అక్రమంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న నారాయణ, చైతన్య స్కూల్స్ పైన చర్యలు తీసుకోని సీజ్ చేయాలి..
అక్రమంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న నారాయణ, చైతన్య స్కూల్ పైన చర్యలు తీసుకోవాలి.. ఒక రూమ్ను అద్దెకు తీసుకొని పుస్తకాలను డంపు చేసుకొని అమ్ముతున్న నారాయణ, చైతన్య విద్యాసంస్థలు నారాయణ, చైతన్య విద్యాసంస్థలను సీజ్ చేయాలి. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుక్స్ ను డంప్ చేసిన రూమ్ వద్ద ఆందోళన* *అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలో అక్రమంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న నారాయణ విద్యాసంస్థలను సీజ్ చేయాలని ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అద్దె రూమ్ లో డంపు చేసిన రూమ్ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమణయ్య కుల్లాయిస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యాసంస్థల పేరుతో ముద్రించిన పుస్తకాలు అమ్మకూడదని నిబంధన ఉన్నప్పటికీ ఆ నిబంధనను నారాయణ విద్యాసంస్థలు తుంగలో తొక్కుతూ అనంతపురం నగరంలో సైపుల్ల ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ వెనుక భాగాన ఒక ఒక రూమ్ను అద్దెకు తీసుకొని దాంట్లో నారాయణ విద్యాసంస్థలకు సంబంధించిన పుస్తకాలను నిలువ ఉంచి కొంతమంది పేరెంట్స్ తో విద్యాసంస్థలలో డబ్బులు కట్టించుకొని పదిమంది అయిన తరువాత ఈ రూమ్ దగ్గరకు వచ్చి పుస్తకాలు తీసుకొని పై తల్లితండ్రులకు అందజేస్తున్నారు.. విద్యను దోపిడీ లాగా దొంగతనం లాగా తయారు చేస్తున్న నారాయణ విద్యాసంస్థల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఒలంపియాడు ఈటెక్నో సీబీఎస్సీ అంటూ ఒక పేర్లు ఏర్పాటు చేసుకొని ఒక గ్రూపుకు 6000 నుంచి 15 వేల రూపాయల వరకు పుస్తకాలను విక్రయిస్తున్నారు.. ఎన్నికల సమయంతో జిల్లా విద్యాశాఖ అధికారులు అందరూ ఆ పనిలో నిమగ్నమావడంతో నారాయణ విద్యాసంస్థలు ఆడిందే ఆట పాడిందే పాట అన్న పద్ధతుల్లో ఎన్నికలు నారాయణ విద్యాసంస్థలకు ఒక వరంలాగా తయారైన అన్నారు. నారాయణ విద్యాసంస్థల పైన జిల్లా విద్యాశాఖ అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని పేర్కొన్నారు. తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి నారాయణ విద్యాసంస్థల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్ష కార్యదర్శులు మంజునాథ్ ఉమా మహేష్ జిల్లా ఉపాధ్యక్షులు వంశీ నగర నాయకులు హర్ష రారాజు పవన్ తదితరులు పాల్గొన్నారు*
May 26 2024, 08:51