తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 12 2024, 19:39

కారు’ దిగనున్న ఆరుగురు ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లో జాయినింగ్‌కు ముహూర్తం ఫిక్స్

కారు’కు పంక్చర్ చేసి కాంగ్రెస్‌తో హ్యాండ్ కలిపేందుకు మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తన అనుచరులతో కలిసి నేడు సీఎం సమక్షంలో ‘హస్తం’ కండువా కప్పుకోనున్నారు.

గతంలోనే పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరగడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్ ప్రకాశ్ గౌడ్‌ను పిలుచుకుని పార్టీ మారొద్దని బుజ్జగించారు. కానీ ఈ మధ్య వరుసగా గులాబీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతుండటంతో ప్రకాశ్ గౌడ్ సైతం కాంగ్రెస్‌లో చేరేందుకు ముహుర్తం నిర్ణయించుకున్నారు.

ఆయనతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మరో ఐదుగురు ఎమ్మెల్యేలు సైతం రేపు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నట్లు తెలిసింది. వీరంతా ఇటీవలే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు. అప్పటి నుంచే వారు పార్టీ మారేందుకు సుముఖంగా ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. వీరితో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారేందుకు కాంగ్రెస్ లీడర్లతో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఐదుగురు ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్ శనివారం పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా జరుగుతున్నది. ఈ మధ్య ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాము ఇన్‌చార్జి మంత్రితో సమావేశమైనట్లు ప్రకటించారు. కానీ అప్పటి నుంచి వీరంతా పార్టీ మారేందుకు మానసికంగా సిద్ధమయ్యే మంత్రిని కలిశారనే ప్రచారం జరుగుతున్నది.

ఆ తర్వాత గ్రేటర్ పరిధిలోని మరో నలుగురు ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే సదరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లీడర్లతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం

అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం క్రమంగా తగ్గుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ గెలుచుకున్నది. అయితే కంటోన్మెంట్ ఎమ్మెల్యే మృతి చెందడం, ఉప ఎన్నికలో అక్కడ కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆ సీటు చేజారింది. మరోవైపు ఇప్పటివరకు ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఆ జాబితాలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాలే యాదయ్య, కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. శుక్రవారం ప్రకాశ్ గౌడ్ చేరికతో ఆ సంఖ్య 8కు చేరనుంది. దీంతో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీ మారుతారోనని టెన్షన్ కారు పార్టీ పెద్దలకు పట్టుకున్నది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 12 2024, 19:35

Atchannaidu: వ్యవసాయ శాఖపై మంత్రి అచ్చెన్న కీలక నిర్ణయాలు

వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ , పశుసంవర్థక, డెయిరీ డెవలప్మెంట్, మత్స్యశాఖామంత్రిగా అచ్చెన్నాయుడు నేడు ఏపీ సచివాలయంలో (Kinjarapu Atchannaidu) బాధ్యతలు స్వీకరించారు.

అమరావతి: వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ , పశుసంవర్థక, డెయిరీ డెవలప్మెంట్, మత్స్యశాఖామంత్రిగా అచ్చెన్నాయుడు నేడు ఏపీ సచివాలయంలో (Kinjarapu Atchannaidu) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ శాఖామంత్రిగా నేడు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఏపీ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని తెలిపారు.

రాష్ట్ర జనాభాలో 62శాతం మంది 3.02 కోట్ల మంది వ్యవసాయం, వ్యవసాయ అనుభంద రంగాలపై ఆధారపడి ఉన్నారని తెలిపారు. వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పశుసంవర్థక, డెయిరీ డెవలెప్మెంట్, మత్స్య శాఖలను తనకు చంద్రబాబు నాయుడు అప్పగించారని అన్నారు. ఈ రంగాన్ని ఏ ప్రభుత్వమైన అత్యంత ప్రాధాన్యమైనదిగా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

2019 నుంచి 2024 వరకూ ఈ రాష్ట్రాన్ని పాలించిన జగన్ రెడ్డి ఈ శాఖకు తాళం వేశారని అన్నారు. వ్యవసాయంలో అత్యంత ప్రాధాన్యం కలిగింది భూమి కాబట్టి భూసారాన్ని ప్రభుత్వం ఎప్పటి కప్పడు పరీక్ష చేయలేదని చెప్పారు.

