ మరోవైపు క్షేత్ర పర్యటనలు, శ్వేతపత్రాల విడుదల పేరుతో తప్పుడు లెక్కలు, అసత్యాలు చెబుతున్నారని, ప్రజలను మభ్య పెట్టె ప్రయత్నం చేస్తున్నారని పేర్ని నాని గుర్తు చేశారు. చంద్రబాబు వైఖరి అలా ఉండగా, విమర్శల నుంచి ఆయనను కాపాడడం కోసమే, ఇప్పుడు షర్మిల ముందుకు వచ్చి మాట్లాడుతున్నట్లుగా ఉందని అన్నారు.

రాజమౌళి సినిమాలో మహేష్ లుక్ ఇదేనా..!

తన సినిమాల్లో హీరోల్ని బెస్ట్ లుక్స్ లో ప్రజెంట్ చేస్తుంటాడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లను తమ కెరీర్ బెస్ట్ లుక్స్ లో చూపించాడు. ఇక బాహుబలి సినిమాలో ప్రభాస్ లుక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడు మహేష్ వంతు.

మహేష్-రాజమౌళి సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. దీనికి సంబంధించి మహేష్ పై విదేశాల్లో ఫొటోషూట్ కూడా జరిగింది. అయితే మహేష్ లుక్ ఎలా ఉండబోతోందనే అంశంపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఎట్టకేలకు దీనిపై చిన్నపాటి క్లారిటీ వచ్చింది.

అనంత్ అంబానీ పెళ్లికి హాజరయ్యాడు మహేష్. భార్య నమ్రత, కూతురు సితారతో కలిసి పెళ్లి వేడుకకు హాజరైన మహేష్, మీడియాకు పోజులిచ్చాడు. అందులో లాంగ్ హెయిర్, గడ్డం, మీసాలతో కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు మహేష్ ఎప్పుడూ కనిపించని మేకోవర్ ఇది.

బహుశా, రాజమౌళి సినిమాలో మహేష్ లుక్ ఇదే కావొచ్చు. సినిమా షూటింగ్ కు ఇంకా టైమ్ ఉంది కాబట్టి, ఈ లుక్ లో మరికొన్ని మార్పుచేర్పులు కూడా ఉండొచ్చు.

రాజమౌళి సినిమాలో మహేష్ లాంగ్ హెయిర్ తో కనిపించబోతున్నాడనేది మాత్రం పక్కా. ఈ లుక్ చూసి థార్ సినిమాలో హీరోలా మహేష్ ఉన్నాడంటూ పొంగిపోతున్నారు అతడి ఫ్యాన్స్.

కేవలం లుక్ పరంగానే కాకుండా, ఫిట్ నెస్ పరంగా కూడా మహేష్ ఈసారి భిన్నంగా కనిపించబోతున్నాడు.

సరిలేరు నీకెవ్వరు, గుంటూరుకారం సినిమాల్లో స్లిమ్ గా కనిపించిన మహేష్, రాజమౌళి సినిమా కోసం కాస్త కండలు పెంచుతున్నట్టు సమాచారం.

రోజు రోజుకు పోలీస్ శాఖలో పెరుగుతున్న ఉదంతాలు.. మరో కానిస్టేబుల్ వ్యవహారం వెలుగులోకి

రోజు రోజుకు పోలీస్ శాఖలో ఉదంతాలు పెరుగిపోతున్నాయి. కోర్టు విషయంలో వచ్చిన వివాహితను చెల్లి, బుజ్జి అంటూ ఓ కానిస్టేబుల్ దగ్గర చేసుకున్నాడు.

దీంతో కానిస్టేబుల్, ఆయన భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.

వివరాల్లోకెళ్తే.. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాంబ్ స్క్వాడ్‌లో పని చేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబు, కోర్టుకు వచ్చిన వివాహితను చెల్లి, బుజ్జి అంటూ లోంగదిసుకొని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

భార్య వ్యవహారంపై అనుమానం వచ్చిన భర్త నిఘా పెట్టగా.. తన భార్యతో, కానిస్టేబుల్ రాంబాబు ఏకాంతంగా ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.

ఇంతకు ముందు ఇద్దరు ఏకాంతంగా గడిపినప్పుడు తీసుకున్న వీడియోలు భార్య ఫోన్‌లో దొరికాయి.

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నప్పుడు భర్తపై కానిస్టేబుల్ రాంబాబు దాడి చేసి పారిపోయాడు.

10 ఏండ్ల ప్రేమ, ఇద్దరు పిల్లలు ఉన్న తన భార్యను కేసు విషయంలో వస్తే ఇలా ట్రాప్ చేయడం ఏంటని భర్త ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.

