నార్పల మండలo బండ్లపల్లి గ్రామం లో టిడిపి ఎన్నికల ప్రచారం.. రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి ఆలం నరసా నాయుడు
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలo బండ్లపల్లి గ్రామం లో శిoగనమల నియోజకవర్గ (టిడిపి జనసేన బిజెపి )ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు, ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ గారి గెలుపు కొరకు గ్రామం లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఈ ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వం అరాచకాలను తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో జిల్లా టీడీపీ నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు, ఆకుల ఆంజనేయులు గారు పాల్గొన్నారు.బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో బండారు శ్రావణి శ్రీ గారిని,ఉమ్మడి ఎంపీ అభ్యర్థి గా అంబికా లక్ష్మి నారాయణ గారి ని గెలిపించాలని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు.
ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు మాట్లాడుతూ జగన్ రాక్షస పాలనను అంతమొందించడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని జగన్ సిద్ధం సభలన్నీ అబద్ధపు సభలు అని, మహిళల సాధికారత కోసం ఏర్పాటు చేసిన పొదుపు సంఘాల డబ్బులు కూడా సొంత పార్టీ ప్రయోజనాలకోసం జగన్ వినియోగించు కున్నారని, పేద కుటుంబాలు పండుగ చేసుకునేందుకు గత ప్రభుత్వంలో కానుకలు ఇచ్చేదని వాటిని కూడా రద్దు చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని, నాగుళూరు పంచాయతీ లో అభివృద్ధి జరిగింది అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అధికారం లో ఉన్నపుడే అని కావున వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు గారిని చేసుకుందామని ఆలం నరసానాయుడు తెలియజేసారు.. ఈ కార్యక్రమం లో మండలం లోని సీనియర్ నాయకులు,మండల అధ్యక్షులు,మాజీ మండల అధ్యక్షులు,సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మాజీ ఎంపీటీసీ లు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటి అధ్యక్షులు,తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ,బిజెపి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
May 03 2024, 09:16