గడచిన ఐదేళ్లలో ఒక్క భూసార పరీక్ష కూడా చేయలేదని చెప్పారు. విత్తనాలు, ఎరువులు లేవు, పండించిన పంటకు గిట్టుబాటు ధరలేదని అన్నారు. పంట అమ్ముకుంటే ఐదారు మాసాలకు డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీలోని ప్రతి రైతు ధైర్యంగా ఉంటారని అన్నారు.

ఏ రైతుకు ఏ సమస్య ఉన్నా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని కోరారు. సాధ్యమైనంత వరకూ ఆ సమస్యకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకూ వ్యవసాయ అనుభంద రంగాలకు ఎలాంటి కార్యక్రమాలు చేశారో అవన్ని మళ్లీ పునప్రారంభించామని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారని అన్నారు. అందులో భాగంగానే మూడు డిపార్ట్‌మెంట్లలో 6 ఫైళ్లపై సంతకం చేశానని వివరించారు.

వ్యవసాయ శాఖలో మొదటిది పొలం పిలుస్తోంది... ఈ కార్యక్రమాన్ని 23 వ తేదీన రాష్ట్రం మొత్తం మీద ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రతి మంగళవారం, బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ అనుబంధ అధికారులు, ప్రజాప్రతినిధులు పొలాల దగ్గరకు వెళ్లి రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించాలని కోరారు. ఖరీఫ్‌, రబీలో నాలుగు మాసాల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. రెండోసంతకం రైతుకు వ్యక్తిగత యాంత్రీకరణ పరికరాలు అందిచడంపై చేశామని వివరించారు. గత ఐదు సంవత్సరాల్లో యాంత్రీకరణ అనేమాటే ఈ రాష్ట్రంలో వినింపిచలేదని చెప్పారు. గతంలో టీడీపీ హయాంలో 3.24 లక్షల మంది రైతులకు రూ.988 కోట్లు ఖర్చు పెట్టి వ్యక్తిగతంగా సబ్సిడీపై యాంత్రీకరణను ప్రోత్సహించామని చెప్పారు. ఈ ఐదేళ్లలో చివరకు కొడవలి పిడి కూడా ఇవ్వలేదని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 12 2024, 19:32

Delhi Liquor Case: కవిత బెయిల్ పిటిషన్‌పై కీలక పరిణామం

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై ఈరోజు(శుక్రవారం) విచారణ చేపట్టింది.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై ఈరోజు(శుక్రవారం) విచారణ చేపట్టింది.

ఈ కేసులో కవిత పాత్ర, అందుకు సంబంధించిన సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను దాఖలు చేసినట్టు సీబీఐ రౌస్‌అవెన్యూ కోర్టుకు (Rouse Avenue Court) తెలిపింది. దానిని పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ అంశంపై విచారణ చేపడతామని న్యాయమూర్తి కావేరి భవేజా తెలిపారు.

సీబీఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్‌పై విచారణ జరిపింది. సీబీఐ ఛార్జ్ షీట్‌లో తప్పులున్నాయని కవిత తరపు న్యాయవాది నితేష్ రానా న్యాయస్థానానికి చెప్పారు. తప్పులు లేవని సీబీఐ తరపు న్యాయవాది అన్నారు.

ఛార్జ్‌షీట్‌లో తప్పులున్నాయని కోర్ట్ ఆర్డర్ ఫైల్ చేశారా అని జడ్జి కావేరి భవేజా అడిగారు. ఛార్జ్‌షీట్‌లో తప్పులున్నాయని కోర్ట్ ఆర్డర్ ఫైల్ చేయాలని జడ్జి కావేరి భవేజా చెప్పారు. కోర్ట్ ఆర్డర్ అప్ లోడ్ కాలేదని కవిత తరపు న్యాయవాది నితేష్ రానా అన్నారు. తదుపరి విచారణను జూలై 22కి రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది.

