ఖైదీ.. మృతి..
అనంతపురం బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి వద్ద టిప్పర్ ఢీకొని ఓపెన్ ఎయిర్ జైలో శిక్ష అనుభవిస్తున్న ఈరన్న (50) S/o రంగయ్య కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు చెందిన ఖైదీ అక్కడిక్కడే మృతి..
వివాహానికి 10,000 రూ.లు ఆర్థిక సహాయం అందజేసిన శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు..
వివాహానికి 10,000 రూ.లు ఆర్థిక సహాయం అందజేసిన శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు...

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామంలో నివాసంఉంటున్న సుగాలి జ్యోతిబాయ్ కూతురు వాణి భాయ్ వివాహంకు ₹10000 ఆర్థిక సహాయం చేసిన *నిరుపేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి *మన శింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు* మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం ఎంతో సంతోషకరం వారి వైవాహిక జీవితం ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో.... బీసీ సెల్ పార్లమెంట్ అధికార ప్రతినిధి గోసుల సుబ్బయ్య. ఐ టి డి పి మండల అధ్యక్షులు మదమంచి శ్రీధర్. గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు అనీఫ్. ఆవుల సుధాకర్. బోయ లింగరాజు గ్రామ నాయన . గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
నారా చంద్రబాబు నాయుడుని, నారా లోకేష్ గారిని కలిసిన సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే

అమరావతి ఉండవల్లి నివాసంలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెల్పిన శింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ గారు బండారు కిన్నెర శ్రీ* గారు 2024 సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలుపొందిన బండారు శ్రావణి శ్రీ గారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారిని అమరావతి ఉండవల్లిలోని నివాసం నందు కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ నారా చంద్రబాబు గారికి నారా లోకేష్ గారికి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారికి* శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ శ్రేణులు..
2024 సార్వత్రిక ఎన్నికలు ఫలితాల్లో శింగనమల నియోజకవర్గం NDA కూటమి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ MLA గారు,MP గా అంబికా లక్ష్మినారాయణ గారి విజయానికి కృషి చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారికి* శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాజీఎంపీటీసీ చెదళ్ళ నారాయణ స్వామి, సోము శేఖర్, ప్రకాష్, సురేష్,కుళ్లాయప్ప, వెంకట నాయుడు, శ్రీనివాస్, రాజు, మరియు బుక్కరాయసముద్రం మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
ముస్లిం మైనార్టీ ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సహాయం అందించిన టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి..
ముస్లిం మైనార్టీ ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సహాయం అందించిన టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి..

