సంక్షేమ కల్పనలో వివక్షత చూపని ప్రభుత్వం..జగనన్న అంటే నమ్మకం..చంద్రబాబు అంటే మోసం.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
సంక్షేమ కల్పనలో వివక్షత చూపని ప్రభుత్వం..జగనన్న అంటే నమ్మకం..చంద్రబాబు అంటే మోసం.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
◆ హోరెత్తిన వైఎస్సార్ సీపీ ఎన్నికల ప్రచారం
◆ సొంత బిడ్డలా ఆదరిస్తున్న ప్రజలు
వైయస్ జగనన్న అంటే నమ్మకమని.. చంద్రబాబు అంటే మోసం.. కుట్రలకు బ్రాండ్ అంబాసిడర్ అని.. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు తన పాలనను చూసి ఓటు వేయండి అని అడిగే దమ్ముందా అని శింగనమల వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం వీరాంజనేయులు ప్రశ్నించారు.
బుక్కరాయసముద్రం మండలం కొట్టాలపల్లి, రాఘవేంద్ర కాలనీ, బీజేపీ కాలనీ, బోయకొట్టాల, బద్రంపల్లి, గోవిందంపల్లి, జంతులూరు గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులు, జిల్లా పార్టీ అధ్యక్షులు పైలా నరసింహయ్యతో కలిసి గడపగడపకు వైఎస్ఆర్ ఎన్నికల ప్రచారాన్ని వీరాంజనేయులు చేపట్టారు.
గ్రామాల్లోని మహిళలు హారతులు పట్టి తిలకం దిద్ది ఆత్మీయ స్వాగతం పలికారు. వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు డప్పు వాయిద్యాలతో డ్యాన్స్ లతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అందించిన మేలును వివరించారు. సంక్షేమం ఇలానే కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కరపత్రాలు అందజేశారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటికే తీసుకొచ్చిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ స్థాపన దిశగా జగనన్న ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను ప్రజల ఇంటి వద్దకే చేర్చేందుకు వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. కరోనా సమయంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వారి ప్రాణాలను కాపాడుకున్నారు కానీ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోలేదన్నారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రజల్ని మోసం చేసేందుకు మాయమాటలు చెబుతున్నారన్నారు. ఇలానే సంక్షేమం, అభివృద్ధి కావాలంటే జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రజలను కోరారు.
టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిక
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో అందించిన పాలనను మెచ్చి టీడీపీ నుంచి వైసీపీ పార్టీ లోకి నాలుగు కుటుంబాలు చేరాయి.
బుక్కరాయసముద్రం మండలం భద్రంపల్లి గ్రామంలో టీడీపీ పార్టీకి చెందిన చెరుకూరి వెంకటేష్, చెరుకూరి వెంకట రాముడు, బుల్లె ఉపేంద్ర, బుల్లె రామాంజనేయులు ప్రభుత్వ విద్యా సలహాదారు సాంబశివారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన సంక్షేమం, అభివృద్ధిని చూసి ఆకర్షితులమై వైసిపి పార్టీలోకి చేరుతున్నట్టు వారి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి చెప్పారు అంటే చేస్తారని నమ్మకంతో రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ముఖ్యమంత్రిగా జగనన్నను, నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు చేసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
May 03 2024, 09:09