డిఫాల్ట్ బెయిల్, ఛార్జ్‌షీట్‌లో తప్పులపై విచారణ జరిగేంత వరకు ఛార్జ్ షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణ వాయిదా వేయాలని న్యాయవాది నితేష్ రానా చెప్పారు. ఛార్జ్ షీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశం కవిత డిఫాల్ట్ బెయిల్‌కి సంబంధం లేదని సీబీఐ తరపు న్యాయవాది వివరించారు. ఛార్జ్‌షీట్ పూర్తిగా లేదని వాదించడం లేదని.. తప్పుగా ఉందని చెబుతున్నానని నితేష్ రానా న్యాయస్థానానికి తెలిపారు

ఢిల్లీ మద్యం విధానం కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్‌లోని ఆమె నివాసంలోనే ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 16న ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో సీబీఐ ఆమెను హాజరుపరిచింది. కవిత తిహాడ్‌ జైలులో ఉండగానే ఏప్రిల్‌ 11న సీబీఐ అరెస్టు చేసినట్టు ప్రకటించింది. ఆ తర్వాత కవిత బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా రౌస్‌అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ట్రయల్‌ కోర్టు తీర్పును కవిత హైకోర్టులో సవాల్‌ చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 11 2024, 19:45

Hyderabad: మియాపూర్-పటాన్‏చెరువు రూట్‏లో డబుల్ డెక్కర్ బస్సులు

మెట్రో రెండోదశ విస్తరణ పనుల్లో వేగం పుంజుకుంటున్నది. సెకండ్‌ ఫేజ్‌లో ప్రతిపాదించిన ఆరు కారిడార్లకు సంబంధించిన డిటైల్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)ను సిస్ర్టా కన్సల్టెన్సీతో తయారు చేయించిన అధికారులు, తాజాగా జాతీయ రహదారులపై నుంచి చేపట్టనున్న మెట్రోపనులపై దృష్టి సారించారు.

హైదరాబాద్‌ సిటీ: మెట్రో రెండోదశ విస్తరణ పనుల్లో వేగం పుంజుకుంటున్నది. సెకండ్‌ ఫేజ్‌లో ప్రతిపాదించిన ఆరు కారిడార్లకు సంబంధించిన డిటైల్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)ను సిస్ర్టా కన్సల్టెన్సీతో తయారు చేయించిన అధికారులు, తాజాగా జాతీయ రహదారులపై నుంచి చేపట్టనున్న మెట్రోపనులపై దృష్టి సారించారు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌), నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు రెండు రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.

ఈ ఏడాది జనవరి 22న మెట్రో రెండోదశ విస్తరణకు సంబంధించిన రూట్‌మ్యా్‌పను ప్రభుత్వం విడుదల చేసింది. ఆయా పనుల డీపీఆర్‌ను హెచ్‌ఏఎంఎల్‌ అధికారులు దాదాపుగా పూర్తి చేశారు. పలు ప్రాంతాల్లో ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి వచ్చే అడ్డంకులు, కావాల్సిన భూసేకరణపై లోతుగా పరిశీలిస్తున్నారు. రూ.20 వేల కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టు ద్వారా ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు.

ఇందులో భాగంగా ఆర్టీసీ, రైల్వేస్టేషన్లు కేంద్రీకృతమైన ప్రాంతాలకు మెట్రోను అనుసంధానం చేయడంపై విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌ నగరానికి తూర్పున ఉన్న నాగోలుతో పాటు దక్షిణాన ఉన్న రాజేంద్రనగర్‌, ఆరాంఘర్‌లను కలుపుతూ ప్రతిపాదించిన 29 కిలోమీటర్ల మార్గంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్‌ - బెంగళూరు జాతీయ రహదారిపై ఆరాంఘర్‌ ఉంది.