Chandrababu : గోతుల రోడ్లకు మోక్షం

వాహనదారులకు ఇదో శుభవార్త. జగన్‌ పాలనలో రహదారులపై మోకాల్లోతు గోతులతో పడిన ఇబ్బందులకు కూటమి సర్కారు చెక్‌ పెట్టే కార్యక్రమానికి తెరదీసింది.

రహదారులపై ఉన్న గుంతలు, మినీ చెరువులను పూడ్చివేసి చక్కటి ప్రయాణానికి వీలుగా వాటిని తీర్చిదిద్దాలని ప్రభుత్వం రోడ్లు భవనాల శాఖ(ఆర్‌అండ్‌బీ) ను ఆదేశించింది. దీనికి అవసరమైన రూ.286 కోట్ల నిధులు ఇచ్చేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. తక్షణమే పనులు చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. రహదారి మరమ్మతుల్లో థర్మ్‌ల్‌ విద్యుత్‌ ప్లాంట్ల నుంచివచ్చే బూడిద(ప్లైయాష్‌) వినియోగంపై పైలెట్‌ అధ్యయనం చేయాలని సూచించారు.

శాస్త్ర, ఇంజనీరింగ్‌ నిపుణులతో కలిసి అధ్యయనం చేయాలని ఆర్‌అండ్‌బీని ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర రహదారులపై సమీక్ష నిర్వహించారు. ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి కాంతిలాల్‌ దండే, ఇంజనీరింగ్‌ చీఫ్‌లు వేణుగోపాల్‌రెడ్డి, నయీముల్లా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 7,087 కిమీ పరిధిలో తక్షణమే మరమ్మతులు చేపట్టాల్సి ఉందని అధికారులు సీఎంకు నివేదించారు.

ఈ గణాంకాలపై సీఎం విస్తుపోయినట్లు తెలిసింది. ఇన్ని వేల కిలోమీటర్ల మేర మరమ్మతులు చేయకుండా ఎలా ఉన్నారు? గతంలో అసలు ఏ పనీచేయలేదా? అని ఆరాతీశారు. జగన్‌ హయాంలో రోడ్లను విధ్వంసం చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 4,151 కిలోమీటర్ల రోడ్లపై తక్షణమే మరమ్మతులు చేపట్టి గుంతలు పూడ్చాలని, మరో 2 వేల కిలో మీటర్ల మేరకు రహదారులకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాల్సి ఉందని అధికారులు నివేదించారు. దీనికిగాను కనీసం రూ.350 కోట్లపైనే నిధులు అవసరం ఉంటుందని సీఎంకు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.

4,151 కి.మీ. మేరకు రహదారులపై ఉన్న గుంతలు పూడ్చేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీనికి అవసరమైన రూ.286 కోట్ల నిధులు ఇస్తామని ఆర్‌అండ్‌బీకి హామీ ఇచ్చారు. ఓటాన్‌ అకౌంట్‌లో ఈ నిధులు కేటాయిస్తామని, రహదారుల రిపేర్లకు తక్షణమే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఇకపై ఏ సమస్య ఉన్నా తనదృష్టికి తీసుకురావాలని చంద్రబాబు ఆదేశించారు

థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ల నుంచి వచ్చే బూడిద(ప్లైయా్‌ష)ను రహదారి మరమ్మతులకు ఉపయోగించే అంశంపై పైలెట్‌ అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్‌అండ్‌బీకి సూచించారు. రోడ్లపై గుంతలు పూడ్చేందుకు బూడిదను ఉపయోగించాలని ఈ నెల 2న జరిగిన సమావేశంలో సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 4 రహదారులపై ఈ ప్రయోగం చేశారు. విజయవాడలోని నున్న బైపాస్‌, నెల్లూరు ఎన్‌పీఎస్‌ రోడ్డు, ప్రొద్దుటూరు రహదారులపై ప్రయోగాత్మకంగా బూడిద వినియోగంతో గుంతలు పూడ్చారు.

