నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన అనంతపురం 37 వ డివిజన్ కు చెందిన ముస్లిం మైనార్టీ మహిళ నాయకురాలు నిహా అయేషా
సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో పసుపు ప్రభంజనం సృష్టించి,రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మక విజయం సాధించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మా ప్రియతమ నాయకులు నారా లోకేష్ గారిని మంగళగిరిలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతపురం అర్బన్ నియోజవర్గం 37 వ డివిజన్ కు చెందిన ముస్లిం మైనార్టీ మహిళ నాయకురాలు నిహా అయేషా.. ఈ సందర్భంగా నిహా అయేషా మాట్లాడుతూ:రాష్ట్రంలో ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలు సైకో జగన్ పాలనకు చమర గీతం పాడి సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియజేశారు. గత ప్రభుత్వంలో కుంటు పడిన అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. అందులో భాగంగా అనంతపురం నియోజవర్గం అభివృద్ధివైపు అడుగులు వేస్తుందని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురాన్ని సుందరవణంగా తీర్చి దిద్దుతారని తెలియజేశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఇంతటి ఘన విజయానికి సహకారం అందించిన అర్బన్ నియోజవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..
Jun 09 2024, 11:36