అలాగే ఎల్‌బీనగర్‌ - హయత్‌నగర్‌(LB Nagar - Hayat Nagar) మార్గాన్ని నేషనల్‌ హైవేపై నిర్మించాల్సి ఉంది. ఇలాంటి చోట్ల భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని డీపీఆర్‌ను తయారు చేస్తున్నారు.

మియాపూర్‌ - పటాన్‌చెరు, ఎల్‌బీనగర్‌ - హయత్‌నగర్‌ రూట్‌లో రెండు రోజులపాటు పరిశీలించిన అంశాలపై రసూల్‌పురాలోని మెట్రోరైలు భవన్‌లో నేషనల్‌ హైవే అధికారులతో హెచ్‌ఏఎంఎల్‌ ఎండీ బుధవారం చర్చించారు.

సమావేశంలో ఆర్‌అండ్‌బీ(ఎన్‌హెచ్‌) ఈఎన్‌సీ గణపతిరెడ్డి, జాతీయరహదారుల ఎస్‌ఈ పి.ధర్మారెడ్డి, హెచ్‌ఏఎంఎల్‌ చీఫ్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ ఆనందమోహన్‌, ఎస్‌ఈ వై.సాయపరెడ్డి, జనరల్‌ మేనేజర్లు ఎన్‌.రాజేశ్వర్‌, విష్ణువర్థన్‌ రెడ్డి, సీనియర్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 11 2024, 19:41

Telangana: బిగ్ షాక్.. ‘రైతుబంధు’పై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

రైతుబంధు’ నిధుల విషయంలో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేయగా.. రేపో మాపో లబ్ధిదారులకు నోటీసులు అందనున్నాయి.

ఇంతకీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసుకుందాం. గురువారం నాడు రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో నెల చివరి వారంలో జగరనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై కీలక సమాలోచనలు చేయనున్నారు.

బడ్జెట్ ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో సమీక్ష చేస్తారు సీఎం. రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణే లక్ష్యంగా సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రవాణా, రిజిస్ట్రేషన్ శాఖల ముఖ్య కార్యదర్శులతో సమీక్షలు చేయనున్నారు.

అంతేకాదు.. భూముల విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. భూముల విలువ పెంపు సహా తదితర అంశాలపై ఈ సమీక్షా సమావేశంలో చర్చించనున్నారు.

గత ప్రభుత్వంలో వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతుబంధు నిధులను రికవరీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారవర్గాల సమాచారం.

ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిందట. రేపో మాపో.. రైతుబంధు నిధుల రికవరీకి సంబంధించి లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 11 2024, 15:27

India Playing XI: అభిషేక్ శర్మపై వేటు.. జింబాబ్వేతో నాలుగో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

జింబాబ్వే పర్యటనలో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగే నాలుగో టీ20లో ఆతిథ్య జింబాబ్వేతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సిరీస్‌ను ఓటమితో ప్రారంభించిన టీమిండియా... తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించింది. దాంతో 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఈ సిరీస్ కైవసం చేసుకోవాలంటే నాలుగో టీ20లో విజయం సాధించడం టీమిండియాకు కీలకం. లేకుంటే ఆఖరి మ్యాచ్ వరకు వేచి చూడాల్సి ఉంటుంది. మరోవైపు జింబాబ్వేకు ఈ మ్యాచ్‌ చావోరేవోలాంటిది. సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిందే. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆశసక్తి నెలకొంది.

టీమ్‌ కాంబినేషన్‌లో మార్పులు..

టీ20 ప్రపంచకప్ విజేతలు అందుబాటులోకి రావడంతో మూడో టీ20లో టీమిండియా నాలుగు మార్పులతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్‌ తుది జట్టులోకి రాగా.. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, సాయి సుదర్శన్ ఉద్వాసనకు గురయ్యారు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ముఖేష్ కుమార్‌కు రెస్ట్ ఇచ్చి ఖలీల్ అహ్మద్‌ను ఆడించారు.

