ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ప్రభంజనం సృష్టిద్దాం.. వైఎస్సార్సీపీతోనే అభివృద్ధి సాధ్యం.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..
ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ప్రభంజనం సృష్టిద్దాం.. వైఎస్సార్సీపీతోనే అభివృద్ధి సాధ్యం.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు ◆ హోరెత్తిన ఎన్నికల ప్రచారం అడుగడుగునా ప్రజల నీరాజనం ◆ నియోజకవర్గంలో టిడిపి ఓటమి భయంతో జిమ్మిక్కులు.. శింగనమల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ప్రభంజనం సృష్టించాలని శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు కోరారు. శింగనమల మండలం గుమ్మేపల్లి, ఏకులనాగేపల్లి, కల్లుమడి, తరిమెల గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు, అనంతపురం ఎంపీ అభ్యర్థి ఎం. శంకర్ నారాయణతో, పార్టీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ఏడిసిసి బ్యాంక్ మాజీ ఛైర్మన్ తరిమెల కోనారెడ్డి, తరిమెల వంశీ గోకుల్ రెడ్డి, కంచె రెడ్డి భాస్కర్ రెడ్డి, డీసీఎంఎస్ డైరెక్టర్ బొమ్మన శ్రీరామిరెడ్డిలతో కలసి గడప గడపకు వైఎస్ఆర్ ఎన్నికల ప్రచారాన్ని వీరాంజనేయులు చేపట్టారు.
కల్లుమడి గ్రామంలో ఎమ్మెల్యే, ఎంపీ, అభ్యర్థులకు పార్టీ నాయకులు గజమాల వేసి స్వాగతం పలికారు. అనంతరం తరిమెల గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే అభ్యర్థికి స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ.. ఈవీఎం మెషిన్ లో 3 వ నెంబర్ వద్ద ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ..2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టి అధికారం కట్టబెట్టారని, అందుకు తగ్గట్టుగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేసి పేద కుటుంబాలు సంతోషంగా ఉండేలా పాలన చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపారన్నారు. 2019 మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు. ఐదేళ్ల జగనన్న పాలనలో రెండేళ్లు కరోన మింగేసినా, ఉన్న మూడేళ్లలోనూ అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. కూటమి మేనిఫెస్టో అంతా బూటకమేనన్నారు. నియోజకవర్గంలో టిడిపి పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. ఐదేళ్లలో ప్రజలకు కనిపించని టీడీపీ అభ్యర్థి కూడా ఓట్ల కోసం నానా.. తంటాలుపడుతూన్నారన్నారు. అలాంటి వారు కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఓటమి భయంతో జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. ప్రజలు టిడిపి వాగ్దానాలను నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. రానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రిగా జగనన్న అవడం ఖాయం అన్నారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేయడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు
May 08 2024, 08:04