అయితే, ఆ ప్రయోగం పూర్తిగా విజయవంతం కాలేదు. గుంతలను పూడ్చేందుకు ఉపయోగించిన బూడిద బిట్‌మెన్‌, ఇతర మెటల్‌తో మిక్సింగ్‌ కావడం లేదు. దీంతో పొడివాతావరణంలో ఆ బూడిద వాహనాల రాకపోకలతో గాల్లోకి లేస్తోంది. ఈ ప్రయోగంపై ఆర్‌అండ్‌బీ ప్రజల నుంచి స్పందన కోరగా ప్రతికూలంగా వచ్చింది. ఇదే విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇద్దరు సీఆర్‌ఐఐకి చెందిన ఐఐటీ నిపుణులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లైన్లోకి తీసుకొని మాట్లాడారు. వారు ఇచ్చిన సూచనలతో బూడిద వినియోగంపై పైలెట్‌ అధ్యయనం చేయాలని సూచించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐటీ రూర్కీ, సీఆర్‌ఆర్‌ఐ, ఢిల్లీ, ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్సిటీ అమరావతి నిపుణుల సహకారంతో అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. శుక్రవారం విజయవాడ బందర్‌ రోడ్డులో ఉన్న చీఫ్‌ జస్టిస్‌ అధికారిక నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాన న్యాయమూర్తిని ఆయన కలవడం ఇదే ప్రఽథమం.

ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని అధికార వర్గాలు తెలిపాయి. మధ్యలో ఆగిపోయిన హైకోర్టు నూతన భవన నిర్మాణం, హైకోర్టు న్యాయమూర్తుల నివాస భవనాల పూర్తికి ప్రభుత్వపరంగా తీసుకుంటున్న చర్యలు, ప్రస్తుత హైకోర్టు భవనంలో ఇంకా అదనంగా కల్పించాల్సిన వసతులు తదితర అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది.

Congress: నాన్‌స్టాప్‌గా చేరికలు.. కాంగ్రెస్‌లోకి మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే

Telangana: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ బాట పడుతున్నారు. తెలంగాణలో ఎన్నికల ముగిసిన నాటి నుంచి మొదలైన చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ్రేటర్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేసి హస్తం పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే దాదాపు ఆరుమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా.. ఆ సంఖ్య మరింత పెరుగుతోంది.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) ఒక్కొక్కరుగా కాంగ్రెస్ (Congress) బాట పడుతున్నారు. తెలంగాణలో ఎన్నికల ముగిసిన నాటి నుంచి మొదలైన చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ్రేటర్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేసి హస్తం పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే దాదాపు ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా..

ఆ సంఖ్య మరింత పెరుగుతోంది. నిన్న (శుక్రవారం) బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ (MLA Prakash Goud) కాంగ్రెస్ కండువా కప్పుకోగా..

నేడు మరో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ (MLA Arikapudi Gandhi) హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరికలు ఇంతటితో ఆగనట్లు కనిపిస్తోంది. మరికొంత మంది కూడా బీఆర్‌ఎస్‌ను వీడిన వారి బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది.

ఈరోజు శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో పార్టీలో గాంధీ చేరనున్నారు.

ఈరోజు ఉదయం 10 గంటలకు జూబ్లిహిల్స్‌లోని సీఎం నివాసంలో ఎమ్మెల్యే... కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. అరికపూడి గాంధీతో పాటు పలువురు కార్పోరేటర్లు, నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

అలాగే రేపు (ఆదివారం) ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రావు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.

తెలంగాణకు వర్ష సూచన.. 13 జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణం కేంద్రం అధికారులు చల్లని కబురు చెప్పారు. నేటి నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. నైరుతి రుతుపవనాలు బలపడటానికి తోడు.. అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో వానలు కురుస్తాయని చెప్పారు.జులై 18 వరకు ఈ వర్షాలు కొనసాగుతాయన్నారు. 13 జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని..

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేడు ప్రధానంగా నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

ఈ 13 జిల్లాలు కాక మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వర్షాలకు తోడు భారీ స్థాయిలో ఈదురు గాలులు వీస్తాయన్నారు. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. ఉరుములు, మెరుపులకు తోడు పలు జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. పొలం పనులకు వెళ్లేవారు చెట్ల కింద ఉండకూడని..

వర్షాలు కురిసే సమయంలో అవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచించారు. ఇక హైదరాబాద్‌లో ఉదయం వాతావరణం పొడిగా ఉంటుందని చెప్పారు. మేఘాలు కమ్ముకొని ఉంటాయని అయితే వర్షం కురిసే ఛాన్స్ తక్కువగా ఉంటుందన్నారు. సాయంత్రం లేదా రాత్రి సమయంలో హైదరాబాద్‌లో వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు.

శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులపై వర్షపు నీరు చేరింది.

దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రంగంలోకి దిగిన ట్రాఫిక్, జీహెచ్‌ఎంసీ అధికారులు వర్షపు నీరు డ్రైనేజీల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఇక జూన్ నెలలో ఆశించినంతగా వర్షాలు కురవలేదు.