నాలుగో టీ20లో కూడా కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. టాపార్డర్ మొత్తం ఓపెనర్లతో నిండిపోవడంతో జట్టు సమతూకంపై విమర్శలు వస్తున్నాయి. యశస్వి జైస్వాల్ రాకతో అభిషేక్ శర్మ ఫస్ట్ డౌన్‌లో బరిలోకి దిగాడు. ఓపెనర్ అయిన రుతురాజ్ గైక్వాడ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. గత మ్యాచ్‌లో ఓపెనర్‌గా శతక్కొట్టిన అభిషేక్ శర్మ.. ఫస్ట్ డౌన్ బ్యాటర్‌గా మాత్రం నిరాశపరిచాడు.

అభిషేక్ శర్మపై వేటు..?

ఓపెనింగ్ స్లాట్స్ ఖాళీ లేని నేపథ్యంలో అభిషేక్ శర్మపై వేటు వేసి మిడిలార్డర్ బ్యాటర్ అయిన రియాన్ పరాగ్‌ను తుది జట్టులోకి తీసుకునే ఆలోచన వీవీఎస్ లక్ష్మణ్ సారథ్యంలోని టీమిండియా మేనేజ్‌మెంట్ చేయవచ్చు. మూడో టీ20లో టీమిండియా 23 పరుగుల తేడాతో గెలిచినా.. బ్యాటింగ్ విభాగం తడబడినట్లు అనిపించింది.

ఈ క్రమంలోనే టీమ్ కాంబినేషన్‌ను మరింత పటిష్టం చేయాలనే యోచనలో టీమ్‌మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా గత మూడు మ్యాచ్‌లు ఆడిన ఆవేశ్ ఖాన్‌కు ఈ మ్యాచ్‌ నుంచి విశ్రాంతి కల్పించే అవకాశం ఉంది. అతని స్థానంలో ముఖేష్ కుమార్ రీఎంట్రీ ఇవ్వవచ్చు. మిగతా కాంబినేషన్‌లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. అభిషేక్ శర్మను కొనసాగించాలనుకుంటే మాత్రం బ్యాటింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు.

జింబాబ్వేతో నాలుగో టీ20.. భారత తుది జట్టుఅంచనా

యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ/రియాన్ పరాగ్, సంజూ శాంసన్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్/ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 11 2024, 15:03

TGS RTC: ఫ్రెండ్లీ కండక్టర్ అనూపరాణికి సజ్జనార్ అభినందన

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) కు కండక్టర్లు, డ్రైవర్లే బ్రాండ్ అంబాసిడర్లని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.

నిబద్ధతతో, అంకితభావంతో విధులు నిర్వర్తించే సిబ్బంది కారణంగానే ఆర్టీసీ రోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చుతోందంటూ ట్వీట్ చేశారు.

రాజేంద్రనగర్ బస్ డిపో కండక్టర్ అనూపరాణిని ప్రశంసిస్తూ సజ్జనార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

గడిచిన 24 ఏళ్లుగా ఆర్టీసీ ప్రయాణికులకు నవ్వుతూ, నవ్విస్తూ సేవ చేస్తున్నారంటూ అనూపరాణిని కొనియాడారు.

అనూపరాణిపై ఓ మీడియా సంస్థ ప్రచురించిన కథనాన్ని ఈ ట్వీట్ తో షేర్ చేశారు.

రాజేంద్ర‌నగర్ బస్ డిపోకు చెందిన రాగమల్ల అనూపరాణి ఫ్రెండ్లీ కండక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు.

Sb news

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 11 2024, 14:52

కాఫర్‌ డ్యాంల వద్ద.. ఎక్కువ బోర్‌వెల్స్‌ తవ్వొద్దు!