శింగనమల నియోజకవర్గము : బుక్కరాయసముద్రం పంచాయతీలోని ఎల్.బి. కాలనీ నివాసి శ్రీమతి కౌసర్ గారి ఆడబిడ్డ వివాహానికి ₹5000/- రూపాయలు మరియు జన చైతన్య నగర్ నివాసి శ్రీమతి సలీమా ల ఆడబిడ్డ వివాహానీకు ₹5000/- రూపాయలు ఆర్థిక సాయంను అందించిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు. ముస్లిం మైనార్టీల ఆడబిడ్డల పెండ్లిండ్ల కు సహాయం చేయడము చాలా సంతోషాన్నిస్తుందని తెలిపారు. చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆడబిడ్డల వివాహాల కోసం రూ.1 లక్ష రూపాయల పథకం అందిస్తారని పేర్కొన్నారు. *ఆడ బిడ్డల వివాహాలకు సహాయం చేసిన కాటప్పగారి రామలింగారెడ్డి గారికి మైనార్టీ మహిళలు ధన్యవాదాలు తెలిపారు*. ఈ కార్యక్రమంలో టిడిపి మహిళా నాయకురాలు జుగును, టిడిపి నాయకులు పూల శంషాద్, దూదేకుల రసూల్ బీ, చాపల మహబూబ్ బీ, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే శ్రావణి కి అభినందనలు తెలిపిన జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు మాసుల చంద్రమోహన్..
ఎమ్మెల్యే శ్రావణి కి అభినందనలు తెలిపిన జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు మాసుల చంద్రమోహన్ సింగనమల ఎమ్మెల్యేగా గెలుపొందిన బండారు శ్రావణి శ్రీ గారికి అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తిరిగి ముఖ్యమంత్రిగా నాలుగోసారి నారా చంద్రబాబు నాయుడు కావడం శుభ పరిణామం అని ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలిపిన మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ రాష్ట్ర తెలుగు యువత మాజీ కార్యదర్శి జిల్లా అఖిల భారత కాపు సమైక్య కార్యదర్శి మాసుల చంద్రమోహన్ టి ఎన్ టి యు సి జిల్లా ఉపాధ్యక్షులు గోగుల నాగభూషణ పెద్ద నాగమణి కార్యకర్తలు నాయకులు అభినందనలు తెలిపినారు తెలుగుదేశం పార్టీ అంటే పేద బడుగు బలహీన వర్గాల పార్టీ అని ప్రజలు నిరూపించినారు అని తెలియజేసినారు
ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారికి అభినందనలు తెలియజేసిన బుక్కరాయసముద్రం మండల ఎంపీపీ దాసరి సునీత దంపతులు మరియు సింగనమల పట్నం నగేష్
సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే గా అధిక గెలుపొందిన శ్రీ బండారు శ్రావణి గారికి బుక్కరాయసముద్రం మండల ఎంపీపీ సునీత గారు చిన్న జలాలపురం పట్నం నగేష్ గారు బుల్లె నారాయణస్వామి గారు శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో తోటి నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు..
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి తాత బండారు నారాయణస్వామి సమాధి వద్ద చేరుకొని పూలమాలలు వేసి నివాళులర్పించిన బండారు శ్రావణి శ్రీ

సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి బుక్కరాయసముద్రం మండలంలొ తమ స్వగ్రామం సిద్దరాంపురంలో పర్యటించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి గ్రామంలో గ్రామస్తులతో బంధువులతో ఆత్మీయంగా మాట్లాడారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి ఆమె ఈ పర్యటన చేశారు. అనంతరం తన తాత బండారు నారాయణస్వామి సమాధి వద్ద నివాళులర్పించారు.

ద్విసభ్య కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఘన విజయం సాధించిన శుభ సందర్భంగా అభినందనలు తెలిపిన నియోజవర్గ ప్రజలు నాయకులు
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ అధిక మెజార్టీతో గెలిచిన శుభ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా టిడిపి శ్రేణులు మరియు ప్రజలు ద్విసభ్య కమిటీ సభ్యులు టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసా నాయుడు గారికి మరియు ముంటిమడి కేశవరెడ్డి గారికి శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చముల అందజేస్తూ అభినందనలు తెలియజేశారు
40 సంవత్సరలా తరువాత కోడుమూరు నియోజకవర్గం లో టీడీపీ పార్టీ ఘన విజయం.. కోడుమూరు నియోజకవర్గ ఇంచార్జ్ వర్యులు కాటప్ప గారి రామలింగారెడ్డి
40 సంవత్సరలా తరువాత కోడుమూరు నియోజకవర్గం లో టీడీపీ పార్టీ MLA గా గెలిచినా బొగ్గుల దస్తగిరి గారు.టీడీపీ పార్టీ గెలుపు కోసం అసమ్మతిగా ఉన్న టీడీపీ నేతలను బుజ్జగించి, అందరినీ సమన్వయ పరచడం లో ముఖ్యంభూమిక పోసించిన కోడుమూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు కాటప్పగారి రామలింగారెడ్డి గారు. గెలుపు కృషి చేసిన రామలింగారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసిన కోడుమూరు నియోజకవర్గం MLA బొగ్గుల దస్తగిరి గారు, టీడీపీ నాయకుడు విష్ణు వర్ధన్ రెడ్డి గారు