దీంతో అన్నదాతలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అయితే జులై నెలలో మాత్రం వర్షాలు దంచికొడతాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే జులై మాసంలో సగం రోజులు పూర్తి కాగా.. వచ్చే 15 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

KTR: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టుంది..!

రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వైఖరి ఉందన్నారు. కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు..

హైదరాబాద్: రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వైఖరి ఉందన్నారు.

కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలు ఇచ్చి రేవంత్ సర్కార్ గద్దెనెక్కిందని విమర్శించారు.

ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్దిదారుల నుంచి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టిందని కేటీఆర్ అన్నారు. ఏవో సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ లబ్దిదారుల నుంచి డబ్బును ప్రభుత్వానికి వెనక్కు పంపమని నోటీసులు ఇస్తోందన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల ముసలమ్మకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన ఒక లక్షా 72 వేల రూపాయలు వెనక్కు కట్టాలని నోటీసు ఇచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు.

ఒంటరి మహిళగా పక్షవాతంతో బాధపడుతున్న దాసరి మల్లమ్మ వంటి వృద్ధుల నుంచి కేసీఆర్ సర్కారు ఇచ్చిన ఆసరా పెన్షన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ సర్కార్ అమానవీయ వైఖరికి నిదర్శనమన్నారు.

వెంటనే పేదల మీద ఇటువంటి దుర్మార్గపు చర్యలు మానుకోవాలన్నారు. లేకుంటే ప్రజలే కాంగ్రెస్ సర్కార్ మీద తిరగబడతారని కేటీఆర్ హెచ్చరించారు.

ఇక్కడ లోన్ పొందిన రైతులకు లక్ష రూపాయల మాఫీ ! ఉదయం శుభవార్త

రైతులకు ప్రభుత్వం నుంచి సకాలంలో రుణమాఫీ పథకం అందుతుంది. అదే విధంగా ఇప్పుడు బ్యాంకుల నుంచి కేసీసీ రుణం పొందిన రైతులకు రుణమాఫీ పథకం లబ్ధి చేకూరుతోంది.

ఈ పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపు రుణాలు పొందిన రైతులందరి రుణాలను ప్రభుత్వం మాఫీ చేసి ఏళ్ల తరబడి బకాయి ఉన్న రుణాలను మాఫీ చేసిందని చెప్పవచ్చు.

ఈ లబ్ధిదారులు కూడా ఈ రుణమాఫీ పథకం కింద ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్‌లో జాబితాను అప్‌డేట్ చేస్తుంది. ఈ లైసెన్స్‌లో పేర్లు ఉన్నవారిని ఈ రుణమాఫీ పథకం లబ్ధిదారులుగా పరిగణిస్తారు.

ఈ పథకం ద్వారా వారి లక్ష రూపాయల వరకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుంది, రైతులకు వారి వ్యవసాయ కార్యకలాపాలకు తగిన మరియు సకాలంలో రుణాన్ని అందించాలనే లక్ష్యంతో KCC పథకం ప్రవేశపెట్టబడింది. భారత ప్రభుత్వం రైతులకు 2% వడ్డీ రాయితీని మరియు 3% సత్వర రీపేమెంట్ ఇన్సెంటివ్‌ను అందిస్తుంది, తద్వారా సంవత్సరానికి 4% చాలా సబ్సిడీ రేటుతో క్రెడిట్ అందుబాటులో ఉంటుంది

ఈ జాబితా ఒక నెలలోపు విడుదల చేయబడుతుంది మరియు వీటిలో మీ పేరు ఉంటే, మీరు మీ KCC లోన్ పథకం కింద 1 లక్షల వరకు రుణమాఫీని పొందే అవకాశం ఉంది, ఈ జాబితాలో ఉన్నవారు రుణమాఫీ పథకాన్ని పొందడం చాలా ముఖ్యం సర్టిఫికేట్. మీరు దీన్ని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో 1 లక్ష వరకు రుణమాఫీ వంటి సమాచారాన్ని అధికారికంగా ప్రస్తావించారు.

ఈ పథకం మీ లోన్‌లో ఒక లక్ష రూపాయల మానసిక ప్రశాంతతను అందించడమే కాకుండా ఆర్థికంగా మిమ్మల్ని మీరు మెరుగ్గా తీర్చిదిద్దుకోవడంలో కూడా సహాయపడుతుందని చెప్పవచ్చు.

ఆర్థిక ఇబ్బందులను మరింత తగ్గించేందుకు ప్రభుత్వం మీకు సహకరిస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రైతుల కుటుంబానికి ఇది మరింత ఆనందం కలిగిస్తుంది