కాఫర్‌ డ్యాంల పటిష్ఠత తెలుసుకోవడం కోసం వాటికి మూడు మీటర్ల దూరంవరకు భారీలోతులో బోర్‌వెల్స్‌ను వేయవద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి అంతర్జాతీయ నిపుణులు సూచించారు. ప్రాజెక్టు నిర్మాణాల సామర్థ్యం, డయాఫ్రం వాల్‌ మరమ్మతులు, కాఫర్‌ డ్యాంలలో సీపేజీ నివారణ మొదలైనవి పరిశీలించి తగు సూచనలు

కాఫర్‌ డ్యాంల పటిష్ఠత తెలుసుకోవడం కోసం వాటికి మూడు మీటర్ల దూరంవరకు భారీలోతులో బోర్‌వెల్స్‌ను వేయవద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి అంతర్జాతీయ నిపుణులు సూచించారు. ప్రాజెక్టు నిర్మాణాల సామర్థ్యం, డయాఫ్రం వాల్‌ మరమ్మతులు, కాఫర్‌ డ్యాంలలో సీపేజీ నివారణ మొదలైనవి పరిశీలించి తగు సూచనలు చేసేందుకు కేంద్ర జలశక్తి శాఖ అమెరికాకు చెందిన ప్రాజెక్టు నిర్మాణ నిపుణులు జియాన్‌ ఫ్రాంకో డి సిక్కో, డేవిడ్‌ బి పాల్‌..

కెనడా నిపుణులు సీన్‌ హించ్‌బెర్గర్‌, రిచర్డ్‌ డొనెల్లీని నియమించిన సంగతి తెలిసిందే. గత నెల 30వ తేదీన పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి వచ్చిన వీరు.. దెబ్బతిన్న కట్టడాలను ఈ నెల మూడో తేదీ దాకా క్షుణ్ణంగా పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర అధికారులతో సమీక్షించారు. ఈ నెల నాలుగో తేదీన తమ దేశాలకు వెళ్లారు. ఈ నెల 8వ తేదీన పీపీఏకి తమ ప్రాథమిక పరిశీలనలను పంపారు. ఆ అభిప్రాయాలను కేంద్ర జల సంఘానికి పీపీఏ పంపింది. వాటిని పరిశీలించిన జలసంఘం.. ఈ సూచనలను పాటించాల్సిందిగా రాష్ట్ర జల వనరుల శాఖకు తెలియజేయాలని బుధవారం పీపీఏని ఆదేశించింది. నిపుణులు తమ ప్రాథమిక నివేదికను ఈ నెల 16వ తేదీన పంపే వీలుందని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 16 తేదీ నాటికి మొదటి ప్రాథమిక నివేదికను పంపేలా ప్రయత్నిస్తామని నిపుణుల కమిటీ పేర్కొంది. ఈ సలహాలు ఆధారంగా కాఫర్‌ డ్యాం మరమ్మతు పనులకు, సీపేజీని తగ్గించేందుకు ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ అధికారులు సమాయత్తమవుతున్నారు.

ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల భూమి పొరల్లో పటిష్ఠతను పరిశీలించేందుకు చానల్‌ 250 మీటర్లు, 290 మీటర్లు, 470 మీటర్లు, 550 మీటర్ల వద్ద నాలుగు బోర్‌వెల్స్‌ వేసినట్లుగా గుర్తించాం. ఇవిగాక.. చానల్‌ 870 మీటర్లు, 1000 మీటర్లు, 1100 మీటర్ల వద్ద కూడా లోతైన బోర్‌వెల్స్‌ను వేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు గమనించాం. కాఫర్‌ డ్యాంలకు మూడు మీటర్ల సమీపం వరకు ఎలాంటి గుంతలు తవ్వొద్దు.

కాఫర్‌ డ్యాం వద్ద 17 చొప్పున బోర్‌వెల్స్‌ వేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే పదేసి చొప్పున వేయడమే మేలు. ఈ బోర్‌వెల్స్‌ నుంచి సేకరించిన మట్టి నమూనాలతోనే పటిష్ఠతను తెలుసుకోవచ్చు. ఎగువ కాఫర్‌ డ్యాం వద్ద 3-4 బోర్‌వెల్స్‌కే పరిమితం కావాలి

ఫిజియో మీటర్లను వీలైనన్ని ఎక్కువ ఏర్పాటు చేయాలి. వైబ్రో స్టోన్‌ కాలమ్స్‌ వద్ద వీటిని అమర్చాలి.

కొత్తగా తవ్వాల్సిన పది బోర్‌వెల్స్‌పై ప్రత్యామ్నాయ ప్రణాళికలను జల వనరుల శాఖ అమలు చేయాలి.

బోర్‌వెల్స్‌ తీసిన గోతులు ఎలా పూడ్చాలో మెథడాలజీని తెలియజేస్తాం.

గ్యాప్‌-1 వద్ద వైబ్రో కంపాక్షన్‌ను మల్టీ చానల్‌ అనాలిసిస్‌ ఆఫ్‌ సర్ఫేస్‌ వేవ్స్‌ (ఎంఏఎ్‌సడబ్ల్యూ) విధానంలో చేయాలి.

జియోటెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్స్‌, జియోలాజికల్‌ పరీక్షలు పునఃసమీక్షించాలి.

ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల మధ్య నిలిచిపోయిన సీపేజీ జలాలను గ్రావిటీ ద్వారా నదిలోకి పంపేయాలి. ఇందుకోసం పంపులను అధికంగా వినియోగించాలి. కేంద్ర జల సంఘంతో సంప్రదింపులు జరుపుతూ.. పీపీఏ పర్యవేక్షణలో సీపేజీని తగ్గించే పనులు చేపట్టాలి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 11 2024, 13:50

Farmers: ఆదాయపన్ను చెల్లిస్తే ‘మాఫీ’ ఉండదు!

రుణమాఫీ మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆదాయపు పన్ను చెల్లింపుదారులను, రాజకీయ నాయకులను, ప్రభుత్వ ఉద్యోగులను పథకం నుంచి మినహాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆదాయపు పన్ను చెల్లింపుదారులను, రాజకీయ నాయకులను, ప్రభుత్వ ఉద్యోగులను పథకం నుంచి మినహాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలుచేసే రైతులు, చిరు ఉద్యోగులకు మాత్రం రుణమాఫీ వర్తింపజేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విధివిధానాలు ఖరారుచేసి, ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు. ఈ నివేదికలో పలురకాల ప్రతిపాదనలను వ్యవసాయశాఖ అధికారులు పొందుపరిచినట్లు సమాచారం. రాష్ట్రంలో ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు ఎంతమంది? పన్ను చెల్లించకపోయినా ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్నవారెందరు? అనే వివరాలకోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం విదితమే! ఆ వివరాలు ఢిల్లీ నుంచి వచ్చాయని, ఆ జాబితాను ప్రభుత్వం ముందు వ్యవసాయశాఖ ఉంచినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం- కిసాన్‌ పథకంలో కూడా ఐటీ చెల్లింపుదారులను, రాజకీయ నాయకులను మినహాయించారు.

ఈ క్రమంలో అధిక ఆదాయం ఉండి.. పన్ను చెల్లించేవారికి రుణమాఫీ వర్తింపజేయాల్సిన అవసరంలేదని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే పిల్లల చదువుల కోసం, ఇంటి నిర్మానం కోసం రుణాలు తీసుకుంటున్న కొందరు రైతులు కూడా ఐటీ రిటర్నులు దాఖలుచేస్తున్నారు. ఇలాంటివారికి రుణమాఫీ వర్తింపజేయాలని భావిస్తున్నట్లు సమాచారం. రాజకీయ నాయకులు, వివిధ పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిఽధులను కూడా రుణమాఫీ పథకం నుంచి మినహాయించే అవకాశాలున్నాయి. పీఎం- కిసాన్‌ పథకంలో కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, మునిసిపల్‌ చైౖర్మన్లు... తదితర ప్రజాప్రతినిధులకు పెట్టుబడి సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వటంలేదు. అవే మార్గదర్శకాలను రుణమాఫీ పథకానికి వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వ భావిస్తున్నట్లు తెలిసింది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి.. ఎక్కువ జీతం తీసుకునేవారికి రుణమాఫీ వర్తింపజేసే ఉద్దేశం లేదని, అయితే తక్కువ జీతం తీసుకునే చిరు ఉద్యోగులు రైతుల జాబితాలో ఉంటే... వారి వరకు రుణమాఫీ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. గత ప్రభుత్వాలు రుణమాఫీ పథకం అమలుచేసిన సందర్భంలో ఈ నిబంధన లేదు.

నిర్ణీత గడువు, కటాఫ్‌ అమౌంట్‌ పెట్టుకొని రుణమాఫీ చేశారు. దాంతో కొందరు బడా బాబులు, భూస్వాములకు కూడా రుణమాఫీ పథకం వర్తించింది. అలాంటివారికి ఇప్పుడు రుణమాఫీ వర్తింపజేస్తే...

ప్రజాధనం దుర్వినియోగం చేసినట్లే అవుతుందని, చిన్న, సన్నకారు రైతులు, అర్హులకు రుణమాఫీ చేస్తే నిధులు సద్వినియోగం చేసినట్లు అవుతుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కాగా రుణమాఫీ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను రెండు రోజుల్లో విడుదలచేస్తామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తాజాగా ప్రకటించారు.

దీంతో రుణమాఫీ మార్గదర్శకాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ అమలుకు ఆగస్టు-15 డెడ్‌లైన్‌గా పెట్టుకున్న విషయం విదితమే! ఈ రెండు, మూడు రోజుల్లో మార్గదర్శకాలతో కూడా జీవో విడుదలైతే... పథకాన్ని అమలుచేయటానికి ఇంకా నెల రోజులు మాత్రమే ఉంటుంది.

రుణమాఫీకి రూ. 31 వేల కోట్లు అవసరమవుతాయనే అంచనా ఉండగా... రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని నిధులు సమకూర్చింది. మరో రెండు, మూడు వారాల్లో రుణమాఫీకి సరిపడా నిధులు సమకూర్చుకొని రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేయాలని భావిస్తోంది. మరోవైపు ‘నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌’(ఎన్‌ఐసీ)లో... బ్యాంకర్లు, పీఏసీఎ్‌సల నుంచి వచ్చిన రైతులు, రైతుకుటుంబాలు, అప్పుల జాబితాను జల్లెడ పడుతున్నారు. రేషన్‌కార్డు, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా రైతు కుటుంబాలను డిసైడ్‌ చేస్తున్నారు. ఆధార్‌ కార్డుల ఆధారంగా నంబర్లను సరిపోలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు కుటుంబానికి రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలనే లక్ష్యంతో ఉన్న నేపథ్యంలో ఈ కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం మార్గదర్శకాలపై కసరత్తు పూర్తిచేసేలోపు... ఎన్‌ఐసీలో డేటా ప్రాసెసింగ్‌ ప్రక్రియను పూర్తిచేయనున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 11 2024, 13:46

తెలంగాణాను హెచ్చరించిన వాతావరణ శాఖ

తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షాలకు సంబంధించి కీలక అప్డేట్ వెల్లడించింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల కోసం రైతులు ప్రజలు, ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆశించిన మేర వర్షాలు పడకపోవడంతో ఈ సంవత్సరం

రైతాంగానికి సరిపడా నీరు ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మాసంలో అయినా వర్షాలు కురిస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు.

తెలంగాణాలో నేడు వర్షాలు

ఇదిలా ఉంటే నేడు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణ ప్రభావంతో, నైరుతి రుతుపవనాలు బలపడడంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఏపీ తీరం వెంబడి ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో వర్షాలు పడుతున్నాయి.